Science Center
-
ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు
Astronomers Detect Light Behind Black Hole: విశ్వంలో మనిషి మేధస్సుకు అంతుచిక్కని రహస్యాలెన్నో. వాటిలో బ్లాక్ హోల్ ఒక సంక్లిష్టమైన సబ్జెక్ట్. అదృశ్య ప్రాంతాలుగా కంటికి కనిపించకుండా.. ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకునే కేంద్రాలివి. అయితే కృష్ణ బిలాల వెనుక ఉన్న ఓ విషయాన్ని తొలిసారి ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగా, ఐన్‌స్టీన్ అంచనా ఆయన మేధోసంపత్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. భూమికి 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణ బిలం(ఐ జ్విక్కీ 1) వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని(తేలికపాటి) గుర్తించారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకులు. మెరుపుల్లా మొదలై అటుపై రంగు రంగుల్లోకి మారిపోయాయి ఆ ఎక్స్‌రే కాంతులు. సాధారణంగా బ్లాక్ హోల్లోకి వెళ్లిన కాంతి ఏదీ బయటకు పరావర్తనం చెందదు. దీంతో ఆ వెనకాల ఏముంటుందో అనేది ఇప్పటిదాకా ఖగోళ శాస్రజ్ఞులు నిర్ధారించుకోలేకపోయారు. అయితే ఈ బిలం చుట్టేసినట్లు ఉండడం, కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రో ఫిజిస్ట్ డాన్ విల్కిన్స్ వెల్లడించారు. ఐన్‌స్టీన్ ఏనాడో చెప్పాడు జర్మన్ మేధావి, థియోరెటికల్ ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ విషయాన్ని ఏనాడో గుర్తించాడు. కృష్ణ బిలం వెనకాల కాంతి కిరణాల పరావర్తనాలు సాధ్యమని, అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని ‘జనరల్ రియాల్టివిటీ’ పేరుతో ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ టైంలో ఆ థియరీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజా పరిశోధనల గుర్తింపుతో ఆయన మేధస్సును నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా సాధారణ టెలిస్కోప్‌ల ద్వారా గుర్తించడం విశేషం. నేచర్ జర్నల్‌లో బుధవారం ఈ మేరకు ఈ ఖగోళ అద్భుతంపై కథనం పబ్లిష్ అయ్యింది. -
జిల్లాకో సైన్స్ సెంటర్
ప్రతిపాదనలు సిద్ధం చేయండి: అధికారులకు మంత్రి జోగు ఆదేశం సాక్షి, హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక అంశాలు క్షేత్రస్థాయి వరకు చేరేందుకు జిల్లాకో సైన్స్ సెంటర్ , రీజినల్ సైన్స్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. హైదరాబాద్‌లో రూ.176 కోట్లతో నెలకొల్పనున్న సైన్స్ సిటీలో అంతరిక్ష, భూతల కేంద్రం, ఐమాక్స్ 9-డీతో పాటు ఎనర్జీ, శాస్త్ర, సాంకేతిక, మానవ, వృక్ష, జంతు, శాస్త్రీయ అంశాల నమూనాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి అంశాలపై మంత్రి శుక్రవారం సమీక్షించారు. ప్రతిష్టాత్మక సైన్స్ సిటీ హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌గా నిలవనుందన్నారు. బిర్లా ప్లానిటోరియం తరహాలో సంచార ప్లానిటోరియంలు, సంచార సైన్స్ వ్యాన్లు ఏర్పాటు చేయాలని సూ చించారు. హైదరాబాద్‌లో 5-డీ థియేటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే జరపాలన్నారు. -
కుదరని ముహూర్తం
- సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవం వాయిదా - తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లోనూ ఇదే పరిస్థితి - ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఎదురుచూపు - రెండున్నరేళ్లుగా తెరుచుకోని దుస్థితి సాక్షి ప్రతినిధి, వరంగల్ : శాస్త్ర, సాంకేతిక అంశాలపై విజ్ఞానం పెంపొందించేందుకు నిర్మించిన సైన్స్ సెంటర్ తెరుచుకోవడం లేదు. రెండున్నరేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయినా.. ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ముహూర్తం కుదరడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా.. పర్యావరణ దినోత్సవం(జూన్ 5)న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. గతంలోనూ ఇలాంటి ముహూర్తాలు నిర్ణయించినా.. చివరి నిమిషంలో వాయిదా పడ్డారు. ఇప్పుడూ అదే జరిగింది. సైన్స్ సెంటర్ నిర్వహణ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి ఆధ్వర్యంలో ఉంటుంది. దీనికి ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉన్న సైన్స్ సెంటర్ ఇటీవలే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి పరిధిలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా ప్రారంభించాల్సి ఉంది. ఈ కారణంగానే శుక్రవారం నాటి ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయిందని అధికారులు చెబుతున్నారు. కారణం ఏదైనా ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంలో ఇంకా అయోమయమే నెలకొంది. కథ కమామిషూ.. పాఠ్యపుస్తకాల్లోని క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు సులువుగా తెలియజేసే లక్ష్యంతో జిల్లా కేంద్రంలోని జూ పార్క్ ఎదురుగా సైన్స్ సెంటర్‌ను నిర్మించారు. దీని నిర్మాణం కోసం రూ.3.85 కోట్లు ఖర్చు చేశారు. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు సంబంధించిన మౌలిక అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించే ఎన్నో అంశాలు(ఎగ్జిబిట్లు) ఈ సైన్స్ సెంటర్లో ఉన్నాయి. మూడు అంతస్తుల భవనం గల గల సైన్స్ సెంటర్ ప్రాంగణంలో పార్కింగ్ మొదలు.. భవనంలోని ప్రతి అంతస్తులో వివిధ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు ఏర్పాటు చేశారు. ఏడు విశాలమైన హాళ్లు ఉన్న ప్రధాన భవనంలో.. మొదటి రెండు హాళ్లలో ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. మిగతా వాటిలో వరుసగా స్పేస్ సైన్స్, సోలార్ పవర్, 5డి థియేటర్, పర్యావరణ కాలుష్యం, మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన నమూనాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ త్రూ సాటిలైట్ హాల్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సాంకేతిక సంస్థల్లో జరిగే వైజ్ఞానిక సదస్సులను ఈ హాల్లో ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది. అక్కడ జరుగుతున్న చర్చల్లో ఇక్కడి నుంచే పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. పాతికేళ్ల కల.. 1986లో తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో ప్రాంతీయ సైన్స్‌సెంటర్లను నిర్మించాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సైన్స్ సెంటర్ల నిర్మాణానికి శిలాఫలకం వేశారు. నిధులు మాత్రం కేటాయించలేదు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2008లో ఈ సెంటర్ల నిర్మాణానికి రూ.5.87 కోట్లు కేటాయించారు. 2013 మార్చి నాటికి భవన నిర్మాణంతోపాటు ఎగ్జిబిట్లను బిగించడం పూర్తయింది. ప్రారంభానికి మాత్రం ముహూర్తం కుదరడం లేదు. -
తెరవకుండానే తాళం!
పడావుగా రీజనల్ సైన్స్ సెంటర్ రాష్ట్రంలోనే ఏకైక కేంద్రం దుస్థితి నిర్మాణం పూర్తయినా తెరుచుకోని వైనం {పతినెల నిర్వహణకే రూ.లక్ష రెండేళ్లుగా పట్టించుకోని యంత్రాంగం వరంగల్ : శాస్త్ర, సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సైన్స్ సెంటర్ తెరుచుకోవడంలేదు. రెండేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయినా.. రాష్ట్రంలోని ఏకైక సెంటర్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రూ.3.85 కోట్లతో శాస్త్ర సాంకేతిక శాఖ నిర్మించిన ఈ సైన్స్ సెంటర్ సందర్శకులు అడుగు పెట్టకుండానే.. మూత పడే పరిస్థితి నెలకొంది. సందర్శకులు వస్తే వసూలయ్యే ఫీజుతో నడిచే ఈ కేంద్రం నిర్వహణ కోసం వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ప్రతి నెల రూ.లక్ష ఖర్చు చేయాల్సి వస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అద్భుతమైన కట్టడం నిర్మాణ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక సైన్స్ సెంటర్ ప్రారంభించాలనే ఆలోచన వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎంత మాత్రం రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పాతికేళ్ల కళ.. 1986లో తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో ప్రాంతీయ సైన్స్సెంటర్ల నిర్మించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1999లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ సైన్స్ సెంటర్ల నిర్మాణం కోసం శిలాఫలం వేశారు. నిధులు మాత్రం కేటాయించలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2008లో ఈ సెంటర్ల నిర్మాణం కోసం రూ.5.87 కోట్లు కేటాయించారు. రెండేళ్ల క్రితం నిర్మాణం పూర్తయ్యింది. 2013 మార్చి నాటికి భవనంతోపాటు ఎగ్జిబిట్లను బిగించడం పూర్తయ్యింది. సైన్స్ సెంటర్ ప్రారంభానికి ముహూర్తం మాత్రం కుదరడం లేదు. అందుబాటులో విజ్ఞానం పాఠ్యపుస్తకాల్లోని క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు సులువు గా తెలియజేసే లక్ష్యంతో సైన్స్ సెంటర్ నిర్మాణం జరిగింది. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు సంబంధించిన మౌలిక అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించే ఎన్నో అంశాలు(ఎగ్జిబిట్లు) ఈ సైన్స్ సెంటర్లో ఉన్నాయి. మూడు అంతస్థుల భవనం గల సైన్స్ సెంటర్ ప్రాంగణంలో పార్కింగ్ మొదలు భవనంలో ప్రతీ అంతస్తులో వివిధ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు ఏర్పాటు చేశారు. ఏడు విశాలమైన హాళ్లు ఉన్న ప్రధాన భవనంలో.. మొదటి రెండు హళ్లలో ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. మిగితా వాటిలో వరుసగా స్పేస్ సైన్స్, సోలార్ పవర్, 5డి థియేటర్, పర్యావరణ కాలుష్యం, మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన నమూనాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ త్రూ సాటిలైట్ హాల్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సాంకేతిక సంస్థల్లో జరిగే వైజ్ఞానిక సదస్సులను ఈ హాల్లో ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది. -
సీఎం పర్యటన ఖరారు
- కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన - నిట్‌లో జయంతి కార్యక్రమం - సైన్స్‌సెంటర్ ప్రారంభం వాయిదా - టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు వెల్లడి సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తొలి పర్యటన ఖరారైంది. కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 9న కేసీఆర్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కాళోజీ నారాయణరావుకు గుర్తింపు ఇచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన, జయంతి ఉత్సవాల్లో పాల్గొనే కార్యక్రమాలకే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిమితం కానున్నారు. సైన్స్ సెంటర్, ఇండోర్ స్టేడి యం నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో వీటి ప్రారంభోత్సవం నిర్వహించాలని అధికారులు ప్రతిపాదిం చారు. దీనికి ముఖ్యమంత్రి అంగీకరించ లేదు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే కాళోజీ కార్యక్రమానికి ప్రాధాన్యం తగ్గించినట్లు ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ నిరాకరించినట్లు తెలిసింది. కాళోజీ జయంతి ఉత్సవాల నేపథ్యంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు గురువారం కేసీఆర్‌ను కలిశారు. ‘సీఎం కేసీఆర్ సెప్టెంబరు 9న ఉదయం 11.45 గం టలకు హెలికాప్టర్లో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో దిగుతారు. కాళోజీ సెంటర్లోని కాళోజీ నారాయణరావు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి హయగ్రీవాచారి మైదానానికి చేరుకుని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఆడిటోరియంలో జరగనున్న కాళోజీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత బాలసముద్రంలోని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు’ అని రవీందర్రావు ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. కాళో జీ కళాక్షేత్రం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతికి రెట్టింపుస్థాయి సౌకర్యాలతో దీన్ని నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. -
సాగర్ కళాశాలలో సైన్స్ సెంటర్ ప్రారంభం
చేవెళ్ల రూరల్: విద్యార్థులు సైన్స్‌ను పుస్తకాల ద్వారానే కాకుండా ప్రయోగాత్మక కేంద్రాలతోనూ విజ్ఞానాన్ని పొందుతారని ప్రొఫెసర్ డాక్టర్ టి.ఎస్. సిద్ధు అన్నారు. సోమవారం మండలంలోని ఊరేళ్ల సమీపంలోని సాగర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ పి.కె. నాగ్ మెమోరియల్ సాగర్ సైన్స్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ.. విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన పెంపొందించేందుకు, విజ్ఞాన సంబంధిత విషయాలను ప్రయోగాత్మకంగా తెలుసుకునేందుకు ఈ సైన్స్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివల్ల విద్యార్థుల వైజ్ఞానిక భావాలను ఉత్తేజపరచడానికి అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులందరికి సైన్స్ సెంటర్ మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. సైన్స్ సెంటర్‌ను మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పరిశీలించారు. కార్యక్రమంలో సాగర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ కార్యదర్శి డాక్టర్ డబ్ల్యూ రాంపుల్లారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శివనారాయణ, డెరైక్టర్ జయరామిరెడ్డి, నాగశివానంద్, బీవీ రెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ రవికాంత్, సుదర్శన్ సింగ్, డబ్ల్యూ మాలతి పాల్గొన్నారు. -
పాతికేళ్ల కలకు గ్రహణం
సాక్షి, హన్మకొండ: 2014 బాలల దినోత్సవం నాటికి సైన్స్ సెంటర్‌ని ప్రారంభిస్తామని అధికారుల చెప్పిన మాటలు మరోసారి నీటి మూటలుగానే మిగిలిపోయాయి. విద్యార్థులకు సైన్స్ సందేహాలు తీర్చి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే సైన్స్‌సెంటర్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. చిన్న అభివృద్ధి కార్యక్రమాలకు హడావుడి చేసే మంత్రులు.. ప్రతిష్టాత్మకమైన సైన్స్‌సెంటర్ వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదు. వరంగల్ నగరంలోని హంటర్‌రోడ్డులో రీజనల్ సైన్స్ సెంటర్ భవన నిర్మాణం పూర్తయి మూడేళ్లు అవుతోంది. కాకతీయ ఉత్సవాల సందర్భంగా గతేడాది డిసెంబర్లో నగరానికి వస్తున్న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా సైన్స్‌సెంటర్‌ను ప్రారంభించాలని అధికారులు సంకల్పించారు. అందుకుతగ్గట్టుగా పనుల్లో వేగం పెంచారు. అంతే వేగంగా అరవై లక్షల రూపాయలతో సైన్స్ ఎగ్జిబిట్లు తెప్పించారు. అయితే చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ ఏడాది మార్చి నాటికి భవన నిర్మాణంతోపాటు ఎగ్జిబిట్లు ఏర్పాటు చేయడం కూడా పూర్తయింది. అయినా జిల్లాకు చెందిన మంత్రులు కానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. చివరికి సెప్టెంబర్ జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ జి.కిషన్ స్పందించారు. నవంబర్ 14నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి సైన్స్‌సెంటర్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. మిగిలిన పనులు సాగుతూనే.. నవంబర్ 14 రానే వచ్చింది. అయినా మిగిలిన పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ప్రధాన పనులు పూర్తయినా లిఫ్ట్‌ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్, లాన్, ల్యాండ్‌స్కేప్, టాయిలెట్లు, ఆర్చ్,సెక్యూరిటీ సెల్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఏళ్లతరబడి నిర్మాణ పనులు జరుగుతుండడం వల్ల భవనానికి వేసిన రంగులు వెలిసిపోతున్నాయి. ఎలక్ట్రికల్ వైరింగ్, ఏసీ తదితరాలు పాడవుతున్నాయి. పాతికేళ్ల కల ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986లో ఏకకాలంలో ప్రాంతాల వారీగా తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో మూడు రీజనల్ సైన్స్‌సెంటర్లను మంజూరు చేశారు. అయితే 1999 వరకు ఎవరూ ఈ సెంటర్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎట్టకేలకు 1999లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు నిర్మాణం కోసం శిలాఫలకం వేశారు తప్పితే నిధులు కేటాయించలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో ఈ సెంటర్ నిర్మాణం కోసం రూ. 5.87 కోట్లు కేటాయించారు. ఆయన అకాల మరణం తర్వాత పనుల్లో వేగం మందగించింది. మొత్తానికి పాతికేళ్ల నుంచి పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఇంకోవైపు తిరుపతి, విజయవాడ రీజనల్ సైన్స్ సెంటర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బాలలకు అందుబాటులో విజ్ఞానం మూడు అంతస్తుల సైన్స్ సెంటర్ ప్రాంగణంలో ప్రతీ అంతస్తులో శాస్త్రసాంకేతిక రంగాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు ఏర్పాటు చేశారు. ఏడు విశాలమైన హాళ్లతో కూడిన ప్రధాన భవనంలో.. మొదటి రెండు హాళ్లలో ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిట్లు ఏర్పాటు చేశారు. మిగితా వాటిలో వరుసగా స్పేస్‌సైన్స్, సోలార్ పవర్, 5డి థియేటర్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్‌లతో పాటు మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన నమూనాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ త్రూ శాటిలైట్ హాల్ కూడా ఉంది.