in the second ODI
-
ఆసీస్ ప్రతీకార విజయం
రెండో వన్డేలో కివీస్ చిత్తు వెల్లింగ్టన్: తొలి వన్డేలో ఎదురైన ఓటమికి ఆస్ట్రేలియా జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఓపెనర్ వార్నర్ (79 బం తుల్లో 98; 8 ఫోర్లు; 4 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (72 బంతుల్లో 69 నాటౌట్; 9 ఫోర్లు; 1 సిక్స్) చెలరేగడంతో న్యూజి లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణాయక చివరి వన్డే సోమవారం హామిల్టన్‌లో జరుగుతుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 281 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (74 బంతుల్లో 60; 5 ఫోర్లు; 1 సిక్స్), సాన్‌ట్నర్ (39 బంతుల్లో 45; 3 ఫోర్లు; 1 సిక్స్), మిల్నే (27 బంతుల్లో 36; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆసీస్ 46.3 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసి నెగ్గింది. సహచర ఓపెనర్ ఖవాజా (49 బంతుల్లో 50; 7 ఫోర్లు)తో కలిసి వార్నర్ తొలి వికెట్‌కు 122 పరుగులు జత చేశాడు. అయితే మరో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడింది. అయితే హేస్టింగ్స్ (48 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్), మార్ష్ నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. -
రెండో వన్డేలో లంక విజయం
రాణించిన సంగక్కర, జయవర్ధనే కొలంబో: భారత్‌తో సిరీస్‌లో చిత్తుగా ఓడిన శ్రీలంక... ఇంగ్లండ్‌పై మాత్రం చెలరేగిపోతోంది. వరుసగా రెండో వన్డేలో కుక్ సేనను ఆతిథ్య శ్రీలంక చిత్తు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లంక ఎనిమిది వికెట్లతో నెగ్గింది. తొలుత ఇంగ్లండ్ 43 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటయింది. బొపారా (69 బంతుల్లో ఒక ఫోర్‌తో 51), జో రూట్ (57 బంతుల్లో ఒక ఫోర్‌తో 42) మినహా అందరూ విఫలమయ్యారు. లంక బౌలర్లలో అజంతా మెండిస్ మూడు వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంక జట్టు 34.2 ఓవర్లలో 2 వికెట్ల నస్టానికి 186 పరుగులు చేసి గెలిచింది. సీనియర్ ద్వయం సంగక్కర (93 బంతుల్లో 8 ఫోర్లతో 67 నాటౌట్), జయవర్ధనే (80 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 77 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఏడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే బుధవారం జరుగుతుంది. -
భారత్‌కు తొలి విజయం
రాణించిన శిఖా, పూనమ్ బెంగళూరు: తొలి వన్డేలో ఓడిపోయిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో తేరుకుంది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే శుక్రవారం జరుగుతుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేసింది. చోలె ట్రయాన్ (34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 49) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో శిఖా పాండే (3/19), ఏక్తా బిస్త్ (3/28) రాణించారు. 187 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 44.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ పూనమ్ రౌత్ (77 బంతుల్లో 8 ఫోర్లతో 47), శిఖా పాండే (56 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 57) నిలకడగా ఆడి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.