sections
-
ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్!
సాక్షి, కరీంనగర్: 'ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకోవడానికి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. పలువురు విద్యార్థులు, యువత ఇంటర్నెట్లో ఎన్నికల చట్టాలు– నిబంధనల గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎన్నికల చట్టాలను వివరించే కథనం.' సెక్షన్ 123: జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఒత్తిడికి లోను చేస్తే.. ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125: ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా జరిమానా రెండింటినీ విధించే అవకాశం ఉంటుంది. 126: ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలు లేదా జరిమానా విధిస్తారు. 127: ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా.. పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా. 128: బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా. 129: ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా, ప్రభావం కలిగించినా శిక్షార్హులు. దీనికిగాను 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. 130: పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే రూ.250 జరిమానా పడుతుంది. 131: పోలింగ్ కేంద్రానికి సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా, రెండూ అమలుచేయొచ్చు. 132: ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించనివారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా. 134: అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షార్హులే. ఇందుకు రూ.500 జరిమానా విధిస్తారు. 134(అ): ఠాణా పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం నిషేధం. అలా వెళ్లినవారికి 2 నెలల జైలుశిక్ష, జరిమానా వేస్తారు. 135: పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే శిక్షార్హులు. ఏడాది పాటు జైలుశిక్ష, రూ.500 జరిమానా. 135(ఇ): పోలింగ్, కౌంటింగ్ రోజున మద్యం విక్రయించడం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశచూపడం నేరం. అందుకు 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల వరకు జరిమానా. 133: ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష, జరిమానా. 135(ఆ): ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవుగా మంజూరు చేసినా శిక్ష, అందుకు రూ. 5వేల జరిమానా విధించొచ్చు. 49వీ: ఒక వ్యక్తి ఓటు మరొకరు వేస్తే పోలింగ్ ఆఫీసర్‌కు సదరు ఓటరు 49–వీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అధికారం కల్పిస్తారు. 134(అ): ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా గానీ పోలింగ్ ఏజెంటుగా గానీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. ఇవి కూడా చదవండి: కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’ -
153 సెక్షన్లు మూత! అధికారులకు 58 ఇంజనీరింగ్ కాలేజీల వినతి
సాక్షి, హైదరాబాద్: తమ కాలేజీల్లో కొన్ని సెక్షన్లు రద్దు చేయాలంటూ కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులకు సంబంధించిన సెక్షన్లున్నాయి. 58 కాలేజీలు ఈ విధంగా అభ్యర్థించడం గమనార్హం. ఈ తరహా కాలేజీలు గ్రామీణప్రాంతాల్లో ఎక్కువగా ఉంటే, హైదరాబాద్ నగరం చుట్టు పక్కల మరికొన్ని ఉన్నాయి. ఇప్పటికిప్పుడు తామేమీ చేయలే మని అధికారులు చెబుతుండగా.. 10మంది లోపు విద్యార్థులున్న 153 సెక్షన్లు నడపడం ఆర్థికంగా తమకు భారమని, వారి కోసం సెక్షన్లు కొనసాగించలేమని కాలేజీలు చెబుతున్నాయి. ఒక్కో సెక్షన్లో ఐదుగురేనా? దాదాపు వంద కాలేజీలు ఈ సంవత్సరం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకునేందుకు దరఖాస్తు చేశా యి. వీటిల్లో 78 కాలేజీల్లోని 9 వేలకు పైగా సీట్లు తగ్గించుకునేందుకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఒప్పుకున్నాయి. వాస్తవానికి ప్రతి సెక్షన్లో 60 మంది విద్యార్థులు చేరేందుకు అనుమతి ఉంటుంది. అయితే 58 కాలేజీల్లో కొన్ని సెక్షన్లలో పట్టుమని పది మంది కూడా చేరలేదు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని ప్రైవేటు కాలేజీల్లో సివిల్, మెకానికల్‌లో ఒక్కో సెక్షన్లో ఐదుగురే చేరారు. నగర శివార్లలోని నాలుగు ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే సీట్లు 78 వేల వరకూ ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు కౌన్సెలింగ్ ద్వారా 64 వేల మంది చేరినా, 59 వేల మందే ఫీజులు చెల్లించారు. ఈ లెక్కన 19 వేల సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆఖరుకు ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. 16 ప్రభుత్వ కాలేజీల్లో 5 వేల వరకూ సీట్లు ఉంటే, 3,800 మందే చేరారు. కంప్యూటర్ కోర్సుల వల్లే: ఈ ఏడాది ఎక్కువమంది విద్యార్థులు కంప్యూటర్, ఐటీ, వాటి అనుబంధ కోర్సుల్లో చేరేందుకే సుముఖత చూపారు. ఈ మేరకు ఆయా విభాగాల్లో 9 వేలకుపైగా సీట్లు కూడా పెరిగాయి. 93% సీట్లు భర్తీ కూడా అయ్యాయి. ఇక మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ తదితర బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. సివిల్, మెకా నికల్ బ్రాంచీల్లో 10,286 సీట్లకుగాను 6,958, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో 18,825 సీట్లు ఉండగా 4,560 మిగిలాయి. 153 సెక్షన్లలో అయితే 10మందిలోపు మాత్రమే చేరారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు పదికి తక్కువగా చేరిన సెక్షన్లను రద్దు చేసి, ఆ విద్యార్థులను వేరే కాలేజీకి పంపే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో దీనిపై స్పష్టత రావొచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
నాలుగు సెక్షన్లతో పాలన
శ్రీకాకుళం పాతబస్టాండ్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉన్నతాధికారులను ప్రజలకు దగ్గర చేసే పనిని ప్రభుత్వం మొదలుపెట్టింది. నూతనంగా ఏర్పడిన జిల్లాలో జనాభా, విస్తీర్ణం తగ్గడంతో కలెక్టరేట్లో పాలన కోసం ఏర్పాటు చేసే సెక్షన్లను కుదించారు. ఇప్పటివరకు 8 సెక్షన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 4కు తగ్గింది. ఈ మేరకు జీఓ కూడా విడుదలైంది. కలెక్టరేటే కీలకం.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, పనులు త్వరగా జరిగేలా చూడడంలో కలెక్టరేట్ కీలక పాత్ర పోషిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలో ఇదివరకు ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్ అనే 8 సెక్షన్లు ఉండేవి. వీటికి తోడుగా మీ సేవ, లీగల్ సెక్షన్లు కూడా సేవలు అందించేవి. పథకాలు, సేవలపై ప్రజలు కలెక్టర్‌కి విన్నవించినా, వాటిని కలెక్టర్ ఈ సెక్షన్లలోని అధికారుల ద్వారా పరిష్కరించేవారు. సెక్షన్ –1: ఇప్పటి వరకు ఉన్న ఎ, బి సెక్షన్లను కలిపి సెక్షన్–1గా మార్చారు. ఎ–సెక్షన్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంటు (పరిపాలన), ఆఫీస్ ప్రొసీడ్స్, ఎస్టాబ్లిష్మెంటు అండ్ సర్వీస్ మేటర్లు, డిసిప్లనరీ మేటర్లు అన్నీ క్యాడర్లకు సంబంధించినవి ఉంటాయి. బి–సెక్షన్లో అకౌంట్సు, ఆడిటింగ్, జీ తాలు, కోనుగోళ్లు, రికార్డుల నిర్వహణ ఉంటాయి. ఈ రెండు సెక్షన్లు ఒకటి చేశారు. సెక్షన్–2 : ఈ, జి, ఎఫ్ లను కలిసి ఒక సెక్షన్ చేశా రు. ఈ సెక్షన్లో ల్యాండ్ మేటర్లు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ ఎలిసేషన్, అసైన్మెంటు, హౌస్ సైట్స్, ప్రోహిబిటెడ్ ప్రోపర్టీ నిర్వహణ 22ఎ, ఫిషరీస్ అండ్ అదర్ ల్యాండ్ రికారŠుడ్స ఉంటాయి. జి సెక్షన్లో సెటిల్మెంట్లు, ఎస్టేట్ ఎ బోల్స్ యాక్టు, ఇనాం భూములు, కోర్టు సంబంధిత, ఫారెస్టు ల్యాండ్ వంటి అంశాలు ఉంటాయి. ఎఫ్‌లో భూ సేకరణ, ఆర్అండ్ఆర్ తదితర అంశాలు ఉంటాయి. ఈ మూడింటిని ఒక్కటి చేశారు. సెక్షన్–3 : సి, హెచ్ సెక్షన్లు కలిపారు. మెజిస్టీరియల్ సెక్షన్, కుల వెరిఫికేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఎలక్షన్ అంశాలు, లా అండ్ ఆర్డర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇతర అనుబంధ అంశాలు ఉంటాయి. హెచ్ సెక్షన్లో ప్రోటోకాల్, గ్రీవెన్సు, ఇతర రిలేటెడ్ అంశాలు ఉంటాయి. సెక్షన్–4 : ఇందులో డి సెక్షన్ ఉంటుంది. ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంటు, విపత్తులు ఇతర అంశాలు ఉంటాయి. పై సెక్షన్లకు సూపరింటెండెంట్లను కూడా నియమించారు. ఇవి కాకుండా ఎప్పటిలాగానే లీగల్ సెక్షన్, మీ సేవ సెక్షన్లు నడుస్తున్నాయి. వీటికి సీనియర్ సూ పరింటెండెంట్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్ప టి వరకు ఉన్న సిబ్బందిని కుదించారు. కలెక్టరేట్ నుంచి సిబ్బంది విజయనగరం, మన్యం జిల్లాలకు వెళ్లారు. సమస్యలు లేవు.. జిల్లాల విభజన తర్వాత సెక్షన్లను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ మేరకు సెక్షన్లను కుదించాం. సమస్యలేవీ లేవు. తగినంత మంది సిబ్బందిని సమకూరుస్తున్నాం. – ఎం.రాజ్యలక్ష్మి, డీఆర్ఓ -
సెక్షన్ 49 పీ: మీ ఓటును మరెవరైనా వేశారా? వెంటనే ఇలా చేయండి..
సాక్షి, కరీంనగర్: ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడం సర్వసాధారణం. పోలింగ్ సమయంలో ఏజెంట్లు అప్రమత్తంగా లేని సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కార్యకర్తలు అవతలి వ్యక్తుల ఓటును వేసి వెళ్తుండటం చూస్తుంటాం. అపరిచితులు వేసిన మన ఓటును అంగీకరించి సరేలే అని తిరిగి రావలసిన పనిలేదు. మన ఓటు హక్కును మనం తిరిగి సాధించుకునేందుకు ఎన్నికల చట్టం అవకాశం కల్పిస్తోంది. అదే సెక్షన్ 49పీ. చదవండి: అనగనగా.. ఓ ఈవీఎం.. దీని జీవితకాలమెంతో తెలుసా? ఇలా చేయాలి తన ఓటును మరొకరు వేసినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ కేంద్రంలోనే చాలెంజ్ ఓటును నమోదు చేసుకోవచ్చు. పోలింగ్ సమయంలో మన ఓటును ఎవరైనా అంతకుముందే వేసినట్లు సదరు ఓటరు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరే అవకాశాన్ని ఈ సెక్షన్ పౌరులకు కల్పిస్తుంది. కండాక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని సెక్షన్ 49పీ ఇదే విషయాన్ని చెబుతుంది. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్? వెంటనే చాలెంజ్ కోసం రూ.5 అక్కడి ప్రిసైడింగ్ అధికారికి చెల్లించి ఓటును నమోదు చేయాల్సిందిగా కోరితే అతని వద్ద ఉన్న గుర్తింపుకార్డు తదితరాలన్నింటినీ పరిశీలించి అనుమతి ఇస్తారు. మొత్తం ఓట్లలో అదనపు ఓటుగా ప్రత్యేకంగా గుర్తిస్తూ ఈ ఓటును కలిపి లెక్కించకుండా దాచి ఉంచుతారు. ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్‌పై మనం వేసిన ఓటును చివరికి లెక్కిస్తారు. గెలుపు ఓటముల్లో ఈ ఓటు అవసరాన్ని బట్టి దీనిని అప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు సెక్షన్ 49పీ గురించి తెలిసింది కదూ..? మన ఓటును మనం వేసేందుకు సన్నద్ధమవుదామా మరి. -
కులానికో సెక్షన్!
లాల్గంజ్: దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు.. పాఠశాల గది గోడల మధ్య నిర్ణయించబడుతుందంటారు. రేపటి మన దేశం ఎలా ఉండాలని కోరుకుంటామో.. అందుకు అనుగుణంగా ఈ రోజే పాఠశాలలను తీర్చిదిద్దుకోవాలి. కులం, మతం, జాతి, ప్రాంతం.. ఈ భేదాలేవీ లేకుండా తరగతి గదిలో అందరూ సమానులేననే భావన విద్యార్థుల్లో కలిగించాలి. ఇది పాఠశాల బాధ్యత. కానీ ఇందుకు విరుద్ధంగా బిహార్‌లోని ఓ పాఠశాల మాత్రం ఇప్పటి నుంచే విద్యార్థుల్లో కులం, మతం, జాతి భేదాలను పెంపొందిస్తోంది. తరగతి గదిలోని విద్యార్థులను కులాల వారీగా, మతాల వారీగా విభజించి కూర్చోబెడుతోంది. ఒక్కో మతానికి ఒక్కో సెక్షన్ ఏర్పాటు చేసి, పాఠశాలను నిర్వహిస్తోంది. ఇదంతా చేస్తోంది ఏదో ఓ ప్రైవేటు పాఠశాల అనుకుంటే పొరపాటే. వైశాలి జిల్లా, లాల్గంజ్లోని ప్రభుత్వ పాఠశాల. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యామంత్రి కృపానందన్ ప్రసాద్‌వర్మ కూడా అంగీకరించారు. ‘నిజమే.. ఆ పాఠశాలలో హిందూ, ముస్లిం విద్యార్థులకు వేర్వేరు సెక్షన్లు ఉన్నాయ’న్నారు. ఆ పాఠాశాలపై చర్యలు తీసుకునేందుకు నివేదిక తెప్పిస్తున్నామన్నారు. ఇక తరగతిలోనూ బీసీలు, ఎస్సీలను వేర్వేరుగా కూర్చోబెడుతున్నారని, రిజిస్టర్లు కూడా వేర్వేరుగా పెట్టినట్లు తమ ప్రాథమిక పరిశీలనలో తేలిందని లాల్గంజ్ విద్యాధికారి అరవింద్‌కుమార్ తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది దురదృష్టకరం, తప్పుడు విధానమని అన్నారు. -
ఇవీ సెక్షన్లు.. తప్పదు యాక్షన్!
సాక్షి, కల్వకుర్తి టౌన్ : అసెంబ్లీ ఎన్నికల సందడి జోరందుకుంది. అభ్యర్ధులు ప్రచారంలో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్ధులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరించినా, ఎన్నికల నియమావళి, నిబంధనలను అతిక్రమించినా శిక్ష తప్పదని చట్టాలు చెబుతున్నాయి. ఆయా సెక్షన్ల ప్రకారం దండనలు, జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఇంతకీ సెక్షన్లు ఏం చెబుతున్నాయి, అసలు ఆ సెక్షన్లు ఏమిటనే విషయాలు మీ కోసం.. ఎన్నికలు.. చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్ధలో పాలకులను ఎన్నుకోవడానికి ఎన్నికలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీ అభ్యర్ధులు నాయకులు,కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పక్రియలో నామినేషన్ల పక్రియ, పరిశీలన, ఉపసంహారణ అంతా పూర్తయింది. ప్రస్తుతం అంతర్జాలంలో ఎన్నికల చట్టాలు, నిబంధనలను గురించి వెతకటం ప్రారంభించారు. సెక్షన్ 125 జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించటం, ఒత్తిడికి లోను చేస్తే ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125 సెక్షన్ ప్రకారం ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలుశిక్ష లేదా జరిమానా, లేదంటే రెండింటినీ విధించవచ్చు. సెక్షన్ 126 ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. సెక్షన్ 128 బహిరంగంగా ఓటు వేస్తే మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా. సెక్షన్ 129 ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పోలీసులు పోటీ చేసే అభ్యర్ధికి సహకరించినా, ప్రభావం కలిగించిన శిక్షార్హులు. దీనికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 131 పోలింగ్ కేంద్రానికి సమీపంలో నియమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే, ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. దీనికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. రెండు కూడా విధించవచ్చు. సెక్షన్ 133 ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలీంగ్ కేంద్రానికి చేరవేసేందుకు వాహనాలను సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులే. దీనికి గాను మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించవచ్చు. సెక్షన్ 132 ఓటరు ఓటు వేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించవచ్చు. సెక్షన్ 134 అధికార దుర్వినియోగానికి పాల్పడితే అందుకుగాను శిక్షార్హులే. దీనికి గాను రూ.500 జరిమానా విధించవచ్చు. సెక్షన్ 134 అ ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంట్ కానీ పోలింగ్ ఏజెంటుగా కానీ ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే వారు శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. సెక్షన్ 127 ఎన్నికల సమావేశం సందర్భంగా ఎలాంటి అల్లర్లకు పాల్పడినా, పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయవచ్చు. దీనికి ఆరునెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 130 పోలింగ్ స్టేషన్ వద్ద 100 మీటర్ల లోపల ప్రచారం నిర్వహించకూడదు. దీనికి జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 135 పోలింగ్ కేంద్రం నుండి బ్యాలెట్ పేపరు, ఈవీఎం యంత్రం అపహారిస్తే వారు శిక్షార్హులు. దీనికి గాను ఏడాది పాటు జైలుశిక్ష,, రూ,500 జరిమానా విధించబడును. సెక్షన్ 134 ఆ పోలీస్స్టేషన్ల పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం శిక్షార్హం. దీనికి గాను ఏడాది పాటు జైలుశిక్ష రూ.,500 జరిమానా విధిస్తారు. సెక్షన్ 49పీ ఒక వ్యక్తి ఓటు మరో వ్యక్తి ఓటు వేస్తే పోలింగ్ అధికారి సదరు ఓటరు 49పీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. సెక్షన్ 135 ఈ పోలింగ్ కౌటింగ్ రోజున మద్యం విక్రయించటం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశ చూపటం నేరం. దీనికి గాను 6 నెలల జైలుశిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో నో సెల్ఫీ సాక్షి, కల్వకుర్తి టౌన్ / అచ్చంపేట : సాంకేతిక పెరుగుతున్నా కొద్దీ వయసు తారతమ్యం లేకుండా సమయం, సందర్భం లేకుండా ప్రతి ఒక్కరు సెల్ఫీలపై మోజు పడుతున్నారు. అదే అలవాటులో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరైనా ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించటం కుదరదు. ఒకవేళ ఎవరూ చూడటం లేదని, సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీలు పూర్తిగా నిషేధం. నిబంధనలను విరుద్ధంగా చూపిస్తూ ఓటు వేసినట్లుగా గుర్తిస్తే అధికారులు వెంటనే ఎన్నికల సంఘం ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 49 ఎం(ఓటు రహస్యం) బహిర్గతం నియమం కింద బయటకు పంపిస్తారు. వేసిన ఓటును సెక్షన్ 17–ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అయితే, రూల్ నెంబర్ 49 ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయడానికి 18 ఏళ్లు దాటిన సహాయకులను వెంట తీసుకువెళ్లొచ్చు. కానీ సహాయకుడు అంధులైన ఓటరు ఓటును బహిరంగ పర్చనని నిబంధన 10లో ధృవీకరించాల్సి ఉంటుంది. -
కామాంధుడికి ఏడేళ్ల జైలు
ఎస్ కోట: బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ నగరంలోని మహిళా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎ.వరప్రసాదరావు సోమవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.రామ్మూర్తినాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన జి.రమణ(32) విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురంలోని ఈనో కోళ్ల ఫారంలో పనిచేసేవాడు. అక్కడికి సమీపంలో పి.కనకమహాలక్ష్మి టీ దుకాణం నడుపుతుండేది. రమణ రోజూ టీ తాగడానికి అక్కడికి వెళ్లేవాడు. టీ దుకాణంలో సహాయకురాలిగా ఉండే ఓ బాలిక(15)తో పరిచయం పెంచుకుని 2010 జూన్ 6న ఆమెను అపహరించి అనకాపల్లి, అక్కడి నుంచి అరకు తీసుకువెళ్లాడు. బాలిక కనిపించకపోవడంతో కనకమహాలక్ష్మి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల తరువాత నిందితుడు రమణ, బాధితురాలిని పోలీసులు పట్టుకున్నారు. నిందితునిపై బాలిక అపహరణ, లైంగిక దాడికి సంబంధించి సెక్షన్ 363, 376 కింద కేసు నమోదు చేశారు. అప్పటి పెందుర్తి ఇన్స్పెక్టర్ భార్గవనాయుడు కేసు దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రెండు సెక్షన్ల కింద ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని తన తీర్పులో స్పష్టం చేశారు. -
కీలక రంగాల వృద్ధి 0.9 శాతం
డిసెంబర్ గణాంకాల విడుదల న్యూఢిల్లీ: ఎనిమిది కీలక రంగాల గ్రూప్ 2015 డిసెంబర్లో కేవలం 0.9 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2014 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 3.2 శాతం. అయితే 2015 నవంబర్‌లో అసలు ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత (ఎనిమిది నెలల కనిష్టం, -1.3 శాతం క్షీణత) నమోదయ్యింది. ఈ ఎనిమిది రంగాల్లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ విభాగాలు ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా 38 శాతం. క్రూడ్ ఆయిల్, సహజవాయువు, స్టీల్ రంగాల పేలవ పనితీరు మొత్తం గ్రూప్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఎరువుల రంగం మంచి పనితీరును కనబరిచింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. తొమ్మిది నెలల్లో... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 1.9 శాతం. 2014 ఇదే తొమ్మిది నెలల కాలంలో ఈ రేటు 5.7 శాతం. -
'కారు' కథకు తెరపడింది..
ముంబయి: కండల వీరుడు సల్మాన్ ఖాన్ భవిష్యత్తు తేలిపోయింది. 13 ఏళ్ల తర్వాత సల్లూ భాయ్ కారు కథకు తెర పడింది. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నిందితుడుగా ఉన్న హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆయనను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అయితే, శిక్ష మాత్రం ఇంక ఖరారు కాలేదు. 2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ మద్యం మత్తులో కారు నడపడం వల్ల రోడ్డు పక్కన ఉండే ఫుట్ పాత్‌పై పడుకున్న వారిపై వాహనం దూసుకెళ్లినట్టు కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. తొలుత బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును విచారించింది. అనంతరం విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో పలువురిని ప్రశ్నించి, సాక్ష్యాలు నమోదు చేశారు. సల్మాన్‌పై సెక్షన్లు.. వివరాలు సెక్షన్ 304: పార్ట్ 2... ఉద్దేశం ఉన్నా లేకున్నా హత్య, పదేళ్ల వరకు జైలు శిక్ష సెక్షన్ 279: వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఆరు నెలల వరకు జైలు శిక్ష సెక్షన్ 337, 338: తీవ్రంగా గాయపరచడం, రెండేళ్ల వరకు జైలు శిక్ష సెక్షన్ 427 :ఆస్తుల ధ్వంసం, రెండేళ్ల వరకు జైలు శిక్ష సెక్షన్ 34(ఏ), (బీ): నిబంధనలు విరుద్ధంగా వాహనం నడపడం ఆరు నెలల జైలు శిక్ష