Seema Singh
-
సీమాసింగ్..: చాంపియన్ ఆఫ్ చేంజ్
‘సేవ అనేది మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అని బలంగా నమ్మే సీమా సింగ్ విద్య నుంచి వైద్యం వరకు ఎన్నో రంగాలలో ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు చేస్తోంది. సీమ స్ఫూర్తితో ఆమె ఇద్దరు పిల్లలు కూడా సేవా పథంలో పయనిస్తున్నారు. ‘సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా’ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన ‘మేఘా శ్రేయ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సీమాసింగ్ తాజాగా ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ పురస్కారాన్ని స్వీకరించింది... ‘సేవలో ఉండే గొప్పతనం ఏమిటంటే అది మన శక్తిని మనకు పరిచయం చేస్తుంది. నువ్వు ఇంకా చేయగలవు అని ముందుకు నడిపిస్తుంది’ అంటుంది ముంబైకి చెందిన సీమాసింగ్. కష్టాల్లో ఉన్న డ్రైవర్ కుమారుడి చదువుకు సహాయం చేయడం ద్వారా ఆమె సేవాప్రస్థానం మొదలైంది. అది తనకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చిన సందర్భం. సీమ ఆర్థిక సహాయం చేసిన పిల్లాడు సీఏ విజయవంతంగా పూర్తి చేశాడు. గృహిణిగా ఉన్న సీమ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ కావడానికి ఈ సందర్భమే పునాది. తన కలలను సాకారం చేసుకోవడానికి ‘మేఘాశ్రేయ్’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ ద్వారా పిల్లల చదువు, స్త్రీ సాధికారత నుంచి అన్నదానం వరకు ఎన్నో సేవాకార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. కోవిడ్ సమయంలో ముంబైవాసుల కోసం వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించింది. పేదల అవసరాలను తీర్చింది. ‘‘లాక్డౌన్ సమయంలో ఒక స్వీపర్‌కు భోజనం, మాస్క్, శానిటైజర్ అందించాను. అవి తీసుకున్న అతడు... ‘థ్యాంక్స్ అమ్మా’ అన్నాడు. ఈ రెండు మాటలు నాకు ఎంతో శక్తిని ఇచ్చాయి. వెంటనే శానిటైజేషన్ కిట్స్‌కు ఆర్డరు ఇచ్చాను. ఒక కిచెన్ సర్వీస్ ద్వారా వాటిని పేదలకు పంపిణీ చేశాను. బయటికి వెళ్లడం వల్ల నాకు ఏమైనా అవుతుందేమో అని మావారు భయపడేవారు. అయితే జాగ్రత్తల విషయంలో నేను ఎప్పుడూ రాజీపడలేదు. రెండు రోజుల తరువాత నా పిల్లలు అమ్మా నీతో పాటు మేమూ వస్తాం అన్నారు. ఇంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది’’ అని గతాన్ని గుర్తు చేసుకుంది సీమ. కోవిడ్ సమయంలో సీమ మామయ్యకు ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆ సమయంలోనే సీనియర్ సిటిజెన్ల ప్రస్తావన తీసుకువచ్చింది ఆమె కూతురు మేఘన. తల్లీకూతుళ్లు వృద్ధాశ్రమాలకు వెళ్లి అవసరమైన మందులు ఇవ్వడమే కాదు... వారికి ధైర్యం కూడా చెప్పేవారు. çపట్టణం– పల్లె తేడా లేకుండా ‘సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా’ క్యాంపెయిన్‌ను ఎన్నోచోట్లకు తీసుకువెళ్లి అవగాహన సదస్సులు, ఉచిత స్క్రీనింగ్‌లు నిర్వహించింది సీమ. తన ఇద్దరు పిల్లలు డా.మేఘన, శ్రేయ్ శ్రీ పేర్లను కలుపుతూ స్వచ్ఛందసంస్థకు ‘మేఘాశ్రేయ్’ అని నామకరణం చేసింది సీమ. ఇప్పుడు వారు కూడా సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె కుమారుడు శ్రేయ్ తన 14వ పుట్టిన రోజు సందర్భంగా ఆడంబరాల జోలికి పోకుండా పుట్టినరోజు వేడుకకు అయ్యే ఖర్చుతో 150 మంది పేదవాళ్లకు అవసరమయ్యే వస్తువులను కొనిచ్చాడు. ఇక మేఘనకు తన పుట్టిన రోజును అనాథాశ్రమాలలో జరుపుకోవడం అలవాటు. ‘సమాజంపై సానుకూల మార్పు’ అనే అంశానికి సంబంధించి సీమాసింగ్ లోతైన ఆలోచనలు చేస్తుంటుంది. అయితే అవి మనసుకు మాత్రమే పరిమితమయ్యే ఆలోచనలు కావు. ఆచరణకు ప్రేరేపించే అద్భుత ఆలోచనలు. ఒక మహిళా కానిస్టేబుల్... ‘అమ్మా మీతో ఫొటో దిగుతాను’ అని సీమాసింగ్‌ను అభ్యర్థించింది. ‘నేను సినిమా స్టార్‌ని కాదు కదా!’ అని చిన్నగా నవ్వింది సీమ. ‘మంచి పనులు చేసే ప్రతి ఒక్కరూ స్టారే. మీ గురించి మా అమ్మాయికి చెప్పాలనుకుంటున్నాను’ అన్నది ఆ కానిస్టేబుల్. మంచి పనులు చేసే వాళ్లను ప్రజలు ఎంతగా అభిమానిస్తారో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. -
సీమా సింగ్ కూడా నేరాలకు పాల్పడితే..!
సాక్షి, న్యూఢిల్లీ : మున్నా భజరంగీగా పేరుబడ్డ కరుడుగట్టిన నేరస్థుడు ప్రేమ్ ప్రకాష్ సింగ్ భార్య సీమా సింగ్ జూన్ 29వ తేదీన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తన భర్తను చంపేందుకు కొందరు కుట్ర పన్నారని, ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్పట్ జైలులో ఉన్నప్పటికీ తన భర్తకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. తన భర్త ప్రాణాలను ఎలాగైనా రక్షించండంటూ ఆమె విలేకరుల సమావేశం వేదిక నుంచి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగికి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ జూలై 9వ తేదీన జైలులో మున్నా భజరంగీని మరో నేరస్థుల ముఠా సభ్యులు కాల్చి చంపారు. జైలర్‌ను సస్పెండ్ చేసి ముఖ్యమంత్రి యోగి జుడీషియల్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు విధుల్లో ఎలాంటి లోపం లేదని, తాము జైల్లో మున్నా భజరంగీకి అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేశామని రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ నివేదిక కూడా ఇచ్చారు. రాష్ట్రంలో నేరాలను సమూలంగా నిర్మూలిస్తానని అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి శపథం చేశారు. 2017, నవంబర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ.. నేరస్థులు ఇక జైలుకైనా వెళతారు లేదంటే ఎన్కౌంటర్లోనైనా చస్తారని ప్రకటించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి పది నెలల కాలంలోనే రాష్ట్రంలో మున్నెన్నడు లేని విధంగా 921 ఎన్కౌంటర్లు జరిగాయి. వాటిల్లో 33 మంది మరణించారు. ఈ విషయమై జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నోటీసు కూడా అందుకుంది. 2017, ఏప్రిల్ నెల నుంచి 2018, ఫిబ్రవరి నెలల మధ్య పది నెలల కాలంలోనే రాష్ట్ర కారాగారాల్లో 365 మంది మరణించారు. ఇన్ని ఎన్కౌంటర్లు, ఇన్ని కారాగార మరణాలు సంభవించినప్పటికీ రాష్ట్రంలో నేరాలు తగ్గిన సూచనలు మాత్రం లేవు. పైగా కొన్ని రకాల నేరాలు మునుపటి కన్నా పెరిగాయి. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల అరాచక పరిస్థితులు రాష్ట్రంలో పెరిగే అవకాశం ఉంది. మున్నా భజరంగీ ప్రాణాలకు ముప్పుందంటూ ఆయన భార్య బహిరంగంగా హెచ్చరిక చేశాక కూడా ఆయన్ని హత్య చేశారంటే ఓ నేరస్థుడు హతమయ్యాడు అనేకంటే పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే ఎక్కువ కారణమని ప్రజలు నిందిస్తారు. ఇప్పటి వరకు ఏ నేరాలతోని ఎలాంటి సంబంధంలేని సీమా సింగ్ తన భర్త ప్రాణాలకు ప్రతీకారంగాగానీ, భర్త స్థానాన్ని భర్తీ చేసేందుకుగానీ నేరస్థుల ముఠాలో చేరితే ఆ పాపం ఎవరిదని? సామాజిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. -
భార్యను పొడిచి.. పోలీసులకు చెప్పి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అతి దారుణంగా ఆమెను కత్తితోపొడిచి చంపేశాడు. వారికి ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఆమెను పొడుస్తున్న సమయంలో పిల్లలు పక్క గదిలోనే నిద్రిస్తున్నారు. ఈ ఘటనతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. నితిన్ సింగ్ (46) సీమా సింగ్(42) అనే ఇద్దరు భార్యా భర్తలు. గత కొద్ది కాలంగా వారి మధ్య ఏదో విషయంపై గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత వారం ఇలాగే గొడవ పడిన నితిన్ సింగ్.. భార్యను కిచెన్‌లోకి తీసుకెళ్లి హత్యచేశాడు. అనంతరం తానే స్వయంగా పోలీసుల అత్యవసర నెంబర్ కు ఫోన్ చేసి పిలిచాడు. వేకువ జామున ఈ ఘటన జరగడంతో అప్పటికే అంతా నిద్రమత్తులోనే ఉన్నారు. అరెస్టు చేసినందుకు పోలీసులు వెళ్లిన సమయంలో అతడు తన భార్య రక్తపు మరకలతో దారుణంగా కనిపించాడని, ఆ దృశ్యం భీతావాహంగా కనిపించిందని పోలీసులు చెప్పారు.