self-employed loans
-
చిన్న సంస్థలకు రుణాలపై ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య తరహా సంస్థలు, స్వయం ఉపాధి పొందుతున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ఎండీ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు. కొత్తగా సప్లై చెయిన్ ఫైనాన్సింగ్, విద్యా రుణాల విభాగాల్లోకి కూడా మరికొద్ది నెలల్లో ప్రవేశించనున్నట్లు చక్రవర్తి వివరించారు. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 15% పైచిలుకు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 18% వరకు వ్యాపార వృద్ధిని అంచనా వేస్తున్నట్లు శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) రూ. 1,71,000 కోట్లుగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 33,000 కోట్లుగా ఉందని చక్రవర్తి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.3,000 కోట్ల డిపాజిట్లు, 46,000 పైచిలుకు డిపాజిట్‌దారులు, 10,000 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. అన్ని శాఖల్లో అన్ని సర్వీసులు .. ప్రస్తుతం 268 శాఖల్లో మాత్రమే వాణిజ్య వాహన (సీవీ) రుణాలు ఇస్తుండగా, కొత్తగా మరో 170 శాఖల్లో కూడా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 2023 ఆఖరు నాటికి అన్ని శాఖల్లోనూ అన్ని ఉత్పత్తులను అందించాలని నిర్దేశించుకున్నట్లు చక్రవర్తి చెప్పారు. -
యువత పై పట్టింపేది..
ఆదిలాబాద్‌అర్బన్: యువజన సర్వీసుల శాఖ(స్టెప్)పై సర్కారు చిన్నచూపు చూస్తోంది. గత నాలుగేళ్లుగా ఎలాంటి సంక్షేమ యూనిట్లు గానీ వాటికి సంబంధించి రుణాలూ విడుదల చేయడం లేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం యువజన సంఘాలను పట్టించుకోకపోవడంతో గ్రూపులలోని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటి ప్రాముఖ్యతను వివరించడంతోపాటు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న యువతకు ప్రభుత్వం చేయూతనివ్వకపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నారు. నేటి సమాజానికి చేదోడువాదోడుగా ఉంటూ సామాజిక సేవ చేస్తున్న యువతను గుర్తించి గ్రూపులుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితం జిల్లా అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే యువతను గుర్తించిన అధికారులు వారిని గ్రూపులుగా ఏర్పాటు చేశారు. వీరికే ఆర్థిక సాయం అందించే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నా.. యూనిట్ల మంజూరు, రుణాల విడుదలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. కాగా, ప్రతి యేడాది యూనిట్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా.. ఈ నాలుగేళ్లలో ఇంతవరకు ఏ ఒక్క సారి కూడా రుణాలు మంజూరు కాలేదంటే సర్కారుకు యువతపై ఉన్న శ్రద్ధ ఇట్టే అర్థమవుతోంది. 300 యూనిట్లు.. 566 యూత్ గ్రూపులు.. జిల్లాలోని యూత్ గ్రూపుల సభ్యులకు ప్రభుత్వం ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లకు ఆర్థిక సాయం అందించేందుకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గత నాలుగేళ్లుగా ఇలాంటి ప్రతిపాదనలు పంపినా ప్ర భుత్వం పక్కన పెడుతూ వచ్చింది. 2016–17లో జిల్లాకు 700 యూనిట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినా.. ఏ ఒక్కటి మంజూరు చేయలేదు. 2017–18 సంవత్సరంలో జిల్లాకు 400 యూని ట్లు కేటాయించాలని నివేదించినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. తాజాగా 2018–19 ఆర్థి క సంవత్సరానికిగాను జిల్లాకు 300 యూనిట్లు కేటాయించాలని నివేదించగా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రభుత్వం మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్లపై యువత ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం వరుసగా నాలుగేళ్ల నుంచి ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకపోవడంతో యూత్ గ్రూపులలోని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో మొ త్తం 566 యూత్ గ్రూపులు రిజష్టరై ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సుమారు 5 వేల మందికిపైగా యువత సభ్యులుగా ఉన్నారు. జిల్లాలోని పాత 13 మండలాల్లో యూత్ గ్రూపులు ఏర్పాటు అయ్యాయి. అత్యధికంగా ఇచ్చోడ మండలంలో 92 యూత్ గ్రూపులు ఉండగా, గుడిహత్నూర్ మండలంలో అతి తక్కువగా 16 గ్రూపులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. యువజన సర్వీసుల శాఖ ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లు ఈ గ్రూపుల సభ్యులకే వర్తింపజేస్తారు. గతంలో ‘స్వయం ఉపాధి’ ఇలా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువజన సర్వీసుల శాఖకు ప్రతియేడాది స్వయం ఉపాధి రుణాల యూనిట్లు ఆయా ప్రభుత్వాలు కేటాయిస్తూ వచ్చాయి. అప్పట్లో ప్రభుత్వం ప్రతి యేటా యూనిట్ల కేటాయింపుకు ప్రతిపాదనలు కోరడం, అందుకు తగిన రుణాలు విడుదల చేయడం వంటివి జరిగేది. దరఖాస్తులు చేసుకున్న యువతకు ఆటోట్రాలీ, ప్యాసింజర్ ఆటో, డెస్క్‌టాప్ ప్రింటింగ్(డీటీపీ), జిరాక్స్ సెంటర్, ఇతర యూనిట్లు ఇచ్చి యువతను ప్రోత్సహించే వారు. దీంతో జిల్లాలోని యువతకు స్వయం ఉపాధి దొరకడంతోపాటు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం సాయం అందించేది. కాలానుగుణంగా వచ్చిన ప్రభుత్వాలు పూర్తి భిన్నంగా మార్చేశాయి. నాలుగేళ్లుగా యూనిట్ల మంజూరుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో యువత సంవత్సరాల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ప్రతిపాదనలు పంపుతున్నాం.. ప్రతి యేడాది స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. కానీ ఈ నాలుగేళ్లలో ఇంత వరకు మంజూరు కాలేదు. యూనిట్ల కేటాయింపు ప్రభుత్వ స్థాయిలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉంది. ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ యేడాది కూడా యూనిట్ల ప్రతిపాదనలు పంపించాం. రాబోయే ఎన్నికల అనంతరం మంజూరు కేటాయించవచ్చు. – వెంకటేశ్వర్లు, సీఈవో,యువజన సర్వీసుల శాఖ -
నేడే ఆఖరు రోజు..
ఖమ్మం మయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ)కు చెందిన నిరుద్యోగులు సబ్సిడీ రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగియనుంది. నిరుద్యోగులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు.. యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందించి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వం అందించే రుణాలు పొందిన లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతుండగా.. కొత్త రుణాల కోసం దరఖాస్తుదారుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు ప్రభుత్వం రుణ ప్రణాళికను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. గత నెల 19 నుంచి దరఖాస్తు చేసుకునేలా ఆన్లైన్ సైట్‌ను ప్రభుత్వం ఓపెన్ చేసింది. అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పలు కారణాల వల్ల జిల్లా అధికారులు ఆలస్యంగా ప్రకటించారు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కొంత వెనుకబడ్డారు. ఈనెల 7వ తేదీతోనే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అని ప్రకటించిన ప్రభుత్వం గడువు తేదీని ఈనెల 10వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు కొంత ఊరట చెందారు. నేటితో గడువు ముగుస్తుండడంతో ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు గడువు తేదీ పెంచాలని కోరుతున్నారు. గడువు తేదీ ముగిస్తే సవరణలకు కూడా అవకాశం కోల్పోతామని, తాము పొందాలనుకున్న యూనిట్‌ను పొందలేమని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు 4,065 యూనిట్లు.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పలు కేటగిరీల్లో సబ్సిడీ రుణాలను అందిస్తుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు సంబంధించిన రుణ ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలను అందించడంతోపాటు పలు రుణాలకు సంబంధించిన ప్రణాళికలను విడుదల చేసింది. జిల్లాకు మొత్తం 4,065 యూనిట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో బ్యాంక్ లింకేజీ ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు 670 యూనిట్లు, సీఎం ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ డెవలప్ ప్రోగ్రాం(సీఎంఈడీపీ) పథకానికి 93, ఆదాయ అభివృద్ధి పథకానికి 232, సంఘాలకు 7, బ్యాంక్‌తో సంబంధం లేకుండా భూ పంపిణీ పథకానికి 110, మైనర్ ఇరిగేషన్ కింద 664, ఎనెర్జిషన్ పథకం కింద 353, ఈఎస్ఎస్ పథకం కింద 775, ట్రైనింగ్ ప్రోగ్రాం కింద 925, ఇతర పథకాల కింద 236 యూనిట్లను జిల్లాకు కేటాయించారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ ద్వారా ఎస్సీల ఆర్థిక బలోపేతం కోసం అందించే రుణాల యూనిట్ల సంఖ్యను మాత్రం తగ్గించింది. 2018–19 సంవత్సరానికి మొత్తం 670 యూనిట్లను జిల్లా లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పురుషులకు 447 యూనిట్లు, మహిళలకు 223, వికలాంగులకు 34 యూనిట్లను కేటాయించింది. ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంక్ లింకేజీ ద్వారా అందించే రూ.లక్ష యూనిట్లు 318, రూ.2లక్షల యూనిట్లు 255, రూ.7లక్షల యూనిట్లు 97 ఉన్నాయి. గత ఏడాది జిల్లాకు 1,382 యూనిట్లను జిల్లా లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ ఏడాది 670 యూనిట్లను మాత్రమే కేటాయించడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 20,449 దరఖాస్తులు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు 20,449 మంది దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు బ్యాంక్ లింకేజీ ద్వారా అందుకునే రుణాలకు వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది రుణాలకు దరఖాస్తు చేసుకొని రుణం పొందని దరఖాస్తులు సైతం ఈ ఏడాది అందించే రుణాలకు రెన్యూవల్ అయ్యాయి. దీంతో కొత్తగా, రెన్యూవల్ అయిన దరఖాస్తులు ఇప్పటివరకు 20,449 ఉన్నాయి. ఇంకా ఒక రోజు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆన్లైన్లో పలు కారణాలతో దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల తర్వాతే ఎంపికలు.. అసెంబ్లీ రద్దుతో త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే సబ్సిడీ రుణాలు ఎన్నికల తర్వాతే ఉంటాయి. అభ్యర్థులు గడువు తేదీని గమనించి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం గడువు తేదీ పెంచితే జిల్లాలో ఇంకా దరఖాస్తుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రేషన్ కార్డులో ఉన్న వారిలో ఒక్కరికి మాత్రమే రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనిని గమనించి దరఖాస్తు చేసుకోవాలి. – వై.ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
కుదింపు కుదిరితేనే రుణం..!
ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రుణాలు అందజేసి ఆదుకుంటోంది. రూ.లక్ష నుంచి రూ.12లక్షల వరకు సబ్సిడీ రుణాలు పొందేందుకు నిరుద్యోగులు, చిరువ్యాపారులు, యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్న విషయం విదితమే.. కాగా 2017–18 సంవత్సరానికి గాను కేటగిరి–1 కింద రూ.లక్ష యూనిట్ కోసం 3,882 మంది బీసీ లబ్ధిదారులు రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో రూ.50వేల యూనిట్ ఆప్షన్ లేకపోవడం, రూ.లక్ష యూనిట్ నుంచే రుణాల దరఖాస్తుల స్వీకరణ ఉండడంతో వాటికి అనుగుణంగానే దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఈ సబ్సిడీ రుణాలను అందజేసింది. మూడేళ్ల క్రితం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2వేలకు పైగా బీసీ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా, పూర్తిస్థాయిలో రుణాలకు పంపిణీ చేయలేదు. రూ.లక్ష యూనిట్ కింద దరఖాస్తు చేసుకున్న కొందరు లబ్ధిదారులకు మాత్రమే వీటిని అందజేసి చేతులు దులిపేసుకుంది. మూడేళ్లుగా రుణాలు అందించకపోవడంతో స్వయం ఉపాధి రుణాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా 2017–18 సంవత్సరానికి సంబంధించి బీసీలకు పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రుణాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా పూర్తిస్థాయిలో కాకుండా స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ బిజినెస్ సెక్టార్ కింద రూ.50వేల యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేయనుండడంతో మిగతా వారు ఆందోళన చెందుతున్నారు. మిగతా వారికెప్పుడో..! బీసీ స్వయం ఉపాధి రుణాల కోసం ప్రభుత్వం కేటగిరి–1 కింద రూ.1లక్ష యూనిట్ నుంచి మొదలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. అప్పుడు రూ.50వేల యూనిట్ అని ఎక్కడా లేదు. అయితే రూ.లక్ష యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.50 వేలకు కుదించి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష కాకుండా రూ.50వేల వరకు అవసరమున్న కుటీర పరిశ్రమల వారికి వంద శాతం సబ్సిడీపై పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కుదింపునకు ఒప్పుకున్న వంద మంది లబ్ధిదారులకు అందజేయనుంది. కాగా, కేటగిరి–1లో 3,882 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, ఆయా మండలాల ఎంపీడీఓల నుంచి ఆన్లైన్ ద్వారా 2,708 మంది జాబితా సంబంధిత శాఖలకు చేరుకున్నాయి. కేటగిరి–2లో రూ.లక్ష పైనుంచి రూ.2లక్షల్లోపు 7,051 మంది ఆన్లైన్లో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా, 5,364 మందికి సంబంధించిన జాబితా సంబంధిత శాఖకు చేరుకుంది. కేటగిరి–3లో రూ.2లక్షల పైనుంచి రూ.12లక్షల వరకు రుణాల కోసం 2,973 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1305 మంది లబ్ధిదారులకు సంబంధించిన జాబితా బీసీ కార్పొరేషన్‌కు చేరుకుంది. మిగతా లబ్ధిదారుల జాబితా చేరాల్సి ఉంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా వంద మంది లబ్ధిదారులకు మాత్రమే రూ.50వేల యూనిట్‌కు సంబంధించి రుణాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకోసం రూ.50 లక్షల బడ్జెట్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని ఆ శాఖాధికారులు పేర్కొన్నారు. రూ.లక్ష నుంచి రూ.12లక్షల దరఖాస్తు చేసుకొని రుణాల కోసం ఎదురుచూస్తున్న తమ పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన చెందుతున్నారు. చిరువ్యాపారులకు ప్రాధాన్యం.. స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చిరువ్యాపారు(స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ బిజినెస్ సెక్టార్)లకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని రూ.50వేల వరకు రుణాలను పంద్రాగస్టు వేడుకల సందర్భంగా అందించనున్నారు. చిరువ్యాపారాలు చేసుకొని వీరు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందించనుంది. బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాలి గతంలో ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈసారి కూడా స్వయం ఉపాధి రుణాలను అందించాలి. దరఖాస్తు చేసుకున్న వారికి పరికరాలు కాకుండా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనే నగదు జమ చేయాలి. పరికరాలను అందజేస్తే నాసిరకంతోపాటు దళారులకు మేలు కలిగించేలా అవుతుంది. లబ్ధిదారులకు మేలు చేకూరేలా ప్రభుత్వం ఆలోచించాలి. – చిక్కాల దత్తు, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రూ.లక్ష రుణం అందించాలి.. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రూ.50వేల సబ్సిడీ వంద శాతానికి బదులు రూ.లక్ష రుణం వంద శాతం రాయితీపై కల్పించాలి. నేరుగా లబ్ధిదారుని ఖాతాలోనే సబ్సిడీ రుణాన్ని జమ చేయాలి. లేనిపక్షంలో లబ్ధిదారులు నష్టపోవాల్సి వస్తుంది. – మందపెల్లి శ్రీనివాస్, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంద మందికి పంపిణీ.. వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ లబ్ధిదారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని వంద మంది లబ్ధిదారులకు రూ.50వేల చొప్పున రుణాలు అందించనున్నాం. రూ.లక్ష నుంచి కుదించి రూ.50వేలకు ఒప్పుకున్న లబ్ధిదారులకు మాత్రమే వీటిని అందించనున్నాం. వీటికి సంబంధించి రూ.50లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. – ఆశన్న, జిల్లా బీసీ శాఖ అభివృద్ధి అధికారి -
స్వయం ఉపాధిపై ఆంక్షలు
ఒంగోలు: కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు...చివరకు ఉపాధిని సైతం దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివిధ కార్పొరేషన్ల కింద స్వయం ఉపాధికి ఇచ్చే రుణాలను తాము ఇస్తామన్నా తీసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదంటూ కొత్తపాట పాడుతోంది. ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తూ స్వయం ఉపాధి కోసం ఆరాటపడుతున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీలోగా యూనిట్ స్థాపించకపోతే అకౌంట్‌కు జమ చేసిన సబ్సిడీ మొత్తం కూడా రద్దు చేస్తామంటూ ఆదేశించింది. ఇక వ్యవసాయంపై రాబడి చాలక కనీసం పశుపోషణ ద్వారా అయినా గట్టెక్కుదామనుకున్న పల్లె ప్రజలు ఈనెల 7 మొదలు 22వ తేదీ వరకు మూడు దశల్లో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు దాఖలు చేయాలని, లేకుంటే రుణాలు రద్దు చేస్తామని జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తోంది. లక్ష్యం కన్నా తక్కువగా మంజూరు ఉత్తర్వులు: ఒక వైపు ఉద్యోగం రాక..ఉపాధి కోసం విలవిల్లాడుతున్న జనానికి జిల్లాలో కొదువలేదు. అయితే జిల్లా అధికారులు మాత్రం నిరుద్యోగులు తక్కువగా రావడం వల్లే అనుకున్న మేరకు లక్ష్యాన్ని సాధించలేకపోయామని 2016–17లో చెప్పుకొచ్చారు. కానీ 7472 మందికి రుణాలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే 16,874 మందికి రుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గాను 60,270 మంది దరఖాస్తు చేసుకుని రుణ మేళాకు హాజరయ్యారు. కేవలం 72 గంటల్లో రుణాలను పరిష్కరిస్తామన్న అధికారులు మాట తప్పారు. ఈ దశలో కేవలం 15,404 మందిని మాత్రమే రుణాలకు అర్హులుగా పేర్కొన్నారు. ఎస్సీలు 22,233 మంది హాజరుకాగా ఎంపిక చేసిన వారి సంఖ్య కేవలం 7953, ఎస్టీలలో 4520 మందికిగాను 481, బీసీలలో 18,790 మందికిగాను 2654, కాపులలో 10,043 మందికిగాను 3,305 మందికి, మైనార్టీలలో 4606 మందికి 968 మందికి, క్రిస్టియన్ మైనార్టీలో 78 మందికిగాను 43 మందికి మాత్రమే మంజూరు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంటే హాజరైన వారిలో కేవలం పాతిక శాతం మందిని మాత్రమే అర్హులుగా చేశారు. మరి..మిగిలిన 75 శాతం మందిని ఎందుకు తిరస్కరించారో అధికార యంత్రాంగానికే తెలియాలి. వారిలో కూడా ఇప్పటి వరకు 2448 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. ఇంకా 12,956 మందికి రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న సమస్యలు: గ్రామాల్లో మాత్రమే నోఅబ్జక్షన్ సర్టిఫికెట్లు తీసుకోవాలనే నిబంధన ఉందని బ్యాంకర్లే చెబుతున్నారు. కానీ పట్టణం మొదలు పల్లెల్లో సైతం కనీసంగా 7 నుంచి పది బ్యాంకుల పేర్లు ఇచ్చి ఆ బ్యాంకు అధికారులతో సంతకాలు చేయించుకు రావాలని ఆదేశిస్తున్నారు. ఆ సర్టిఫికెట్ల కోసమే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీడీసీసీ బ్యాంకులో అయితే తమకు అభ్యంతరం లేదంటూ సర్టిఫై చేసేందుకు రూ.50ల చొప్పున చలానా సైతం కట్టించుకున్నారు. పలువురు బ్యాంకర్లు నోఅబ్జక్షన్ సర్టిఫై చేసేందుకు జాప్యం చేస్తుండడంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరగక తప్పడం లేదు. -
నిరుద్యోగ యువతకు శుభవార్త
* రాజీవ్ యువశక్తి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం * ఆగస్టు 8వ తేదీ వరకు గడువు అర్హతలు ఇవీ.. * 18 నుంచి 35ఏళ్లలోపు వయసు ఉండాలి. * పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన వారు అర్హులు. వృత్తి విద్య శిక్షకులకు సైతం అవకాశం ఉంది. * ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 5వ తరగతి వరకు విద్యార్హత ఉండాలి. * వార్షిక ఆదాయం రూ.50వేలు ఉండాలి. ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువశక్తి రుణాలు అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువశక్తి పథకం 2014-15 సంవత్సరానికి గాను 365 యూనిట్లు మంజూరు చేయనుంది. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తోంది. ఈ మేరకు జిల్లా యువజన సర్వీసుల శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు ఫారాలు ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకు చేరాయి. మండలాలు, మున్సిపాల్టీల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేసి రుణాలు అందిస్తారు. రుణ సబ్సిడీ రూ.30వేలు ఉంటుంది. రూ.60వేలు రుణం తీసుకున్న వారికి సగం ప్రభుత్వం చెల్లించనుండగా.. రూ.30వేలు సబ్సిడీ లభిస్తుంది. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు రుణాలు తీసుకునే వారు 10శాతం బ్యాంకులు డిపాజిట్ చేయాలి. రూ.60వేల రుణం తీసుకునే వారు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆగస్టు 8లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా ఎంపిక కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ రాజీవ్ యువశక్తి పథకానికి అర్హులను ఎంపిక చేసేందుకు జిల్లా కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. అర్హులను కలెక్టర్ సమక్షంలోనే ఎంపిక చేస్తారు. జిల్లా కమిటీలో బ్యాంకు మేనేజర్, స్టెప్ సీఈవో, డీఆర్డీఏ పీడీలు సభ్యులు ఉంటారు. మండల స్థాయిలో ఎంపీడీవో, సభ్యులుగా ఐకేపీ, డీఆర్డీఏ రిప్రజెంటెటివ్, యువజన సర్వీసుల శాఖ, బ్యాంకర్లు సభ్యులుగా ఉంటారు. మున్సిపాల్టీలో కమిషనర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ, బ్యాంకర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. మండల, మున్సిపాల్టీలో సంయుక్తంగా సదస్సులు, ఇంటర్వ్యూలు, ప్రజాపథం, సంయుక్తగా గుర్తింపు కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి యువజన సర్వీసుల శాఖకు పంపిస్తారు. దరఖాస్తు ఇలా చేసుకోవాలి.. నిరుద్యోగ యువతీ, యువకులు రాజీవ్ యువశక్తి స్వయం ఉపాధి రుణాల కోసం ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆయా కార్యాలయాలతోపాటు స్టెప్ కార్యాలయంలోనూ దరఖాస్తులులభిస్తాయి. దరఖాస్తు పూర్తి చేసి ఫొటో అతికించాలి. బ్యాంకు రుణం ఇచ్చేందుదకు అనుమతి పత్రం జోడించాలి. ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌పుస్తకం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. ఎంపీడీవోలు,మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తులు అందజేయాలి. వారు అర్హులను ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపిస్తారు. రుణాలు.. ఫ్లోర్‌మిల్లు, ఆటోరిక్షా, జిరాక్స్ మిషన్, కాంక్రీట్ మిషన్, మెకానికల్ వర్క్‌షాప్, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, డీటీపీ సెంటర్, సిమెంట్ బ్రిక్స్, క్లినికల్ లేబరేటరీస్, సెంట్రింగ్ వర్క్, ఫొటో, వీడియోగ్రఫి, మోటార్ వైండింగ్, వెల్డింగ్ వర్క్స్ తదితర రుణాలు అందిస్తారు. కిరాణ, జనరల్ స్టోర్లు, క్లాత్ బిజినెస్, కూరగాయల దుకాణాలు, ప్యాన్సిస్టోర్లకు రుణాలు ఇవ్వరు. రిజర్వేషన్లు స్వయం ఉపాధి రుణాల్లో రిజర్వేషన్ కల్పించారు. మండల, జిల్లా స్థాయిలోనూ రిజర్వేషన్ అమలవుతుంది. ఎస్సీలకు 18 శాతం, బీసీలకు 27 శాతం, ఎస్టీలకు 18 శాతం, మహిళలకు 33 శాతం, మైనార్టీలకు 11 శాతం, వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించారు. మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు రుణాలు ఇప్పిస్తామని మభ్యపెట్టే, మోసగించే మాటలు నిరుద్యోగ యువతీ, యువకులు నమ్మవద్దు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురండి. అర్హులైన వారికి రుణాలు తప్పక అందిస్తాం. రాజీవ్ యువశక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - వెంకటేశ్వర్లు, యువజన సర్వీసుల శాఖ సీఈవో -
స్వయం ఉపాధి సున్నా!
రుణాల మంజూరుకు రెండు నెలలే గడువు ముంచుకొస్తున్న ఎన్నికల కోడ్ దరఖాస్తుదారుల్లో ఆందోళన త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది...అభివృద్ధి పనులకు ‘కోడ్’ అడ్డం రానుంది. ఇదే సమయంలో మరో రెండు నెలల్లోనే ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో స్వయం ఉపాధి రుణాలు లబ్ధిదారులకు అందే సూచనలు కన్పించడం లేదు. ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ఆలస్యంగా ఖరారు చేయడంతో రాష్ట్రంలో ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు రుణాలు అందే సూచనలు కనిపించడం లేదు. సబ్సిడీ మొత్తాలు పెంచడంతో ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ వెనక్కి పంపేశారు. వివరాలిలా వున్నాయి. ఏటా బీసీ,ఎస్సీ,మైనారిటీ,సెట్విస్ సం స్థల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రూ.కోట్లతో రుణాలు ఇస్తుంటారు. ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేశాక బ్యాంకులు రుణాలు ఇస్తాయి. రుణాలు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలో పావలా మినహాయించుకుని మిగిలిన వడ్డీని వాపస్ చేస్తారు. కానీ, ఈ ఏడాది ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను గత నెలలో ఖరారు చేయడం గమనార్హం. ఈ ఏడాది సబ్సిడీ మొత్తాలను రూ.30వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అలాగే, లబ్ధిదారుని వాటా ధనం రద్దు చేశారు. గతనెలలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అధికారులతో కూడిన క మిటీ ఆమోదించిన దరఖాస్తులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. రుణాలకు వయోపరిమితిని బీసీలకు 40 ఏళ్లు, ఎస్సీలకు 45 ఏళ్లకు కుదించారు. వెనక్కి వచ్చిన దరఖాస్తులు ఎండీఓ, జీవీఎంసీ జోనల్, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయాలలో మూలుగుతున్నాయి. దరఖాస్తులను మళ్లీ పరిశీలించి ప్రభుత్వానికి పంపేసరికి సార్వత్రిక ఎన్నికల కోడ్ ముంచు కొచ్చేస్తుందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. వివిధ శాఖల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి... ఎస్సీ కార్పొరేషన్లో... ఈ ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన దరఖాస్తులు 8012 బ్యాంకర్ల ఆమోదంతో వచ్చిన దరఖాస్తులు 343 ఈ ఏడాది లక్ష్యం 1495 యూనిట్లు వార్షిక రుణ లక్ష్యం రూ.13.55కోట్లు సబ్సిడీ రూ.6.01కోట్లు బ్యాంకు రుణాలు రూ.7.54కోట్లు జీవీఎంసీ పరిధిలో 608 యూనిట్లకు 2340 దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాలలో 140 యూనిట్లకు 885 దరఖాస్తులు నర్సీపట్నంలో 409 యూనిట్లకు 2732 దరఖాస్తులు యలమంచిలిలో 9 యూనిట్లకు 158 దరఖాస్తులు బీసీ కార్పొరేషన్లో... వార్షిక రుణ లక్ష్యం రూ.34.49కోట్లు మార్జిన్‌మనీ రుణాలకు రూ.21.06కోట్లు రాజీవ్ అభ్యుదయ యోజనకు రూ.13.43కోట్లు మార్జిన్‌మనీ దరఖాస్తులు 1172 రాజీవ్రుణాల దరఖాస్తులు 413 సెట్విస్లో... ఈ ఏడాది యూనిట్ల లక్ష్యం 610 యూనిట్లు రుణాల లక్ష్యం రూ.6.10కోట్లు వచ్చిన దరఖాస్తులు 930కిపైగా సబ్సిడీ మొత్తం రూ.2కోట్లు బ్యాంక్ రుణం రూ.4.10కోట్లు 5- బ్యాంక్‌పై స్కెచ్... మేనేజర్ ఇంట్లో చోరీ