Self-employment schemes
-
బీసీలకు సబ్సిడీ 100%
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపాధి పథకాలను అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వంద శాతం సబ్సిడీతో ఆర్థిక సాయం నేరుగా అందించాలని చెప్పారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, గణేష్ గుప్తా, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల వారీగా లబ్ధిదారులు ‘‘బీసీల్లో కుల వృత్తులు చేసుకుని జీవించే వారికి అవసరమైన పనిముట్లు కొనుక్కోవడానికి, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అవసరమైన పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించాలి. ఇందుకు గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ప్రతీ జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా, బీసీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏ పీడీ సభ్యులుగా కమిటీని నియమించాలి. లబ్ధిదారుల జాబితా సిద్ధం కాగానే బ్యాంకులతో సంబంధం లేకుండా వారికే నేరుగా ఆర్థిక సాయం అందించాలి’’అని సీఎం చెప్పారు. ‘‘బీసీ సంక్షేమ శాఖకు, ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను ఇందుకు వినియోగించాలి. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కులాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. పెద్దఎత్తున బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నుంచి మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తాం. మైనారిటీ రెసిడెన్షియల్స్‌లో ఎక్కడైనా సీట్లు మిగిలితే వాటిని కూడా బీసీలకే కేటాయిస్తాం. బీసీ కులాల్లోని పిల్లలకు మంచి విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కల్లు దుకాణాల పునరుద్ధరణ, చెట్ల పన్ను రద్దు చేయడం వల్ల గీత కార్మికులకు మేలు కలుగుతోంది. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చే విషయాలపై మరోసారి అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’’అని సీఎం వివరించారు. పండ్లు, కూరగాయాలు అమ్ముకునేవారికీ చేయూత యాదవులకు ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేశామని, వారు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పెద్ద ఎత్తున చేపల పెంపకం వల్ల ముదిరాజ్, గంగపుత్రులు తదితరులు లాభం పొందుతున్నారన్నారు. చేనేతను ఆదుకోవడానికి తీసుకున్న చర్యల వల్ల పద్మశాలి కులస్తులకు మేలు కలిగిందని పేర్కొన్నారు. ఇంకా చాలా కులాలవారు వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని, వారందరికీ చేయూత అందిస్తామని చెప్పారు. ‘‘విశ్వ కర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులతోపాటు ఎంబీసీ కులాల వారికి ఆర్థిక చేయూత అందివ్వాలి. కుల వృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారులు చేసే వారికి, పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి, మెకానిక్ పనులు చేసుకునే వారికి, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బీసీలను గుర్తించి ఆర్థిక చేయూత అందివ్వాలి’’అని అధికారులను ఆదేశించారు. -
ఎస్టీ, బీసీలకు డ్రైవింగ్‌లో శిక్షణ
* మారుతీ సంస్థ సహకారం * స్వతంత్ర సంస్థ ద్వారా శిక్షణపై పర్యవేక్షణ సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా శిక్షణ, నైపుణ్యాల మెరుగుదలకు సంక్షేమ శాఖలు చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ర్ట ప్రభుత్వ ఆమోదముద్ర పడిన వెంటనే ఈ పథకాలు అమలులోకి రానున్నాయి. షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందినవారికి మారుతీ మోటార్స్ సంస్థ ద్వారా డ్రైవింగ్‌లో ప్రొఫెషనల్ శిక్షణను అందించనున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ ఉండి, అనుభవమున్నవారికి మరింత మెరుగైన శిక్షణతోపాటు వృత్తిపరంగా ఆయా బాధ్యతల నిర్వహణలో భాగంగా ఇతరులతో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై కూడా ప్రత్యేక అవగాహనను ఇచ్చేలా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇంగ్లిష్‌లో ప్రవేశమున్నవారిని గుర్తించి వారికి ప్రత్యేకమైన శిక్షణను అందించనున్నారు. ఎస్టీ కార్పొరేషన్ (ట్రైకార్), బీసీ కార్పొరేషన్ ద్వారా ఆయా శిక్షణా కార్యక్రమాలను అమలుచేస్తారు. వెబ్సైట్ ద్వారా ఔత్సాహికుల వివరాలు సేకరణ ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఔత్సాహిక యువకులు, నిరుద్యోగుల నుంచి (డ్రైవింగ్ లెసైన్స్, వృత్తి అనుభవమున్నవారు) వారి వివరాలు సమాచారాన్ని సేకరించి వారి ఆలోచనలు, అభిలాషలను విశ్లేషిస్తారు. సొంతంగా ట్యాక్సీలు, ఆటోలు నడుపుకోవాలని ఆలోచనతో ఉన్నవారికి ఆయా కార్పొరేషన్ల ద్వారా డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద అందుకు అవసరమైన రుణాలు అందజేస్తారు. డ్రైవర్లుగా పనిచేయాలని అనుకుంటున్నవారి విద్యార్హతలు, ఇంగ్లిష్‌లో ప్రవేశాన్ని బట్టి ఆయా కంపెనీలు, సంస్థల అవసరాల మేరకు డ్రైవర్లుగా పంపిస్తారు. సరుకు రవాణాను ఇష్టపడేవారికి అందుకు అవసరమైన టిప్పర్లు, ఇతర వాహనాలను సమకూరుస్తారు. అద్దెపై ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటోలు నడుపుకోవాలనేవారికి ఆ మేరకు అవకాశాలను కల్పిస్తారు. స్వయం ఉపాధి పథకాల లబ్ధిదారులకు ఆయా ప్రయోజనాలు అందాక వారు వాటిని ఏ విధంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న దానిని స్వతంత్ర సంస్థ ద్వారా ఎస్టీ, బీసీ శాఖలు పర్యవేక్షించనున్నాయి. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు లబ్ధిదారుల పనీతీరును బేరీజు వేసి, అధికారులకు నివేదికలను పంపించనున్నారు. -
బ్యాంకర్ల తీరు సరిగా లేదు: కేసీఆర్
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్య బ్యాంకులు వారికి నచ్చితేనే రుణాలిస్తున్నాయి స్వయం ఉపాధికి మోడల్ పథకాన్ని రూపొందిస్తాం దీనిపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం తీసుకుంటాం ఏకాభిప్రాయంతో మార్గదర్శకాలు రూపొందిద్దామన్న సీఎం సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి పథకాల అమల్లో బ్యాంకర్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్ల తీరు సరిగా లేదని, ఏవేవో సాకులు చెప్పి రుణాలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల్లో బ్యాంకర్ల ప్రత్యక్ష ప్రమేయం వల్ల వాళ్లకు నచ్చితేనే రుణాలిస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఇటీవల భూమి కొనుగోలు పథకంపై చర్చ జరిగినప్పుడు అందులో బ్యాంకర్ల పాత్ర ఉండాలని అధికారులు చెబితే.. తాను వద్దే వద్దంటూ కొట్లాడినంత పని చేసినట్లు చెప్పారు. బ్యాంకులతో పెట్టుకుంటే అది అయ్యేది కాదని.. ప్రభుత్వ డబ్బుతోనే భూమిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ‘‘దళిత నిరుద్యోగ యువతకు సరైన న్యాయం జరగటం లేదు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా.. ఏం చేయాలనే దానిపై అందరి సహకారం కోరుతున్నాం. ఈ వారంలోనే, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడే.. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమై ఏకాభిప్రాయంతో నిర్ణ యం తీసుకుందాం. రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. అందుకే ఆ పథకం ఏ విధంగా ఉండాలో అందరి అభిప్రాయాలు పంచుకుం దాం. రాష్ట్రంలో, కేంద్రంలో అన్నిచోట్లా గతంలో సబ్ప్లాన్ల నిధుల మళ్లింపు జరిగింది. మనం సబ్ ప్లాన్‌ను కచ్చితంగా అమలుచేద్దాం. ఎస్సీ వర్గాల నుంచి పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.కోటి ఇచ్చే ఆలోచన కూడా ఉంది. ప్రభుత్వ వ్యూహంతో మేం ముందుకు వస్తాం. ఫ్లోర్ లీడర్లతో పాటు దళిత, గిరిజన, మైనారిటీ శాసనసభ్యులందరితో సమావేశమవుదాం. ఏది ఉత్తమమైన పాలసీ అనుకుంటే.. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేద్దాం’’ అని సీఎం వివరించారు. ఎంపిక కమిటీల నుంచి బ్యాంకర్లను తొలగించండి: జీవన్‌రెడ్డి కరీంనగర్ జిల్లాలో 2013-14 సంవత్సరానికి సంబంధించి దళితులు, గిరిజనులు, మైనారిటీలకు లబ్ధి చేకూర్చేందుకు మంజూరైన స్వయం ఉపాధి పథకాలు ఇప్పటికీ అమలు కాలేదని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు. బ్యాంకర్లను లబ్ధిదారుల ఎంపిక కమిటీల నుంచి తొలగించాలని, రికవరీ గురించి ఆలోచిస్తే అర్హులైన నిరుపేద యువత లబ్ధిపొందే అవకాశం కోల్పోతారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రి ఈటెల సమాధానమిస్తూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగలేదని ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. బ్యాంకర్లు సహకరించటం లేదు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఆలోచిస్తోంది..’’ అని చెప్పారు. తెలంగాణ స్టేట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చండి ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు పేరు మార్చాలని రైల్వే మంత్రికి కేసీఆర్ లేఖ! హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు పేరును తెలంగాణ స్టేట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కేంద్ర రైల్వేమంత్రికి లేఖ రాయనున్నారు. ప్రస్తుతం ఆ రైలును ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు నెలలైనా.. ఇంకా ఆ రైలు పేరును మార్చకపోవడం సరికాదన్న అభిప్రాయంతో సీఎం ఉన్నారు. తెలంగాణ స్టేట్ పేరుతో మారిస్తే రాష్ట్రానికి ఒక గుర్తింపు కూడా లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బీసీ బోర్డుల పనితీరును సమీక్షిస్తాం బీసీ కులాల సంక్షేమం కోసం గతంలో ఏర్పా టు చేసిన బోర్డుల కొనసాగింపు విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. వాటి పనితీరును సమీక్షించి అసలు వాటి అవసరం ఎంతో తేల్చాల్సి ఉందన్నారు. ఇలాంటి బోర్డులకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోతుండటంతో.. ఎందుకూ కొరగాకుండా పోతున్నాయని, వాటి తాలూకు కార్యాలయాల్లో ఫర్నిచర్ కూడా ఉండటం లేదని మంగళవారం అసెంబ్లీలో బీజేఎల్పీ నేత లక్ష్మణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు ముఖ్యమంత్రి స్పందించారు. ‘‘ఈ బోర్డులను అప్పట్లో ఎందుకు ఏర్పాటు చేశారో ఆ భగవంతుడికే తెలియాలి. వాటి పనితీరు కూడా అంతుబట్టడం లేదు. వెంటనే వాటిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే.. వీలైతే ఈ సమావేశాల సమయంలోనే అన్ని పక్షాలతో కలసి సమీక్షిస్తాం. అందులో వచ్చిన సూచనల ఆధారంగా వాటి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుం టుంది. వచ్చే సంవత్సరం బడ్జెట్‌కు పెద్దగా సమయం కూడా లేదు. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వచ్చే కొత్త బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటుంది’’ అని చెప్పారు. బీసీలకు తాజా బడ్జెట్లో కేటాయిం చిన రూ.2 వేల కోట్లు ఎందుకూ సరిపోవని, బీసీసంఘాలు రూ.20 వేల కోట్లు కోరితే ప్రభుత్వం అంత తక్కువగా ఇవ్వటం సముచితం కాదని లక్ష్మణ్ పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలతోపాటు అగ్రవర్ణాల పేదలకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. -
స్వయం ఉపాధి.. జాప్యంతో సమాధి
* నిరుద్యోగ యువతకు రుణాలు ఎండమావే * స్వయం ఉపాధి పథకాలకు నిధులు కేటాయించని సర్కారు ఏలూరు : బాబు వస్తే జాబు.. ఉద్యోగం దొరకని వారికి రూ.2,500 చొప్పున నిరుద్యోగ భృతి వస్తుందని ఎన్నికల సమయంలో వెలువడిన ప్రకటనలు చూసి నిరుద్యోగులంతా సంబరపడ్డారు. ఏదో ఒక రూపంలో తమకు ఆసరా దొరుకుతుందనుకున్నారు. జాబు, నిరుద్యోగ భృతి మాట దేవుడెరుగు.. కనీసం స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు సైతం మంజూరుకాక వారంతా ఆవేదన చెందుతున్నారు. కనీసం తమ కాళ్లపై తాము నిలబడదామనుకుంటున్న యువతకు చేయూత అందటం లేదు. స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నిరుద్యోగుల భవిష్యత్ ఎండమావిగా కనిపిస్తోంది. రుణాల కోసం 10 వేల మంది ఎదురుచూపు ఏటా బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్లతోపాటు సెట్వెల్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద నిరుద్యోగులకు రుణాలు ఇస్తున్నారు. అరుుతే, రెండేళ్లుగా జిల్లాలోని ఒక్క నిరుద్యోగికైనా స్వయం ఉపాధి యూనిట్ మంజూరు కాలేదు. గత ఏడాది అప్పటి సర్కారు నిర్లక్ష్యం వల్ల రుణాల మం జూరులో జాప్యం జరిగింది. తీరా రుణాలిచ్చే సమయూనికి పంచాయతీ ఎన్నికలు రావడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. దాదాపుగా 10వేల మందికి రుణం ఇచ్చేందుకు నిర్ణయించిన ఆయూ విభాగాల అధికారులు ప్రభుత్వానికి తిరిగి ప్రతిపాదనలు పంపించారు. అయితే, నిధుల మంజూరు విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదు. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాల కింద వివిధ యూనిట్లు మంజూరు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. పాత వారికే రుణాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం వల్ల ప్రయోజనం ఉండదనే భావనతో అధికారులు ఉన్నారు. ఈ కారణంగానే ప్రతిపాద నలు రూపొందించడం లేదు. ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులిచ్చినా... జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు కేటారుుంచింది. 5,073 యూనిట్లు స్థాపించాలనే లక్ష్యంతో రూ.42.26 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డారుు. ఇందుకు సంబంధించి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రుణ ప్రణాళికను ఆమోదించాల్సి ఉంటుంది. బీసీ, మైనార్టీ, సెట్వెల్ ద్వారా కేటాయింపులు లేకపోవడంతో ఇప్పట్లో బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగే అవకాశం లేదని సమాచారం. ఈ కారణంగా నిధులు కేటారుుంచినా ఎస్సీ నిరుద్యోగులకు ఇప్పట్లో రుణాలు అందే పరిస్థితి కనిపించడం లేదు.