Shares Rise
-
రయ్..మన్న రిలయన్స్ పవర్ షేర్లు..
అనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ (Reliance Power) తన క్యూ3 ఆదాయాలను ప్రకటించిన తర్వాత ఆ సంస్థ షేర్లు రయ్..మని ఎగిశాయి. గురువారం (ఫిబ్రవరి 6) ప్రారంభ డీల్స్‌లో రిలయన్స్ పవర్ షేర్లు (shares) 9% పైగా పెరిగాయి. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ రిలయన్స్ గ్రూప్ సంస్థ రూ.41.95 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో అనిల్ అంబానీ కంపెనీ రూ.1136.75 కోట్ల నష్టాన్ని చవిచూసింది.అయితే కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయం క్యూ3లో 4.68% తగ్గి రూ.1852.84 కోట్లకు చేరింది. ఇది 2023 డిసెంబర్ త్రైమాసికంలో రూ.1943.83 కోట్లుగా ఉండేది. గడిచిన త్రైమాసికంలో లాభం చెల్లించాల్సిన పన్నుతో కలిపి రూ.49.88 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1168.70 కోట్ల నష్టం ప్రకటించింది. రిలయన్స్ పవర్ ఒక్కో షేరుకు ఆదాయం ఈ క్యూ3లో రూ.0.104గా ఉంది. ఇది గతేడాది క్యూ3లో రూ.3,298 (మైనస్)గా ఉంది.గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.1,998.79 కోట్ల నుంచి రూ.2,159.44 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ.3,167.49 కోట్ల నుంచి రూ.2,109.56 కోట్లకు తగ్గాయి. కంపెనీ జీరో బ్యాంక్ రుణ స్థితిని సాధించిందని, అంటే ప్రైవేట్ లేదా పబ్లిక్ ఏ బ్యాంకులోనూ తమకు ఎటువంటి బకాయిలు లేవని రిలయన్స్ పవర్ తెలిపింది.ఒక్కో రిలయన్స్ పవర్ షేర్ అంతకుముందు ముగింపు రూ.39.89తో పోలిస్తే గురువారం (ఫిబ్రవరి 6) 9.52% పెరిగి రూ.43.69కి చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.17,252 కోట్లుగా ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన మొత్తం 42.76 లక్షల షేర్లు చేతులు మారాయి. బీఎస్ఈలో వీటిపై మొత్తం రూ.18.17 కోట్ల టర్నోవర్ జరిగింది. -
సన్‌టీవీకి ఐపీఎల్ జోష్
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లోని మీడియా సెక్టార్‌కు ఐపీఎల్ బూస్ట్ లభించింది. ముఖ్యంగా ఐపీఎల్ టెలికాస్టింగ్( టెలివిజన్, డిజిటల్ మీడియా) హక్కులను స్టార్ గ్రూప్ దక్కించుకోవడంతో మంగళవారం నాటి మార్కెట్లలో మీడియా షేర్లు మరింత వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో వరుసగా అయిదో రోజు కూడా మీడియా స్టాక్స్ అన్నీ లాభాల్లో జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా నసన్టీవీ నెటవర్క్ లిమిటెడ్ 3.3శాతం లాభంతో దూసుకుపోతోంది. బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు పాజిటివ్ ధోరణిని వ్యక్తం చేయడంతో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొంది. క్రెడిట్ సూస్, సీఎల్ఎస్ఏ బై కాల్ పిలుపునిచ్చాయి. కాగా ఐసీఎల్ లంలో.. స్టార్ గ్రూప్ రూ.15 వేల కోట్లకు మించిన భారీ మొత్తాన్ని చెల్లించి.. రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అధిక ఆదాయంలో సన్ రైజర్స్ హైద్రాబాద్ వాటాలు పొందనుండంతో.. సన్ టీవీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. -
మార్కెట్లో రిలయన్స్ మెరుపులు
ముంబై: అతిపెద్ద ప్రైవేటు సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మార్కెట్లో దూసుకుపోతోంది. ఒక వైపు సోమవారం నాటి ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతుండగా రిలయన్స్ షేర్లు హై వాల్యూమ్స్ తో మెరుపులు మెరిపిస్తోంది. గత 14 ట్రేడింగ్ సెషన్స్‌లో వరుసగా 10 సెషన్స్ లో భారీ లాభాలను నమోదు చేస్తూ ఏడు సంవత్సరాల గరిష్టాన్ని తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2.42 శాతం లాభాలతో ఇంట్రాడేలో రూ.1,122 కు ఎగిసింది. ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ..టెలికాం జియో సేవలను ప్రకటించిన తరువాత నిఫ్టీ కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 5 తరువాత నిఫ్టీతో పోలిస్తే రిలయన్స్11శాతం జంప్ చేయగా, నిఫ్టీ ఫ్లాట్ గా ఉందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన సర్వే ప్రకారం ఆర్ఐఎల్ టాప్ టెన్ ప్రపంచ చమురు కంపెనీల మధ్య ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అటు స్టాక్ మార్కెట్లు 329 పాయింట్ల భారీ నష్టంతో, నిఫ్టీ వంద పాయింట్లు పతనమై 88 వేల దిగువకు పడిపోయింది. ,