Shaurya Chakra Award
-
శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ కాల్చివేత
చండీగఢ్: శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ సింగ్ (62)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఆయనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని తారన్ తరణ్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన ఆయనపై గతంలోకూడా అనేకసార్లు ఉగ్రవాదులు ఎటాక్ చేశారని పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రభుత్వం బల్విందర్ భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబం మొత్తం ఉగ్రవాదుల హిట్ జాబితాలో ఉందని బల్విందర్ సింగ్ సోదరుడు రంజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన బల్విందర్ సింగ్ కు 1993లో రక్షణ మంత్రిత్వ శాఖ శౌర్యచక్ర పురస్కారం లభించింది. అంతర్జాతీయ మీడియాను కూడా ఆయన ధైర్యసాహసాలు ఆకట్టుకున్నాయి. ప్రధానంగా నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ తోపాటు అనేక డాక్యుమెంటరీలు ఆయనపై రూపొందాయి. -
జమ్మూ పోలీసుకు ‘శౌర్య చక్ర’
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి అశువులు బాసిన పోలీసు కానిస్టేబుల్ మన్జూర్ అహ్మద్ నాయక్‌కు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు వరించింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉడీ ప్రాంతానికి చెందిన మన్జూర్ దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 2017 మే 5న మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో మరణించాడు. అసాధారణ ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు మన్జూర్కు శౌర్య చక్ర అవార్డును అందిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కాగా, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు 2017లో సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో మన్జూర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారని గుర్తించిన మన్జూర్ ఇంటి చుట్టూ పేలుడు పదార్థాలను అమర్చాడు. అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు జరపగా మన్జూర్ తప్పించుకున్నాడు. అప్పటికే ఇంటి చుట్టూ దాదాపు సగం భాగం వరకు పేలుడు పదార్థాలు అమర్చిన మన్జూర్.. మిలిటెంట్లు కాల్పులు విరమించాక మిగతా భాగంలో కూడా అమర్చాడు. రెండోసారి బాంబులను అమర్చే క్రమంలో ఉగ్రవాదులు మన్జూర్పై మరోసారి కాల్పుల వర్షం కురిపించారు. తూటాలు దిగినా చివరి క్షణం వరకు తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలను అమర్చాడు. ఈ క్రమంలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. -
నిరాలాకు ‘అశోక్ చక్ర’
న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరుడైన వైమానిక దళం గరుడ్ కమాండో జ్యోతి ప్రకాశ్ నిరాలాకు కేంద్రం ‘అశోక్ చక్ర’ పురస్కారాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 390 మందికి రాష్ట్రపతి సాహస పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఒక కీర్తి చక్ర, 14 శౌర్య చక్ర, 28 పరమ్ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్ధ్ సేవా పతకాలు ఉన్నాయి. ఉత్తమ సేవలు అందించిన 27 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రకటించారు. 2017 నవంబరులో కశ్మీర్‌లోని బందిపొర జిల్లా చందర్గెర్లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం మేరకు గరుడ్ ప్రత్యేక దళానికి చెందిన ప్రకాశ్‌తోపాటు మరికొందరు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులు దాగున్న సంగతి తెలిసిన గరుడ్ దళం ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టింది. కార్పొరల్ ప్రకాశ్ మాత్రం ప్రమాదాన్ని లెక్కచేయకుండా స్థావరం అతి సమీపంలోకి వెళ్లి ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపి ఇద్దరిని మట్టుబెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిరాలా తుదిశ్వాస విడిచారు. కాగా, సీఆర్పీఎఫ్కు చెందిన ఇద్దరు కమాండోలకు కేంద్రం శౌర్యచక్ర పురస్కారం ప్రకటించింది. జార్ఖండ్‌లోని లతేహార్లో ఆరుగురు మావోయిస్టులను మట్టుబెట్టటంతోపాటు ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకోవటంలో అసిస్టెంట్ కమాండెంట్ జఖార్తోపాటు ఆయన బృందంలోని సబ్ ఇన్స్పెక్టర్ రియాజ్ ఆలం కీలకంగా వ్యవహరించారు. -
శౌర్యచక్ర అందుకున్న శ్రీనివాసులు
♦ అశోక హాల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం ♦ రాష్ట్ర సీఐ సెల్లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాసులు ♦ తెలంగాణ నుంచి తొలి వ్యక్తిగా రికార్డు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగా నికి మరో అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరు లోని పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్ పరిధిలో గత ఏడాది జనవరి 23న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఆలమ్ జెబ్ అఫ్రీదిని ప్రాణాలకు తెగించి పట్టుకున్న తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ హెడ్ కానిస్టేబుల్ కుకుడపు శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో గురువారం జరిగిన అధికారిక కార్య క్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. ఉగ్రవాది కత్తి దాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నా... ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన శ్రీనివాసులుకు గత ఏడాది ఆగస్టులో శౌర్యచక్ర ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులతో సహా మొత్తం 12మందికి శౌర్యచక్ర ప్రకటించగా... అందు లో శ్రీనివాసులు ఒక్కరే దక్షిణాదికి చెందిన పోలీసు అధికారి కావడం విశేషం. కానిస్టేబుల్ హోదాలో ప్రతి ష్టాత్మకమైన శౌర్యచక్ర పొందిన వ్యక్తిగానూ ఈయన రికార్డులకెక్కారు. గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్సుల్లో సేవలు... నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీనివాసులు 1998లో కానిస్టేబుల్‌గా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. గ్రేహౌండ్స్‌తో పాటు హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్‌ల్లో సుదీర్ఘ కాలం సేవలందించారు. కొన్నేళ్లుగా సీఐ సెల్లో పనిచేస్తున్నారు. ఐసిస్‌కు అనుబంధంగా, హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్నిన ‘జేకేహెచ్’సంస్థ ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గత ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. వీరికి శిక్షణ ఇవ్వడంలో కీలకపాత్ర పోషించింది ఆలమ్ జెబ్ అఫ్రీది అని సీఐ సెల్ అధికారులు గుర్తించారు. ఇతడిపై దేశ వ్యాప్తం గా 25 వరకు పేలుళ్లు, కుట్ర, విద్రోహక చర్యల కేసులు నమోదై ఉన్నాయి. 2008 నుంచి పరారీలో ఉన్న ఇతడు... మెకానిక్ అవతారం ఎత్తి, రఫీఖ్ పేరుతో కర్ణాటకలోని దొడ్డినాగమంగళం ప్రాంతంలో నివసిస్తున్నట్లు సీఐ సెల్ అధికారులు 2016 జనవరి 23న గుర్తించారు. దీంతో శ్రీనివాసులుతో పాటు మరో ముగ్గురి బృందాన్ని అక్కడకు పంపారు. రక్తమోడుతున్నా ఉగ్రవాదిని వదల్లేదు... రంగంలోకి దిగిన శ్రీనివాసులు బృందం బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న వినాయకనగర్‌లో అఫ్రీది కదలికల్ని గుర్తించింది. ఎన్ఐఏ బృందం ఆ ప్రాంతానికి దూ రంగా ఉండటం, వారు వచ్చేలోపు అఫ్రీది పారి పోయే ప్రయాదం ఉందని వీరు భావించారు. దీం తో ఈ నలుగురే అతడిని అదుపులోకి తీసుకో వడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అఫ్రీది కత్తితో శ్రీనివాసులు పొత్తికడుపులో బలంగా పొడి చాడు. ఈ దాడిలో శ్రీనివాసులు పేగులు బయటకు రావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విపరీతమైన రక్తస్రావం అవుతున్నప్పటికీ లెక్కచేయని శ్రీనివాసు లు అఫ్రీదిని వదలకుండా పట్టుకున్నాడు. రెండు గంటల తరువాత పోలీసు బృందాలు వచ్చి అఫ్రీది ని అదుపులోకి తీసుకున్నాయి. శ్రీనివాసులు దాదాపు 20 రోజులు అక్కడే చికిత్స పొందారు.