Shell Company
-
బాబు ముఠా పరార్
సాక్షి, అమరావతి: తన అవినీతి బండారం బట్ట బయలు కావడంతో మాజీ సీఎం చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. షెల్ కంపెనీల ద్వారా ప్రజాదనాన్ని కాజేసిన వైనం ఆధారాలతో సహా వెలుగు లోకి రావడంతో ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులు రాత్రికి రాత్రే విదేశాలకు పరారయ్యారు. బాబు తరఫున అన్నీ తామై వ్యవహరించిన తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెని ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తాలకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దీంతో చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని హఠాత్తుగా విదేశాలకు పరారయ్యారు. మరో బినామీ యోగేశ్ గుప్తా ఆచూకీ తెలియడం లేదు. ఆ ముగ్గురే కీలకం.. తన అవినీతి పాపాలు పండటంతో చంద్రబాబు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. తాను అధికారంలో ఉండగా యథేచ్ఛగా సాగించిన అవినీతి వ్యవహారాలను కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కటిగా వెలికి తీయడంతో తప్పించుకునే దారి లేక సానుభూతి నాటకాలకు తెర తీశారు. రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టుల కేటాయింపులో షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ముడుపులు అందుకున్న వైనాన్ని ఆదాయపన్ను శాఖ ఆధారాలతో సహా వెలికి తీసిన విషయం తెలిసిందే. ఇందులో కీలక పాత్ర పోషించిన బాబు బినామీలైన ముగ్గురు నిందితులే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో కూడా షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేటతెల్లం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారని నిగ్గు తేల్చింది. వారు ముగ్గురూ చంద్రబాబు బినామీలేనని తేలడంతో నోటీసులు జారీ చేసింది. మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాలను ఈ నెల 11న, పెండ్యాల శ్రీనివాస్‌ను ఈ నెల 14న విజయవాడలో విచారణకు హాజరుకావాలని ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆ ముగ్గురూ హఠాత్తుగా అదృశ్యం కావడం, ఇద్దరు నిందితులు ఏకంగా దేశం విడిచి పరారు కావడం ఈ కుంభకోణాలకు సూత్రధారి చంద్రబాబేనని స్పష్టం చేస్తోంది. పాత్రలు ఫినిష్..! అక్రమ నిధులు తరలించేందుకు తాను ఏర్పాటు చేసుకున్న అవినీతి నెట్‌వర్క్‌ను కేంద్ర ఆదాయపన్ను శాఖ, సీఐడీ సిట్ ఛేదించడంతో చంద్రబాబుకు దారులు మూసుకుపోయాయి. అప్పటికే మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల వాంగ్మూలాన్ని ఆదాయ పన్ను శాఖ నమోదు చేసింది. తాము చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ద్వారా ఆయనకు భారీగా ముడుపులు అందించినట్లు వాంగ్మూలంలో వారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో అక్రమ ఆదాయంపై ఆదాయ పన్ను శాఖ సమాచారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తన బినామీలు ముగ్గురికీ సిట్ నోటీసులు జారీ చేస్తుందని చంద్రబాబు ఊహించలేదు. దీంతో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చని ఆయన ఊహించారు. అందుకే తనను రెండు రోజుల్లో అరెస్టు చేయవచ్చంటూ తాజాగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను అరెస్టు చేస్తే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని ఆయన టీడీపీ శ్రేణులకు పరోక్షంగా సందేశమిచ్చారు. ఒకవైపు ఈ కుట్రలకు వ్యూహ రచన చేస్తూనే మరోవైపు తన బినామీలు మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ సిట్ విచారణకు హాజరైతే అక్రమాల చిట్టా బద్ధలవుతుందనే భయంతో వారిని విదేశాలకు పారిపోవాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. అమెరికాకు శ్రీనివాస్... దుబాయ్‌కి మనోజ్ చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అప్పటికప్పుడే హఠాత్తుగా అమెరికాకు పరారయ్యారు. సిట్ నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె తెలిపారు. నోటీసులపై ఆమె సంతకం కూడా చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో చంద్రబాబు పీఎస్ అందుబాటులో లేకుండా పోయారు. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయారు. అంటే నోటీసులు అందడంతోనే పెండ్యాల శ్రీనివాస్ పరారైనట్లు స్పష్టమవుతోంది. ఇక మనోజ్ పార్థసాని దుబాయ్ ఉడాయించారు. ఆయన ముంబై నుంచి దుబాయ్ వెళ్లిపోయారు. తనకు సీఐడీ నోటీసులు జారీ చేసిందనే విషయం తెలియగానే ఆయన అందుబాటులో లేకుండా పోయారు. అనంతరం హడావుడిగా దుబాయ్‌కి పరారయ్యారు. అక్కడ నుంచి ఆయన ఎక్కడకు వెళ్తారన్నది సన్నిహితులకు కూడా చెప్పకుండా అత్యంత గోప్యంగా ఉంచారు. మరోవైపు షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఆచూకీ తెలియడం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సీఐడీ నోటీసులు జారీ చేసిన వెంటనే చంద్రబాబు బినామీలు ముగ్గురూ హఠాత్తుగా అదృశ్యం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారన్న దానికి ఇదే తిరుగులేని నిదర్శనమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా పరిణామాలతో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఐడీ అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. -
మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్.. కవిత, కేజ్రీవాల్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షెల్ కంపెనీల నుంచి మారిషస్‌లోని గ్రీన్ హస్క్ ఇండస్ట్రీస్‌కు రూ.80 కోట్లు బదిలీ చేసినట్లు ఓ మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం కార్యాలయ నివాసం ఫర్నీచర్ నిమిత్తం ఈ సొమ్ము మూడు విడతలుగా బదిలీ చేశానని పేర్కొన్నారు. తనపై వస్తున్న కథనాలకు సంబంధించి కొన్ని వివరణలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాలతోనే జైలు అధికారులు తనని వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం సుకేశ్ తరఫు న్యాయవాది మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. కేజ్రీవాల్ ఎంత ప్రయత్నించినా తాను వెనక్కి తగ్గేది లేదని, ఫర్నీచర్‌కు సంబంధించి అన్ని బిల్లులు ఈడీ, సీబీఐలకు అందజేస్తానని స్పష్టంచేశారు. కేజ్రీవాల్ సూచన మేరకు కల్వకుంట్ల కవిత షెల్ కంపెనీ ఖాతా నుంచి మారిషస్‌లోని మంత్రి కైలాశ్ గెహ్లోత్ బంధువుల ఖాతాకు రూ.80 కోట్లు (రూ.25 కోట్లు+ రూ.25 కోట్లు + రూ.30 కోట్లు) బదిలీ చేసినట్లు చెప్పారు. ఆ సొమ్ము యూఎస్ డాలర్టెట్హెర్ (యూఎస్డీటీ), క్రిప్టో కరెన్సీల్లోకి మార్చి అబుదాబికి పంపినట్లు సుకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఫేస్‌టైమ్‌లో జరిపిన చాట్ల స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయన్నారు. ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన తల్లికి తప్పించి మరో కాల్ చేశానని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని, అది తప్పయితే, కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణలు చెబుతారా అని లేఖలో ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఎలా అవినీతికి పాల్పడ్డారో, ఏ స్థాయికి దిగజారగలరో తెలుసుకోవడానికి మరో ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండాలన్నారు. జైలు అధికారులందరూ కేజ్రీవాల్ రాకకోసం ఎదురుచూస్తున్నారని సుకేశ్ ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: ‘కమలం’ కార్యాచరణ మారాలి సారూ! -
నాకు బెయిల్ మంజూరు చేయండి
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో జరిగిన రూ. 241 కోట్ల కుంభకోణంలో బెయిల్ కోసం ప్రధాన నిందితుడైన గంటా సుబ్బారావు, ముందస్తు బెయిల్ కోసం మూడో నిందితుడైన నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీఎస్ఎస్డీసీ తరఫున ప్రైవేటు కంపెనీలకు చెల్లింపులు చేసిన వ్యక్తిని ఈ కేసులో ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సీఐడీని ప్రశ్నించింది. ఈ విషయంపై తమకు వివరణ, స్పష్టతనివ్వాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ రమేశ్ అడిగిన ప్రశ్ననే రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అడగటాన్ని పలువురు చర్చించుకోవడం విశేషం. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తనకు కింది కోర్టు రిమాండ్ విధించడంతో బెయిల్ మంజూరు కోరుతూ గంటా సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్బారావు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, సుబ్బారావు విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలి ఇక్కడకు వచ్చారన్నారు. సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో ఒప్పందం విషయంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తున్న సీబీఐ, ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయో చెప్పలేదన్నారు. సుబ్బారావును పబ్లిక్ సర్వెంట్‌గా భావించి సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. సుబ్బారావు ప్రభుత్వంలో ఎన్నడూ ఉద్యోగిగా పని చేయలేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోలేదని, అందువల్ల అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆయన పబ్లిక్ సర్వెంట్ నిర్వచన పరిధిలోకి రారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున చెల్లింపులు చేసిన వ్యక్తిని సీఐడీ ఇప్పటి వరకు ప్రశ్నించలేదని, ఆయన ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తి కావడమే అందుకు కారణమన్నారు. తరువాత నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్ తరఫు సీనియర్ న్యాయవాది ఎన్.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పిటిషనర్ కేవలం కన్సల్టెంట్ మాత్రమేనని తెలిపారు. సీఐడీ తరఫు న్యాయవాది చైతన్య వాదనలు వినిపిస్తూ, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందన్నారు. విచారణ కొనసాగుతోందన్నారు. నిందితుల పాత్ర విషయంలో ప్రభుత్వాధికారులు సాక్ష్యం ఇచ్చారని కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ స్పందిస్తూ, ప్రైవేటు కంపెనీలకు చెక్కులు జారీ చేసిన వ్యక్తిని ఎందుకు నిందితునిగా చేర్చలేదని, చెల్లింపులన్నీ ఆయన ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఆయనను కనీసం ప్రశ్నించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. -
‘స్కిల్’ స్కామ్‌లో షెల్.. షా
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) నిధుల కుంభకోణం కేసులో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు గత సర్కారు పెద్దలు ఏకంగా దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరస్తుడు శిరీష్ చంద్రకాంత్ షాను రంగంలోకి దించినట్లు తాజాగా వెల్లడైంది. ఏకంగా 212 షెల్ కంపెనీలను సృష్టించి రూ.వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డ శిరీష్‌ను అరెస్టు చేసేందుకు 2017లో స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకుంది. ఘరానా మోసగాడిని భాగస్వామిగా చేసుకుని టీడీపీ పెద్దలు 2015లో ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టారంటే ఎంత పక్కాగా పన్నాగం పన్నారో స్పష్టమవుతోంది. 24 వరకు రిమాండ్.. మచిలీపట్నం జైలుకు తరలింపు ఈ కేసులో తాజాగా సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించారు. ఆర్థిక నేరగాడు శిరీష్‌చంద్ర షాను ముంబైలో అరెస్టు చేశారు. బుధవారం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచగా ఈనెల 24వరకు రిమాండ్ విధించడంతో మచిలీపట్నంలోని జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. షెల్ కంపెనీల డాన్... శిరీష్ శిరీష్ చంద్రకాంత్ షా దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరస్తుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 212 షెల్ కంపెనీలను సృష్టించి నల్లధనాన్ని దారి మళ్లించిన ఘనుడు. ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, సెబీ తదితర సంస్థలన్నీ శిరీష్ చంద్రకాంత్ షా కోసం రంగంలోకి దిగాయంటే ఎంత ఘరానా నేరస్తుడో అర్థమవుతోంది. షెల్ కంపెనీలతో దేశ ఆర్థిక వ్యవస్థకే సవాల్‌గా మారిన అతడి ఆట కట్టించేందుకు కేంద్ర ఆదాయపన్ను శాఖ ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సహకారాన్ని కోరాల్సి వచ్చింది. పీఎంవో ఆధ్వర్యంలోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ద్వారా అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. ‘స్కిల్’ కుంభకోణంలో కింగ్‌పిన్.. టీడీపీ పెద్దలు గుట్టు చప్పుడు కాకుండా ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టేందుకు శిరీష్ చంద్రకాంత్ షాను పావుగా వాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.371 కోట్లను డిజైన్‌టెక్ కంపెనీ ద్వారా స్కిల్లర్ అనే షెల్ కంపెనీకి చెల్లించారు. ఆ కాంట్రాక్టు కింద హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సరఫరా చేసిందంటూ ఏసీఐ అనే మరో షెల్ కంపెనీని తెరపైకి తెచ్చారు. ఏపీఎస్ఎస్డీసీ నుంచి పొందిన రూ.371 కోట్లలో రూ.242 కోట్లను స్కిల్లర్ కంపెనీ ఏసీఐకి చెల్లించింది. ఏసీఐ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి కథ నడిపించింది. అనంతరం రూ.242 కోట్లను తిరిగి టీడీపీ పెద్దలకు చెందిన డిజైన్‌టెక్‌కు చెల్లించింది. ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని దొడ్డిదారిలో టీడీపీ పెద్దలకు కట్టబెట్టేందుకు సాధనంగా ఉపయోగపడిన షెల్ కంపెనీ ఏసీఐని శిరీష్ చంద్రకాంతే సృష్టించాడు. అతడు సృష్టించిన 212 షెల్ కంపెనీల్లో ఏసీఐ కూడా ఉందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తన నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. శిరీష్ చంద్రకాంత్ షా 212 షెల్ కంపెనీల ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల మేర నల్లధనాన్ని మళ్లించినట్లు ఆదాయపన్ను శాఖ 2017లోనే వెల్లడించింది. అందులో 2015–16లో ఏపీఎస్ఎస్డీసీ ద్వారా టీడీపీ సర్కారు చెల్లించిన నిధులు కూడా ఉన్నట్లు తాజాగా సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. ఈ ఒక్క కుంభకోణంలోనే కాదు 2014–19 మధ్య రాష్ట్రంలో పలు కుంభకోణాలకు సంబంధించి నిధులు మళ్లించేందుకు శిరీష్ చంద్రకాంత్ షాను టీడీపీ పెద్దలు వాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరిపితే భారీ స్థాయిలో కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
‘స్కిల్’గా కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో వ్యవహారమంతా గంటా సుబ్బారావే నడిపారు. ఒకేసారి మూడు కీలక స్థానాల్లో ఆయనే ఉన్నారు. షెల్ కంపెనీల ముసుగులో కొల్లగొట్టిన రూ.241 కోట్లు ఏ పెద్దలకు చేరాయో ఆయనకే తెలుసు. ఆ పెద్దలను కాపాడేందుకే ఏకంగా ఆ కాంట్రాక్ట్ నోట్ ఫైళ్లనే మాయం చేశారు’ అని సీఐడీ స్పష్టం చేసింది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గంటా సుబ్బారావుకు సంబంధించి కొత్త విషయాలను వెల్లడించింది. ఆయన పాత్రపై న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో సీఐడీ ఏం చెప్పిందంటే.. నిధులు కొల్లగొట్టేందుకే ఆ ప్రాజెక్ట్ ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ముసుగులో కొల్లగొట్టేందుకు లోపభూయిష్టంగా ఏపీఎస్ఎస్డీసీ కాంట్రాక్ట్‌ను గంటా సుబ్బారావు రూపొందించారు. రూ.3,556 కోట్లు అని పేర్కొన్న ఆ ప్రాజెక్ట్ వ్యయాన్ని మదింపు చేసేందుకు ఎలాంటి శాస్త్రీయ విధానాలను పాటించలేదు. కేవలం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు ఇచ్చిన ఓ ‘పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) ఆధారంగా ఏకంగా రూ.3,556 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్‌ను కుట్రపూరితంగా ఆమోదించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా ఆ రెండు సంస్థలతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల వాటాను ఎలా నిర్ధారించిందనే విషయాన్ని ఆయన పేర్కొనకుండా దాటవేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి పత్రం లేకుండానే ఒప్పందం కుదుర్చుకున్నారు. బ్యాంక్ గ్యారెంటీ లేకుండానే రూ.371 కోట్లు చెల్లింపు సంబంధిత ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఆ రెండు సంస్థలకు ప్రభుత్వం పన్నులతో సహా చెల్లించాల్సిన రూ.371 కోట్లను గంటా సుబ్బారావు చెల్లించేశారు. కనీసం దానికి ముందు ఆ రెండు సంస్థలు వెచ్చించాల్సిన 90 శాతం నిధులకు సంబంధించి బ్యాంక్ గ్యారెంటీ కూడా ఉద్దేశపూర్వకంగానే తీసుకోలేదు. బ్యాంక్ గ్యారంటీ తీసుకుని ఉంటే ఆ సంస్థలు ప్రాజెక్ట్ పూర్తిచేయకపోతే ఆ మేరకు నిధులను ప్రభుత్వం రికవరీ చేసే అవకాశం ఉండేది. ఆ రెండు కంపెనీల నుంచి లిఖితపూర్వకంగా కూడా ఎలాంటి హామీ తీసుకోకుండా షెల్ కంపెనీలకు ఆయన అడ్డదారిలో ప్రయోజనం కలిగించారు. ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందనేది టెక్నాలజీ పార్టనర్స్ నుంచి వివరాలు తెలుసుకోలేదు కూడా. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఏపీఎస్ఎస్డీసీ నిధులు కొల్లగొట్టేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు మరో అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా ఐఏఎస్ అధికారి ఉపాధ్యాయుల అపర్ణను నియమించారు. ఏపీఎస్ఎస్డీసీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సీమెన్స్ సంస్థ కమిటీలో సభ్యుడైన జీవీఎస్ భాస్కర్ సతీమణి ఆమె. ఆ విషయాన్ని వెల్లడించకుండా ఆమెను డిప్యూటీ సీఈవోగా నియమించడం అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధం. తద్వారా షెల్ కంపెనీలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కల్పించారు. ఫైళ్లూ మాయం కేంద్ర జీఎస్టీ అధికారులు ఏపీఎస్ఎస్డీసీలో కుంభకోణం గురించి 2018లో సమాచారం ఇవ్వగానే సంబంధిత నోట్ ఫైళ్లు మాయమయ్యాయి. ఏపీఎస్ఎస్డీసీ సీఈవోతోపాటు స్పెషల్ సెక్రటరీగా కూడా ఉన్న గంటా సుబ్బారావే జీవో నంబర్ 4, సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కోసం జీవో నంబర్ 5, రెండు కమిటీల ఏర్పాటు కోసం జీవో నంబర్ 8కు సంబంధించి నోట్ ఫైళ్లను రూపొందించారు. దీనిపై ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్‌కు ఆయన ఓ లేఖ రాశారు. ఆ జీవోల నోట్ ఫైళ్లు, గంటా సుబ్బారావు రాసిన లేఖలు గల్లంతు కావడం వెనుక ఆయన హస్తం ఉంది. అంతేకాదు షెల్ కంపెనీలు ఇచ్చిన నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా రూ.371 కోట్లు చెల్లించేశారు. ఆ నిధులు ఎవరికి వెళ్లాయన్నది గంటా సుబ్బారావుకే పూర్తిగా తెలుసు. కాబట్టి ఏపీఎస్ఎస్డీసీ నిధులు దారి మళ్లించిన కేసులో గంటా సుబ్బారావు పాత్ర అత్యంత కీలకం. -
‘రోబో డాగ్’ చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
సాధారణంగా చాలా మంది పెంపుడు జంతువులుగా కుక్కలను పెంచుకుంటారు. ఆ మూగజీవాలు మన రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ భవిష్యత్తులో వాటిని కూడా రోబోలతో భర్తీ చేస్తామేమో..! అవును మీరు చదివింది నిజమే.. రానున్న కాలంలో రోబోలే మనకు కాపలాగా ఉండనున్నాయి. కెనడాకు చెందిన ఆల్బార్టా షెల్ రిఫైనరీ కంపెనీ ‘స్పాట్’ అనే రెండు రోబో డాగ్‌లను కాపలా ఉద్యోగులుగా చేర్చుకున్నారు. ప్లాంట్‌లో అత్యంత ప్రమాదకరమైన పనులను ఈ రోబో డాగ్‌లు చూడనున్నాయి. వీటితో ప్లాంట్‌లో ప్రాణనష్టం తక్కువని భావించి ఈ రోబోలను వారి కంపెనీలో చేర్చుకున్నారు. ఈ రోబో డాగ్‌లను అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ అనే సంస్థ రూపొందించింది. స్పాట్ రోబో డాగ్ ధర సుమారు లక్ష డాలర్లు. స్పాట్ ప్రత్యేకతలివే.. స్పాట్ చేసే పని చూస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. ఈ రోబో డాగ్‌లు గంటకు మూడు మైళ్ల గరిష్ట వేగాన్ని అందుకోగలవు. అంతేకాకుండా వీటికి అమర్చిన 360 డిగ్రీల కెమెరాలతో వాటికి ఎదురయ్యే అడ్డంకుల నుంచి సులువుగా తప్పించుకోగలవు. సుమారు పద్నాలుగు కిలోల వరకు బరువును మోయగలవు. స్పాట్‌ను అత్యల్పంగా -20 డిగ్రీల సెల్సియస్ నుంచి, అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద ఆపరేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఆయిల్, గ్యాస్ కంపెనీలో జరిగే లీకేజీలను కూడా ఇవి పసిగట్టగలవు. ఈ రోబో డాగ్‌లను పలు క్లిష్టమైన పనులకు ఉపయోగించవచ్చునని బోస్టన్ డైనమిక్స్ తెలిపింది. అండర్‌గ్రౌండ్ మైనింగ్, రేడియేషన్ ఎక్కువగా ఉండే న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీ కంపెనీలో వీటిని వాడొచ్చుననీ పేర్కొంది. బోస్టన్ డైనమిక్స్ స్పాట్ రోబో డాగ్‌లతో పాటు, బిగ్ డాగ్, హ్యాండిల్, చీతా, పెట్మెన్, అట్లాస్ లాంటి హ్యూమనాయిడ్ రోబోలను రూపొందించింది. వీటిలో ప్రస్తుతం స్పాట్ రోబో డాగ్‌లను మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. -
షెల్ కంపెనీ ద్వారా భారీ విరాళం : వ్యాపారి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : షెల్ కంపెనీ ద్వారా ఢిల్లీలో పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి రూ 2 కోట్ల విరాళం అందించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరిని ఢిల్లీకి చెందిన వ్యాపారి ముఖేష్ శర్మగా గుర్తించినట్టు ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు వెల్లడించారు. వీరిపై 2014, మార్చి 31న డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఆప్‌కు విరాళం అందచేశారనే ఆరోపణలున్నాయి. ఢిల్లీకి చెందిన ముఖేష్ శర్మ పొగాకు వ్యాపారంతో పాటు ప్రాపర్టీ డీలర్‌గా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఆప్ బహిష్కృత నేత ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ మంత్రి కపిల్ మిశ్రా సైతం ఆప్‌కు షెల్ కంపెనీ ద్వారా విరాళం అందిందని ఆరోపించారు. ఆప్‌కు నిధులను సమీకరించడంలో తీవ్ర అవకతవకలు చోటుచేసకున్నాయని అప్పట్లో మిశ్రా ఆరోపించారు. పార్టీకి అందిన రూ 2 కోట్ల విరాళంపైనా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఆప్‌కు పలు షెల్ కంపెనీల నుంచి నిధులు లభించాయని, పార్టీకి సైతం ఈ విషయం తెలుసునని మిశ్రా ఆరోపించారు. చదవండి : వామ్మో.. ఇదేందిది ఇంత ట్రాఫిక్ జామ్! -
ముడుపుల కోసం షెల్ కంపెనీలు..
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ వ్యవహారంలో బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో రుణాలు పొందిన కంపెనీల నుంచి ముడుపులు పొందేందుకు రాణా కపూర్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు 20 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ఈడీ గుర్తించింది. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఆదివారం రాణా కపూర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. కపూర్ అరెస్ట్‌తో ఆయన అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. దివాలా తీసిన హౌసింగ్ ఫైనాన్స్‌కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్కు యస్ బ్యాంక్ రూ 3700 కోట్లు రుణం ఇవ్వగా ఈ మొత్తం అంతా నిరర్ధక ఆస్తులుగా మారింది. ఇంత మొత్తం రుణం పొందిన డీహెచ్ఎఫ్ఎల్ కపూర్ కుటుంబానికి రూ 600 కోట్లు ముట్టచెప్పింది. డీహెచ్ఎఫ్ఎల్ తరహాలో యస్ బ్యాంక్ నుంచి అక్రమంగా రుణాలు పొందిన కార్పొరేట్ సంస్థలు కపూర్ కుటుంబానికి చెందిన షెల్ కంపెనీల్లోకి ముడుపులను తరలించాయి. అక్రమ మార్గాల్లో నిధులు స్వీకరించిన కపూర్ కుటుంబం రూ 2000 కోట్ల వరకూ వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా ఈ ఆస్తుల విలువ రూ 5000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బ్రిటన్‌లోనూ కపూర్ కుటుంబం రెండు ఆస్తులను కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. మరోవైపు యస్ బ్యాంక్ వ్యవహారంపై సీబీఐ సైతం దర్యాప్తును చేపట్టింది. ఈడీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐతో సీబీఐ ఈ దిశగా సంప్రదింపులు చేపట్టింది. చదవండి : ఈడీ కస్టడీకి రాణా కపూర్ -
దేశీయ గ్యాస్ కంపెనీల కీలక నిర్ణయం
దేశీయ గ్యాస్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ క్షేత్రాలైన షెల్, రిలయన్స్, ఓఎన్జీసీ జేవీ పన్నా ముక్త క్షేత్రాలను ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)కి డిసెంబర్21, 2019న అప్పగించనున్నారు. 25ఏళ్ల కార్యకలాపాల తర్వాత పన్నాముక్త క్షేత్రాలను ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకి బదిలీ చేయనున్నారు. పన్నా ముక్త, పన్నా ముక్త తప్తి (పిఎంటి) జాయింట్ వెంచర్ భాగస్వాములుగా పన్నా ముక్త క్షేత్రాలను ఓఎన్జీసీకి అప్పగించనున్నారు. పీఎమ్టీ జేవీ విభాగాలలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు (ఓఎన్జీసీ)40శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు(ఆర్ఐఎల్)30శాతం, బీజీ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ఇండియా లిమిటెడ్‌కు(బీజీఈపీఐఎల్)30 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజీఈపీఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ అరుణ్ మాట్లాడుతూ భారతదేశపు అతిపెద్ద జాతీయ ఆయిల్ కంపెనీ (ఒఎన్‌జిసి), అతిపెద్ద ప్రైవేట్ సంస్థ (రిలయన్స్) అంతర్జాతీయ ఆయిల్ కంపెనీల (షెల్)మధ్య విజయవంతమైన భాగస్వామ్యానికి పీఎమ్టీ జేవీ గొప్ప ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. పన్నాముక్త క్షేత్రాలను ఓఎన్జీసీకి సురక్షితంగా అప్పగించేలా తమ బృందాలు కృషి చేశాయని అరుణ్ కొనియాడారు. దేశంలోని చమురు ఉత్పత్తిలో పన్నా ముక్తా క్షేత్రాలు దాదాపు 6%, గ్యాస్ ఉత్పత్తిలో 7% దోహదం చేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ బీ గంగూలీ పేర్కొన్నారు. -
ఐటీకి చిక్కిన ముడుపుల ముఖ్యడు!
-
దుబాయి షెల్ కంపెనీలపై ఫోకస్
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ దుబాయిలో మకాం వేసిన భారత షెల్ కంపెనీలపై నిఘా పెట్టింది. భారత కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు మధ్య ప్రాచ్యం, ముఖ్యంగా దుబాయి కేంద్రంగా నిర్వహించిన లావాదేవీలను పరిశీలిస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. నీరవ్‌మోదీ, చోక్సీ ద్వయం చేసిన మోసం ఈ దిశగా దారి చూపించినట్లయింది. దేశీయంగా షెల్ కంపెనీలపై (ఏ వ్యాపారం లేకుండా నడిచేవి) కేంద్ర ప్రభుత్వం ఇటీవల కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దుబాయిలోని స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతంలో సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా నిధుల్ని కొల్లగొట్టి, పన్నుల ఎగవేతకు పాల్పడి ఉంటాయని కొన్ని కంపెనీలను ఆదాయపన్ను శాఖ (ఐటీ) అనుమానిస్తోంది. కమోడిటీలు, ఇతర ఎగుమతి రంగాలకు సంబంధించి మధ్య స్థాయి కంపెనీల లావాదేవీలను ఇప్పటికే ఇది పరిశీలించింది. వీటిలో కొన్ని లావాదేవీలకు సంబంధించి అదనపు వివరాలు కోరుతూ ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. పన్నులు ఎగ్గొట్టేందుకే ఆయా దేశాల్లో కంపెనీలను (ఎస్పీవీలు) నెలకొల్పి ఉంటారని భావిస్తున్నామని, వాటి లావాదేవీల్లో పారదర్శకత లేకపోవడమే ఈ అనుమానాలకు కారణమని అధికార వర్గాలు చెబు తున్నాయి. వీటికి రానున్న వారాల్లోనూ నోటీసుల జారీ ఉంటుందని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. మోదీ, చోక్సీలు చేసింది ఇదే...:‘‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రతీ ఎమిరేట్ విడిగా ఆదాయపన్ను శాఖ ఆదేశాలను ఆమోదించి ఉంటుంది. కానీ వాటి అమలును మాత్రం విదేశీ బ్యాంకులు, చమురు కంపెనీలకే పరిమితం చేస్తారు. దీంతో అక్కడ ఏర్పాటయిన ఇతర కంపెనీ విషయంలో అవి పన్నులు ఎగ్గొట్టేందుకే ఏర్పాటయి ఉంటాయని ఐటీ అధికారులు అనుమానించటం అసహజమేమీ కాదు’’ అని కేపీఎంజీ ట్యాక్స్ హెడ్ హితేష్ డిగజారియా చెప్పారు. వజ్రాల వ్యాపారులు నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలు లెటర్ఆఫ్ అండర్ టేకింగ్‌ల ద్వారా పీఎన్బీని రూ.13,000 కోట్లకుపైగా మోసగించిన విషయం తెలిసిందే. వీరు దుబాయి స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన పెట్టుబడి కంపెనీలను ఇందుకు వినియోగించుకోవడం గమనార్హం. అయితే, ఐటీ శాఖ విచారణ దుబాయికే పరిమితం కాలేదని, హాంగ్‌కాంగ్, చైనా తదితర ప్రాంతాల్లోని సబ్సిడరీలపైనా దృష్టి పెట్టిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూఏఈ కీలక నిర్ణయం దేశీయ బ్యాంకులకు రూ.6,800 కోట్లు ఎగవేసిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యుయలరీకి సంబంధించి భారత్‌తో సమాచారం పంచుకునేందుకు యూఏఈ తమ దేశ బ్యాంకులను అనుమతించింది. బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు. దేశీయ బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసిన కంపెనీల్లో ఇదీ ఒకటి. విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యుయలరీకి (లిస్టెడ్ కంపెనీ) రుణాలిచ్చిన బ్యాంకులకు స్టాండర్డ్ చార్టర్డ్ లీడ్ బ్యాంకుగా ఉంది. ఈ బ్యాంకుకు ఈఏఈలో పెద్ద సంఖ్యలో శాఖలున్నాయి. విన్సమ్ గ్రూపు సంస్థలు, సబ్సిడరీలు, దుబాయి క్లయింట్ల ఖాతాల్లోని లావాదేవీల సమాచారం పంచుకునేందుకు అనుమతివ్వడంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి కీలకం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
సిటీ నీరవ్.. రంగారెడ్డి
లేని కంపెనీలను ఉన్నట్లు నమ్మించాడు. పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నట్లు నమ్మబలికాడు. వీరి పేరిట బ్యాంకుల్లో సాలరీ ఎకౌంట్లను ఓపెన్ చేసి...క్రెడిట్ కార్డులు సైతం పొంది దాదాపు కోటిన్నర రూపాయలకు టెండర్ వేశాడు నగరానికి చెందిన కంభం రంగారెడ్డి.ఉత్తరాదికి చెందిన నీరవ్ మోదీ మాదిరిగానే ‘షెల్ కంపెనీ’లతో బ్యాంకులను మోసగించాడు. రెండేళ్లుగా కనిపించకుండా తిరుగుతుండగా..ఎట్టకేలకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగారెడ్డి ఆటకట్టించారు. ఇతనికి సహకరించిన 9 మందిని సైతం అరెస్టు చేశారు. సాక్షి,సిటీబ్యూరో: ఉత్తరాదికి చెందిన నీరవ్ మోదీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఒకే బ్యాంకు నుంచి రూ.వేల కోట్లు రుణాలు తీసుకుని పరారయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన కుంభం రంగారెడ్డి దాదాపు అదే బాటలో పయనించాడు. షెల్ కంపెనీ ఏర్పా టు చేయడంతో పాటు అందులో పదుల సంఖ్యలో బోగస్ ఉద్యోగులను క్రియేట్ చేసి వారి పేర్లతో నాలుగు బ్యాంకుల్లో శాలరీ అకౌంట్స్ తెరిచాడు. వీటి ఆధారంగా క్రెడిట్ కార్డ్స్ పొంది రూ.1.52 కోట్ల మేర వాడేసుకున్నాడు. దాదాపు రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రంగారెడ్డితో పాటు ఇతడికి సహకరించిన 9 మంది నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో రెండు బ్యాంకులు, జీహెచ్ఎంసీకి చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం ఉన్నట్లు సిటీ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు గురు వారం వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ, అదనపు డీసీపీలు పి.రాధాకిషన్‌రావు, ఎస్.చైతన్యకుమార్‌లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ పూర్తి వివరాలు వెల్లడించారు. రెండు కార్డులు ఇచ్చిన అనుభంతో... నల్లగొండ జిల్లా తెలుగుపల్లికి చెందిన కుంభం రంగారెడ్డి డిగ్రీ చదువుతూ మధ్యలోనే మానేశాడు. 1998 నుంచి హయత్‌నగర్ మండలంలోని తుర్కయాంజల్‌లో స్థిరపడిన ఇతను కంప్యూటర్ హార్డ్‌వేర్ ట్రైనింగ్ తీసుకుని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేశాడు. ఇందులో నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషించాడు. అదే సందర్భంలో తనతో పాటు భార్య పేరుతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండు క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డికి బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ డివిజన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న గోపతోటి కిషోర్‌బాబుతో పరిచయమైంది. అతడి ద్వారా క్రెడిట్ కార్డులు పొందే విధానం, జారీలో బ్యాంకుల వద్ద ఉన్న లోటుపాట్లు తెలుసుకున్నాడు. భారీ స్థాయిలో క్రెడిట్‌కార్డులు తీసుకుని మోసం చేస్తే ‘లాభం’ ఉంటుందని భావించిన రంగారెడ్డి తన బావమరిది తిప్పర్తి విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి రంగంలోకి దిగాడు. కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఓ రేకుల షెడ్డును అద్దెకు తీసుకుని ‘ప్రణిక నానో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. డేటా ప్రాసెసింగ్ చేస్తుందంటూ కేవలం నాలుగు కంప్యూటర్లు ఏర్పాటు చేసి రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్‌లో రిజస్టర్ చేయించుకున్నాడు. ఈ తతంగం మొత్తం 2013 ఏప్రిల్‌లో జరిగింది. టీ స్టాల్, బార్బర్ షాపు నిర్వాహకులే.. తనకు పరిచయస్తులైన అనేక మంది నుంచి మాయమాటలు చెప్పి ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించిన రంగారెడ్డి వారందరూ తన సంస్థలో ఉద్యోగులంటూ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఉండే కొందరు బార్బర్ షాపు యజమానులు, టీ స్టాల్ నిర్వాహకుల ఫొటోలు సైతం సేకరించి వీరు బీటెక్, ఎంటెక్, ఎంబీఏలు పూర్తి చేసినట్లు నకిలీ వివరాలు సృష్టిస్తూ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజినీర్లుగా, హెచ్ఆర్ నిర్వాహకులుగా మార్చాడు. ఈ వ్యవహారాల్లో ఫొటోలు ఎవరివి తీసుకున్నా.. పేరు, చిరుమానాలు మాత్రం బోగస్‌వి వాడుతూ సిమ్‌కార్డులు తీసుకోవడంతో పాటు వీరందరినీ ఉద్యోగులుగా మార్చేశాడు. వీరి వివరాలతో ఓటర్ ఐడీ, పాన్‌కార్డు దరఖాస్తులను హయత్‌నగర్‌కు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు మేక సంతోష్‌రెడ్డి ద్వారా అప్లోడ్ చేయించాడు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్లో ఎలక్షన్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న వరికుప్పల శ్రీకాంత్, మేకల నరేష్ ద్వారా ఈ దరఖాస్తులను అప్రూవ్ చేయించి ఓటర్ ఐడీ కార్డులు తీసుకున్నాడు. వీటి ఆధారంగా పాన్‌కార్డులు సైతం పొందాడు. మొత్తం 41 మంది తన సంస్థలో పని చేస్తున్నట్లు క్రియేట్ చేసిన రంగారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి వారి పేర్లతో ఓ ప్రైవేట్ బ్యాంకులో శాలరీ అకౌంట్స్ తెరిచాడు. ఒక్కో కార్డుకు సంబంధించిన సంతోష్‌కు రూ.2 వేలు, శ్రీకాంత్‌కు రూ.1500, నరేష్‌కు రూ.1000 చొప్పున చెల్లించారు. మూడు నెలలు జీతాల కథ నడిపి... ఇలా తెరిచిన శాలరీ అకౌంట్స్ ఖాతాలకు సంబంధించి ఏటీఎం కార్డులు, చెక్ పుస్తకాలను రంగారెడ్డి, విజయ్‌కుమార్ తమ వద్దే ఉంచుకున్నారు. దాదాపు మూడు నెలల పాటు జీతాలు వేయడంతో పాటు ఆ మొత్తాలను వీరే డ్రా చేసుకున్నారు. ఇలా రూపొందించిన స్టేట్మెంట్స్, బోగస్ ధ్రువీకరణలను ఆధారంగా చేసుకుని ఎస్బీఐ. హెచ్డీఎఫ్సీ, స్టాండర్డ్ చార్టర్డ్, ఆర్డీఎల్ బ్యాంకులకు క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ డివిజన్లో, వెరిఫికేషన్ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గోపతోటి కిషోర్‌బాబు, జి.శైలేష్‌కుమార్, ఎస్బీఐకి చెందిన ఆర్.సందీప్ కుమార్, యు.ఆనంద్‌రావు సహాయంతో కార్డులు మంజూరయ్యేలా చేశాడు. ఒక్కో కార్డుకు కొంత కమీషన్‌గా చెల్లిస్తూ వివరాలు సరిచూడకుండా, కార్డులు నేరుగా తమ చేతికే అందేలా రంగారెడ్డి, విజయ్‌లు సఫలీకృతులయ్యారు. తమ సంస్థ పేరుతో సంతోష్‌నగర్‌లోని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్ సైతం పొందారు. దీంతో పాటు కొన్ని పెట్రోల్ బంకులు, సంస్థల్లో ఈ కార్డుల్ని స్వైప్ చేస్తూ వచ్చారు. ఇలా మొత్తం 41 మంది పేర్లతో 4 బ్యాంకుల నుంచి 125 క్రెడిట్‌కార్డులు తీసుకుని ‘వాడేశాడు’. మూడు శాతం కమీషన్ ఇస్తూ... రంగారెడ్డి, విజయ్ తాము తీసుకువచ్చిన క్రెడిట్‌కార్డుల్ని పీఓఎస్ మిషన్లలో స్వైప్ చేసి, నగదు ఇవ్వడానికి కొందరు దళారులను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకుగాను వారికి 3 శాతం కమీషన్ ఇస్తూ వీరు 97 శాతం నగదు తీసుకునేవారు. ఇలా మొత్తం నాలుగు బ్యాంకుల నుంచి రూ.1,52,10,725 కాజేసి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని మాకాం మార్చేశారు. ఈ స్కామ్ మొత్తం 2015 వరకు జరిగింది. డిఫాల్టర్ల కోసం కొన్నాళ్ళు ప్రయత్నించిన బ్యాంకు ప్రతినిధులు బోగస్ వివరాలని తెలియడంతో మిన్నకుండిపోయారు. ఓ బ్యాంకు ద్వారా సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్ రెడ్డి, కె.శ్రీకాంత్ దర్యాప్తు చేశారు. గురువారం రంగారెడ్డితో పాటు విజయ్, సంతోష్, శ్రీకాంత్, నరేష్, కిషోర్, శైలేష్, సందీప్, పరమేష్కుమార్ను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.6.9 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సంపాదించిన సొమ్మును రంగారెడ్డి కొన్ని సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసిందని, దానిని రికవరీ చేయడానికి చట్టపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. -
షెల్ కంపెనీలపై కొరడా..
లక్ష మంది డైరెక్టర్లపై అనర్హత వేటు!! న్యూఢిల్లీ: నల్లధనంపై పోరులో భాగంగా డొల్ల కంపెనీలు నిర్వహిస్తున్న వారిపై మరిన్ని కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. షెల్ కంపెనీలతో సంబంధమున్న దాదాపు 1.06 లక్షల మంది పైగా డైరెక్టర్లపై అనర్హత వేటు పడనుంది. సెప్టెంబర్ 12 నాటికి కంపెనీల చట్టంలోని సెక్షన్ 164 కింద అనర్హత వేటు వేయతగిన డైరెక్టర్లుగా 1,06,578 మందిని గుర్తించినట్లు, వీరిపై ఆమేరకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెక్షన్ ప్రకారం వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు వార్షిక నివేదికలు సమర్పించని కంపెనీల్లోని డైరెక్టర్లు ఐదేళ్ల పాటు అదే కంపెనీలో పునర్నియామకానికి గాని లేదా ఇతర కంపెనీల్లో గానీ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి గానీ అర్హత కోల్పోతారు. ఈ నెలాఖరు నాటికల్లా షెల్ కంపెనీలతో సంబంధమున్న డైరెక్టర్ల పూర్తి వివరాలతో జాబితా సిద్ధం కాగలదని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి చెప్పారు. చాన్నాళ్లుగా వ్యాపార కార్యకలాపాలు జరగని 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇటీవలే రద్దు చేసిన దరిమిలా తాజా ప్రతిపాదిత చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కంపెనీల ఏర్పాటు పరమావధి, డైరెక్టర్లు, లబ్ధిదారుల నిగ్గు తేల్చే దిశగా ఆయా సంస్థల డేటాను కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిశీలిస్తోన్నట్లు ప్రభుత్వం ప్రకటనలో వివరించింది. ఈ సంస్థల ఆధ్వర్యంలో మనీల్యాండరింగ్ కార్యకలాపాల్లాంటివి ఏమైనా జరిగాయా అన్న కోణంపై కూడా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. సదరు డిఫాల్ట్ కంపెనీలతో సంబంధమున్న వృత్తి నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లు మొదలైన వారిని ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారిపై ఐసీఏఐ, ఐసీఎస్ఐ తదితర వృత్తి నిపుణుల సంస్థలు తీసుకున్న చర్యలు కూడా పరిశీలనలో ఉన్నాయి. 2.09 లక్షల సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు అయిన తర్వాత ప్రస్తుతం 11 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి. -
బ్రోకర్ల నుంచి బాలీవుడ్ వరకు
► షెల్ కంపెనీల సాయంతో నల్లధన చలామణీ ► సెబీ, దర్యాప్తు సంస్థల నిఘాలో 500 సంస్థలు న్యూఢిల్లీ: అనుమానిత షెల్ కంపెనీలంటూ 331 లిస్టెడ్ సంస్థలపై ఆంక్షలకు ఆదేశించి సంచలనం సృష్టించిన సెబీ, త్వరలో మరింత మందికి షాక్ ఇవ్వనుంది. బాలీవుడ్ రంగానికి చెందిన వారితోపాటు బ్రోకర్లు, బిల్డర్ల నల్లధన ప్రవాహానికి కొన్ని షెల్ కంపెనీలుగా వ్యవహరించినట్టు సమాచారం. అంతేకాదు, మరో 100కుపైగా అన్‌లిస్టెడ్ కంపెనీలు అక్రమ ధనంతో షేర్ల ట్రేడింగ్‌కు పాల్పడినట్టు సెబీ వర్గాలు తెలిపాయి. 331 లిస్టెడ్ కంపెనీలకు షోకాజు నోటీసుల జారీని సెబీ ప్రారంభించింది. కొన్ని సంస్థలు సెబీ ఆదేశాలకు వ్యతిరేకంగా శాట్‌కు వెళ్లి స్టే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయా సంస్థలపై దర్యాప్తునకు శాట్ కూడా అడ్డుచెప్పలేదు. ప్రముఖ కంపెనీలు సైతం నల్లధన చలామణికి వాహకంగా ఉపయోపడ్డాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అనుమానిత షెల్ కంపెనీల్లో పలువురు చిన్న బ్రోకర్లు ఉన్నారని, పెద్ద బ్రోకరేజీ సంస్థలతో వీటికున్న సంబంధాలపై సెబీ ఆరా తీస్తోందని ఆ అధికారి వెల్లడించారు. మరోవైపు 331 కంపెనీలపై సెబీ ఆంక్షల తర్వాత స్టాక్ మార్కెట్లో భయానక వాతావరణం కల్పించడం వెనుక కొంత మంది బ్రోకర్ల పాత్రపైనా సెబీ పరిశీలన జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు తీసుకున్న చర్య అదని, కానీ వీటిల్లో వాటాలున్న బ్రోకర్లు తమ వాటాలను సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల విచారణ: సెబీ దర్యాప్తులో ఉన్న ఈ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎస్ఎఫ్ఐవో కూడా దృష్టి సారించాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత వీటిలో కొన్ని కంపెనీలు భారీ నగదు లావాదేవీలకు పాల్పడినట్టు సైతం సెబీ అనుమానిస్తోంది. దీంతో సెబీ, ఇతర దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నట్టు ఆ అధికారి తెలిపారు. నియంత్రణ, దర్యాప్తు సంస్థలు సుమారు 500 సంస్థలపై దర్యాప్తు చేస్తున్నాయని, సున్నిత అంశం దృష్ట్యా, దర్యాప్తునకు విఘాతం కలగకూడదన్న ఉద్దేశంతో కొన్నింటి పేర్లను బయటపెట్టలేదని పేర్కొన్నారు. -
మూడు వారాల కనిష్టం
♦ షెల్ కంపెనీలపై సెబీ ఆదేశాలతో పెరుగుతున్న ఆందోళన ♦ అంతర్జాతీయ సంకేతాల బలహీనత ♦ సెన్సెక్స్ 216 పాయింట్లు, ♦ నిఫ్టీ 70 పాయింట్లు డౌన్ అనుమానాస్పద షెల్ కంపెనీలపై ట్రేడింగ్ నిషేధించాలంటూ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సెబీ జారీచేసిన ఆదేశాల ప్రభావంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా వుండటంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు క్షీణించింది. స్టాక్ సూచీలు మూడు వారాల కనిష్టస్థాయిలో ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం మరో 216 పాయింట్లు తగ్గి 31,798 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 528 పాయింట్ల పతనమయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 70.50 పాయింట్లు క్షీణించి 9,908 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఉత్తర కొరియా–అమెరికాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తడంతో ప్రపంచ మార్కెట్లు కూడా తగ్గాయని, ఇప్పటికే సెబి ఆదేశాలతో అట్టుడుకుతున్న మార్కెట్‌కు ప్రపంచ ట్రెండ్ ఆజ్యం పోసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. హెల్త్‌కేర్, ఫార్మా నేతృత్వంలో అన్ని రంగాల సూచీలు తగ్గుదలతో ముగిసాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సెబీ ఆదేశాల ప్రభావంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచి 1.66 శాతం, స్మాల్‌క్యాప్ సూచి 1.88 శాతం మేర తగ్గాయి. ఫార్మా షేర్లు అతలాకుతలం... కొద్దిరోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న ఫార్మా షేర్ల పతనం బుధవారం కూడా కొనసాగింది. సన్‌ఫార్మా అమెరికా సబ్సిడరీ టారో ఫార్మాస్యూటికల్స్ బలహీనమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో సన్‌ఫార్మా 5 శాతంపైగా పతనమై 4 సంవత్సరాల కనిష్టస్థాయి రూ. 470 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్–30లో అధికంగా క్షీణించిన షేరు ఇదే. ఇతర ఫార్మా షేర్లలో నిఫ్టీ–50లో భాగమైన అరబిందో ఫార్మా 6 శాతం పతనమై రూ. 683 వద్ద క్లోజయ్యింది. సిప్లా 3.5 శాతం, లుపిన్ 2.5 శాతం చొప్పున తగ్గాయి. ప్రధాన సూచీల్లో భాగంకాని కెడిలా హెల్త్‌కేర్ 9 శాతం, గ్రాన్యూల్స్ ఇండియా 7.8 శాతం, అజంతా ఫార్మా, దివీస్ ల్యాబ్‌లు 7 శాతం చొప్పున పడిపోయాయి. తగ్గిన ఇతర రంగాల షేర్లలో అదాని పోర్ట్స్ (4 శాతం), టాటా మోటార్స్, బజాజ్ ఆటోలు వున్నాయి. ఎన్టీపీసీ, ఓఎన్జీసీలు స్వల్పంగా పెరిగాయి. -
ఆ షెల్ కంపెనీల్లో ట్రేడింగ్ కష్టమే!
► అనుమానిత 331 కంపెనీల ట్రేడింగ్‌పై ఆంక్షలు ► నెలలో మొదటి సోమవారం మాత్రమే అవకాశం ► సెబీ తాజా ఆదేశాలు... నేటి నుంచే అమల్లోకి ► ఆడిట్ వివరాల ఆధారంగా అవసరమైతే డీలిస్టింగ్ న్యూఢిల్లీ: షెల్ కంపెనీలుగా (నల్లధనం ప్రవాహం, పన్నుల ఎగవేతకు వీలుగా ఏర్పాటు చేసేవి) అనుమానిస్తున్న 331 లిస్టెడ్ కంపెనీలపై తాజా చర్యలకు సెబీ ఆదేశించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆయా లిస్టెడ్ కంపెనీల వివరాలు అందజేయడంతో... వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్సేంజ్‌లను సెబీ ఆదేశించింది. ఈ కంపెనీలను నాల్గవ గ్రేడ్ నిఘా నియంత్రణలోకి తీసుకురావాలని కోరింది. ఈ గ్రేడ్‌లోకి తీసుకొస్తే ఆయా స్టాక్స్‌లో నెలలో ఒక్కసారే ట్రేడింగ్‌కు వీలుంటుంది. సెబీ ఆదేశాల నేపథ్యంలో 331 లిస్టెడ్ కంపెనీలను మంగళవారం నుంచే నాల్గవ గ్రేడ్‌లోకి మార్చనున్నారు. దీంతో ఇక ఈ నెలలో ఈ స్టాక్స్‌లో లావాదేవీలకు అవకాశం ఉండదు. నెలలో ఒక్కసారే అది కూడా మొదటి సోమవారమే వీటిలో ట్రేడింగ్‌కు అనుమతించనున్నట్టు సంబం ధిత ప్రకటనలో సెబీ పేర్కొంది. అలాగే, చివరిగా క్లోజ్ అయిన ధరకు మించి పెరిగేందుకు కూడా అవకాశం ఇవ్వరు. ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేస్తున్న వారి నుంచి లావాదేవీ విలువ మొత్తానికి అదనంగా 200 శాతాన్ని నిఘా డిపాజిట్ కింద వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ఎక్సేంజ్‌లు ఐదు నెలల పాటు తమ వద్దే ఉంచుకుంటాయి. ఇక ఈ కంపెనీల ఆర్థిక వివరాలు, ఇతర అంశాలను ఎక్సేంజ్‌లు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే, స్వతంత్ర ఆడిటర్‌తో ఆడిటింగ్ జరపాలని, అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించాలని సెబీ కోరింది. ఈ ఆడిటింగ్‌లో ఆయా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా ఎటువంటి ఆర్థిక వ్యవహారాలు, ఫండమెంటల్స్ ఏవీ లేవని తేలితే వాటిని తప్పనిసరిగా డీలిస్ట్ కూడా చేస్తారు. ఈ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్ల వాటా లను డిపాజిటరీలు ఎక్సేంజ్‌ల ధ్రువీకరణ తర్వాతే బదిలీకి అనుమతిస్తారు. ఈ కంపెనీలు మరే ఇతర లిస్టెడ్ కంపెనీల్లో లావాదేవీలు నిర్వహించేందుకు వీలుండదు. ఒకవేళ ఈ 331 కంపెనీల్లో ఏవైనా ఇప్పటికే ట్రేడింగ్ సస్పెన్షన్‌కు గురై ఉంటే, సస్పెన్షన్ ఎత్తివేసిన మరుక్షణమే వాటిని నాల్గవ గ్రేడ్ నిఘాలోకి తీసుకొస్తారు. నల్లధనంపై పోరులో భాగంగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎటువంటి వ్యాపారాలు నిర్వహించని 1.62 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను ఇటీవలే రద్దు చేసిన విషయం తెలిసిందే. -
షెల్ కంపెనీలపై కఠిన చర్యలు
• బ్యాంకు ఖాతాల స్తంభన • టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు న్యూఢిల్లీ: పన్నులు ఎగవేసేందుకు, మనీలాండరింగ్ కోసం ఏర్పాటయ్యే డొల్ల కంపెనీలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఆయా సంస్థల ఖాతాలను స్తంభింపచేయడంతో పాటు పలు కఠిన చర్యలు తీసుకోనుంది. షెల్ కంపెనీలపై శుక్రవారం సమీక్ష జరిపిన ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రెవెన్యూ విభాగం, కార్పొరేట్ వ్యవహారాల విభాగాల కార్యదర్శుల సారథ్యంలోని ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఇతర శాఖలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు సభ్యులుగా ఉంటారు. ’దేశంలో 15 లక్షల కంపెనీలు నమోదై ఉండగా, కేవలం 6 లక్షల సంస్థలు మాత్రమే వార్షికంగా రిటర్నులు దాఖలు చేస్తున్నాయి. అంటే, చాలా పెద్ద సంఖ్యలో కంపెనీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయి’ అని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే ఈ తరహా డొల్ల సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, కార్యకలాపాలు సాగించని సంస్థలను రద్దు చేయడం, బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగించడం తదితర చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. అలాగే ఇలాంటి కార్యకలాపాలకు సహకరించే వృత్తి నిపుణులపై కూడా చర్యలు ఉంటాయని పీఎంవో తెలిపింది. 49 సంస్థలపై ఎస్ఎఫ్ఐవో కేసులు.. గణాంకాల ప్రకారం 54 మంది ప్రొఫెషనల్స్‌తో 559 మంది దాదాపు రూ. 3,900 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తేలిందని పీఎంవో తెలిపింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) 49 షెల్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది. డొల్ల సంస్థల తీరుతెన్నులు.. షెల్ కంపెనీల తీరుతెన్నుల గురించి పీఎంవో వివరించింది. నామమాత్రపు పెయిడప్ క్యాపిటల్, షేరుకు అధిక ప్రీమియం కారణంగా ఖాతాల్లో అధిక నిల్వలు.. మిగులు, అన్‌లిస్టెడ్ సంస్థల్లో పెట్టుబడులు, డివిడెండ్ ఆదాయం లేకపోవడం, అత్యధికంగా నగదు నిల్వలుండటం ఈ షెల్ కంపెనీల లక్షణాలని పేర్కొంది. అలాగే ప్రైవేట్ సంస్థలు మెజారిటీ వాటాదారులుగా ఉండటం, టర్నోవరు.. నిర్వహణ ఆదాయాలు తక్కువగా ఉండటం, నామమాత్రపు వ్యయాలు..చెల్లింపులు, అతి తక్కువ స్థిరాస్తులు మొదలైనవి కూడా ఇందులో ఉంటాయని వివరించింది. -
‘సిటీ’ కోసం ఓ కారు
రాబోయే 50 ఏళ్లలో ప్రపంచంలోని మూడొంతుల జనాభా పట్టణాల్లో నివసిస్తుందని అంచనా.. దీనికి తోడు వాహనాలు, కాలుష్యం పెరుగుతుంది. కనీసం పార్కింగ్ స్థలానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి నగరాల పరిస్థితులకు తగ్గట్లు ఉపయోగపడేలా ‘షెల్’ కంపెనీ సరికొత్త కారును డిజైన్ చేసింది. రీసైక్లింగ్ చేసిన కార్బన్ ఫైబర్‌తో చేయడం వల్ల కారు బరువు 550 కిలోలకు తగ్గడమే కాకుండా తక్కువ ధరలోనే లభ్యం కానుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రయ్‌మని దూసుకుపోవచ్చు కూడా. దాదాపు 3.8 లీటర్ల ఇంధనంతో 172 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు కూడా. ఒకటిన్నర మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల పొడవు, 1.3 మీటర్ల వెడల్పు ఉండటం వల్ల పార్కింగ్ చేసుకోవడానికి చాలా తక్కువ స్థలం సరిపోతుందని కారు డిజైనర్ గోర్డాన్ ముర్రే చెప్పాడు. మిగతా కార్ల కన్నా తక్కువ కార్బన్‌డై ఆక్సైడ్‌ను విడుదల చేసి కాలుష్యాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నాడు.