Siddharthjain collector
-
కలెక్టరేట్లో ఈ-ఆఫీస్ ప్రారంభం
ప్రభుత్వ కార్యాలయాల అనుసంధానం అధికారుల్లో జవాబుదారీతనం చిత్తూరు (అర్బన్): కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్త కలిసి ఈ-ఆఫీస్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. తద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల సమాచారం, పరిపాలన విధానం మొత్తం అనుసంధానం చేస్తారని కలెక్టర్ తెలిపారు. దీనివల్ల పనులు త్వరగా అవడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం కూడా పెరుగుతుందని చెప్పారు. -
రేపు సీఎం రాక
చిత్తూరు (సెంట్రల్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రాత్రి 10 గంటలకు ఆయన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట నుంచి బయలుదేరి అర్ధరాత్రి 12.30 గంటలకు తిరుపతి ఫార్చూన్గ్రాండ్ రిడ్జ్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 7.15 గంటలకు బయలుదేరి 8.45 గంటలకు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. 10.30 గంటలకు అక్కడ బయలుదేరి 11.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీసిటీకి చేరుకుని 1.10 గంటలకు పెప్సికో యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం అక్కడ వ్యాపారవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. విలేకరుల సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళతారని కలెక్టర్ తెలిపారు. -
నియంతలా కలెక్టర్
{పజా సమస్యలు పట్టించుకోవడంలేదు ముఖ్యమంత్రి మెప్పుకోసం వెంపర్లాడుతున్నారు మంత్రి సభలో కలెక్టర్‌పై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫైర్ ఎమ్మెల్యే నారాయణస్వామి సైతం మండిపాటు చిత్తూరు: కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సీఎం మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల గురించి చర్చించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధుల పట్ల నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆది వారం పీవీకేఎన్ కళాశాల ఆవరణలో జరిగిన దళిత-గిరిజన సాధికారిక సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు సమక్షంలో జరిగిన ఈ సదస్సులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కే.నారాయణస్వామి, డాక్టర్ సునీల్‌కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. తొలుత చెవిరెడ్డి మాట్లాడుతూ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సంధానకర్తగా వ్యవహరించాల్సిన కలెక్టర్ నియంతగా మారారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరగడం లేదని, సమాచారం కావాలని కలెక్టర్‌కు లేఖరాస్తే సమాధానం ఇవ్వకుండా నిబంధనలు తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు, నియమావళినే కలెక్టర్ పాటించకపోతే ఎలా అని వేదికపై తన పక్కనే ఉన్న కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఇలా అయితే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాలని మంత్రి రావెల కిషోర్‌ను ప్రశ్నించారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులతో ఎంతగా గొడవపడితే అన్ని మార్కులు సీఎం వద్ద వస్తాయని కలెక్టర్ భావిస్తున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ విధానం మంచిది కాదని, తీరుమార్చుకోకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం ఎన్ని పథకాలు పెట్టినా అవి సరిగా అమలు కావడం లేదన్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్థికంగా ఎదుగుదల లేకపోతే దళితులు సామాజికంగా, రాజకీయంగా ఎలా అభివృద్ధి సాధిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నారాయణస్వామి మట్లాడుతూ అవినీతిపరులైన అధికారులకు కలెక్టర్ సిద్ధార్థజైన్ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 90 శాతం అవినీతి ఉందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నా కలెక్టర్ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్‌కుమార్, సత్యప్రభ, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, మేయర్ అనూరాధ, కలెక్టర్ సిద్ధార్థజైన్, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి మాట్లాడారు. -
కలెక్టర్‌గారి తీరు మారదా?
సమయపాలన పాటించని జిల్లా కలెక్టర్ పడిగాపులతో అధికారుల తిప్పలు మహిళా అధికారుల కష్టాలు వర్ణనాతీతం చిత్తూరు: ‘‘కలెక్టర్ సమీక్ష అంట.. ఎప్పటికి ఇంటికొస్తామో మాకే తెలియదు. అన్నం వండుకుని తినేసి పడుకోండి..’’ అంటూ ఓ అధికారిణి ఇంటికి పంపిన ఫోన్ ఎస్ఎంఎస్ ఇది.ఉదయం 11 గంటలకు మీటింగంటూ పిలిపిస్తారు.. మూడు గంటల వరకు ఆయనగారు రారు. ఎప్పుడొస్తారో తెలియక తిండితిప్పలు మాని కార్యాలయం చెట్ల కింద పడిగాపులు కాయాల్సి వస్తోంది. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల బాధలు వర్ణనాతీతం. మాకు ఈ కర్మ ఏమిటి సార్.. ఓ జిల్లాస్థాయి అధికారి ఆవేదన ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమీక్ష అంటేనే జిల్లా అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. సమయపాలన పాటించని కలెక్టర్ తీరుతో విసిగిపోతున్నామంటూ తలలు పట్టుకుని కుయ్యో.. మొర్రో అంటున్నారు. ఇది ఒకటి, రెండు రోజుల సమస్య కాదు.. నిత్యం ఇదే తంతు. ముందుగా ప్రకటించిన సమయానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమీక్షలు, సమావేశాలు నిర్వహించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా గురువారం జరిగిన ఘటన కూడా కలెక్టర్ సమయపాలన పాటించలేదనేందుకు తార్కాణంగా నిలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి ఉపఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. సమావేశానికి ఎన్నికల విధులకు సంబంధించిన అధికారులందరూ హాజరుకావాలని ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటల నుంచే ఎన్నికల పరిశీలకుడితో పాటు, ఆర్డీవో, డెప్యూటీ కలెక్టర్, ఆ తరువాత స్థాయి అధికారులు దాదాపు వందమంది ఎస్వీ యూనివర్శిటీ సెనేట్ హాల్ వద్ద ఎదురుచూశారు. మూడు కాదు 4 గంటలైనా కలెక్టర్ హాజరుకాలేదు. దీంతో 2.45 గంటలకే సమావేశానికి వచ్చిన ఒకరిద్దరు ఉన్నతాధికారులు వె ళ్లిపోయారు. మిగిలిన అధికారులందరూ కలెక్టర్ కోసం పడిగాపులు కాశారు. ఏమీ అనలేని మిగిలిన అధికారులు బాధ దిగమింగుకుని వేచి చూశారు. మరోవైపు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల నేతల సమావేశానికి సైతం కలెక్టర్ హాజరుకావాల్సి ఉంది. కానీ ఈ సమావేశానికి కలెక్టర్ హాజరుకాలేదు. ఆ తరువాత సమావేశం 3 గంటలకు ఉంటుందని నేతలకు సమాచారం అందించారు. 3 గంటలకు కూడా కలెక్టర్ అటు రాజకీయ పార్టీ సమావేశానికి, ఇటు ఎన్నికల అధికారుల సమావేశానికిగానీ హాజరుకాలేదు. ఎన్నికల అధికారుల సమావేశానికి హాజరైన ఎన్నికల పరిశీలకులు విసిగివేశారి కలెక్టర్‌పై మండిపడ్డట్లు సమాచారం. దీంతో ఎట్టకేలకు 4.45 గంటలకు కలెక్టర్ అధికారుల సమావేశానికి హాజరయ్యారు. రాజకీయ పార్టీల సమావేశం వాయిదా పడింది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఉన్నతాధికారుల సమావేశాలు ఏదో ఒక రోజు ఒక గంట అటో ఇటో జరగడం సర్వసాధారణం. అయితే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమావేశాలు తరచూ ఆలస్యంగా జరుగుతున్నాయని, చెప్పుకోలేని బాధతో సతమతవుతున్నామని పలువురు అధికారులు ‘సాక్షి’తో వాపోయూరు.. తమ బాధలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గారి తీరు మారితే బాగుంటుందని వారంతా ఆకాంక్షిస్తున్నారు. -
నేడు కలెక్టర్ అత్యవసర సమావేశం
చిత్తూరు (అర్బన్): జిల్లాలో నెల రోజులుగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలు, స్థితిగతులపై చర్చించేందుకు గురువారం చిత్తూరులో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పుంగనూరులో స్వైన్‌ఫ్లూ వచ్చి ఉపాధ్యాయుడు మృతి చెందడం, తిరుపతిలో ఓ వృద్ధురాలు, ఆమె సహాయకురాలికి స్వైన్‌ఫ్లూ వచ్చిన విషయం విదితమే. వ్యాధి తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. -
మరింత అభివృద్ధి సాధిద్దాం
పాల ఉత్పత్తిలో అగ్రస్థానం మనదే అక్షరాస్యతలో ఐదో స్థానం మామిడి, టమాట ఉత్పత్తుల్లోనూ మనమే కీలకం గణతంత్ర దిన వేడుకల్లో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ చిత్తూరు : జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేసి మరింత అభివృద్ధిని సాధించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అకాంక్షించారు. పాల ఉత్పత్తిలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. సోమవారం పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్రదిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రోజుకు 22 నుంచి 24లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. మామిడి, టమాట ఉత్పత్తుల్లోనూ కీలక స్థానం ఈ జిల్లాదేనన్నారు. 85 వేల హెక్టార్లల్లో మామిడి, 16వేల హెక్టార్లల్లో టమాట సాగువుతోందని తెలిపారు. ఈ పంటలను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పిస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉండగా, మహిళా అక్షరాస్యతలో ముందంజలో ఉన్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం మరిన్ని పరిశ్రమలు రావాల్సి ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో ప్రధాన పంటలైన వరి, చెరకుతో పాటు పండ్ల తోటల పెంపకానికి పట్టు, పాడి పరిశ్రమ అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి రైతన్నలు అభివృద్ధి సాధించాలని కోరారు. వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి అన్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో నాణ్యత కోసం రైతులు మూడు సర్వీసులకు ఒక ట్రాన్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తక్కువ నీటితో పంటల సాగుకు డ్రిప్ ఇరిగేషన్ శ్రేయస్కరమని తెలిపారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలన్నారు. పారిశ్రామిక వేత్తలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఆవశ్యకత గుర్తించి వాటి నిర్మాణానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. స్వైన్‌ఫ్లూ లాంటి ప్రాణంతక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పసిపిల్లలకు వ్యాధుల నివారణలో బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గర్భిణులు పూర్తి స్థాయిలో వైద్యసౌకర్యం ఉన్న ఆస్పత్రిలోనే కాన్పులు చేసుకోవాలన్నారు. స్త్రీలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. ప్రతి అమ్మాయి ఆడపిల్లగా పుట్టినందుకు గర్వపడాలన్నారు. సమాజంలో పరివర్తన వస్తేనే స్త్రీజాతి అభివృద్ధి చెందుతుందన్నారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. బడిఈడు పిల్లలంతా బడిలో ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 72.36 అక్షరాస్యత ఉందన్నారు. పురుషుల అక్షరాస్యత 81.15 శాతం కాగా స్త్రీల అక్షరాస్యత 63.65 శాతం మాత్రమే ఉందని తెలిపారు. 2001 - 2011 మధ్య కాలంలో జిల్లా అక్షరాస్యత పెరుగుదల రేటు 5.59 శాతంగా నమోదైందన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో ఉందన్నారు. విశాఖలో సంభవించిన హుద్‌హుద్ తుపాను బాధితులకు జిల్లా తరఫున సత్వర సేవలు అందించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అభినందనలు తెలిపారు. చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ నారాయణభరత్‌గుప్త, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, మేయర్ అనురాధ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 26సీటీఆర్ 02 - జాతీయపతాకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్ 26సీటీఆర్03 గణతంత్ర దినోత్సవ ప్రసంగం చేస్తున్న కలెక్టర్ 26సీటీఆర్ 06- హాజరైన అధికారులు -
కలెక్టర్ బదిలీపై గందరగోళం
ఇక్కడే కొనసాగేందుకు సిద్ధార్థ్‌జైన్ యత్నాలు అడ్డంకి కానున్న డీవోపీటీ నిబంధనలు చిత్తూరు: కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బదిలీపై గందరగోళం నెలకొంది. బదిలీ తప్పదని కొందరు, ఇక్కడే ఉంటారని మరికొందరు అం టుంటే... మొత్తం మీద ఈ విషయం జిల్లాలో చర్చనీయూంశమైంది. సిద్ధార్థ్‌జైన్‌ను ఇప్పటికే డీవోపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడో రేపో జైన్ బదిలీపై వెళ్లనున్నారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే ఇక్కడే ఉండేందుకు హైదరాబాద్ స్థాయిలో జైన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం సైతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులు అజయ్‌జైన్, అజయ్‌సహాని, కర్ణన్, ఏకే సింగాల్, ఐపీఎస్ అధికారి అనూరాధతో పాటు చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను సైతం రాష్ట్రంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పూనంమాలకొండయ్య, సోమేష్‌కుమార్, జయేష్‌రంజన్, రోనాల్డ్‌రాస్‌ను అక్కడే కొనసాగించాలని కేంద్రాన్ని కోరింది. అధికారుల మ్యూచువల్ బదిలీలకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీ సంతకాలతో లేఖ పంపాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు రెండు రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపాయి. దాంతో సిద్ధార్థ్‌జైన్ బదిలీ ఆగనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అడ్డంకిగా మారనున్న నిబంధనలు సిద్ధార్థ్‌జైన్ బదిలీ ఆగేందుకు డీఓపీటీ నిబంధనలు అడ్డుగా మారనున్నట్లు సమాచారం. ఐఏఎస్, ఐపీఎస్ అంతర్రాష్ట్ర బదిలీల్లో మ్యూచువల్‌కు సేమ్ పే బ్యాండ్ (ఇద్దరూ ఒకే జీతం)లో ఉన్నవారు మాత్రమే అర్హులు. ఈ విషయం డీఓపీటీ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. రెండు రాష్ట్రాలు కోరుతున్న విధంగా మ్యూచువల్‌లో ఉన్న అధికారులు సేమ్ పే బ్యాండ్‌లో లేరు. రోనాల్డ్రాత్ జైన్ కంటే జూనియర్ కాగా, పూనంమాలకొండయ్య, సోమేష్‌కుమార్, జయేష్‌రంజన్ సీనియర్లు. దీంతో నిబంధనల మేరకు సిద్ధార్థ్‌జైన్ బదిలీ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన తెలంగాణకు వెళ్లాల్సి ఉంటుందని ఐఏఎస్ అధికారులు తేల్చి చెబుతున్నారు. నిబంధనలను సడలిస్తేనే జైన్ చిత్తూరులో కొనసాగే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.