Silk farmers
-
Fact Check: పట్టు రైతులకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించింది. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు అండగా ఉండటానికి గ్రామాల్లోనే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500, పంట నష్టపరిహారం, రైతులకు ఉచిత విద్యుత్.. ఇలా ఒకటా రెండా దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు.. దేశవిదేశాల నుంచి ఏపీ వ్యవసాయ విధానాలపై ప్రశంసలు.. ఇన్ని కళ్ల ముందు కనిపిస్తున్నా పచ్చకళ్ల కబోధి, ఈనాడు పత్రికాధినేత రామోజీరావుకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. పట్టు రైతులు కష్టాలు పడుతున్నారని.. పథకాలకు ప్రభుత్వం పాతరేసిందని.. రైతులకు రాయితీలు నిలిపేసిందని అసత్యాలు, అబద్ధాలతో మంగళవారం జగనన్న మంకు‘పట్టు’ అంటూ ఒక విష కథనాన్ని వండివార్చారు. దీనికి సంబంధించిన అసలు వాస్తవాలు ఇవిగో.. ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో గత ఐదేళ్లుగా పట్టుసాగు భారీగా విస్తరించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో పట్టు రైతులు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు కళ్లజూస్తున్నారు. కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇలా అడుగడుగునా చేయూతనిస్తుంటే ఈనాడు మాత్రం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ఆరోపణ: గతమెంతో ఘనం.. నేడు దైన్యస్థితిలో పట్టు రైతులు వాస్తవం: 2014–15 నుంచి 2018–19 మధ్య కొత్తగా 39,433 ఎకరాల్లో 15,362 మంది రైతులు పట్టు సాగు చేపట్టారు. 25,632 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు పండించారు. 2019–20 నుంచి 2023–24 మధ్య కొత్తగా 40,362 ఎకరాల్లో 17,852 మంది రైతులు పట్టు సాగు చేపట్టారు. అదనంగా 30,272 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు పండించారు. ఇక గతేడాది రికార్డు స్థాయిలో రూ.4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు ఉత్పత్తయ్యాయి. రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్నుల నాణ్యమైన ముడిపట్టును సిల్క్‌రీలర్లు ఉత్పత్తి చేశారు. ఆరోపణ: రాయితీలకు కోత.. నిధుల విడుదలకు సతాయింపు వాస్తవం: ఈ ఐదేళ్లలో పట్టు రైతులకు ప్రభుత్వం రూ.19.41 కోట్ల బైవోల్టిన్ కకున్ ఇన్సెంటివ్ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.4.50 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసింది. ఇక పట్టు రీలర్లకు 4 ఏళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్స్ ఇ చ్చింది. ఈ ఏడాది మరో రూ.2.75 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది పట్టు రైతులకు రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇలా క్రమం తప్పకుండా పట్టు రైతులకు ఇన్సెంటివ్‌లు, రీలర్లకు ప్రోత్సాహకాలు ఇస్తూంటే.. ఈనాడు పత్రిక సత్యదూరమైన ఆరోపణలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆరోపణ: 33 శాతం పైగా పెరిగిన ఉత్పత్తి వ్యయం వాస్తవం: కిలో పట్టు గూళ్లకు 2018–19లో మార్కెట్ ధర రూ.350లకు మించి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సరాసరి ధర రూ.480 నుంచి రూ.550 మధ్య పలుకుతోంది. అంటే 2018–19తో పోలిస్తే సరాసరి ఆదాయం కిలోకు అదనంగా రూ.200కు పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. గత ఐదేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్ రకం పట్టు గూళ్లకు కిలోకి రూ.881కు పైగా లభించింది. పైగా రైతుల పట్టుగూళ్ల ఉత్పాదకత కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ప్రతి వంద గుడ్లకు గతంలో 60 కిలోలొస్తే, ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తోన్న పట్టు సాగు బడుల ఫలితంగా ప్రస్తుతం 70–75 కిలోలు వస్తోంది. దీన్ని బట్టి చూస్తే రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యారే తప్ప ఈనాడు ఆరోపించినట్టు ఏ దశలోనూ ఇబ్బందిపడిన దాఖలాలు లేవు. ఆరోపణ: వైఎస్సార్సీపీ ప్రభుత్వం శీతకన్ను వాస్తవం: చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్ షెడ్లలో టర్బో వెంటిలేటర్స్, కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, షూట్ రీరింగ్ పద్ధతులపై పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వల్ల సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా పట్టు రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ లక్ష్యం కాగా ఇప్పటికే 5,242 మంది రైతులు 7,720 ఎకరాల్లో కొత్తగా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.3,462 కోట్ల విలువైన 66,593 టన్నుల నాణ్యమైన కకూన్స్, 13,246 టన్నుల బైవోల్టెన్ కకూన్స్‌ను ఉత్పత్తి చేశారు. రూ.3,560 కోట్ల విలువైన 9,150 టన్నుల రా సిల్క్ ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుత ఏడాదిలో పట్టు పరిశ్రమ కోసం రూ.99.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరపగా ఇప్పటికే రూ.28.80 కోట్లు విడుదల చేసింది. 2021–22లో పట్టు పరిశ్రమ స్థూలాదాయం రూ.11,638 కోట్లు ఉండగా 2022–23లో రూ.12,098 కోట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆరోపణ: యాంత్రీకరణ సహా పథకాల ఎత్తివేత వాస్తవం: క్రిమిసంహారక మందుల కొనుగోలుకు 9,525 మంది రైతులకు రూ.2.38 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. యంత్ర పరికరాల కోసం పట్టు పరిశ్రమ ద్వారా 1,524 మంది రైతులకు రూ.8.25 కోట్లు ఇచ్చింది. పట్టు రైతులు నిర్మించుకున్న షెడ్లతో పాటు మల్బరీ తోటల సాగు, రీలింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం రూ. 111.61 కోట్లు విడుదల చేసింది. పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ బకాయిలన్నింటినీ రైతుల ఖాతాకు జమ చేస్తోంది. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా యంత్ర పరికరాలకు మంగళం పాడేశారంటూ ఈనాడు అబద్ధాలను అచ్చేసింది. -
Fact Check: ‘పట్టు’ తప్పిన రాతలు
సాక్షి, అమరావతి: ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతో గడచిన నాలుగేళ్లుగా పట్టుసాగు విస్తరిస్తుండడమే కాదు.. ఆ రైతులు గతంలో ఎన్నడూలేని రీతిలో లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా నాలుగేళ్లలో కొత్తగా 39,640 ఎకరాల్లో పట్టుసాగు విస్తరించగా, బైవోల్టిన్ రకం పట్టుగూళ్ల ఉత్పత్తి మరో 13,905 టన్నులు పెరిగింది. 2018–19లో పట్టుగూళ్ల ధర (కకూన్స్) కిలో రూ.380 రావడం గగనంగా ఉండేది. కానీ, నేడు సగటున రూ.470 నుంచి రూ.620 వరకు లభిస్తోంది. అయినా, ప్రభుత్వంపై బురద జల్లడమే ఈనాడు లక్ష్యంగా పెట్టుకుంది. ‘పట్టు రైతుకు కుచ్చుటోపీ’ అంటూ నిసిగ్గుగా అబద్ధాలు అచ్చేసింది. ఈనాడు కథనంలో వాస్తవాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.. రాష్ట్రంలో 76,395 మంది 1,37,420 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తున్నారు. 600 సిల్క్ రీలర్ కుటుంబాలు ముడిపట్టును ఉత్పత్తి చేస్తుంటే ఈ రంగంపై ఆధారపడి 14లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. పట్టు రైతులకు మెరుగైన ఆదాయకల్పన లక్ష్యంతో పట్టుగూళ్ల మార్కెట్లలో ఈ–మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురావడమే కాదు.. పట్టుసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తోంది. రైతులు, రీలర్లకు ఏటా ప్రోత్సాహకాలు.. ఇలా నాలుగేళ్లలో పట్టు రైతులకు రూ.19.41 కోట్ల బైవోలి్టన్ కకున్ ఇన్సెంటివ్ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.7.12 కోట్లు విడుదల చేసింది. అలాగే, పట్టు రీలర్లకు నాలుగేళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్ ఇచ్చారు. ఈ ఏడాది మరో రూ.6 కోట్లు విడుదల చేశారు. మరోవైపు.. పట్టు రైతులు నిర్మించుకున్న 1,186 షెడ్లకు ప్రభుత్వం ఇప్పటికే రూ.37.88 కోట్ల రాయితీనందించగా, మరో రూ.11.97 కోట్ల రాయితీని విడుదల చేసేందుకు ఏర్పాట్లుచేసింది. పట్టు పురుగుల పెంపకపు షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన బకాయిలన్నీ రైతుల ఖాతాలో జమచేశారు. అలాగే, పట్టుసాగులో అవసరమైన క్రిమిసంహార మందుల కొనుగోలు కోసం నాలుగేళ్లలో రూ.1.46 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. మరోవైపు.. కొత్తగా ఐదు ఆటోమేటిక్ రీలింగ్ మెషినరీ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నారు. పట్టు సాగుబడుల ద్వారా శిక్షణ.. చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్ షెడ్లలో టర్బో వెంటిలేటర్లు, కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటుచేయడం, షూట్ రీరింగ్ పద్ధతులపై ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వలన సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా ఈ రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలా ప్రభుత్వ చర్యల ఫలితంగా 2019–23 మధ్యలో కొత్తగా 39,640 ఎకరాల మేర సాగులోకి వచి్చంది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్‌బ్రీడ్ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు ఉత్పత్తి కాగా, రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్నుల నాణ్యమైన ముడిపట్టును సిల్్కరీలర్లు ఉత్పత్తి చేశారు. 2021–22లో స్థూలాదాయం (జీవీఏ) రూ.11,638 కోట్లు సాధించగా, 2022–23లో రూ.12,098 కోట్లు సాధించి పట్టు పరిశ్రమ కొత్త రికార్డు నెలకొల్పింది. ఏటా రికార్డు స్థాయి ధరలు.. గడిచిన నాలుగేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్ రకం పట్టుగూళ్లకు కిలోకి రూ.881 లభించింది. నాలుగేళ్లలో రైతులు పొందిన సగటు ధరను పరిశీలిస్తే కిలో రూ.470 నుంచి రూ.620 మధ్య పలికింది. ఈ ఏడాది గడిచిన మూడునెలల్లో సగటు ధర కిలో రూ.400 నుంచి రూ.480 మధ్య ఉంది. సాధారణంగా ఏటా సెపె్టంబరు నుంచి ఫిబ్రవరి వరకు పట్టుగూళ్లకు మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలు వచ్చే మూడునెలల్లో గరిష్ట స్థాయికి చేరే అవకాశముంది. ఇక ఈ ఏడాది (2023–24) 12వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ ద్వారా 15వేల టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు, 65వేల టన్నుల క్రాస్‌బ్రీడ్ పట్టుగూళ్ల ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, ఇతర పట్టు రైతులకు ఈ ఏడాది రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చుచేయడానికి కార్యాచరణను సిద్ధంచేసింది. ఈనాడు ఆరోపణల్లో నిజంలేదు.. పట్టు రైతులకు కుచ్చుటోపీ అంటూ ఈనాడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ధరలు పడిపోయాయని, రైతులకు, రీలర్లకు ప్రోత్సాహకాలు, క్రిమిసంహాకర మందులకయ్యే వ్యయాన్ని నిలిపి వేసిందనడంలో ఎలాంటి వాస్తవంలేదు. నిజాలు తెలుసుకోకుండా బురద జల్లడం ఈనాడుకు సరికాదు. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, పట్టు శాఖ -
రైతు ఆదాయం పెంచే పట్టు యంత్రం
పట్టు గూళ్లు సాగు చేసే రైతుల ఇబ్బందులను తీర్చడంతో పాటు కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించే సమగ్ర యంత్రాన్ని రైతు శాస్త్రవేత్త గురుమూర్తి శెట్టి (ఏడూరు బాబు) ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరు వాస్తవ్యుడైన ఆయన కుటుంబం రెండు తరాలుగా పట్టు గూళ్ల సాగులో నిమగ్నమై ఉంది. పదో తరగతి వరకు చదివిన గురుమూర్తి ఊహ తెలిసిన నాటి నుంచి పట్టు గూళ్ల సేకరణ ప్రక్రియలో చాకిరీని గమనిస్తున్నారు. వెదురు చంద్రికలు లేదా రోటరీ మోటేజ్ లేదా ప్లాస్టిక్ నేత్రికల్లో పెరిగిన పట్టు గూళ్లను విడిపించి అమ్మకానికి సిద్ధం చేయటం ఖర్చుతో, శ్రమతో కూడిన పని. 35 మంది కూలీలు రోజంతా శ్రమిస్తే 600 కిలోల పట్టు గూళ్లను మార్కెట్‌కు సిద్ధం చేస్తారు. ఈ పనిలో చాకిరీని తగ్గించగలిగితేనే రైతు నికరాదాయం పెరుగుతుందని ఆలోచనతో కృషి చేసిన గురుమూర్తి అందుకు ఉపయోగపడే ఓ యంత్రాన్ని మూడేళ్ల క్రితం రూపొందించారు. ఆచరణలో ఎదురైన కొన్ని సమస్యలను సైతం పరిష్కరించి సమగ్రమైన కకూన్ హార్వెస్టర్‌కు ఇటీవల రూపొందించారు. ఈ యంత్రం ఉంటే కేవలం 11 మంది కూలీలతో 600 కిలోల గూళ్లను ప్లాస్టిక్ నేత్రికల నుంచి సులువుగా విడిపించవచ్చని గురుమూర్తి తెలిపారు. పెద్దలు, పిల్లలు, ఆడ, మగ ఎవరైనా దీనిపై సులువుగా పనిచేయవచ్చు. విద్యుత్తు మోటారు లేదా మోటారు సైకిల్ ద్వారా దీన్ని నడపవచ్చు. ఇవేవీ లేకపోతే మనుషులే దీని చక్రం తిప్పుతూ గూళ్లను చంద్రికల నుంచి వేరు చేయవచ్చు. ఆకు గూళ్లు లేదా బెడ్ గూళ్లను శుభ్రం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుండటం విశేషం. పట్టు గూళ్లపైన ఉండే నూగు లేదా ప్లాస్ లేదా జుంజరను తీసివేసి గూళ్లను నున్నగా చేసే శక్తి కూడా ఈ యంత్రానికి ఉంది. ఈ యంత్రం బరువు తక్కువ. ఆటోలో పెట్టి ఎక్కడికైనా తరలించవచ్చు. ఈ యంత్రం ధర రూ. 40 వేలు. దీనికి వాడిన నట్లు, బోల్టులు, బెల్టు.. అన్నీ గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేవే. మరమ్మతు వచ్చినా రైతులే చేసుకోవచ్చని గురుమూర్తి వివరించారు. ఈ యంత్రాన్ని ఉత్పత్తి చేసి సెరికల్చర్ రైతులకు అందించడానికి గురుమూర్తి ‘గురూస్ ఎంటర్ప్రైజెస్’ స్టార్టప్ కంపెనీని నెలకొల్పారు. ‘రఫ్తార్’ పథకం కింద రూ.1.80 లక్షలను అందించి ప్రభుత్వం ప్రోత్సహించింది. తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారులు డా. సి. రమణ, డా. బాలహుస్సేన్‌రెడ్డి ఈ యంత్రం పనితీరును చూసి ముగ్ధులయ్యారు. సొంత తెలివితో యంత్రాన్ని ఆవిష్కరించిన గురుమూర్తి శెట్టి(98491 26223)కి జేజేలు! ఎలుకలకు అడుగున్నర దూరం! వరి సాగులో నారు మడి నుంచి పంట దిగుబడి వరకు ఎలుకల సమస్య రైతులను సతమతం చేస్తుంటుంది. 5–10% ధాన్యం దిగుబడి నష్టం జరుగుతూ ఉంటుంది. విష గుళికలు చల్లటం, గమ్ స్టిక్లర్ల ఎరలు పెట్టడం, బుట్టలు పెట్టి (ఎలుకకు రూ. 20–30 చెల్లించి) పట్టుకోవటం.. ఎన్ని ఉపాయాలు చేసినా ఎలుకలు తప్పించుకుంటూ నారును, పాల కంకులను కొరికేస్తూనే ఉంటాయి. అయితే, కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాలుగేళ్లుగా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మాదివాడ సురేంద్ర అనుభవాలు వేరుగా ఉన్నాయి. ఆయన ఎలుకలకు విభిన్నంగా చెక్ పెడుతున్నారు. 45 సెం.మీ. దూరంలో.. శ్రీవరి పద్ధతిలో సాధారణంగా వరి మొక్కల్ని 25–30 సెం. మీ. దూరంలో నాటేస్తూ ఉంటారు. సురేంద్ర మాత్రం కుల్లాకర్, నారాయణ కామిని, మైసూర్ మల్లిగ వంటి దేశీ వరి వంగడాల నారును ఎటు చూసినా 45 సెం.మీ. (అడుగున్నర) దూరంలో నాటేస్తున్నారు. మొక్కలు ఇంత దూరంలో ఉండటం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి ఎక్కువ దుబ్బులు కట్టడం వల్ల, ఎలుకలు కంకులను కొరికేయకుండా ఉండటం వల్ల దిగుబడి ఏమీ తగ్గటం లేదు. ఎలుకల సమస్యకు ఇది అద్భుత పరిష్కారంగా కనిపించిందని ఆయన తెలిపారు. ఇంత దూరంగా నాట్లేయటం వల్ల ఎలుకల సమస్య 90% తీరిపోయిందన్నారు. ఎలుకలు, బహుశా ప్రాణభయంతో కావచ్చు, వత్తుగా ఉండే పంట పొలాలనే ఎంచుకుంటాయి. ఎడం ఎడంగా దుబ్బులు ఉన్నప్పుడు ఏ కాకులో, ఏ గుడ్లగూబో తన్నుకుపోతాయన్న భయం వీటికి కలుగుతూ ఉండొచ్చు. అందుకే నా పొలంలోకి రావట్లేదు. వత్తుగా ఉన్న పొరుగు పొలాల్లో ఎలుకలు ఎడతెగని సమస్యగా ఉన్నాయన్నారు. రేడియో ప్రసారాలతో నారుమడికి రక్షణ! వరి నారుమడిలో కూడా ఎలుకల సమస్య తీవ్రంగా ఉంటుంది. విత్తనాలు తినేస్తాయి. మొలకలనూ కొరికేస్తూ ఉంటాయి. పొలం అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి కూడా నారుమళ్లకు ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకని కొందరు రైతులు కలిసి ఒకే చోట నార్లు పోసుకుంటూ ఉంటారు. అయినా, ఎలుకల సమస్య ఉండనే ఉంటుంది. సురేంద్ర ఇంటర్నెట్లో వెతికితే.. అలజడిగా ఉంటే, వెలుతురుగా ఉంటే ఎలుకలను అరికట్టవచ్చని అర్థమై.. ఆ దిశగా ప్రయత్నించి విజయం సాధించారు. ఏ భాషలోనైనా సరే నిరంతరం ప్రసారాలుండే స్టేషన్‌ను ఆన్ చేసిన రేడియోను 2 సెంట్ల నారుమడిలో రాత్రి 8.30కి పెట్టేవారు. పొద్దున్నే తీసేసే వారు. ఈ పని చేయటం ప్రారంభిచిన తర్వాత నారుమడికి ఎలుకల సమస్య లేకుండా పోయింది. విస్తారమైన వరి/మినుము పొలంలో అయితే ఎక్కువ చోట్ల రేడియోలు పెట్టాలి లేదా ఒక రేడియో నుంచి దూరం దూరంగా పొలం అంతటా సౌండ్ బాక్స్లైనా పెట్టుకోవాలి. పొలాల్లో తాటి చెట్లు ఉంటే.. దానిపై గుడ్లగూబలు, కాకులు ఉండి.. ఎలుక పిల్లలను ఏరుకు తింటూ ఉంటాయి. తాటి చెట్లు కొట్టేయటం కూడా ఎలుకల సమస్య పెరగడానికి ఓ కారణమని సురేంద్ర (88862 31122) అంటున్నారు. సెన్సార్‌తో పని చేసే సోలార్ లైట్ల ద్వారా కూడా ఎలుకలను అరికట్టవచ్చన్నారు. -
'పట్టు'న్నోడు రైతు గురుమూర్తి!
పలమనేరు: నెలపాటు సాగు చేసిన పట్టు గూళ్లను నేత్రికల నుంచి విడిపించడానికి ‘పట్టు’ రైతులు పడే పాట్లు చూసి చలించిపోయాడు.. ఆ రైతు. సమయానికి కూలీలు దొరక్కపోవడం.. దీంతో సకాలంలో మార్కెట్‌కు తీసుకువెళ్లకపోవడం వల్ల ఎదురయ్యే కష్టాలను స్వయంగా తాను అనుభవించాడు. దీంతో ఈ కష్టాలకు చెక్ పెట్టాలని భావించిన పట్టు రైతు తానే పట్టు గూళ్లను విడిపించే యంత్రాన్ని తయారు చేశాడు. రూ.40 వేలతోనే యంత్రాన్ని రూపొందించి శాస్త్రవేత్తల మన్ననలందుకున్నాడు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ప్రోగ్రామ్ కింద అందించే రూ.3 లక్షల ప్రోత్సాహకానికి కూడా ఎంపికయ్యాడు. ఇలా అందరికీ ఆదర్శంగా నిలిచిన రైతే.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరుకు చెందిన గురుమూర్తి. ఈయన తయారు చేసిన యంత్రంతో పట్టు రైతుల కష్టాలు తీరాయి. తగ్గిన కూలీల ఖర్చు.. పట్టు పురుగులు నేత్రికల్లో గూళ్లు కట్టాక వాటిని రైతులు జాగ్రత్తగా విడిపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 500 మట్టి (సీడ్) పురుగులను మేపితే సుమారు 400 కిలోల గూళ్లు ఉత్పత్తి అవుతాయి. వెయ్యికిపైగా నేత్రికల్లోని గూళ్లను విడిపించేందుకు రోజుకు 30 మంది కూలీల అవసరముంటుంది. ఒక్కో కూలీకి రోజుకు రూ.300 చొప్పున రూ.9 వేలు ఖర్చు అవుతుంది. అయితే కొన్నిసార్లు సమయానికి కూలీలు దొరకరు. దీంతో గూళ్లను నేత్రికల నుంచి విడిపించడానికి మూడు, నాలుగు రోజులు సమయం పడుతోంది. దీంతో పట్టు గూళ్లను సకాలంలో మార్కెట్‌కు తీసుకెళ్లకపోవడంతో మంచి ధర లభించక పట్టు రైతులు నష్టపోతున్నారు. దీంతో ఈ కష్టాలకు చెక్ పెట్టాలని భావించిన గురుమూర్తి ఈ యంత్రాన్ని తయారుచేశాడు. విద్యుత్ లేకున్నా పనిచేసేలా.. హాఫ్ హెచ్‌పీ మోటారు సాయంతో నడిచే ఈ యంత్రంలోకి పట్టుగూళ్ల నేత్రికలను ఓ వైపు నుంచి ఒకరు పెడుతుంటే మరోవైపున మరొకరు దాన్ని లాగుతుండాలి. నేత్రికల్లోని గూళ్లు అక్కడే పడి యంత్రానికి ఏర్పాటు చేసిన జల్లెడ ద్వారా ముందుకెళ్లి సంచిలో పడతాయి. దీంతోపాటు పట్టు పురుగులు గూడును అల్లేటప్పుడు కొన్ని మల్బరీ ఆకుల్లోనే గూడును కడతాయి. ఇలాంటి ఆకుగూళ్లను సైతం జాగ్రత్తగా విడదీసేలా గురుమూర్తి ఈ యంత్రాన్ని రూపొందించాడు. ఈ యంత్రాన్ని ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా విద్యుత్ లేనప్పుడు సైతం చేతితో తిప్పేలా హ్యాండిల్ ఉంది. బైక్‌ను స్టార్ట్ చేసి దానికి బెల్ట్ వేసి కూడా వాడుకోవచ్చు. ఇటీవల ఈ యంత్రాన్ని పరిశీలించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంజనీర్ రమణ, సీనియర్ శాస్త్రవేత్త డా.బాలహుస్సేన్.. రైతు గురుమూర్తిని అభినందించారు. ఈ యంత్రం పట్టు రైతులకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ప్రోగ్రామ్ కింద గురుమూర్తికి రూ.3 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఇందులో ఇప్పటికే రూ.1.8 లక్షలు ఆయన చేతికందాయి. పేటెంట్‌కు దరఖాస్తు చేశా నేను ముప్పై ఏళ్లుగా పట్టు పురుగులు పెంచుతున్నా. కూలీల సమస్యను అధిగమించేందుకు ఈ యంత్రాన్ని తయారుచేశా. దీనికి పేటెంట్ కోసం దరఖాస్తు చేశా. పేటెంట్ వచ్చాక యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తా. – గురుమూర్తి, పట్టురైతు -
పట్టు రైతు కుదేలు
గిద్దలూరు: పట్టు రైతులకు కరోనా కాటు పడింది. కరోనా వైరస్ దాటికి పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పట్టు పురుగులను పెంచుతున్న రైతులు పురుగులను మేపాలా, వద్దా అనేది అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఎకరం పొలంలో మల్బరీ ఆకు పెంచేందుకు, పట్టు గుడ్లు కొనుగోలు, చాకీ ఖర్చులు, గూళ్ల దిగుబడికి రూ.ఎకరానికి రూ. 30 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఇప్పటికే కొందరు రైతులు పంట పూర్తికాగా, మరి కొందరు రైతులు పట్టు గూళ్లు తీయాల్సి ఉంది. కొందరు రైతులు పురుగులు నాలుగో దశలో ఉన్నాయి. పంట పూర్తయి పట్టుగూళ్లు తీసిన రైతులు వాటిని విక్రయించుకునేందుకు మార్కెట్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంట చివరి దశలో ఉన్న రైతులు గూళ్లు కట్టించాలా.. ముందే పంటను పడేయాలా అనే సందేహంలో ఉన్నారు. కిలో పట్టుగూళ్లు రూ.700 నుంచి రూ.750 వరకు ధర పలుకుతున్న తరుణంలో మార్కెట్లు మూతవేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగు.. జిల్లాలో మల్బరీ సాగు దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగవుతోంది. ప్రస్తుతం 70 ఎకరాల్లో రైతులు పట్టు పురుగులు పెంచుతున్నారు. వీరికి పట్టుపరిశ్రమ శాఖ ద్వారా నర్సరీలు పెంచి పట్టు పురుగులు రెండు దశలు వచ్చే వరకు 8 రోజుల పాటు పెంచి ఇస్తారు. ఇక రైతులు 19 రోజులు మాత్రమే పురుగులను సంరక్షించి గూళ్లు కట్టించి మార్కెట్లో విక్రయించాల్సి ఉంది. గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట మండలాల్లో పట్టురైతులు 250 మంది వరకు 500 ఎకరాల్లో పంటను సాగుచేస్తున్నారు. వీరంతా పట్టు పురుగులను పెంచి చంద్రికల్లో వేశారు. గూళ్లు అల్లే దశలో ఉన్నాయి. కొందరు రైతులు గూళ్లు పూర్తయిన రెండు రోజుల్లోనే మార్కెట్‌కు తరలిస్తారు. లేదంటే పట్టుగూడుకు రంద్రం వేసి పురుగు పక్షిగా మారి బయటకు వెళ్తుంది. ఆ తర్వాత పట్టు గూడు విక్రయానికి పనికిరాదు. దారం తెగిపోవడం వలన విక్రయించడం వీలు పడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థంకాక రైతులు ఆందోళన చెందుతున్నారు. గిద్దలూరు మండలంలోని ఒక్క పొదలకుంటపల్లె గ్రామంలోనే 23 మంది పట్టు రైతులు ఉన్నారు. పట్టు రైతులకు తీరని నష్టం కరోనా వైరస్‌తో పట్టు గూళ్ల కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో జిల్లాలోని పట్టు రైతులకు తీరని నష్టం వాటిల్లింది. 750 మంది రైతులు దాదాపు లక్షా, 50 వేల పట్టు గుడ్లు కొనుగోలు చేసి పెంచుతున్నారు. తద్వారా ఒక లక్ష కిలోల పట్టు గూళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కిలో రూ.700 చొప్పున రూ.7 కోట్ల వరకు పట్టు రైతులు నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమాచారం ఇచ్చేందుకు పటుపరిశ్రమ అధికారులు అందుబాటులో లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి పట్టు గూళ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 250 పట్టు గుడ్లు పెంచుతున్నాను తాను ఎకరంలో మల్బరీ సాగుచేస్తున్నాను. 250 పట్టు గుడ్లు తీసుకొచ్చి పెంచుతున్నాను. ఇప్పటికే కొందరు రైతులు పంట పూర్తయి పట్టు పురుగులు గూళ్లు అళ్లాక మార్కెట్‌కు వెళ్తే కొనుగోలు చేసేవారు లేక వెనక్కు వచ్చారు. తాను రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టి పురుగులను పెంచుతున్నాను. మార్కెట్ లేకపోతే ఏం చేయాలో అర్థం కావడం లేదు.– ఎస్.మోహన్‌రెడ్డి, పట్టు రైతు, పొదలకుంటపల్లె -
పట్టు జారుతోంది
పట్టు రైతులకు ప్రోత్సాహకమివ్వని ప్రభుత్వం 12 సంవత్సరాలు గడిచిన అందని వైనం ఒక్క కోలారు జిల్లాకు రూ. 5.60 కోట్ల బకాయి కోలారు : పట్టు రైతులకు ప్రోత్సాహక ధనం ప్రకటించిన రాష్ర్ట ప్రభుత్వం ఏడాది గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఒక్క కోలారు జిల్లాలోని పట్టు రైతులకు రూ. 5.60కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం. కోలారు జిల్లాలో ఐదారు దశాబ్ధాలుగా పట్టుపరిశ్రమపై రైతులు ఆధారపడ్డారు. జిల్లాలోని వాతావరణ పరిస్థితులు పట్టు పరిశ్రమకు అనుకూలంగా ఉండడంతో అధిక శాతం రైతులు దీనిపై ఆధారపడ్డారు. ఇక్కడ పండించే పట్టులో బైవోల్టిన్, సీఆర్ఆర్, కోలార్ గోల్డ్ రకం ప్రఖ్యాతి గాంచాయి. జిల్లాలోని ఐదు తాలూకాల్లో 15,447 హెక్టార్లలో పట్టు పరిశ్రమ విస్తరించి ఉంది. కోలారు తాలూకాలోని 1,531 గ్రామాలలో 22,815 మంది రైతులు పట్టు పురుగులను పెంచుతున్నారు. వీరిలో 1,580 మంది మహిళా రైతులు ఉన్నారు. 2,045 మంది ఎస్సీలు, 879 మంది ఎస్టీలు, 54 మంది వికలాంగులు, 284 మంది మైనారిటీలు పట్టుపరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టుపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించడంతో పట్టు గూళ్ల ధరలు గణనీయంగా పడిపోయి రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. మరో వైపు చైనా పట్టు దిగుమతి అధికం కావడంతో పట్టు రైతు మరింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దీంతో రైతులను ఆదుకునేందుకు మిశ్రతలి పట్టు కిలో ఒక్కంటికి రూ. పది, బైవోల్టిన్ కిలో ఒక్కంటికి రూ. 30 చొప్పున ప్రోత్సాహకాన్ని 2013లో అప్పటి రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. ఇది రైతులకు కాస్త ఉపశమనం కలిగించింది. గత బడ్జెట్లో ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని పెంచింది. మిశ్రతలికి రూ. 30, బైవోల్టిన్కు రూ. 50 చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపు 2014 ఆగస్టు నుంచి అన్వయం కానుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రోత్సాహకం ఇంకా అందకపోవడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడలేక పోతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా 11,551 మెట్రిక్ టన్నుల పట్టును ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో 10,974 మెట్రిక్ టన్నులు మిశ్రతళి పట్టు అయితే, బైవోల్టిన్ 577 మెట్రిక్ టన్నులను మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రభుత్వం బకాయి పడిన ప్రోత్సాహకం వివరాలు తాలూకా పెంపకందార్లు బకాయి (లక్షల్లో) కోలారు 8163 300.00 బంగారుపేట 3213 150.00 మాలూరు 1907 65.00 ముళబాగిలు 4983 16.00 శ్రీనివాసపురం 4549 35.00 మొత్తం 22815 560.00