Siren strike
-
సమ్మె సైరన్!
సాక్షి, చెన్నై : లారీల రవాణా పునరుద్ధరించని పక్షంలో దక్షిణ భారత దేశం వ్యాప్తంగా సమ్మె గంట మోగించాల్సి ఉంటుందని లారీ యజమానుల సంఘం ప్రకటించారు. కావేరి జలాల పంపిణీలో మళ్లీ కర్ణాటక కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించే పనిలో పడింది. ఇక, దేవే గౌడ కర్ణాటకలో దీక్ష చేపట్టడం తమిళనాట విమర్శలకు దారి తీశాయి. ఇక, కావేరి అభివృద్ధిమండలిలో తమిళనాడు ప్రతినిధులుగా ఎవ్వరెవ్వరికి చాన్స్ దక్కనున్నదో అన్న ఎదురు చూపులు పెరిగాయి. కావేరి జల వివాదం జఠిలం అయ్యే కొద్ది రెండు రాష్ట్రాల మధ్య రవాణా పునరుద్ధరణ కష్టతరంగా మారింది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వ బస్సులు ఆ రాష్ట్రంలోకి, ఆ రాష్ట్ర బస్సులు ఇక్కడికి రావడం లేదు. అదే సమయంలో తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో కూడిన వాహనాలు ఆ రాష్ట్రంలోకి వెళ్లడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల మీద ప్రభావం చూపించే విధంగా పరిస్థితులు నెలకొంటుండడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగి ఉన్నాయి. సరకుల లోడులతో వాహనాలు సరిహద్దుల్లో బారులు తీరి ఉండడం ఓ వైపు, వాహనాలు రోడ్డెక్కకుండా షెడ్లకు పరిమితం కావడం మరో వైపు వెరసి ఆయా యజమానుల్లో ఆందోళనలో పడేసి ఉన్నది. దీంతో దక్షిణభారత లారీ యజమానుల సంఘం హొసూరులో శనివారం సమావేశం అయింది. రెండు రాష్ట్రాల మధ్య రవాణా పునరుద్దరించాలని,లారీలు, సరకు వాహనాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధం అయ్యారు. రెండు రోజుల్లో లారీల రవాణా పునరుద్ధరించని పక్షంలో ఈనెల ఐదో తేదీ నుంచి సమ్మె సైరన్ మోగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంగా ఆ సంఘం నేత షణ్ముగప్ప మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్యవర్తకం ఆగి ఉండడంతో రోజుకు ఐదు వేల కోట్ల మేరకు వరక్తం ఆగి ఉండడంతో, ఆగిన వర్తకం కారణంగా తాము కోట్లాది రూపాయాల్ని నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వాహనాలకు నిరసన కారుల కారణంగా దెబ్బ తిన్నాయని, వీటన్నింటికీ నష్ట పరిహారం చెల్లించాలని, రవాణా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ , ఐదో తేదీ నుంచి లారీల సమ్మెకు నిర్ణయించామన్నారు. లారీ యాజమన్యాలు ఓ వైపు హెచ్చరించే పనిలో పడితే, మరో అన్నదాతలకు మళ్లీ మొండి చేయి మిగిల్చే విధంగా కర్ణాటక కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించే పనిలో పడింది. మళ్లీ ఉల్లంఘన : శనివారం నుంచి ఆరో తేదీ వరకు తమిళనాడుకు సెకనుకు ఆరు వేల గణపుటడుగుల మేరకు నీటిని విడుదల చేయాల్సిందేనని కర్ణాటక సర్కారుకు శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఉత్తర్వుల్ని అమలు చేయకుండా ఉల్లంఘించే పనిలో అక్కడి పాలకులు పడ్డారు. దీంతో కావేరిలో నీరు కాన రావడం లేదు. ఇదే చివరి హెచ్చరిక అని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కర్ణాటక పాలకులు పెడచెవిన పెడుతుండటం తమిళనాట మరింత ఆక్రోశాన్ని రగుల్చుతున్నది. దేవేగౌడ తీరుపై విమర్శలు : సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, తమిళనాడుకు నీటి విడుదలను అడ్డుకునే విధంగా మాజీ ప్రధాని దేవే గౌడ బెంగళూరులో దీక్ష చేపట్టడం తమిళనాట విమర్శలు బయలు దేరాయి. బాధ్యత గల పదవిలో గతంలో పనిచేసిన దేవేగౌడ లాంటి వాళ్లు ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించే పనిలో రాజకీయ పక్షాల నాయకులు ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత ఇలగణేషన్ పేర్కొంటూ, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సొంత ప్రయోజనాలు, రాజకీయలబ్ధికి ప్రయత్నిస్తున్నట్టుందని మండి పడ్డారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ పేర్కొంటూ, అదృష్టం లేదా దురదృష్టం వెరసి దేవే గౌడ గతంలో ప్రధాని అయ్యారని , అయితే, ఆ పదవికి మచ్చ చేకూర్చే విధంగా ఆయన ఒక్క రాష్ట్రం కోసం దీక్షలో కూర్చోవడం విడ్డూరంగా ఉందని మండి పడ్డారు. నిపుణులు ఎవ్వరో : కావేరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు సంబంధించి సుప్రీం కోర్టు వచ్చిన గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నది. దీంతో ఆ మండలిలో నిపుణులుగా రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు ఎవ్వరెవ్వరు ఉంటారో అన్న ఎదురు చూపులు పెరిగాయి. కరుణానిధి స్పందిస్తూ, త్వరితగతిన అభివృద్ధి మండలి ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. -
రామన్‌పాడులో సమ్మె సైరన్
- నేటినుంచి పెండింగ్ జీతాల కోసం ఆందోళనలకు సిద్ధమవుతున్న కార్మికులు - శుక్రవారం అర్ధరాత్రి నుంచి మోటార్లు బంద్ - 130 గ్రామాలకు నిలిచిపోనున్న నీటి సరఫరా గోపాల్పేట : అచ్చంపేట రక్షిత మంచినీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సమ్మె సైరన్ మోగిస్తున్నారు. పెండింగ్ జీతాల కోసం శుక్రవారం అర్ధరాత్రి నుంచి పంప్‌హౌసుల్లో మోటార్లు బంద్ చేసి సరఫరాను నిలిపివేయనున్నారు. దీంతో రామన్‌పాడు హెడ్‌వర్క్ నుంచి పూర్తి స్థాయిల్లో సరఫరా స్తంభించిపోయి వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని సుమారు 130 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇటీవల పలుచోట్ల లీకేజీలు, పగిలిన చోట మరమతు పనులు పూర్తి చేసి గురువారం నుంచి సరఫరాను పునరుద్ధరించారు. తిరిగి శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీంతో 130 గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తీవ్రతరమైంది. 4 నెలల పెండింగ్ జీతాలు, పీఎఫ్ అమలు చేయాలని, లేకుంటే అగస్టు 1 నుంచి సమ్మె చేస్తామని ముందస్తుగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు రామన్‌పాడు కార్మికులు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో సమ్మె చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు. రామన్‌పాడు మంచినీటి పథకంలో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులకు ఏప్రిల్ నుంచి జూలై వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఎఫ్ అమలు కావడంలేదు. గతంలో కార్మికుల జీతాలు, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మోటార్లు బంద్ చేసి పంప్‌హౌస్‌లకు తాళాలు వేసి ఆందోళనలకు దిగారు. ప్రతిసారి కార్మికులు ఆందోళనలు చేయడం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడడం.. ఆ తర్వాత గడువు ఇచ్చి జీతాలు చెల్లించడం జరుగుతుంది. ఇలా రోజుల తరబడి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాసిరకం పైపులతో తరుచూ సరఫరాను నిలిపివేస్తుండడంతో దీనిపైనే ఆదారపడిన ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. నిధులు మంజూరు కాలేదు జీతాల కోసం కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలుసు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి పథకాల మెయింటెనెన్స్‌కు నిధులు విడుదల కాలేదు. కాబట్టి ఏప్రిల్ నుంచి కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. కనీసం కాంట్రాక్టర్‌ను ఒప్పించి సరఫరా ఆగకుండా చూడాలి. -రాములుగౌడు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ -
మునిసిపాలిటీల్లో సమ్మె సైరన్
ఏలూరు : మునిసిపాలిటీల్లో శుక్రవారం నుంచి సమ్మె సైరన్ మోగనుంది. జిల్లాలోని మునిసిపల్ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనబాట పట్టేందుకు సమాయత్తమయ్యూరు. అపరిష్కృత డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు దిగగా.. అప్పట్లో ప్రభుత్వం చర్చలు జరిపి ఆందోళనను తాత్కాలికంగా విరమింపచేసింది. అప్పటినుంచీ హామీ లు నెరవేర్చకపోవడం, ఆ తరువాత ప్రభుత్వం మారటం, ఈనెల 11 మునిసిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. డిమాండ్లు ఇవీ నగరపాలక, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మధ్యంతర భృతి, రూ.13 వేల కనీస వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, స్కూల్ స్వీపర్లను ఫుల్‌టైమ్ వర్కర్స్‌గా గుర్తిం చడం, 010 పద్దు ద్వారా జీతాలు చెల్లింపు, ట్రైసైకిళ్లతో చెత్త సేకరించే వారికి కనీసం వేతనం రూ.6,700 చెల్లింపు, ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు నిర్ణయించి అమలు చేయాలన్న 14 డిమాండ్లతో సమ్మె చేపడుతున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం మునిసిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కుంటిసాకులతో కాలయాపన చేస్తూ వారిని పట్టించుకోవడం లేదని ఏపీ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయూస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బి.సోమయ్య, ఏఐటీయూసీ నాయకుడు బండి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగులు, కార్మికుల డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, స్కూల్స్, లైబ్రరీల్లో పనిచేస్తున్న స్వీపర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.