క్యారమ్ జట్టు మేనేజర్‌గా మదన్‌రాజ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్నేషనల్ చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ క్యారమ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టు మేనేజర్‌గా ఎస్.మదన్‌రాజ్ నియమితులయ్యారు. ఈ పోటీలు ఈనెల 21 నుంచి 23 వరకు హర్యానాలోని గుర్గావ్లో జరుగుతాయి. పురుషులు, మహిళల విభాగాల్లో మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయి.
మదన్‌రాజ్ ప్రస్తుతం హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయన జీహెచ్ఎంసీలో పని చేస్తున్నారు. ఈటోర్నీలో 11 దేశాలు పాల్గొంటాయి. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో స్విస్ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో భారత్, అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, పోలండ్, మాల్దీవులు, శ్రీలంక, మలేసియా, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, కెనడా జట్లు పాల్గొంటున్నాయి.