Smart town
-
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్
-
మధ్యతరగతి ప్రజలకు శుభవార్త
-
Jagananna Smart Town Scheme: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికా బద్ధంగా ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల (ఎంఐజీ – మిడిల్ ఇన్‌కం గ్రూప్ లేఔట్లు) నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికకు బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ప్లాట్లకు ఉన్న డిమాండ్‌ను తెలుసుకోవడం కోసం నిర్వహించిన ప్రాథమిక సర్వేకు అపూర్వ స్పందన లభించింది. ఈ పథకం కింద ప్లాట్ పొందడానికి 3.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. స్మార్ట్ టౌన్ షిప్ లే ఔట్లు అన్నీ ఒకే విధంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఔట్లను ప్రభుత్వం లబ్ధిదారులను సరసమైన ధరలకు అందించనుంది. లేఔట్లకు భూసేకరణ, ప్లాట్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక.. ఇలా ప్రతి దశలో పారదర్శకతతో వ్యవహరిస్తుంది. జిల్లా స్థాయి కమిటీల నుంచి వచ్చిన స్థలాల వివరాలు, లేఔట్ల ఏర్పాటు, ఇతర ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ స్క్రూటినీ చేసి ఆమోదిస్తుంది. జిల్లాల్లో స్మార్ట్ టౌన్లకు అవసరమైన భూమిని అంచనా వేయడం, మార్గదర్శకాల మేరకు భూమిని గుర్తించడం, ప్లాట్లను నిర్మించడం జిల్లా కమిటీల బాధ్యత అని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలతో లేఔట్లు ► డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో మూడు కేటగిరీల్లో ప్లాట్లు. ► లేఔట్లలో 60 అడుగులు బీటీ, 40 అడుగులు సీసీ రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం. నీటి నిల్వ, సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు. ► అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్‌లు, ఇతర వసతుల కల్పన. ► నగరాలు, పట్టణాల్లోని మార్కెట్ విలువ, లేఔట్‌కు చుట్టుపక్కల ఉన్న ఇతర లేఔట్ల ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయిస్తుంది. ► అనంతరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి ధరల్లో మార్పులు చేర్పులు చేస్తూ ప్రతిపాదనలు అందితే రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదిస్తుంది. ఇవీ అర్హతలు ► ఒక కుటుంబానికి ఒకే ప్లాట్ ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వార్షిక ఆదాయం రూ.18 లక్షల లోపు ఉండాలి. ► 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ► లబ్ధిదారుడు ఏపీలో నివసిస్తూ ఉండాలి. ► ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్లాట్ల కేటాయింపు ఇలా.. ► డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) రూపొందించిన వెబ్సైట్లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా స్థానిక వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ► ప్లాట్ అమ్మకం ధరపై 10 శాతం మొత్తాన్ని దరఖాస్తు సమయంలో ఆర్టీజీఎస్/ఎన్ఈఎఫ్టీ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ► లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు ప్లాట్ పొందలేకపోతే లాటరీ అనంతరం నెల రోజులకు దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని వెనక్కు ఇస్తారు. చెల్లింపులు ఇలా.. ► ప్లాట్ పొందిన దరఖాస్తుదారులు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించాలి. ► అగ్రిమెంట్ కుదుర్చుకున్న నెల రోజులకు 30 శాతం, ఆరు నెలలలోపు మరో 30 శాతం, ఏడాది లోపు మిగతా 30 శాతం చెల్లించాలి. ఒక నెలలోపు ప్లాట్ అమ్మకం మొత్తాన్ని చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇస్తారు. వాయిదా చెల్లించడంలో ఆలస్యం అయితే 0.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. -
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు ప్రభుత్వ భూముల సేకరణ
సాక్షి, అమరావతి: మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికాబద్ధమైన ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల (ఎంఐజీ లేఅవుట్లు) నిర్మాణానికి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి భూములను గుర్తించి ముందస్తుగా మునిసిపల్ శాఖకు అప్పగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. విధివిధానాలను ఖరారు చేస్తూ మంగళవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ సంస్థలు, శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు ప్రజోపయోగం కోసం గతంలో సేకరించి అందుకు ఉపయోగించకుండా ఉన్న భూములను సేకరించాలని ఆదేశించారు. స్మార్ట్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ఉపయోగపడే ఇలాంటి భూములను క్రమబద్ధీకరించి మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖకు నేరుగా ఇచ్చే అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అలాంటి భూముల వివరాలను సీసీఎల్ఏకు పంపాలని కలెక్టర్లకు సూచించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి కోసం మాత్రమే కలెక్టర్లకు ఈ అధికారాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేవదాయ, వక్ఫ్, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంబంధిత భూములు, పర్యావరణ సున్నితమైన భూములను ఈ సేకరణ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. చెరువు, కాలువ కట్టలు, నీటి వనరులున్న భూములు, అడవులతో నిండిన కొండ ప్రాంతాలతోపాటు అభ్యంతరకరమైన ప్రభుత్వ పోరంబోకు, కమ్యూనిటీ పోరంబోకు భూములను సైతం సేకరించవద్దని ఆదేశించారు. మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా, అన్ని సౌకర్యాలతో కూడిన నివాస స్థలాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనుంది. -
జగనన్న స్మార్ట్ టౌన్స్ ఎంఐజీ లే అవుట్లకు ప్రభుత్వ భూములు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దిశగా మరో ముందడుగు వేసింది. జగనన్న స్మార్ట్ టౌన్స్ ఎంఐజీ గృహాల లే అవుట్లకు ప్రభుత్వ భూములు కేటాయించింది. వివిధ శాఖల పరిధిలోని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను మున్సిపల్ శాఖకు అప్పగించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అన్ని వసతులతో లేఅవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా ప్లాట్లు విక్రయించే ఈ ప్రాజెక్టు పట్ల మధ్యతరగతి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న డిమాండ్ సర్వేనే అందుకు నిదర్శనం. ఏప్రిల్ నెల 1 నుంచి 10 వరకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన డిమాండ్ సర్వేలో ఏకంగా 2,32,369 ప్లాట్లకు ఆసక్తి కనబరచడం విశేషం. వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఈ డిమాండ్ సర్వే నిర్వహించారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు చొప్పున మాత్రమే సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. -
స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుకు అనూహ్య స్పందన
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అన్ని వసతులతో లేఅవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా ప్లాట్లు విక్రయించే ఈ ప్రాజెక్టు పట్ల మధ్యతరగతి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న డిమాండ్ సర్వేనే అందుకు నిదర్శనం. ఈ నెల 1 నుంచి 10 వరకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన డిమాండ్ సర్వేలో ఏకంగా 2,32,369 ప్లాట్లకు ఆసక్తి కనబరచడం విశేషం. వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఈ డిమాండ్ సర్వే నిర్వహించారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు చొప్పున మాత్రమే సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఊహించిన దానికంటే అధికంగా డిమాండ్ స్మార్ట్టౌన్ల పట్ల రాష్ట్రంలో పట్టణ ప్రాంత ప్రజల నుంచి ఊహించిన దానికంటే భారీ డిమాండ్ వ్యక్తమవుతోంది. డిమాండ్ సర్వేకు చివరి రోజు అని ముందుగా ప్రకటించిన ఒక్క ఆదివారమే ఏకంగా 74 వేల ప్లాట్లకు ప్రజల నుంచి సుముఖత వ్యక్తం కావడం విశేషం. ► ఒక్కోటి 150 చ.గజాల విస్తీర్ణం ఉండే 76,018 ప్లాట్ల కోసం ఆసక్తి వ్యక్తమైంది. ► ఒక్కోటి 200 చ.గజాల విస్తీర్ణం ఉండే 77,247 పాట్ల కోసం సానుకూలత చూపారు. ► 240 చ.గజాల విస్తీర్ణం ఉండే 79,104 ప్లాట్ల కోసం ఆసక్తి చూపారు. డిమాండ్ సర్వే పొడిగింపు వరుస సెలవులు రావడంతో డిమాండ్ సర్వేను పొడిగించాలని పలువురు పురపాలక శాఖను కోరారు. దీంతో సర్వేను ఈ నెల 20 వరకు పొడిగించినట్టు రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ వి.రాముడు తెలిపారు. డిమాండ్ సర్వే అనంతరం తదుపరి కార్యాచరణ డిమాండ్ సర్వే పూర్తి చేశాక స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుపై పురపాలక శాఖ తుది అంచనాకు వస్తుంది. దాని ప్రకారం భూసేకరణ నిర్వహిస్తారు. అనంతరం నోటిఫికేషన్ జారీ చేసి ప్లాట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, నిబంధనలు, ప్లాట్ల కేటాయింపు విధివిధానాలను ఆ నోటిఫికేషన్లో ప్రకటిస్తారు. -
ఇక స్మార్ట్టౌన్లకు భూసేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్మార్ట్టౌన్ల భూసేకరణకు పురపాలక శాఖ సమాయత్తమవుతోంది. లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లను మధ్యతరగతి వర్గాలకు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు పట్ల రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా స్మార్ట్టౌన్ల ప్రాజెక్టును చేపట్టేందుకు పురపాలక శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇప్పటికే మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో నిర్వహిస్తున్న డిమాండ్ సర్వే అంచనాల ప్రకారం ఎంత భూమి అవసరమవుతుందో ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీంతో అవసరమైన మేర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో స్మార్ట్‌టౌన్లలో స్థలాల కోసం దరఖాస్తుదారుల అర్హతలు, భూసేకరణకు మార్గదర్శకాలతో పురపాలక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించాకే ఆమోదం ► భూసేకరణకు జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మెట్రోపాలిటన్ కమిషనర్/పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, సంబంధిత మునిసిపల్ కమిషనర్, ఎస్ఈ (ప్రజారోగ్య శాఖ), జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ► రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని నియమించారు. ఇందులో ఏపీ టిడ్కో ఎండీ, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్, గృహనిర్మాణ సంస్థ వైస్ చైర్మన్ సభ్యులు. ► జిల్లాల్లో స్మార్ట్టౌన్లకు అవసరమైన భూమిని అంచనా వేయడం, మార్గదర్శకాల మేరకు భూమిని గుర్తించడం జిల్లా కమిటీల బాధ్యత. ► జిల్లా కమిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ సమీక్షిస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీలో కనీసం ఇద్దరు సభ్యులు ఆ భూములను ప్రత్యక్షంగా పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆ భూములు ఉన్నాయో, లేదో నిర్ధారించాలి. రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించాకే జిల్లా కలెక్టర్లు భూసేకరణ ప్రక్రియ చేపడతారు. మూడు కేటగిరీలుగా ప్లాట్లు ► డిమాండ్ అంచనాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా కేంద్రాల్లో 150 ఎకరాలు/200 ఎకరాలు/250 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేస్తారు. ► మునిసిపాలిటీల్లో 50 ఎకరాలు/100 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేయాలని నిర్ణయించారు. ► ఇక స్మార్ట్‌టౌన్లలో మూడు కేటగిరీల ప్లాట్లతో లేఅవుట్లు వేస్తారు. 150 చ.గజాల్లో మధ్య ఆదాయ వర్గం (ఎంఐజీ), 200 చ.గజాల్లో ఎంఐజీ–1, 240 చ.గజాల్లో ఎంఐజీ–2 ప్లాట్ల డిజైన్ రూపొందించారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షలు స్మార్ట్‌టౌన్లలో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఒక కుటుంబం ఒక ప్లాట్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. భూసేకరణకు మార్గదర్శకాలు.. ► వివాదాస్పదంకాని భూములనే ఎంపిక చేయాలి. ► భూముల ఎంపికలో మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ► డిమాండ్ ఉన్న ప్రాంతంలో, తగినంత ఎత్తులో ఉన్న భూములకు ప్రాధాన్యమివ్వాలి. ► గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాంతాల్లోనే ఎంపిక చేయాలి. ► పాఠశాలలు, రవాణా, వైద్య వసతులు అందుబాటులో ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలి. ► మునిసిపాలిటీల్లో అయితే గరిష్టంగా 3 కి.మీ., కార్పొరేషన్లలో అయితే గరిష్టంగా 5 కి.మీ. దూరంలో ఉన్న భూములను ఎంపిక చేయాలి. ► ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపట్టిన ప్రాంతాలకు సమీపంలో ఉంటే మంచిది. ► మౌలిక వసతుల కల్పన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ‘జగనన్న కాలనీ’లకు సమీపంలో ఉండేటట్టుగా చూడాలి. ► భవిష్యత్‌లో కూడా విస్తరణకు అవకాశం లేని ప్రాంతాలను ఎంపిక చేయకూడదు. ► ఆ భూములకు అప్రోచ్ రోడ్ తప్పనిసరిగా ఉండాలి. ► నిర్మాణాలకు అనువుగా లేని నేలలను ఎంపిక చేయకూడదు. ► చెరువులు, ఇతర నీటి వనరులకు సమీపంలో ఉన్న భూములను ఎంపిక చేయొద్దు. ► భూగర్భ జలాలు తగినంతగా ఉండి, తాగునీటి వసతి ఉన్న ప్రాంతంలోని భూములనే ఎంపిక చేయాలి. -
‘స్మార్ట్ టౌన్ల’కు యమా క్రేజ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నగరాలు, పట్టణాల్లో అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లను లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటన పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. మిడిల్ ఇన్‌కం గ్రూప్(ఎంఐజీ) కేటగిరీలో 150 చదరపు గజాలు, 200 చదరపు గజాలు, 240 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్లను విక్రయించనున్న లే అవుట్లపట్ల పట్టణ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పురపాలక శాఖ సర్వే చేపట్టింది. వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకుని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించి ఈ నెల 10లోగా సర్వే పూర్తి చేయాలని పేర్కొంది. ఇప్పటికే చాలావరకు పూర్తయిన సర్వేలో ప్రజల అభిప్రాయం ప్రస్ఫుటమైంది. మాకు ప్లాట్లు కావాలి అంటే మాకు కావాలంటూ ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతమున్న డిమాండ్‌కు అనుగుణంగా దాదాపు ఐదువేల ఎకరాల్లో లేఅవుట్లు వేయాల్సి ఉంటుందని పురపాలక శాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. డిమాండే డిమాండ్ స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టుపై ప్రస్తుతం మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 50 వేల కుటుంబాలు ఎంఐజీ ప్లాట్లు కొనుగోలుకు తమ సంసిద్ధతను తెలిపాయి. ఇందులో 150 చ.గజాల ప్లాట్లు కావాలని 16,200 కుటుంబాలు, 200 చ.గజాల ప్లాట్లు కోసం 14,200 కుటుంబాలు, 240 చ.గజాల ప్లాట్లు కావాలని 19,600 కుటుంబాలు కోరాయి. ఏప్రిల్ పది నాటికి ఈ సర్వే పూర్తి కానుండగా.. మరో పదివేల ప్లాట్ల వరకు డిమాండ్ వస్తుందని పురపాలక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఐదువేల ఎకరాలు అవసరం.. ఇంతవరకు నిర్వహించిన సర్వే ప్రకారం 50 వేల ప్లాట్లకు కనీసం 4,100 ఎకరాలు అవసరమవుతాయని పురపాలక శాఖ అధికారులు నిర్ధారించారు. ఏప్రిల్ 10 నాటికి మొత్తం పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే పూర్తి చేసేసరికి దాదాపు 60 వేల ప్లాట్ల వరకు డిమాండ్ లెక్క తేలుతుందని భావిస్తున్నారు. ఆ ప్రకారమైతే ఐదువేల ఎకరాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. నిబంధనలను పాటిస్తూ అన్ని వసతులతో లేఅవుట్లు వేయనున్న సంగతి తెలిసిందే. విశాలమైన రోడ్లు, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ కేబుళ్లు, గ్రీనరీ మొదలైన అన్ని వసతులు కల్పిస్తారు. సర్వే పూర్తయ్యాక మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల వారీగా అవసరమైన భూసేకరణపై దృష్టి సారిస్తారు. దీనికోసం ఇప్పటికే జాయింట్ కలెక్టర్(రైతు భరోసా, రెవెన్యూ) అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలను కూడా నియమించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టులో ప్లాట్ల కొనుగోలుకు పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. లిటిగేషన్లు లేకుండా అన్ని వసతులతో ప్రభుత్వం లే అవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు విక్రయించనుండటమే అందుకు కారణం. సర్వే పూర్తయ్యాక భూసేకరణ అంశంపై కార్యాచరణ చేపడతాం. –వి.రాముడు, డైరెక్టర్, రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం, పురపాలక శాఖ -
‘జగనన్న స్మార్ట్ టౌన్’కు దరఖాస్తు చేసుకోండి
పటమట(విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోందని, ఈ మేరకు జగనన్న స్మార్ట్ టౌన్ పథకం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 5 కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉండేలా ఇంటి స్థలాలను అందించనుందని వీఎంసీ కమిషనర్ ప్రసన్నవెంకటేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని వసతులతో ఈ స్థలాలను అభివృద్ధి చేసి అందించనున్నట్టు వివరించారు. రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షలలోపు సంవత్సరాదాయం కలిగిన వారందరూ(ప్రభుత్వ ఉద్యోగులు కూడా) ఈ పథకానికి అర్హులని, 150 చదరపు గజాల స్థలం పొందాలంటే రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు, 200 చదరపు గజాలకు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షలు, 240 చదరపు గజాల స్థలానికి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలు సంవత్సరాదాయం ఉండాలని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది ఈనెల 6,7 తేదీల్లో డిమాండ్ సర్వే నిర్వహిస్తారని, అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. చదవండి: ఓపీఎం వెనుక డ్రగ్ మాఫియా! ‘ఉప ఎన్నికనూ బహిష్కరిద్దామా.. సార్!’ -
స్మార్ట్ టౌన్ల ప్రాజెక్ట్ టేకాఫ్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులతో లే అవుట్లను లాభాపేక్ష లేకుండా అందించేందుకు ఉద్దేశించిన స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టు వేగంగా సిద్ధమవుతోంది. విస్తరిస్తున్న నగరాలు, పట్టణాల్లో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. అనధికారిక, సరైన మౌలిక వసతులులేని లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఊరట కలిగించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పురపాలక శాఖ పూర్తి వసతులతో లే అవుట్లను అభివృద్ధి చేసిందుకు ‘స్మార్ట్ టౌన్ల’ ప్రాజెక్టును రూపొందించింది. ప్రతి పట్టణ స్థానిక సంస్థ పరిధిలో ఒకటి చొప్పున స్మార్ట్ టౌన్ల లే అవుట్లు అభివృద్ధి చేస్తారు. పట్టణ స్థానిక సంస్థ జనాభాను బట్టి ఒక్కో లే అవుట్ 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఉండాలని నిర్ణయించారు. ► విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో 200 ఎకరాలు చొప్పున లేఅవుట్లు వేస్తారు. ► మిగిలిన 14 కార్పొరేషన్లలో 100 ఎకరాల చొప్పున లేఅవుట్లు రూపొందిస్తారు. ► 13 స్పెషల్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీలలో 75 ఎకరాల చొప్పున లే అవుట్లు అభివృద్ధి చేస్తారు. 63 గ్రేడ్ 1, గ్రేడ్ 2.. గ్రేడ్ 3 మున్సిపాలిటీలలో 50 ఎకరాల చొప్పున లేఅవుట్లు వేస్తారు. ► 31 నగర పంచాయతీల్లో 25 ఎకరాల చొప్పున లేఅవుట్లు నిర్మిస్తారు. రెండు కేటగిరీల కింద స్థలాలు స్మార్ట్ టౌన్ లే అవుట్లలో రెండు కేటగిరీల కింద స్థలాలు కేటాయిస్తారు. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (ఎంఐజీ)–1 కేటగిరీ కింద 200 చ.గజాలు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్(ఎంఐజీ)–2 కేటగిరీ కింద 240 చ.గజాల విస్తీర్ణంలో స్థలలతో లే అవుట్లు వేస్తారు. స్మార్ట్ టౌన్లలో కల్పించే వసతులు.. ► లే అవుట్లో రోడ్లకు 30 శాతం, ఓపెన్ స్పేస్‌కు 10 శాతం, మౌలిక వసతుల కల్పనకు 5 శాతం, యుటిలిటీస్‌కు 1 శా>తం, పేదల ప్లాట్ల కోసం 5 శాతం భూమిని కేటాయిస్తారు. ► కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం, షాపింగ్ సెంటర్, బ్యాంక్, వార్డు సచివాలయం, అంగన్వాడీ కేంద్రం, మార్కెట్, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలాలకు భూములు కేటాయిస్తారు. ► నీటి సరఫరా, ఓవర్‌హెడ్ ట్యాంక్, వీధి దీపాలు, డ్రైనేజ్, విద్యుత్ సబ్‌స్టేషన్, ప్లాంటేషన్, సోలార్ ప్యానళ్లు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. భూముల ఎంపికకు మార్గదర్శకాలు ఇవీ... ప్రజల అన్ని అవసరాలకు అందుబాటులో ఉండే ప్రాంతంలోని భూములనే స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టుకు ఎంపిక చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. భూ సేకరణ కోసం రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలకు నిర్దేశించిన మార్గదర్శకాలు ఇవీ... ► మున్సిపల్ కార్పొరేషన్లలో గరిష్టంగా 5 కి.మీ. పరిధిలోపు, మున్సిపాలిటీలలో గరిష్టంగా 3 కి.మీ. పరిధిలోపు ఉన్న భూములను ఎంపిక చేయాలి. ► ఉపాధి అవకాశాలు ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలి. ► పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతంలో భూములను గుర్తించాలి. ► వివాదాస్పదం కాని భూములను ఎంపిక చేయాలి. ► ఎంపిక చేసిన భూములకు ఇప్పటికే అప్రోచ్ రోడ్డు ఉండాలి. ► సరైన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి అనువుగా భూములను ఎంపిక చేయాలి. ► చెరువులు, నీటి వనరుల సమీపంలో ఉన్న భూములను ఎంపిక చేయకూడదు. ► భూగర్భ జలాలు తగినంతగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలి. ► జగనన్న కాలనీలకు సమీపంలో ఉండే ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలి. అన్ని వసతులతో స్మార్ట్ టౌన్లు – వి.రాముడు, డైరెక్టర్, రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం ‘పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అనధికారిక లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి సామాన్యులు మోసపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించింది. అన్ని వసతులతో కూడిన లే అవుట్లలో స్థలాలను లాభాపేక్ష లేకుండా ప్రజలకు అందించనున్న ఈ ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తెస్తాం’ -
సామాన్యుల కోసం ‘స్మార్ట్ టౌన్లు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ టౌన్ల ఏర్పాటు, వాటి అభివృద్ధికి పురపాలక శాఖ కార్యాచరణకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణం, నగర పంచాయతీలలో భూములను సేకరించి లే–అవుట్లు వేయడం.. వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా సరసమైన ధరకు సామాన్యులకు ప్లాట్లను అందించేందుకు ఉద్దేశించిన ‘స్మార్ట్ టౌన్’ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్‌ను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 125 పట్టణాలు, నగరాలు, నగర పంచాయతీలను జనాభా ప్రాతిపదికన ఐదు కేటగిరీలుగా విభజించి స్మార్ట్ టౌన్లను తీర్చిదిద్దాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. మొదటి దశలో 12 పట్టణాల్లో 18 లే–అవుట్లను అభివృద్ధి చేస్తారు. అనంతరం అన్నిచోట్లా స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టులను చేపడతారు. ప్రత్యేక సెల్స్ ఏర్పాటు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే స్మార్ట్ టౌన్ ప్రాజెక్టులను విజయవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయిలోనూ, పురపాలక సంఘాల స్థాయిలోనూ ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా భూ రికార్డుల పరిశీలన కోసం ప్రత్యేకంగా రెవెన్యూ, న్యాయ అధికారులతో లీగల్ సెల్స్‌ను నెలకొల్పుతారు. ఇప్పటికే వివిధ టిడ్కో, గృహ నిర్మాణ శాఖ తదితర విభాగాల వద్ద అందుబాటులో ఉన్న భూములను పరిశీలిస్తారు. ఇంకా అవసరమైన భూముల కోసం భూ యజమానులు, క్రెడాయ్ వంటి సంస్థలు, ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతారు. భూ సేకరణ ప్రక్రియ నుంచి పూర్తిస్థాయిలో లే–అవుట్ల అభివృద్ధి, భూ యజమానులకు ప్లాట్ల పంపిణీ, లాభాపేక్ష లేకుండా సామాన్యులకు ప్లాట్ల విక్రయం వరకూ అన్ని అంశాలను ఈ సెల్స్ పర్యవేక్షిస్తాయి. నిర్ణీత కాలవ్యవధిలో స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టులను పూర్తి చేసి నగరాలు, పట్టణాల ప్రణాళికాబద్ధ అభివృద్ధికి పురపాలక శాఖ చర్యలు వేగవంతం చేసింది. ప్రాజెక్టుల స్వరూపం ఇలా.. ఒక్కో స్మార్ట్ టౌన్ ప్రాజెక్ట్ లే–అవుట్ 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న విశాఖ, విజయవాడ నగర పాలక సంస్థల పరిధిలో 200 ఎకరాల చొప్పున ప్రాజెక్టులు చేపడతారు. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న 14 నగరపాలక సంస్థల్లో 100 ఎకరాల చొప్పున సేకరించి స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తారు. 6 సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 7 స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలలో 75 ఎకరాల చొప్పున సేకరించి లే–అవుట్లు వేస్తారు. 17 గ్రేడ్–1 మున్సిపాలిటీలు, 30 గ్రేడ్–2 మున్సిపాలిటీలు, 18 గ్రేడ్–3 మున్సిపాలిటీలలో 50 ఎకరాల చొప్పున భూములు సేకరించి లే–అవుట్లు వేస్తారు. అదేవిధంగా 31 నగర పంచాయతీలలో 25 ఎకరాల చొప్పున సేకరించి లే–అవుట్లు అభివృద్ధి చేస్తారు. -
ఆ భవనానికీ స్మార్ట్ టౌన్ హోదా!
న్యూఢిల్లీ: టర్కీ తర్వాత ఒక దేశ ప్రథమ పౌరుడు నివసించే అతి పెద్ద నివాసంగా పేరొందిన రాష్ట్రపతి భవన్ త్వరలో స్మార్ట్ టౌన్‌షిప్‌గా మారనుంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్ (ఐబీఎమ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఈ మేరకు భవన్లో చేపట్టబోయే ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ సెంటర్ (ఐఓసీ), 'మానిటర్' పేరుతో తయారుచేసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్లను ప్రారంభించారు. ఈ అప్లికేషన్‌ను ఉపయోగించి నీటి నిర్వహణ, విద్యుత్, చెత్త డిస్పోజింగ్, తోటల నిర్వహణలను పర్యవేక్షించనున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో స్మార్ట్ పట్టణాలను ఎలా నిర్మిస్తారో రాష్ట్రపతి భవన్లో కూడా అదే మోడల్‌ను అనుసరిస్తారు. ఏదైనా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసి వాటిని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ మోడల్ ను రాష్ట్రపతి భవన్ కు అన్వయిస్తారు. నిపుణుల బృందాలు, రాష్ట్రాల పరిపాలన భవనాలు, జిల్లా పరిపాలనా కేంద్రాలతో దీన్ని అనుసంధానిస్తారు.