special powers
-
ఒక హైడ్రా.. ఆరు చట్టాలు!
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)’ను పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు చట్టాలను సవరించడం ద్వారా ‘హైడ్రా’కు ప్రత్యేక అధికారాలు కల్పించాలని నిర్ణయించింది. భూ ఆక్రమణల చట్టం–1905, వాల్టా, ల్యాండ్ రెవెన్యూ చట్టం, మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్, మున్సిపాలిటీస్ యాక్ట్, పంచాయతీరాజ్ చట్టాలను సవరించడం ద్వారా.. కీలక అధికారాలను హైడ్రాకు బదలాయించాలని భావిస్తోంది. ఆ చట్టాల సవరణ కోసం ప్రతిపాదనలు ్చపంపాలని రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. ఆ శాఖలు వెంటనే ప్రతిపాదనలను పంపాయని తెలిసింది. అయితే ఈ సవరణ ప్రతిపాదనలన్నింటినీ కలిపి చట్టం చేయాలా? ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల పరిధిలోనే ఈ సవరణలను అమలు జరపాలా? అన్నదానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. చట్ట సవరణలు కాకుండా హైడ్రా కోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తే బాగుంటుందని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుతానికి సహాయకారి మాత్రమే..ఆక్రమణల కూల్చివేత విషయంలో ‘హైడ్రా’ప్రస్తుతానికి ప్రభుత్వ శాఖలకు సహాయకారిగా మాత్రమే ఉంది. ఆక్రమణల నిర్ధారణ, నోటీసులివ్వడం, చర్యలు తీసుకోవడం, కూల్చివేయడం వంటి అధికారాలేవీ హైడ్రాకు దఖలు పడలేదు. ప్రభుత్వ శాఖలకు అనుబంధంగానే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు చట్టాలను సవరించి ఈ అధికారాలన్నీ నేరుగా హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు రెవెన్యూ శాఖ ఇప్పటికే చట్ట సవరణ ప్రతిపాదనలను పంపింది. ఆక్రమణల విషయంలో నోటీసులు ఇచ్చే అధికారం ఇప్పటివరకు కేవలం తహసీల్దార్‌కు మాత్రమే ఉండగా.. ఇకపై తహసీల్దార్‌తోపాటు హైడ్రాలోని అ«దీకృత అధికారికి కూడా అధికారాలను దఖలు పరుస్తూ రెవెన్యూ చట్టంలో సవరణను ప్రతిపాదించారు.లేదంటే రెవెన్యూ అదీకృత అధికారిని హైడ్రాలోకి తీసుకోవాలని సవరణ ప్రతిపాదనల్లో సూచించినట్టు సమాచారం. అయితే హైడ్రాకు అధికారాల బదలాయింపు కోసం ఆర్డినెన్స్ రూపంలో చట్టం చేయాలా? అసెంబ్లీలో చర్చించి బిల్లు ఆమోదం ద్వారా చట్టం చేయాలా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, ఈ నెల 20వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. స్పష్టత కోసమే ప్రత్యేక చట్టం ‘హైడ్రా’ మనుగడకు ప్రత్యేక చట్టమే ఉపయోగపడుతుంది. చట్టాలకు సవరణలు, ఆ సవరణలతో మరో చట్టం చేసే దాని కంటే హైడ్రాకు ప్రత్యేకంగా చట్టం చేసి మార్గదర్శకాలు రూపొందించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావు. గందరగోళం ఉండదు. న్యాయపరమైన చిక్కులు రావు. ఎన్ఫోర్స్మెంట్తో పాటు చర్యలు తీసుకునే ప్రక్రియ మొత్తాన్ని ఈ చట్టంలో రూపొందించుకోవచ్చు. మరోవైపు చట్టబద్ధత ద్వారా అధికారాన్ని ఏ సంస్థకు బదలాయించినా ఆ సంస్థ బాధ్యత మరింత పెరుగుతుంది. – ఎం.సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణుడు -
దేశమంతటికీ ఒకే రాజ్యాంగం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు, రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 35(ఏ)పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కారణంగా దేశ సార్వభౌమత్వాన్ని నీరుగార్చలేమని దోవల్ వ్యాఖ్యానించడంపై ఆ రాష్ట్ర పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీతోపాటు కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం దోవల్ వ్యాఖ్యలను ఖండించని పక్షంలో.. కేంద్రమే కావాలని ఈ వ్యాఖ్యలు చేయించినట్లుగా భావించాల్సి వస్తుందన్నాయి. మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్‌పై రాసిన ఓ పుస్తకం విడుదల సందర్భంగా దోవల్ మాట్లాడుతూ.. ‘వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేయడంపై మాత్రమే దృష్టిపెట్టలేదు. సంస్థానాలతోపాటు దేశమంతా ఒకటిగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకెళ్లారు. దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రజల సార్వభౌమత్వం దేశమంతటికీ వర్తిస్తుంది. కానీ జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉండడం.. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విభిన్నంగా ఉంది. స్వతంత్ర భారతమంతా ఒకే రాజ్యాంగం, ఒకే జెండా కింద ఉండాలని పటేల్ భావించారు. కానీ అప్పటి కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఇందుకు విభేదించారు’ అని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం చాలామటుకు అహింసాయుతంగా కొనసాగడం వల్ల సరైన వేడి రాజుకోలేదని.. అందుకే దేశ ప్రజలకు స్వాతంత్య్రం విలువ అర్థం కావడం లేదని దోవల్ అభిప్రాయపడ్డారు. -
పంచాయతీల పాలనకు ప్రత్యేకాధికారులు
-
పంచాయతీల పాలనకు ప్రత్యేకాధికారులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు పదవీకాలం ముగిసిన వెంటనే గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించనున్నట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఆగస్టు 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన రానున్న నేపథ్యంలో సోమ వారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు, బాధ్యతలు చేపట్టనున్న ప్రత్యేకాధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసినా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రతీ గ్రామానికి ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తున్నట్టు ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం దేశంలో ఒకేసారి 4 వేలకుపైగా గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు. 4,383 నూతన పంచాయతీలను ఆగస్టు 2న పండగ వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన పంచా యతీ నిధులను, కొత్త పంచాయతీలకు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. మౌలిక సదుపాయాలతోపాటు కొత్త పంచాయతీలకు బోర్డులు ఏర్పాటు చేయడంలాంటి వాటికి నిధులు కేటాయించినట్టు చెప్పారు. కొత్తగా 9,355 మంది పంచాయతీ కార్యదర్శుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాయింట్ అకౌంట్లు తెరవాలి పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారులంతా నూతన పంచాయతీల్లో తక్షణమే పంచాయతీల తరఫున బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్లు తెరవాలని మంత్రి ఆదేశించారు. ప్రతీ గ్రామంలోనూ నర్సరీల ఏర్పాటుతోపాటు ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త పంచాయతీల ఏర్పాటు నేపథ్యంలో న్యాయ నిపుణులు, అధికారులతో చర్చించిన తర్వాతే సర్పంచ్‌లను కొనసాగించలేని పరిస్థితులున్నాయని వివరించారు. ఎన్నికలు జరగకుండా కోర్టుకు ఎవరెళ్లారో అందరికీ తెలుసని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. బీసీ గణనతోపాటు, ఎన్నికలను వీలైనంత వేగంగా నిర్వహించడానికి న్యాయపరంగానూ పోరాడుతామని అన్నారు. సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కేసుల కేటాయింపు’పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపు (రోస్టర్)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక అధికారాలను తొలగించాలన్న పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. కేసుల కేటాయింపు బాధ్యతను ఐదుగురు జడ్జీల కొలీజియంకు అప్పగించాలని కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ వేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఫలానా కేసు తనకు కేటాయించలేదని లేదా ఎందుకు కేటాయించరంటూ కొందరు జడ్జీలు అసంతృప్తికి గురయిన సందర్భాలు కూడా హైకోర్టుల్లో ఉన్నాయని విచారణ సందర్భంగా జడ్జి సిక్రి అన్నారు. పిటిషనర్ తరఫున దుశ్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. సున్నితమైన కొన్ని కేసుల బాధ్యతను కొన్ని బెంచ్‌లకే అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ‘మాస్టర్ రోస్టర్’గా సీజేఐకు అపరిమిత అధికారం ఉన్నట్లు కాదని తెలిపారు. సుప్రీంజడ్జిగా ఇందూ ప్రమాణం సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా(61) సుప్రీం న్యాయమూర్తిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈమె రాకతో సుప్రీంజడ్జీల సంఖ్య 25కు చేరుకుంది. దీంతో న్యాయవాది నుంచి నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె నిలిచారు. సుప్రీం చరిత్రలో ఒకేసారి ఇద్దరు మహిళా జడ్జీలు పనిచేయడం ఇది మూడోసారి. -
అధికారాలు గవర్నర్‌కే ఇవ్వాలి'
-
'హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాలు గవర్నర్‌కే ఇవ్వాలి'
ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ అధికారాలు మొత్తం గవర్నర్‌కు ఉండేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే చట్టాన్ని మార్చి అయినా గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిల్లో నివాసముంటున్న ప్రజలకు భద్రత, ఆస్తులకు రక్షణ చర్యల విషయంలో కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు కమిషనర్లతో సహా, డీసీపీలు, ఏసీపీలు ఇతర అధికారుల నియామకం మొత్తం గవర్నర్ పరిధిలోకి తేవాలన్నారు. రెండు రోజుల కిందట చంద్రబాబు రాసిన ఈ లేఖ ప్రస్తుతం వివాదానికి దారితీసేదిగా మారింది. ఆదివారం రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఈ లేఖ విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు. ‘ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ మొత్తం గవర్నర్ పరిధిలోనే కొనసాగాలి. ఇక్కడి పోలీసు వ్యవస్థ మొత్తం గవర్నర్ పర్యవేక్షణలోనే ఉండాలి. విభజన చట్టంలో దీన్ని స్పష్టంగా పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్‌లలో పోలీసు నియామకాలు, బదిలీలు కూడా గవర్నర్ పరిధిలో ఉండాలి. ఇక్కడి శాంతిభద్రతల వ్యవహారం ఉమ్మడి ప్రభుత్వాలకు సంబంధించిన పోలీసు అధికారుల బాధ్యతగా చేయాలి. నియామకాలు, బదిలీలు, భవనాల కేటాయింపు, వాటి పరిరక్షణ, నిర్వహణ బాధ్యతల్లో రెండు ప్రభుత్వాలకూ సమానాధికారాలు ఉండాలి. విభజన చట్టంలో ఈ అంశాలన్నీ స్పష్టంగా ఉన్నాయి’ అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజల మానప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారని తెలుస్తోంది. -
ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కే పవర్
పోలీసు పోస్టింగ్‌లు, బదిలీలుగవర్నర్ చేతికి.. విభజన చట్టంలో సవరణకు కేంద్రం ముసాయిదా బిల్లు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు,డీజీపీలతో ప్రత్యేక బోర్డుఏర్పాటుకు ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకిస్తూ తిప్పి పంపిన తెలంగాణ సర్కారు రాష్ర్ట హక్కులను కాలరాయడమేనని మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టేందుకు కేంద్రం ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. హైదరాబాద్‌లో పోలీసులపై ఆయనకే పెత్తనం అప్పగించాలని.. వారి పోస్టింగ్‌లు, బదిలీల బాధ్యతలు ఆయనకే ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముసాయిదా ప్రతిని తెలంగాణ సర్కారు తిప్పి పంపింది. పోలీసులపై గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తూ కేంద్రానికి ఘాటుగా లేఖ రాసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇప్పటికే లేఖను కేంద్ర హోంశాఖకు పంపినట్లు తెలిసింది. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు, హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఏదేని విషయంలో తీవ్ర విభేదాలు తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్ జోక్యం చేసుకుని ఆ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విభజన చట్టంలోని సెక్షన్ 8 సూచిస్తోందని ఆ లేఖలో స్పష్టం చేశారు. పాలనాపరమైన నిర్ణయాలు, శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసు శాఖ ఆధునీకరణ తదితర బాధ్యతలన్నీ తెలంగాణ ప్రభుత్వానివేనని తేల్చి చెప్పారు. విభజన చట్టానికి మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన కనీస అధికారాల్లో పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌లు కూడా ఉన్నాయని, రాష్ర్ట హక్కులను కాలరాసే విధంగా చట్ట సవరణకు సిద్ధమవడం అన్యాయమని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను గవర్నర్ గౌరవించాలని, హైదరాబాద్ పోలీసు వ్యవస్థపై గవర్నర్‌కు అధికారులు కల్పించాలని విభ జన చట్టంలో ఎక్కడా లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం కొత్తగా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాయి. ఉమ్మడి రాజధానిలో తన విధులేమిటో తెలుసుకునేందుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గతంలో కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ఈ ముసాయిదాను రూపొందించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించేందుకు వీలుగా విభజన చట్టంలోని సెక్షన్ 8కు సవరణలు చేస్తూ ముసాయిదా బిల్లును రూపొందించి రాష్ట్రానికి పంపింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కూడిన కామన్ పోలీస్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదివార ం టీఆర్ఎస్ ఎంపీలతో క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టే ముసాయిదా బిల్లును పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించాలని, దాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న అనురాగ్ శర్మను తెలంగాణ డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. తర్వాత నగర కమిషనర్‌గా అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డిని తెలంగాణ సర్కారు నియమించింది. ఇక అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, డీసీపీల్లోనూ ఒకరిద్దరు మినహా అంతా పాత వారే కొనసాగుతున్నారు.