Sri Ramsagar Project
-
వరద కాలువలోనూ ‘విద్యుదుత్పత్తి’ చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మిగులు జలాలను సది్వనియోగం చేసుకునే లక్ష్యంతో వరద కాలువ నిర్మాణం చేపట్టారు. ఈ కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరుకు నీటిని తరలిస్తారు. వరద కాలువ సామర్థ్యం 22 వేల క్యూసెక్కులు. 2010 నుంచి దీని ద్వారా మిడ్‌మానేరుకు నీటిని వదులుతున్నారు. గతంలో ఒక సీజన్లో అత్యధికంగా 56 వేల క్యూసెక్కుల నీటిని సైతం వదిలారు. ఈ కాలువ వద్ద పంప్‌హౌస్ నిర్మాణం చేస్తే 90 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటి ఆధారంగా 4 టర్బైన్లతో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించారు. ఈ కాకతీయ కాలువ సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు. ఒక్కో టర్బైన్ నుంచి 2,200 క్యూసెక్కుల నీటి ద్వారా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 4 టర్బైన్ల ద్వారా 8,800 క్యూసెక్కుల నీటితో 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అయితే 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే వరద కాలువ నుంచి సైతం విద్యుదుత్పత్తి చేసే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. 13 ఏళ్లుగా వరద కాలువ ద్వారా ప్రతి సంవత్సరం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో గరిష్టంగా వరద కాలువ ద్వారా ఒక సీజన్లో 56 టీఎంసీల నీటిని విడుదల చేసిన సందర్భంగా కూడా ఉంది.ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా చేస్తున్న విద్యుదుత్పత్తికి మూడు రెట్లు ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది. కాకతీయ కాలువ టర్బైన్లతో పోలిస్తే వరద కాలువకు ఇలాంటి 10 టర్బైన్లు నిర్మించే అవకాశాలున్నాయి. శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుపోతుండడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. దీంతో గత పదేళ్లుగా 42 వరద గేట్లును ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. మరోవైపు వరద కాలువ ద్వారా కూడా నీటిని మిడ్‌మానేరుకు విడుదల చేస్తున్నారు. ఎగువ మహారాష్ట్ర నుంచి ప్రతిఏటా భారీగా వరద నీరు వస్తోంది. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వరదకాలువ వద్ద పంప్‌హౌస్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్‌తో వరద కాలువ ద్వారా నీటిని శ్రీరాంసాగర్ జలాశయంలోకి తరలించారు. కాగా 1,091 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న ఎస్సారెస్పీకి 1,075 అడుగుల మేర నీటిమట్టం చేరగానే వరద కాలువ ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. -
శ్రీరాంసాగర్ 41 గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కడెం వాగుతోపాటు ఎగువన గోదావరికి వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు 1,95,767 క్యూసెక్కుల వరద రాగా, నీటినిల్వ 71.85 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండుకుండలా మారడం, ఎగువ నుంచి ఉధృతంగా వరద వస్తుండడంతో ఉదయం 10:30 గంటలకు 8 గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెరుగుతున్న కొద్దీ క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తుతూ వెళ్లారు. రాత్రి పదిగంటలకు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా, ప్రాజెక్టులో 72.9 టీఎంసీలను నిల్వ చేస్తూ మొత్తం 41 గేట్లు ఎత్తి 2.65లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ⇒ కడెం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా, 49,763 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 5.41 టీఎంసీల నిల్వలు కొనసాగిస్తూ 18 గేట్లు ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు. ⇒ శ్రీరాంసాగర్ నుంచి విడుదలవుతున్న వరదకు కడెం జలాలు తోడుకావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి 2,92,815 క్యూసెక్కులు పెరిగింది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 15.02 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 2,64,787 క్యూసెక్కు ల నీటిని గేట్ల ద్వారా కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లకు వరద ఉధృతి భారీగా పెరిగింది. సుందిళ్ల బరాజ్‌కు 3.68లక్షలు, అన్నారం బరాజ్‌కు 6.61లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కు 6.79లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచి్చంది వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సమ్మక్కసాగర్‌కు 4.45 లక్షలు, సీతమ్మసాగర్కు 3.13లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు విడుదల చేస్తున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువకు వెళుతోంది. సోమవారం రాత్రి 12. గంటల సమాయానికి 12.010 మీటర్లకు చేరింది. తెల్లవారే సరికి మరింత వరద పెరగనుంది. కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక 12.210 మీటర్లు, డేంజర్ లెవల్ 13.460 మీటర్లు వరకు నమోదు అయితే లోతట్టు గ్రామాలు జలమయమవుతాయి.1986లో కాళేశ్వరం వద్ద 15.75 మీటర్ల ఎత్తు, 2022 జూలై 14న 16.72మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదైంది. సింగూరు, నిజాంసాగర్‌కు జలకళ గోదావరి ఉపనది మంజీరలోనూ వరద ఉధృతి మరింతగా పెరగడంతో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంలు కాగా, ప్రస్తుతం 23,942 క్యూసెక్కుల వరద వస్తుండగా, నిల్వలు19.22 టీఎంసీలకు చేరాయి. ⇒ నిజాంసాగర్ నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా 48,800 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.16 టీఎంసీలకు చేరాయి. వరద ఇలానే కొనసాగితే మరో ఐదు రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండే అవకాశముంది. మిడ్‌మానేరుకు గ్రావిటీ ద్వారా ఎస్సారెస్పీ జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని మిడ్‌మానేరులోకి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తి పోయాల్సిన అవసరం లేకుండా పోయింది. రెండు పంప్‌హౌస్‌లలో పంపింగ్ బంద్ చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 7000 క్యూసెక్కుల నీటిని గ్రావిటీతో మిడ్‌మానేరు జలాశయా నికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి అనంతగిరి జలాశయానికి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు నీళ్లను ఐదు దశల్లో పంపింగ్ చేస్తున్నారు. ఎగువన శాంతించిన కృష్ణమ్మ... దిగువన ఉగ్రరూపం ⇒ జూరాల 40 గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు, సాగర్ 26 గేట్ల ద్వారా నీటి విడుదల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణమ్మ శాంతించింది. మూడు రోజులుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు తోడు కావడంతో దిగువన కృష్ణానది ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బరాజ్‌కు వస్తున్న 11,27,30 క్యూసెక్కుల వరదను వచ్చింది వచ్చినట్టు గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలోని ఆల్మట్టి జలాశయానికి 70 వేలు, నారాయణపూర్ జలాశయానికి 30 వేల క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది.దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు సైతం 3.21లక్షల క్యూసెక్కులకు వరద తగ్గిపోగా, 40 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని 10 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 5.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 5.48 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 5.43 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న ప్రకాశం బరాజ్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం నాటికి ప్రకాశం బరాజ్‌కు వరద ఉధృతి తగ్గే అవకాశముంది. అలుగుపారుతున్న డిండి ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగు పరవళ్లు తొక్కుతుండడంతో నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు నిండి సోమవారం అలుగు పోసింది. వర్షాధారంపైనే ఆధారపడిన ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి (36 అడుగులు) చేరుకుంది. హైదరాబాద్ – శ్రీశైలం రహదారి మధ్యలో ఉన్న డిండి ప్రాజెక్టు అలుగుపారుతున్న అందాలను తిలకించేందుకు స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత మూసీనదికి వరద పోటెత్తడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యంగల మూసీ రిజర్వాయర్‌లో 3.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
రంగుమారిన ఎస్సారెస్పీ నీరు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లోని నీరు ఒక్కసారిగా ఆకుపచ్చ రంగులోకి మారింది. అంతేకాక ఈ నీరు దుర్వాసన వస్తోంది. ఇదే నీటిని ఆయకట్టుకు కాలువల ద్వారా సరఫరా చేస్తున్నారు. పంట భూముల్లోకి చేరిన నీటి దుర్వాసనను భరించలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ నీటి వల్ల పంటలకు తెగుళ్లు వ్యాపిస్తాయని అంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదలతో పాటు వ్యర్థాలు కొట్టుకు రావడంతో ఏటా ప్రాజెక్ట్‌లో నీరు రంగు మారుతోంది. గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో కూడా ప్రాజెక్ట్‌లో నీరు రంగు మారింది. ఎందుకు రంగు మారుతోంది.. ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రలోని ధర్మాబాద్ వద్ద గల పలు కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను వరదలు వచ్చిన సమయంలో గోదావరిలోకి ఎక్కువగా వదులుతున్నారు. ఈ కారణంగానే నది నీరు కలుíÙతమవుతోందని స్థానికులు, అధికారులు చెబుతున్నారు. అయితే ఆ కెమికల్ ఫ్యాక్టరీలను కట్టడి చేయడంలో అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక అధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం ప్రతి రోజు 231 క్యూసెక్కుల నీటిని వదులుతారు. అలాగే ప్రాజెక్ట్‌లో చేపల వేటపై సుమారు ఐదు వేల మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. నీరు కలుషితం కావడం వల్ల ప్రాజెక్ట్‌లో చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు రంగు మారడంపై వెంటనే విచారణ చేపట్టాలని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు. కలుషితం కాలేదని నివేదిక వచ్చింది గత ఏడాది ఇలానే నీరు రంగు మారడంతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రాజెక్టును సందర్శించారు. నీటి శాంపిళ్లను సంగారెడ్డిలోని ల్యాబ్‌కు పంపించాం. అయితే ఎలాంటి కాలుష్యం లేదని నివేదిక వచ్చి0ది. ఇప్పుడు కూడా నీరు రంగు మారింది. ఎందుకు మారుతోందో తెలియడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం.– చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
వరద గోదారి!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శనివారం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను, ఆసిఫాబాద్ జిల్లా కుమురంభీం (ఆడ) ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. పలు బరాజ్‌ల గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35 అడుగులు దాటి ప్రవహిస్తోంది. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం, వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉండటంతో గోదావరికి వరద పెరగొచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.మేడిగడ్డకు వచ్చిన నీళ్లు వచ్చినట్లే..కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కి 3,73,500 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వెళ్లిపోతున్నాయి. బరాజ్ ఇప్పటికే దెబ్బతిని ఉండడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిరంతరం వరద పరిస్థితిని, బరాజ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బరాజ్‌లో నీటి మట్టం 100 మీటర్లకు గాను 93 మీటర్లు ఉంది.మహదేవపూర్ మండలం అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో నీటి మట్టం 119 మీటర్లకు గాను 106.96 మీటర్లు ఉంది. బరాజ్‌లోని 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 4,82,800 క్యూసెక్కులు చేరుతుండగా 59 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. వాటి దిగువన ఉన్న దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 5,93,167 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు.దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి వరద తీవ్రత 6,02,985 క్యూసెక్కులు చేరగా, నీటి మట్టం 35.5 అడుగులకు పెరిగిపోయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇక పోలవరం ప్రాజెక్టులోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. 6 రోజుల్లో 73 టీఎంసీలు సముద్రం పాలుమేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్టు దిగువనకు వెళ్లిపోతోంది. గత ఆరు రోజుల్లో ఏకంగా 73 టీఎంసీల వరద మేడిగడ్డ బరాజ్ గుండా ప్రవహించి సముద్రంలో కలిసిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిపేరుకు పోటెత్తిన వరదభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు వరద పోటెత్తుతోంది. దీంతో 25 గేట్లు ఎత్తి 1,45,078 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలావుండగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను శనివారం ఎత్తారు. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 15,338 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 (7.603 టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 690.400 (5.345టీఎంసీ) అడుగులు ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలోని కుమురంభీం (అడ) ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. ప్రాజెకుŠట్ సామర్థ్యం 5.9 టీఎంసీలు కాగా 1,941 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరదశ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి 18,245 క్యూసెక్కుల వరద నిలకడగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా òపెరిగింది. అయితే సాయంత్రానికి 15,100 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (80 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం రాత్రికి 1,067.00 (18.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 9గంటల వరకు నీటిమట్టం 140.91 మీటర్లుగా, నీటి నిల్వ 5.96 టీఎంసీలుగా ఉంది. -
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్‌కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
అఖండ గోదావరి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణ మీదుగా దిగువన ఏపీలోని ధవళేశ్వరం దాకా నిండుగా ప్రవహిస్తుండటం.. మొత్తం అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో.. అఖండ గోదావరిగా మారింది. బాబ్లీ బ్యారేజీ నుంచి 2,92,889 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తేసి 2.74 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో 2,40,196 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ వరదకు స్థానిక ప్రవాహాలు చేరి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఏకంగా 7,40,951 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడ 7,12,294 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటికి దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, ఇతర ఉపనదులు, వాగులు తోడై.. గోదావరిలో 12 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకులగూడెం), సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం) బ్యారేజీలకు వస్తున్న నీటిని వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద అప్రమత్తం భద్రాచలం వద్ద గురువారం ఉదయం నీటి మట్టం 50.5 అడుగులకు పెరగడంతో ఆందోళన వ్యక్తమంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత వరద తగ్గి.. రాత్రి 9 గంటలకు 11,77,133 క్యూసెక్కుల వరదతో 48.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. అయితే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి భారీగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా నదికి జలకళ మహారాష్ట్ర, కర్ణాటకలలో విస్తారంగా వానలతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి 1.75 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద జూరాల ప్రాజెక్టుకు చేరుతుండటంతో ఈ సీజన్లో తొలిసారి ఏడు గేట్లు ఎత్తారు. దీంతోపాటు విద్యుదుత్పత్తి కూడా చేస్తూ.. మొత్తం 70,422 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి స్థానిక ప్రవాహం కలసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 71 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం వస్తోంది. ఇక్కడ నీటి నిల్వ 39.2 టీఎంసీలకు చేరింది. దిగువన మూసీ నుంచి వరదతో పులిచింతలలో నీటి నిల్వ 21.88 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర డ్యామ్‌కు 1,11,566 క్యూసెక్కుల వరద వస్తోంది. కాళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్! గురువారం అర్ధరాత్రి కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 11 లక్షల క్యూసెక్కులతో, 105.1 మీటర్లకు పెరగడం ఆందోళన రేపుతోంది. శుక్రవారం ఉదయానికి నీటి మట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది జూలై మూడో వారంలో గోదావరికి భారీ వరదలు వచ్చి.. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 108.19 మీటర్లకు పెరిగింది. మేడిగడ్డ, అన్నారం పంపుహౌజ్‌లు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పట్లో మేడిగడ్డకు ఏకంగా 26,79,260 క్యూసెక్కుల అతిభారీ వరద వచ్చి బ్యారేజీ గేట్లపై నుంచి పొంగిపొర్లింది. -
వచ్చే నెల నుంచే ‘ఎస్సారెస్పీ’కి నీరు
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు డిసెంబర్ నుంచే నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుత యాసంగిలో మొత్తంగా 6.10 లక్షల ఎకరాలకు నీరందించనున్నారు. ఈ మేరకు గురువారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లోయర్ మానేర్ డ్యాం ఎగువన 4 లక్షల ఎకరాలకు, దిగువన 1.60 లక్షల ఎకరాలకు, సరస్వతి, లక్ష్మీ కాలువల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని తీర్మానించారు. రెండు, మూడు రోజుల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. రెండో వారం నుంచి.. యాసంగికిగాను ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలపై కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ రెండో వారం నుంచి సాగునీరు ఇవ్వాలని, మొత్తంగా 8 తడులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎక్కువ నీళ్లు వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయకట్టు చివరి రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ఈ ఏడాది కృష్ణాలో బాగానే నీళ్లు వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు గోదావరిలో తక్కువగా వచ్చాయన్నారు. ఎస్సారెస్పీలోకి సాధారణం కంటే 15 శాతం తక్కువగా నీరు చేరిందని, ప్రస్తుతం 63 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజి–1లో చివరి ఆయకట్టు వరకు నీరిచ్చేలా పనులు చేపట్టేందుకు రూ.1,000 కోట్లు కేటాయించామని.. ఆ పనులు వేగవంతమయ్యేలా చూడాలని సూచించారు. అయితే ఆయా పనుల పేరుతో పంటలకు నీరందించే ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. ఈ పనులను 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. వీఆర్వో, వీఆర్ఏల సేవలను సైతం నీటి విడుదల పనులకు వినియోగించుకోవాలని సూచించారు. ఎల్ఎండీ దిగువన 1.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్, పుట్టా మధు, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, విద్యాసాగర్‌రావు, మనోహర్‌రెడ్డి, బొడిగె శోభ, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషీ, సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఈ బి.శంకర్ తదితరులు పాల్గొన్నారు. సింగూరును త్యాగం చేసి ఇస్తున్నారు: ఈటల సీఎం కేసీఆర్, హరీశ్‌రావులు త్యాగం చేసి సింగూరు ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీకి జలాలను తరలించారని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గతంలో ఎస్సారెస్పీలో 40 టీఎంసీల కంటే తక్కువగా లభ్యత ఉంటే.. గేట్లు తెరిచి నీళ్లు ఇవ్వలేదని, ఇప్పుడా నిబంధనను పక్కన పెట్టామని చెప్పారు. ఆయకట్టు చివరి రైతుకు కూడా నీళ్లు అందించేందుకు చర్యలు చేపడతామని, అవసరమైతే మూడు నెలల పాటు తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకుందామని ఈటల ప్రతిపాదించారు. ఇక గతేడాది నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన టెయిల్ టు హెడ్ నీటి సరఫరా విధానం విజయవంతమైందని, మిగతా ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. -
కిలోల కొద్దీ అదృష్టం
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో ఆదివారం మత్స్యకారులకు 22 కేజీల చేప చిక్కింది. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో పెద్ద పెద్ద చేపలు చిక్కుతున్నాయి. కాగా ప్రాజెక్ట్‌లో చేపలు భారీ సంఖ్యలో మృతి చెందుతున్నాయి. నీటి పరిమాణం తగ్గిపోయి ఆక్సిజన్ అందనందున చేపలు వ్యాధిబారిన పడి మృతి చెందుతున్నాయని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. -
చేపపిల్లల ఉత్పత్తికి నీటి కొరత
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగు వ భాగాన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం సంవత్సరం ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో చేప పిల్లల ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది.జూలై పక్షం రోజులు దాటుతున్నా నీటి కొరతతో చేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కాలేదు. జిల్లాలోనే స్వయంగా చేపపిల్లలను ఉత్పత్తి చేసే ఏకైక కేంద్రం ఎస్సారెస్పీ జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం. ప్రాజెక్ట్‌లో 1065 అడుగులు నీరున్నప్పుడు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి నీరందించవచ్చు. ప్రస్తుతం 1063.70 అడుగుల నీరు నిల్వ ఉంది. దీంతో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి ప్రాజెక్ట్ నీరు అందడంలేదు. చేపప్లిలల సంతనోత్పత్తికి జూలై, ఆగష్టు మాసలే అనువైనవి. జూలై మొదలు నుంచి ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాలి. నీటి సరఫరా లేక ఉత్పత్తిప్రక్రియ సకాలంలో సాగడం లేదు. దీంతో మత్స్య కారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సంత్సరం చేప పిల్ల ఉత్పతి పూర్తి స్థాయిలో జరుగుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు. జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి నిరంతరం విద్యుత్తు సరఫరా లేక పోవడం వలన తీవ్ర ఇబ్బందిగా ఉంది. ఉత్పత్తి కేంద్రానికి నీటి సరఫరా చేసేందుకు కేంద్ర వద్ద బావి తవ్వారు. బావి ద్వారా నీటి సరఫరా చేసి చేప పిల్లల ఉత్పత్తి కోసం స్వల్పంగా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే విద్యుత్తు సరఫరా లేక ఆ నీరు కూడా అందడంలేదు. వ్యవసాయానికి సరఫరా చేసే ఆరు గంటల విద్యుత్తు సరఫరా మాత్రమే ఉంది. అదీ లోవోల్టేజీ సమస్యతో మోటారు నడిచేది చాలా తక్కువ సమయం. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి నిరంతరం విద్యుత్తు సరఫరా కోసం ట్రాన్స్‌కోకు డిమాండ్ ప్రకారం రూ. 7 లక్షలు చెల్లించినట్లు మత్స్య శాఖ అధికారులు తెలుపుతున్నారు. జూలై మొదటి వారంలో కరెంటు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు లేదు. దీంతో నీటి కొరత తీవ్రమైంది. అదేవిధంగా అధికారులు స్పందించి బోరుబావి తవ్వించాలని మత్స్య కారులు కోరుతున్నారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మూడు కోట్ల చేప పిల్లల ఉత్పత్తి చేపట్ట వచ్చు. నీటి కొరత తీవ్రంగా ఉంది చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. కరెంట్ సరఫరా నిరంతరం లేక పోవడంతో ఉన్న నీటిని సరఫరా చేపట్ట లేక పోతున్నాం. దీంతో ఉత్పత్తి ప్రక్రియ ఆలస్య మవుతోంది. - లక్ష్మీ నారాయణ, ఇన్చార్జి, ఎఫ్‌డీవో -
వరద గోదారి
విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి వరద ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రానికి 51 అడుగులకు చేరింది. అటు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 30 అడుగుల (9.92 మీటర్లు)కు, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద 33 అడుగులకు (11.2 మీటర్ల)కు చేరుకుంది. దీంతో భద్రాచలం, రామన్నగూడెంలలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం వద్ద వరద 12 మీటర్లకు చేరితే ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇక భారీగా వరదలు పోటెత్తుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యూరు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని మండలాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్ అతలాకుతలం నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భైంసా పరిధిలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో నాలుగు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ నీటితో బైపాస్ రోడ్డు, వంతెన నీట మునగడంతో 12 మంది చిక్కుకుపోయారు. వారిని సహాయక సిబ్బంది కాపాడారు. వేమనపల్లి మండలంలో ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తోంది. మండల పరిధిలోని 18 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 32 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బెజ్జూరు మండలంలో తీగలబర్రె వాగు ఉప్పొంగడంతో తలాయి, ఇక్కపల్లి, భీమారం గ్రామాలు రెండు రోజుల నుంచి జల దిగ్బంధంలో ఉన్నాయి. ఆసిఫాబాద్, ఖానాపూర్ మండలాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నేరడిగొండ మండలం వాంకిడి వద్ద తాత్కలిక వంతెన కొట్టుకుపోవడంతో వాహనాలను జాతీయరహదారి మీదుగా మళ్లించారు. కాళేశ్వరం వద్ద ఉధృతంగా.. కరీంనగర్ జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నారుు. సోమవారం సాయంత్రానికి కాళేశ్వరం వద్ద నీటిమట్టం 11.2 మీటర్లకు చేరింది. కాళేశ్వరం దిగువన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతర్రాష్ట్ర వంతెనను తాకేంతగా వరద ప్రవహిస్తోంది. నీటిమట్టం 12 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. కాళేశ్వరం వద్ద నీటిమట్టం 13 మీటర్లకు చేరితే మహదేవపూర్ మండలంలోని పలు లోతట్టు గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉండటంతో.. అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి కమ్మునీటితో మండలంలోని పెద్దంపేట వాగు ఉప్పొం గింది. దాంతో నాలుగు రోజులుగా పెద్దం పేట, లెంకలగడ్డ, పంకెన, మోదేడు, పలి మెల, అప్పాజీపేట, బోడాయిగూడెం, సర్వాయిపేట, దమ్మూరు, బూర్గుగూడెం, నీలంపల్లి, వెంచంపల్లి, ముకునూర్, తిమ్మటిగూడెంలకు రాకపోకలు స్తంభించాయి. వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో వాగు వద్ద చిక్కిపోయూరు. వాగుకు ఇటు పక్కన ఉన్న అంబట్పల్లి, సూరారం తదితర గ్రామాల్లో బంధువులు, తెలిసినవారి ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇక గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని గోదావరిలో నాటు పడవలు తిప్పడాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు నిషేధించారు. భద్రాచలంలో పరవళ్లు.. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచ లం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో గోదావరి విశ్వరూపం చూపిస్తోంది. వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య కిలోమీటర్ మేర రహదారి నీటిలో మునిగిపోయింది. స్తంభాలు దెబ్బతిని విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాజేడు, ఏడ్జర్లపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన నీట మునిగింది. దూలాపురం, పూసూరు, కాసారం ప్రాంతాల్లో పంట పొలాల్లో వరద నీరు చేరింది. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, సీతమ్మ వారి నారచీరలు, సీతవాగుకు భారీగా నీరు చేరడంతో రామాయణ దృశ్యాలు నీట మునిగాయి. భద్రాచలం స్నానఘట్టాలపైకి వరద నీరు చేరింది. గోదావరి కరకట్ట స్లూయిస్ల లీకేజీతో భద్రాచలంలోని అశోక్‌నగర్ కొత్తకాలనీలోకి వరద నీరు వచ్చింది. దీంతో కాలనీ వాసులను సమీపంలోని పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. శ్రీరాంసాగర్‌కు పెరుగుతున్న వరద వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల కళ సంతరించుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లాలోని గెడ్డన్న వాగు నుంచి 18 వేల క్యూసెక్కులు, స్థానిక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 12 వేల క్యూసెక్కులు కలిపి మొత్తంగా 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం ఒక్కరోజులోనే 1.5 అడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు (90 టీఎంసీలు) కాగా... సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1,050.40 అడుగుల (6.42 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో గతేడాది ఇదే రోజున 1,057.80 అడుగుల (11.34 టీఎంసీలు) నీరు ఉంది. ఎగువన మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులకు జలకళ భారీగా వచ్చి చేరుతున్న వరదతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కొమురం భీమ్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో ఐదు గేట్లు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 24 వేల క్యూసెక్కులు ఉండగా.. 25,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 700 అడుగులుకాగా.. 695.13 అడుగుల వరకు నీరు చేరింది. ఇంకా 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో.. అధికారులు తొమ్మిది గేట్లు ఎత్తి 99,400 క్యూసెక్కులు వదిలిపెడుతున్నారు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నిండిపోయింది. దీంతో 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 138.3 మీటర్లుకాగా.. సోమవారం సాయంత్రానికి 138.25 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో 8,600 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 158 క్యూసెక్కులుగా ఉంది. చెరువుల్లో ఆశాజనకం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువులకు నీటి కళ వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో 2,300 చెరువులకు వెయ్యి చెరువులు నిండిపోయాయి. ఖమ్మం జిల్లాలో మొత్తంగా 4,500 చెరువులకు 1,900 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. మరో వెయ్యి చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు చేరింది. మహబూబ్‌నగర్‌లో 30 చెరువులు పూర్తిస్థాయిలో నిండగా.. మరో 400 చెరువులు నిండేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరంగల్‌లో 69, నల్లగొండలో 50 చెరువులు పూర్తిస్థాయిలో నిండినట్లు చిన్న నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా భూగర్భ జలాలు భారీగా క్షీణించడంతో చెరువుల్లోకి నీటి ప్రవాహాలున్నా అవి ఇంకిపోతున్నాయని... ప్రస్తుత వర్షాలు మరిన్ని రోజులు కొనసాగితే గోదావరి బేసిన్‌లోని చెరువులన్నీ నిండుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీట మునిగిన పంటలు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండ లం రామన్నగూడెం, గొంటైని పం టలు నీట మునిగాయి. రాంనగర్, కోయగూడ ఎల్లాపురం, లంబాడీతండా జలది గ్బంధంలో చిక్కుకున్నాయి. రాంనగర్-రామన్నగూడెం మధ్య కాజ్‌వేపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆ గ్రామా ల వారికి మూడు రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయా రుు. దీంతో ఐటీడీఏ, రెవెన్యూ అధికారు లు సోమవారం పడవలు ఏర్పాటు చేశా రు. నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు రెం డు ఇళ్లు కూలిపోయాయి. వర్షాలతో కరీం నగర్ జిల్లా రామగుండం రీజియన్ పరిధిలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లలో నీరు చేరి బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు స్తంభించారుు. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాం పూర్, రెబ్బెన, బెల్లంపల్లి గనుల్లోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లో చేరిన నీటిని మోటార్లతో తోడివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పూడుకుపోతున్న ఎస్సారెస్పీ
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో రోజురోజుకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ఎగువ ప్రాంతాలనుంచి వచ్చే వరద నీరు, మట్టితో పూడిక పేరుకుపోతోంది. ఇప్పటికే సుమారు 34 టీఎంసీల మేర పూడిక చేరి ఉంటుందని భావిస్తున్నారు. పూడికపై సర్వే చేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పకడ్బందీగా సర్వే నిర్వహించి ఎంత మేరకు పూడిక పేరుకుపోయిందో తేల్చాలని, పూడికను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఠబాల్కొండ, న్యూస్‌లైన్ : ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి కాగానే 1970లో హైడ్రో గ్రాఫిక్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 112.02 టీఎంసీలుగా నిర్ధారించింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు, మట్టితో ప్రాజెక్టులో పూడిక పేరుకుపోతోంది. 1994 లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబరెటీస్ (ఏపీఈఆర్‌ఎల్) సంస్థ సర్వే చేసి ప్రాజెక్టులోకి 21.71 టీఎంసీల పూడిక వచ్చి చేరిం దని తేల్చింది. అంటే 1994 నాటికి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలకు పడిపోయిందన్నమాట. 2006లో అదే ఏపీఈఆర్‌ఎల్ సర్వే జరిపి ప్రాజెక్టులో 32 టీఎంసీల పూడిక పేరుకుపోయిందని నివేదిక ఇచ్చింది. లెక్క ప్రకారం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 79.96 టీఎంసీలకు పడిపోయినట్లు కాగా, ఈ నివేదిక నమ్మశక్యంగా లేదని అధికారులు కొట్టిపారేశారు. పూడికపై 1994లో ఏపీఈఆర్‌ఎల్ సంస్థ ఇచ్చిన నివేదిక ను నమ్మిన ప్రాజెక్టు అధికారులు.. 2006లో ఇచ్చిన రిపోర్టు నమ్మశక్యంగా లేదని అంటున్నారు. ఏటా 0.8 టీఎంసీల పూడిక 1970 నుంచి 1994 వరకు 24 ఏళ్లలో 21.71 టీఎంసీల పూడిక చేరింది. 1994 నుంచి 2006 వరకు 12 ఏళ్లలో 10 టీఎంసీల పూడిక చేరినట్లు సర్వే తేల్చింది. ప్రాజెక్టులోకి ఏటా ఎగువ ప్రాంతాల నుంచి 0.8 టీఎంసీల పూడి క వచ్చి చేరుతుందని అధికారుల సర్వే రికార్డులు చెబుతున్నాయి. వారి లెక్కల ప్రకారం 36 ఏళ్లలో 28.8 టీఎంసీల పూడిక చేరుతుం ది. 24 టీఎంసీల పూడిక చేరిందని 2006లో ఏపీఈఆర్‌ఎల్ సంస్థ ఇచ్చిన నివేదికను ప్రాజె క్టు అధికారులు ఎందుకు తిరస్కరించారో అర్థంకాని పరిస్థితి. అయితే ప్రాజెక్టులో ఇంత భారీగా పూడిక చేరిందని తెలిస్తే రైతులనుంచి ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడిన అధికారులు.. సర్వే రిపోర్టును తిరస్కరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా అధికారులు మళ్లీ అదే సంస్థతో ప్రస్తుతం సర్వే చేయిస్తుండడం గమనార్హం. వారం రోజుల్లో సర్వే ప్రారంభం కానుంది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎస్సారెస్పీ వట్టిపోయే పరిస్థితి ఏర్పడుతోంద న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1963లో ఈ ప్రాజెక్టు పురుడుపోసుకుంది. సుమారు 18 లక్షల ఎకరాలకు సాగు నీరు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు తాగు నీరు అందిస్తూ ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా మారింది. అయితే ఈ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పూడిక పేరుకుపోతుండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. పూడికతీత విషయమై అధికారులు గతంలో ఓసారి విదేశీ బృందాలను పిలిపిం చారు. పూడికను రసాయనాలతో కరిగించి, ప్రాజెక్టు వరద గేట్ల కింద అమర్చిన షిల్ట్ గేట్ల ద్వారా వదలాలని వారు సూచించారు. అయి తే షిల్ట్ గేట్లు సైతం మట్టిలోనే కూరుకుపోయాయని, అందువల్ల పూడికతీత సాధ్యపడలేదని పేర్కొంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఇప్పటివరకు వేల టీఎంసీల నీటిని గోదావరి నదిలోకి వదిలినా.. ఒక్కసారి కూడా షిల్ట్ గేట్లను ఎత్తకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతులు ఆరోపిస్తున్నారు. దాని ఫలితంగానే ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయాలు వేదికి, ప్రాజెక్టులోంచి పూడిక తొలగించాలని కోరుతున్నారు. పకడ్బందీగా సర్వే చేయిస్తాం ఏపీఈఆర్‌ఎల్ ప్రభుత్వ సంస్థ. అయితే గతంలో ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికపై నిర్వహించిన సర్వేలో పొరపాట్లు జరిగాయి. ఈసారి అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పకడ్బందీగా సర్వే చేయించి, ప్రాజెక్టులో ఎంతమేర పూడిక పేరుకుపోయిందో తేలుస్తాం. -శ్యాంసుందర్, ప్రాజెక్టు ఎస్ఈ