sri sringeri sharada peetham
-
విజయవాడ : శ్రీ శృంగేరీ శారదా పీఠంలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
శ్రీ శృంగేరి శారదా పీఠానికి వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(మంగళవారం)సాయంత్రం విజయవాడ శ్రీ శృంగేరి శారదా పీఠానికి బయల్దేరి వెళ్లారు. సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించి..,శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలిశారు. వైఎస్ జగన్‌కు శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీ ఆశీస్సులు అందించారు.వైఎస్ జగన్‌తో పాటు.. మల్లాది విష్ణు,వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ కార్పోరేటర్లు శ్రీ శృంగేరీ శారదా పీఠాన్ని సందర్శించారు. -
శృంగేరి పీఠాధిపతులను ఆహ్వానించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం కర్ణాటకలోని శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతులను దర్శించుకున్నారు. ఈ నెల 23 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న అయుత చండీ మహాయాగానికి రావాల్సిందిగా జగద్గురుశంకరాచార్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వార్లను ఆయన ఆహ్వానించారు. శృంగేరి పీఠానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు పీఠాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ శారదాంబ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వార్లను దర్శించుకున్నారు. అయుత చండీయాగం ఆహ్వాన పత్రికను ఆయన జగద్గురువులకు అందజేశారు. దాదాపు అరగంటపాటు జగద్గురువులతో కేసీఆర్ సమావేశమై యాగం ఏర్పాట్లను వారికి వివరించారు. కేసీఆర్ వెంట జగద్గురువులను కలిసిన వారిలో అయుత చండీయాగం ఆచార్య బ్రహ్మలు పురాణం మహేశ్వర శర్మ, గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మలు ఉన్నారు.