Sridevasena collector
-
కారులో మద్యం బాటిల్స్ పట్టుకున్న కలెక్టర్
సాక్షి, ఆదిలాబాద్ : పట్టణ ప్రజలను కరోనా వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. జిల్లాలో ఇప్పటికే 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. అందులో ఆదిలాబాద్ పట్టణంలోనే ఏడుగురికి కరోనా సోకడంతో రెడ్ జోన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పట్టణంలో ఆంక్షలు పకడ్బందీగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన స్వయంగా గల్లీ గల్లీ తిరుగుతూ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ లోని వినాయక్ చౌక్‌లో కలెక్టర్ పర్యటించి వాహనాలు తనిఖీ పర్యవేక్షించారు. ఈ తనిఖీల్లో భాగంగా తలమాడుగు మండలంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ గా పనిచేస్తున్న భీమన్న వాహనంలో పోలీసులు మద్యం సీసాలు గుర్తించారు. లాక్డౌన్ సందర్భంగా మద్యం షాపులు బంద్ కొనసాగుతున్న తరుణంలో 8 క్వార్టర్ బాటిల్స్ తో దొరకడంతో భీమన్న కారును పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు. -
కారులో మద్యం బాటిల్స్ పట్టుకున్న కలెక్టర్
-
సర్కార్ వైద్యులకు ‘బయోమెట్రిక్’!
కోల్‌సిటీ(రామగుండం) : జిల్లాలోని సర్కారు వైద్యులు, సిబ్బందికి ‘బయోమెట్రిక్’ భయం పట్టుకుంది. డాక్టర్లతోపాటు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో ఉండకుండా.. సొంత పనులపై బయట తిరుగుతున్నారు. అడిగేవారు లేకపోడంతో.. వైద్యులు, సిబ్బంది ఎవరిష్టం వచ్చినట్లు వారు సమయపాలన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారి ఆటలకు కలెక్టర్ శ్రీదేవసేన చెక్ పెట్టనున్నారు. పేదలకు సకాలంలో వైద్యం అందాలనే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో వైద్య సిబ్బందిలో వణుకు మొదలయ్యింది. ఇక ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్: జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పంచ్(థంబ్ ఇంప్రెషన్) అమలు చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. ఇటీవల గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ను వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారుల ప్రతిపాదనలు..: ప్రభుత్వాస్పత్రుల వైద్యులు, సిబ్బంది సమయపాలనపై జిల్లా కలెక్టర్ సీరియస్‌గా దృష్టిసారించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుపై వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యశ్రీరావుతోపాటు డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్‌కుమార్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 30 బయోమెట్రిక్ యంత్రాలు: గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి, పెద్దపల్లి, మంథని ఆస్పత్రులతోపాటు డీఎంహెచ్ఓ కార్యాలయం, రెండు డెప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయాలు, సుల్తానాబాద్‌లోని సీహెచ్‌సీ, రామగుండంలోని ఆరు యూపీహెచ్‌సీలుతోపాటు మేడారం, రాగినేడు, రాఘవపూర్, శ్రీరాంపూర్, కొలనూరు, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి, గర్రెపల్లి, పూట్నూర్, బసంత్‌నగర్, రామగుండం, గద్దెలపల్లి, ముత్తారం, కమాన్‌పూర్ పీహెచ్సీలలో బయెమెట్రిక్ యంత్రాలు అమలు చేయనున్నారు. ప్రస్తుతం మంథని ఆస్పత్రిలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. సుమారు 30 బయెమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత వీటిని కొనుగోలు చేయనున్నారు. ఉద్యోగుల్లో గుబులు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో బయెమెట్రిక్ విధానం అమలు చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో వినియోగంలోకి తేవాలని చూస్తున్నారు. దీంతో స్థానికంగా నివాసం ఉండని వైద్యులు, ఇతర సిబ్బంది దూరప్రాంతాల నుంచి అప్ అన్ డౌన్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తాజా నిర్ణయంతో వైద్యులతోపాటు నర్సింగ్‌స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, నాలుగో తరగతి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో గుబులు మొదలయ్యింది. గతంలో గాడితప్పింది.. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో గతంలోనే బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. అయితే ఆస్పత్రి అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీంతో సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ మూలకుపడేశారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్‌పై సీరియస్‌గా ఉండడంతో, మూలకుపడేసిన యంత్రానికి మరమ్మతులు చేపట్టడానికి చర్యలు ప్రారంభించారు. ప్రతిపాదనలు సిద్ధం చేశాం.. – డాక్టర్ సూర్యశ్రీరావు, సూపరింటెండెంట్ బయోమెట్రిక్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరిఖని ఏరియా ఆస్పత్రితోపాటు మంథని, పెద్దపల్లి ఆస్పత్రులలో బయోమెట్రిక్ యంత్రాలు వినియోగించడానికి చర్యలు ప్రారంభించాం. మంథనిలో వినియోగిస్తున్నాం. మూడు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుకు ప్రతిపాదనలు తయారు చేశాం. గోదావరిఖనిలో పని చేయని యంత్రానికి మరమ్మతులు కూడా చేయిస్తాం. ప్రతిపాదనలకు కలెక్టర్ అనుమతించాక వాటిని ఫిబ్రవరిలో అమలు చేస్తాం. 25 యంత్రాలు అవసరం...– డాక్టర్ ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో జిల్లాలో డీఎంహెచ్‌వో, రెండు డెప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయాలతోపాటు పీహెచ్సీ, 15 సీహెచ్‌సీలు, ఆరు యూహెచ్‌సీలలో బయోమెట్రిక్ విధానం అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నాం. కలెక్టర్ కూడా ఈ విషయంలో సీరిసయ్‌గా ఉన్నారు. ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. జిల్లాలో సుమారు 25 బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుకు తయారు చేసిన ప్రతిపాదనలను కలెక్టర్‌కు సమర్పిస్తాం. -
బతుకమ్మకుంట రీసర్వే
సాక్షి, జనగామ: కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల నడుమ విభేదాలకు కారణమైన బతుకమ్మకుంట వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు బతకుమ్మకుంటలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హద్దులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో వారు ప్రభుత్వానికి మళ్లీ ఎలాంటి నివేదికను అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో ఉన్న ధర్మోనికుంట అలియాస్ బతుకమ్మకుంట సర్వేనంబర్ 85లో 9.10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నియోజకవర్గానికి ఒక మినీట్యాంకు బండ్‌ను మంజూరు చేయగా, బతుకమ్మ కుంటను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. 2015లో రూ. 1.4 కోట్ల నిధులతో బండ్ అభివృద్ధి పనులు చేశారు. ఈ తరుణంలో బతకుమ్మకుంటను ఆనుకుని ఉన్న కనుకదుర్గమ్మ ఆలయాన్ని విస్తరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల సమయంలో కలెక్టర్ అల్లమరాజు శ్రీదేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య వివాదం తలెత్తింది. నిబంధనలకు విరుద్ధంగా బతుకమ్మకుంటను నిర్మించారని, కుంట భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారని కలెక్టర్ ఆయనపై బహిరంగ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బతుకమ్మకుంటలో మరో సారి సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇరిగేషన్ రిటైర్డ్ ఈఈ గోపాల్, ఇరిగేషన్ డీఈ పొన్నాల కొమురయ్య, ఇరిగేషన్ ఈఈ శంకర్రావు, రెవెన్యూశాఖ నుంచి ఆర్ఐ రాజు, సర్వేయర్ ప్రకాశ్ నేతృత్వంలో అధికారుల బృందం శుక్రవారం కుంట హద్దులను పరిశీలించారు. కుంట వద్దనే ఉండి 4 వెపులా కొలతలు వేశారు. అసరమైతే మరోసారి కొలతలను వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల సూచన మేరకే మరోసారి కుంటలో హద్దుల కొలతలను చేపట్టామని.. అంతకుమించి తమను ఏమి అడగవద్దని అధికారులు చెబుతున్నారు. బతుకమ్మకుంట వద్ద సర్వే చేయడం చర్చనీయాంశంగా మారింది. -
‘ఆపరేషన్ స్మైల్’ను పటిష్టంగా చేపట్టాలి
బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన జనగామ అర్బన్ : ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్‌ను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. జిల్లాలో బాలల సంరక్షణ కొరకు నిర్వహించనున్న ఆపరేషన్ స్మైల్–3 కార్యక్రమంపై శుక్రవారం ఆమె వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్–3 స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. తప్పిపోయిన, భిక్షాటన చేసే పిల్లలను వారి తల్లిదండ్రులకు చేర్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. బాలలను పనిలో పెట్టుకునే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించాలని అధికారులను అదేశించారు. సమీక్షలో జనగామ ఏసీపీ పద్మనాభరెడ్డి, లేబర్ ఆఫీసర్ శంకర్, డీడబ్ల్యూఓ పద్మజారమణ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన విధానం మారాలి.. దేశ పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన విధానం మారాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. జిల్లాలోని వైన్స్, బార్ షాపు యజ మానులతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుకాణాల్లో తప్పకుండా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. అమ్మకందారుడు మారితే వినియోగదారులు కూడా మారుతారన్నారు. ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ యాప్‌లను వాడుకోవాలని సూచించారు. ప్రజా శ్రేయస్సు కోసమే నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. శామీర్‌పేటలో గ్రామ సందర్శన జనగామ : మండలంలోని శామీర్‌పేటలో శుక్రవారం గ్రామ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రసాద్‌రావుతోపాటు పలువురు అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శామీర్‌పేట గ్రామాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆదర్శ గ్రామం గా నిలపాలని ఆక్షాంక్షించారు. క్యాష్‌లెస్ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని సూచించారు. విద్యార్థులు నగదు రహి త చెల్లింపులపై అవగాహన ఏర్పరచుకుని వారి కుటుంబసభ్యులకు కూడా తెలియజేయాలన్నారు. గ్రామంలో ఇంకా బ్యాంకు అకౌంట్లు, క్రెడిట్ కార్డులు తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాలన్నారు.