Sriram malyadri
-
వీరి మధ్యే అసలు పోటీ
సార్వత్రిక ఎన్నికల సమరం చివరి ఘట్టానికి చేరింది. మైకుల హోరు.. హామీల జోరుతో ముందుకు సాగిన నేతలు.. తమ తలరాతలు ఎలా మారబోతున్నాయోనని ఎదురు చూస్తున్నారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. జన సేన ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభావం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా మూడు పార్లమెంట్, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు వారి గుణగణాలు, విజయావకాశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఘన చరిత్ర ఉంది. రాజకీయ ఉద్యమాలకు పురిటి గడ్డ ఇది. ఎందరో ఉద్దండులు, మహామహులు ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ తరఫున శిద్దా రాఘవరావు బరిలో నిలిచారు. మూడు దశాబ్దాలుగా మాగుంట కుటుంబం ఒంగోలు కేంద్రంగా రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాసేవ చేస్తోంది. శిద్దా రాఘవరావు పదిహేనేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు కేంద్రంగా నివాసం ఉంటూ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా.. శిద్దా రాఘవరావు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి చెంది ఎంఎల్సీగా రాజకీయాల్లో కొనసాగారు. 2014లో దర్శి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన శిద్దా.. మాగుంట సహకారంతోనే ఆ ఎన్నికల్లో గట్టెక్కారని ఆయన సన్నిహతులే చెబుతుంటారు. శిద్దాకు రాష్ట్ర మంత్రి మండలిలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇలా మాగుంట, శిద్దా.. జిల్లా రాజకీయాల్లో సుపరిచితులుగా ఉన్నారు. శిద్దా అందుబాటులో ఉన్నట్టే ఉంటారు. కొందరికే ఆయనను కలిసేందుకు అనుమతి ఉంటుంది. అన్ని వేళలా అందుబాటులో ఉండరు. ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే కష్టమే. కొన్ని క్లిష్టతరమైన సందర్భాల్లో జనంపై చిర్రుబుర్రులాడతారు. జనం సమస్యలపై ఇచ్చే అర్జీల సంగతి పట్టించుకోరు. మంత్రిగా ఆయన ఇక్కడ సాధించిన విజయాలు అతి తక్కువే. కలుపుగోలుతనంగా ఉండరన్న విమర్శలున్నాయి. ఇటీవల యర్రగొండపాలెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నోటికొచ్చినట్లుగా మాట్లాడి తన నిజ రూపాన్ని ప్రదర్శించారని శిద్దా అనుచరులే అంటున్నారు. చేసే సాయం పది మందికీ తెలిసేలా చేయడం శిద్దా నైజం. తనకు ఇబ్బంది వచ్చే అంశాల నుంచి తప్పుకోవడానికి ఎంతటి వారినైనా ప్రలోభపెట్టడంలో ఆయకు ఆయనే సాటి అనే విమర్శ ఉంది. మాగుంట సౌమ్యంగా ఉంటారు. పది మందితో కలిసి ముందుకు సాగుతారు. కార్యకర్తలను కూడా పేరు పెట్టి పిలుస్తారు. ఎంతటి వారినైనా గౌరవిస్తారు. పిల్లలతో పిల్లవానిగా, పెద్దలతో పెద్దగా, మేధావులతో తలలో నాలుకలా వ్యవహరిస్తారు. అందరితో కలిసి భోజనం చేస్తారు. ఆప్యాయంగా పలకరిస్తారు. ఫోన్ చేస్తే నిద్రలో ఉన్నా లేచి మాట్లాడతారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే గుణం మాగుంట శ్రీనివాసరెడ్డిది. వ్యాపారాల్లో దిట్టలు మాగుంట శ్రీనివాసులురెడ్డి చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. శిద్దా రాఘవరావుకు చీమకుర్తి గ్రానైట్‌తో పాటు పాలిషింగ్ యూనిట్ ఇతర వ్యాపారాలున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ వీరికి పరిచయం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీరికి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఇరువురూ ధార్మిక కార్యక్రమాలకు కొంత నగదు వెచ్చిస్తున్నారు. మాగుంట కుటుంబం గత 30 ఏళ్ల నుంచి సేవా రంగంలో ఉండి తన సొంత నిధులతో ప్రజలకు తాగునీరు, విద్య అందిస్తున్నారు. శిద్దా రాఘవరావు ధార్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. శిద్దా ఎక్కువగా మఠాధిపతులు, పీఠాధిపతులకు సమయం, ధనం వెచ్చిస్తారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ‘మాగుంట’కు ప్రజాభిమానం మెండు జిల్లా ప్రజానీకంతో మాగుంట కుటుంబానిది విడదీయరాని బంధం. జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతున్న వేళ తాగునీటికి సొంత నిధులు వెచ్చించి దప్పిక తీర్చారు. నేటికీ పలు ప్రాంతాల్లో ఉచితంగా నీరు సరఫరా చేస్తున్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత నీరు అందించే ఏర్పాట్లు చేశారు. విద్యా సంస్థలు నెలకొల్పి విద్యాదాతగా పేరుపొందారు. ఒంగోలు నగర అభివృద్ధిలో చెరగని ముద్ర వేసి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు. వివాదాలకు దూరం రాజకీయ వివాదాలకు మాగుంట ఎంత దూరంగా ఉంటారో.. శిద్దా కూడా అంతే. ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా మాగుంట ఆలోచిస్తారు. శిద్దా మాత్రం తన కుటుంబానికి ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుందో బేరీజు వేసుకుని ఆచితూచి అడుగు వేస్తారన్న అభిప్రాయం ఉంది. ప్రజల నుంచి మంచితనాన్ని మాగుంట మూటగట్టుకున్నారు. శిద్దాకు గ్రానైట్ వ్యాపార రంగం నుంచి కొన్ని వివాదాలున్నా వాటిని బయటకు రానీయకుండా జాగ్రత్తగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. ఇటీవల ఒంగోలు పర్యటనకు వచ్చిన పవన్‌కళ్యాణ్ శిద్దా గ్రానైట్ వ్యాపారం, అక్రమ సంపాదన గురించి ప్రస్తావించడం గమనార్హం. నందిగం సురేష్, బాపట్ల పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ► సామాన్యుడిగా ఎంపీ టికెట్ సాధించారు ► ప్రజలు తమవాడిగా భావిస్తున్నారు ► నిత్యం నియోజకవర్గంలోనే ఉంటున్నారు ► ప్రతి సమస్యా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ► హోదా వాణిని ఢిల్లీలో వినిపిస్తానని చెబుతున్నారు ► యువకుడు కావడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు ► పార్టీకి ఉన్న సానుకూలత కలిసొస్తుందని నమ్ముతున్నారు. శ్రీరామ్ మాల్యాద్రి, బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ► ఆర్థిక బలంతోనే ఎంపీ టికెట్ సాధించారు ► ప్రజలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు ► ఎంపీ అయ్యాక నియోజకవర్గంలో ఉన్నది చాలా తక్కువ ► సమస్యలపై అవగాహన లేదు ► హోదాపై పోరాడిన దాఖలాలు లేవు ► ఎన్నికల సమయంలోనూ అంతంతమాత్రం ప్రచారమే.. ► టీడీపీపై వ్యతిరేకత ఉండడం ప్రతికూలాంశం -
డబ్బు, మద్యంతో ఓటర్లకు టీడీపీ ఎర
సాక్షి, అమరావతి : సార్వత్రికల ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. రెండు రోజుల గడువు మాత్రమే ఉండటంతో, నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో ప్రచారం చేసేందుకు రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. రాత్రివేళ కుల సంఘాలతో అత్మీయ సమావేశాలు, చోటామోటా నాయకులతో బేరసారాలు కొనసాగిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని పలు జాతీయ సర్వేలు తేల్చి చెప్పడంతో పాటు, ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కానుండటంతో , చివరి ఆస్త్రంగా ఓటర్లలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులకు ఎదురుగాలి జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఎదురీదుతున్నారు. గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రధానంగా ఎంపీగా గెలిచినప్పటి నుంచి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో, ఓట్లు అడిగేందుకు వెళితే పలుచోట్ల సొంత పార్టీ నేతనే నిలదీస్తున్నట్లు సమాచారం. సామాన్య ప్రజలు ఆయన్ను కలుసుకోవాలంటే ఇప్పటికి కుదరని పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారిక సమావేశాలకు సైతం హాజరుకాకపోవడం, పార్లమెంటు పరిధిలోని సమస్యల గురించి ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు. పదవీ కాలంలో ఆయన వ్యాపారాలు చక్కదిద్దుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కనీసం ఎంపీ నిధుల్ని అభివృద్ధి పనులకు ఖర్చు చేయక పోవడంతో , అవి మురిగిపోయే దుస్థితి నెలకొంది. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు కేవలం గల్లా జయదేవ్ గల్లా పెట్టేనే నమ్ముకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచి మరొసారి మాయ చేయాలని చూస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి లోకల్ కావడం కలిసొచ్చే అంశం. దీనికితోడు మాస్ లీడర్‌గా పేరున్న ఆయన తనదైన శైలిలో పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓటర్ల మనస్సు దోచుకుంటున్నారు. గెలుపుపై ధీమాతో ప్రచారంతో దూసుకపోతున్నారు. రాయపాటికి తప్పని తిప్పలు నరసరావుపేట తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి రాయపాటి సాంబశివరావు ప్రచారంలో వెనకంజలో ఉన్నారు. వయోభారానికి తోడు, అనారోగ్యం నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన లేకపోతున్నారు. అతికష్టం మీద టీడీపీ అధినేతల సభలకు, అక్కడక్కడా నాయకులను మాత్రమే కలుస్తున్నారు. దీనికితోడు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్ వర్గం రాయపాటికి సహకరించపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీగా గెలిచినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. కనీసం నరసరావుపేటలో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేక పోయారు. దీంతో ఆయనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. టిక్కెట్టు చివరి నిమిషంలో ఖరారు కావడంతో , ప్రచారంలో బాగా వెనుకబడి ఉన్నారు. నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలును ఏడు నెలల ముందుగానే పార్టీ సమన్వయకర్తగా ప్రకటించింది. దీంతో ఆయన ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్లమెంటు పరిధిలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలను వివరించటంతో పాటు, ప్రజలకు చేరువయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక, రెండో సారీ అన్ని పట్టణాలు, పల్లెల్ని చుట్టేసి, ప్రచారంలో దూసుక పోతున్నారు. యువకుడు, విద్యావేత్త, కష్టపడేతత్వం కల వ్యక్తి అని ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. పల్నాడుకు ప్రత్యేకంగా మేనిఫెస్టో ప్రకటించారు. పార్లమెంటు అభివృద్ధికి ప్రత్యేక విజన్‌తో ముందుకు పోతుండటంతో, ప్రజల్లో ఆయనపై నమ్మకం ఏర్పడింది. మాల్యాద్రి టిక్కెట్టు పైనే ఊగిసలాట బాపట్ల తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి శ్రీరాం మాల్యాద్రి టిక్కెట్టు చివరి వరకు అధిష్టానం ప్రకటించ లేదు. ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పదవీ కాలంలో నియోజకవర్గానికి చేసింది లేకపోవడంతో టిక్కెట్టు ఇచ్చే విషయంలోనే టీడీపీ అధిష్టానం అలోచన చేసింది. తాడికొండ అసెంబ్లీ అభ్యర్థిగా మార్చాలని చూసినా, సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ టిక్కెట్టుపై గట్టి పట్టు పట్టడంతో చివరకు అధిష్టానం, పెద్దల ఆశీస్సులతో టిక్కెట్టు సాధించినా నియోజకవర్గంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాపట్ల పార్లమెంటు స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాన్యునికి పట్టం కట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్ ఇప్పటికే నియోజక వర్గ పరిధిలో విస్తృతంగా తిరిగి ప్రజలను కలుసుకున్నారు. యువకుడు, సామాన్యుడుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందలం ఎక్కించింది. దీంతో ఓటర్లు నందిగం సురేష్‌ను ప్రత్యేకంగా అక్కున చేర్చుకుంటున్నారు. ప్రచారంలో సైతం తన దైన శైలిలో దూసుకుపోతున్నారు.మొత్తం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు ప్రచారంలో దూసుక పోతుండగా, టీడీపీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. చివరి అస్త్రంగా టీడీపీ అభ్యర్థులు ఓటర్లలను ప్రలోభ పెడుతూ, డబ్బుల పంపకాలకు తెరలేపారు. -
బాపట్లలో గెలుపు ఎవరిది?
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. 2004 వరకు జనరల్ సెగ్మెంట్‌గా ఉన్న బాపట్ల 2009 పునర్విభజన నేపథ్యంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారిపోయింది. ఇక్కడ నుంచి గెలిచిన వారిలో నలుగురు ఎంపీలు కేంద్రమంత్రులుగా పనిచేయగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాలు : గుంటూరు జిల్లాలోని వేమూరు, రేపల్లె, బాపట్ల,ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. సీఎంను అందించిన బాపట్ల బాపట్ల పార్లమెంట్ నుంచి ఎంపీలుగా గెలుపొందిన పి.అంకినీడు ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి వంటి వారు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఇక్కడ నుంచి 1998లో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బాపట్ల నుంచి పనబాక లక్ష్మి ఇక్కడ నుంచి పోటీ చేసి 69వేల భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందడమే కాకుండా కేంద్ర మంత్రిగా పనిచేశారు. పి. అంకినీడు ప్రసాద్ మినహా మిగతా తొమ్మిది మంది కొత్తవారికి ఇక్కడి ప్రజలు అవకాశం కల్పిస్తూ వచ్చారు. 11 సార్లు ఎన్నికలు జరగ్గా ఆరు సార్లు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు, ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. సామాన్యునికే పట్టం కట్టనున్న ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీలో నిలిచిన నందిగం సురేష్ మాత్రం పార్టీలో సామాన్య కార్యకర్త. ఆర్థిక బలం, అంగబలం పెద్దగా లేని సురేష్‌కు వైఎస్.జగన్ టిక్కెట్టు కేటాయించడంతోపాటు, ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేష్‌తో చదివించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సురేష్‌ను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో భారీ స్థాయిలో చేసిన అభివృద్ధి పనుల కారణంగా ప్రజలు వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపనున్నారు. మాల్యాద్రికి గడ్డుకాలమే.. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన శ్రీరామ్ మాల్యాద్రిని 2014లో బాపట్ల పార్లమెంట్ ప్రజలు గెలిపించారు. అయితే ఐదేళ్లలో ప్రజల సమస్యలు తీర్చడం మాట అటుంచితే కనీసం ముఖం కూడా చూపించని పరిస్థితి. కొన్ని గ్రామాల్లోని ప్రజలకు వాళ్ల ఎంపీ ఎవరో తెలియదంటే మాల్యాద్రి ప్రజలకు ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నారో అర్థమవుతోంది. దీనికి తోడు గుంటూరు జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో టీడీపీలో అంతర్గత విభేదాలతో నాయకులు పార్టీని వీడుతుండటం, ప్రకాశం జిల్లాలోని చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్సీపీలో చేరడం, మాజీ ఎంపీ, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్సీపీలో చేరి పర్చూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనుండటంతో ఈ సారి మాల్యాద్రి ఓటమి ఖాయంగా కనిపిస్తుంది. అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు తొలుత టిక్కెట్టు ఇచ్చారు. అయితే కార్యకర్తల్లో నిరసన వ్యక్తం కావడంతో శ్రీరామ్ మాల్యాద్రికి కేటాయించారు. – నక్కా మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు -
చీరాల టీడీపీలో ముసలం
ఆమంచి వర్సెస్ శ్రీరామ్ మాల్యాద్రి పతాక స్థాయికి చేరిన వర్గ విభేదాలు నవనిర్మాణ దీక్షకు ఎంపీని ఆహ్వానించని ఎమ్మెల్యే మాల్యాద్రి, పోతుల సునీత వర్గం గైర్హాజరు ఆగ్రహంతో రగులుతున్న ఎంపీ.. అధిష్టానానికి ఫిర్యాదు భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు ఒంగోలు: చీరాల టీడీపీలో ముసలం పుట్టింది. అధికార పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిల మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఆమంచి అధికార పార్టీలో చేరడాన్ని అటు పోతుల సునీత, ఇటు ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిలు ఆదిలోనే వ్యతిరేకించారు. అయినా ముఖ్యమంత్రి ఆమంచిని పార్టీలో చేర్చుకోవడంతో అధికార పార్టీలో వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. తాజాగా సోమవారం చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి నిర్వహించిన నవనిర్మాణ దీక్ష సభకు ఎంపీ మాల్యాద్రి, సునీత వర్గాలు హాజరుకాలేదు. దీక్షకు జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావులు హాజరైనప్పటికీ అధికార పార్టీ ఎంపీ, నియోజకవర్గ టీడీపీ నేత హాజరుకాకపోవడంపై చర్చలు మొదలయ్యాయి. ఎంపీ శ్రీరామ్, సునీతను ఎమ్మెల్యే ఆమంచి ఆహ్వానించలేదని తెలుస్తోంది. అయినా ఇద్దరు మంత్రులు ఈ విషయం తమకెందుకన్నట్లు నోరు మెదపలేదని సమాచారం. అధికార పార్టీ కార్యక్రమానికి ఎంపీ హోదాలో ఉన్న తనను పిలవకపోవడంపై ఎంపీ మాల్యాద్రి ఆగ్రహం చెంది, అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కనీసం మంత్రులు కూడా మాటమాత్రం కూడా తనను పిలవకపోవడంపై మరింత ఆవేదన చెంది, ఈ విషయంపై ఇటు జిల్లా స్థాయి, అటు రాష్ట్రస్థాయి నేతలకు ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం పోతుల సునీత వర్గం ఒంగోలులో ఉన్న ఎంపీని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. నాటి వైద్యశిబిరంలో విభేదాలకు బీజం.. చీరాల అధికార పార్టీలో ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, పోతుల సునీతలు ఒక వర్గంగా, ఆమంచి మరో వర్గంగా విడిపోయూరు. దీంతో అధికార పార్టీలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే పోతుల, ఆమంచి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుండగా, తాజాగా ఎమ్మెల్యే బాపట్ల ఎంపీల మధ్య పోరు తీవ్రరూపం దాల్చుతోంది. ఆమంచి పార్టీలో చేరిన కొత్తలో ఎంపీ మాల్యాద్రి చీరాలలో మెడికల్ క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేతో పాటు సునీతను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సునీత వర్గాలు అక్కడే గొడవకు దిగాయి. దీంతో ఆమంచిని ఎంపీ మందలించడంతో వీరి మధ్య గొడవ జరిగింది. ఇక్కడే ఇరువర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఎంపీ చీరాలలో ప్రత్యేక వర్గం కూడగట్టుకుంటుండాన్ని ఆమంచి వర్గం జీర్ణించుకోలేకపోతుంది. నాలుగు నెలల క్రితం చీరాలలో జరిగిన అంబేద్కర్ భవన్ ప్రారంభానికి సైతం ఎమ్మెల్యే ఇద్దరు మంత్రులను ఆహ్వానించినా... ఎంపీని మాత్రం పిలవలేదు. తాజాగా నవ నిర్మాణ దీక్షకు సైతం పిలవకపోవడంతో మాల్యాద్రి, సునీత వర్గాలు ఒక్కటయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. -
శాసిస్తే... ఖబడ్దార్
ఒంగోలు: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రెండో రోజైన శనివారం కూడా తీవ్ర వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశం హాలులో ప్రారంభమైన ఈ సమావేశంలో బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి మాట్లాడుతూ పలుమార్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ జడ్పీ చైర్మన్‌ను విమర్శించడంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అడ్డగోలు’ అనే పదాన్ని ఉపసంహరించుకోవాలి. సభాధ్యక్షుడ్ని గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి అంటూ హితవు పలికారు. తాను అడ్డగోలు తనంగా తీర్మానం పెట్టరాదని మాత్రమే చెప్పానని, అలా చేస్తే చట్టవిరుద్ధంగా చేశారంటూ ప్రభుత్వం రద్దుచేస్తుంది...అప్పుడు ఏం చేస్తారంటూ ఎంపీ చెబుతుండగానే జడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మరింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వంలో ఉన్నది మీరు...మంచిపనికి ..చెడ్డపనికి తేడా తెలియదా....మంచి పనిని ఫ్రభుత్వం ఎందుకు రద్దుచేస్తుంది....రాజకీయంగా మాట్లా డి జడ్పీని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. ఇప్పటికే స్టాండింగ్ కమిటీలు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఇంకా జిల్లా అభివృద్ధిని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తే జడ్పీటీసీ సభ్యులు, జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వ్యవసాయంపై చర్చ... అనంతరం వ్యవసాయశాఖపై చర్చకు జెడ్పీ చైర్మన్ అనుమతించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతూ శనగకు ప్రత్యామ్నాయంగా ఏయే పంటలు వేసుకోవాలో రైతులను చైతన్యం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని విమర్శించారు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలలో శనగలు నిల్వ ఉంచుకొని రైతాంగం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నా ప్రత్యామ్నాయ చర్యలపై మౌనం వహించడం సరికాదంటూ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రుణాలు తదితర అంశాలపైనా ప్రశ్నల పరంపర కొనసాగించారు. మార్కాపురం ప్రాంతాల్లో ఎరువులు, పురుగు మందుల ధరలు ఎంఆర్పీ కంటే దాదాపు వంద రూపాయల తక్కువకు విక్రయిస్తున్నారని, నాసిరకంగా ఉన్నాయేమో పరిశీలించాలని సూచించారు. అద్దంకి నియోజకవర్గంలో కొన్ని సొసైటీలకు ఎరువులు ఇచ్చి, మరికొన్ని సొసైటీలకు నిధులు ఇవ్వకుండా అధికారులు వ్యవహరించడం సరికాదంటూ అద్దంకి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బల్లికురవ ఏవోపై ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లోపం ఎక్కడ జరిగిందో పరిశీలించి చర్యలు తీసుకుంటామని జేడీ మురళీకృష్ణ సమాధానమిచ్చారు. ఫారెస్ట్ అకాడమీని దోర్నాలలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలి సమైక్య రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ అదిలాబాద్ జిల్లాలో ఉందని, అయితే నేడు రాష్ట్రం విడిపోయిన తరువాత నల్లమల అటవీప్రాంతం దట్టంగా ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాలలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలంటూ సమావేశంలో డేవిడ్‌రాజు సూచించారు. ప్రతిపాదనను తప్పకుండా ప్రభుత్వానికి పంపుతామంటూ జడ్పీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం అధికారులు తుఫాను ప్రభావ ప్రాంతాలలో సేవలందించేందుకు అం దుబాటులో ఉండాల్సి ఉన్నందున సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు. కైలాష్ సత్యార్థి....మలాలకు జడ్పీ అభినందనలు... బాల కార్మికుల నిర్మూలనకు , బాలికా విద్య కోసం ఒంటరి పోరాటం చేస్తూ నోబుల్ శాంతి బహుమతికి ఎంపికైన మధ్యపదేశ్ ఇంజినీర్ కైలాష్ సత్యార్థి, పాక్ బాలిక మలాలాను అభినందించే తీర్మానాన్ని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి కుమార్ ప్రవేశపెట్టగా సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ ప్రతిపాదించారు. మార్కాపురం శాసనసభ్యుడు జంకే వెంకటరెడ్డి, యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజులు మాట్లాడుతూ మధర్థెరెస్సా తరువాత నోబుల్ శాంతి బహుమతికి ఎంపికైన సత్యార్థి మన దేశవాసులందరికీ గర్వకారణమంటూ ప్రశంసించారు. 80 వేలమంది బాల కార్మికులకు విముక్తి కల్పించిన సత్యార్థికు అభినందనలు ప్రకటిస్తూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే అంశంపై కొండేపి శాసన సభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ తీర్మానాన్ని తాము కూడా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. -
అభివృద్ధి కోసం నిధులు అడిగితే మోకాలడ్డుతారా
ఒంగోలు సబర్బన్: మండలాల అభివృద్ధి కోసం నిధులడిగితే మోకాలడ్డుతారా అంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు టి.డి.పి. సభ్యులపై మండిపడ్డారు. జిల్లా కరువు కోరల్లో అల్లాడుతుంటే గ్రామాలలోని ప్రజలను ఊరట కలిగించేందుకు చిన్నపాటి అభివృద్ధి పనుల కోసం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మండలాలకు నిధులను కేటాయించేందుకు తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ సభ్యులు అడిగితే తీర్మానం కాకుండా చేసేందుకు టి.డి.పి. సభ్యులు అడ్డుకోవడం మంచి పద్దతి కాదంటూ నిలదీశారు. ప్రస్తుతం జిల్లాలో స్థాయి సంఘాలు లేకపోయినా సర్వసభ్య సమావేశంలో గ్రామాల అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ సాధారణ నిధులను కేటాయించేందుకు తీర్మానం చేయడానికి వైఎస్సార్సీపీ సభ్యులు తీర్మానం పెట్టారు. అందుకు టిడిపి సభ్యులు నిధుల కేటాయింపు సరైన పద్ధతి కాదంటూ అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు ధ్వజమెత్తారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేష్ పంచాయతీరాజ్ చట్టంలోని 187 సెక్షన్‌ను ప్రస్తావించి స్థాయి సంఘాలు లేకపోయినా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేస్తే సాధారణ నిధుల నుంచి మండలాలకు ప్రత్యేకంగా కేటాయించవచ్చని సూచించారు. దీంతో టి.డి.పి. నేత, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి అడ్డు తగిలారు. ఆర్ధిక పరమైన అంశాలను తీర్మానం చేసినప్పటికీ ప్రభుత్వ అనుమతి కావాలన్నారు. స్థానిక సంస్థలకు విధులు, నిధులు కేటాయింపుల్లో స్వయం ప్రతిపత్తి ఉందని అందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ ఎంపీని అడ్డుకున్నారు. అప్పటికే సభలోఉన్న టి.డి.పి. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్థన్, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, కదిరి బాబూరావులు సభలో లేకపోవడంతో ఏవిధంగానైనా సభలో జరుపతలపెట్టిన తీర్మానాన్ని కాకుండా చేయాలంటూ బాపట్ల ఎంపీ మాల్యాద్రి హైడ్రామా నడిపారు. అందుకు టి.డి.పి. జెడ్పిటీసీ సభ్యులు కూడా ఆయనకు వంతపాడడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే కాలాతీతం కావడం సమయం సాయంత్రం 6.30 గంటలు దాటటంతో ఎక్కువ మంది సభ్యులు సభను వీడి వెళ్లిపోయారు. దీనిని గమనించిన టి.డి.పి. సభ్యులు వాకౌట్ చేయడమే సరైన పద్దతని నిర్ణయించుకుని వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి బయటకు వెళ్లిన తరువాత వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, సభ్యులు మండలాలకు ప్రత్యేక నిధులను కేటాయించే తీర్మానాన్ని చేయాలని జెడ్పీ ఛైర్మన్ డా. నూకసాని బాలాజీపై ఒత్తిడి తెచ్చారు. ఛైర్మన్‌కు సభ్యులకు మధ్య కొంత సేపు వాదనలు కూడా జరిగాయి. తీర్మానం చేయాలన్నా మూడవ వంతు సభ్యుల కోరం అవసరమని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి కాబట్టి తీర్మానం చేయడం కష్టమని తెగేసి చెప్పారు. ఎక్కడ తీర్మానాన్ని ఆమోదింపజేసుకుంటారోనని వాకౌట్ చేసి బయటకు వెళ్లిన టిడిపి సభ్యులు, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రితో సహా తిరిగి మళ్లీ సమావేశ మందిరంలోకి వచ్చారు. నిబంధనల మేరకు తీర్మానాన్ని ఆమోదించాలి కాబట్టి సభను వాయిదా వేయడం మినహా మరో మార్గం లేదంటూ ఛైర్మన్ సభను వాయిదా వేశారు. చర్చకు రాకుండానే వాయిదా ఒంగోలు: జిల్లా పరిషత్ సమావేశంలో మొత్తం 20 శాఖలపై సమీక్షించాలని జిల్లా పరిషత్ చైర్మన్ నిర్ణయించారు. ఈ మేరకు 20 అంశాల అజెండా కాపీని కూడా జిల్లా పరిషత్ సభ్యులందరికీ పంపిణీ చేశారు. జడ్పీ సభ్యులకు సంబంధించి మండల అభివృద్ధికి నిధులు కేటాయించాలనే అంశం చర్చకు వచ్చి మిగిలిన 16అంశాలు చర్చకు రాకుండానే వాయిదాపడ్డాయి. వాయిదాపడ్డ వాటిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖ, ఇరిగేషన్ డిపార్టుమెంట్, ఉద్యానవనశాఖ, పశు సంవర్థకశాఖ, హౌసింగ్ కార్పోరేషన్, జిల్లా పంచాయతీ కార్యాలయం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమం, విద్యుత్, పౌరసరఫరాలశాఖ, సంక్షేమ శాఖలు మరియు సంక్షేమ వసతి గృహాలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రోడ్లు మరియు భవనాల శాఖ, గనులు, భూగర్భశాఖ, సామాజిక అటవీ విభాగంలపై ఎటువంటి చర్చలు జరగకపోవడం గమనార్హం. వీటిలో గనులకు సంబంధించి జిల్లా పరిషత్‌కు వచ్చే ఆదాయంలో కొంత ఆదాయం తమకు కూడా వస్తుందని క్రీడాకారులు భావించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. -
పొత్తు పెటాకులు
సంతనూతలపాడులో ‘దేశం’ రగడ బీజేపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు బీఫారం పంపిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి బాపట్ల ఎంపీ అభ్యర్థి చ్చరికతో ‘ధర్మం’తప్పిన అధిష్టానం చంద్రబాబు వైఖరితో బీజేపీ నాయకుల ఆవేదన సాక్షి ప్రతినిధి, ఒంగోలు తెలుగుదేశం, బీజేపీల మధ్య కుదిరిన పొత్తు సంతనూతలపాడులో పెటాకులయ్యింది. బీజేపీకి ఈ స్థానాన్ని కేటాయించిన నాటి నుంచి సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీలో రగడ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ సీటు బీజేపీదేనని అంటూ వచ్చిన తెలుగుదేశం, పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించింది. సంతనూతలపాడులో తెలుగుదేశం పార్టీ కూడా నామినేషను దాఖలు చేసింది. దీనికి బీ ఫారం కూడా ఆగమేఘాల మీద శనివారం హైదరాబాద్ నుంచి పంపించింది. ఈ వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం తరఫున నామినేషన్ వేసిన బీఎన్.విజయకుమార్ తాను స్వతంత్రంగానే పోటీ చేస్తానని భీష్మించుకుని కూర్చోవడంతో, సుజనా చౌదరి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. శనివారం ఉదయం టెలిఫోన్లో మాట్లాడిన సుజనా చౌదరి, బీఫారంను విమానంలో పంపినట్లు తెలుస్తోంది. విజయకుమార్‌కు సీటు ఇవ్వకపోతే, తెలుగుదేశం పార్టీకి చెందిన సంతనూతలపాడు ఓట్లు తనకు రావని, ఆ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రి హెచ్చరించినట్లు తెలిసింది. ఒక దశలో విజయకుమార్‌కు బీ ఫారం ఇవ్వకపోతే, తాను పోటీ నుంచి విరమించుకుంటానని కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో బీఫారం పంపినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కూడా తెలియజేయలేదని సమాచారం. తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించకపోవడంపై, బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొత్తుపెట్టుకున్న తరువాత, విధిగా తమకు రావాల్సిన స్థానాలను తమకు ఇవ్వాలని అంటున్నారు. ఇప్పటికే శ్రీకాకుళంలో ఒక స్థానాన్ని వారికి తిరిగి ఇచ్చామని అంటున్నారు. అంత చేసినా, సంతనూతలపాడును కూడా వారు తీసేసుకుని, బీజేపీని తీవ్రంగా మోసం చేశారని అన్నారు. దీనిపై సంతనూతలపాడు బీజేపీ అభ్యర్థి దారా సాంబయ్య మాట్లాడుతూ పొత్తు ధర్మానికి తిలోదకాలిచ్చిన విషయం అందరికీ తెలుసని, ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. బీజేపీ అగ్రనాయకులకు తెలియజేయలేదా అనే ప్రశ్నకు ఇప్పటికే అన్ని టీవీ చానళ్లలో ఈ విషయం వచ్చిందని, అందరికీ తెలిసినా, మౌనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాత్రం యథావిధిగా ప్రచారం చేసుకుంటున్నానని, అంతిమ తీర్పు ప్రజలు ఇస్తారని అన్నారు. అయితే బీజేపీకి ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు, ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలుస్తాడా అనే సందేహాన్ని పలువురు నేతలు వ్యక్తం చేయడం గమనార్హం. బీజేపీ నాయకుల మండిపాటు సాక్షి, ఒంగోలు :స్థానిక ఆంధ్రకేసరి కళాశాలలో శనివారం సాయంత్రం బీజేపీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీపై మండిపడ్డారు. విజయ్‌కుమార్‌కు పార్టీ తరఫున బీఫారం ఇవ్వడం అంత తేలికైన విషయంగా భా వించడం లేదన్నారు.ఆ పార్టీ నమ్మకద్రోహంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రపార్టీ నేతలు బత్తుల నరసింహారావు, బొద్దులూరి ఆంజనేయులు, ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి దారా సాంబయ్య మాట్లాడుతూ సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల్లో స్థానికంగా ఉన్న కొందరు పారిశ్రామికవేత్తలు తెర వెనుక చక్రం తిప్పి బీఎన్ విజయ్‌కుమార్‌ను బరిలోకి దింపుతున్నట్లు అనుమానం వ్యక్తంచేశారు. టీడీపీ బీఫారం ఇచ్చిన సంగతి అధినేత చంద్రబాబుకు తెలియదని భావిస్తున్నామని, ఆయనతోనే ఈవిషయంపై తాడోపేడో తేల్చుకునే ప్రణాళికలో ఉన్నామన్నారు. తక్షణమే బీఎన్ విజయ్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ టీడీపీ అభ్యర్థి బరిలోనే ఉన్నప్పటికీ తాము వెనుకంజవేసే ప్రసక్తేలేదన్నారు. ఆరునూరైనా పోటీ చేస్తానంటూ దారా సాంబయ్య స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీ గెలుపునకు టీడీ పీ సహకరిస్తోం దని చెప్పారు. చీరాలలో శనివారం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో తాము పాల్గొనడం లేదని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు మువ్వల వెంకటరమణ, సీవీ రామకృష్ణ పాల్గొన్నారు.