sudden check
-
మినిస్టర్ మాస్టారు!
సంగారెడ్డి రూరల్: ప్రభుత్వ, రాజకీయ కార్యకలాపాలతో నిత్యం తీరిక లేకుండా గడిపే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మాస్టారు అవతారం ఎత్తారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి.. మండల కేంద్రమైన కందిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్రం, గణితం తదితర సబ్జెక్టుల్లో పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి విషయ పరిజ్ఞానాన్ని పరిశీలిం చారు. ఎన్ని ఎక్కాలు వచ్చు.. అని అడిగి 17వ ఎక్కం చదవాలని సూచించారు. విద్యార్థులు ఎవరూ చెప్పలేకపోయారు. కనీసం 12, 13వ ఎక్కం చెప్పాలని అడిగినా చెప్పలేని విద్యార్థులు తమకు కేవలం పదవ ఎక్కం వరకు మాత్రమే వచ్చని తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో ఉపాధ్యాయుల పేర్లను రాయాలని మంత్రి అడగడంతో ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు మాత్రమే సక్రమంగా రాయగా, నలుగురు రాయలేకపోయారు. దీంతో మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే విద్యార్థులు ఎలా పాసవుతారని మంత్రి ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. అన్ని సబ్జెక్టుల్లో అవగాహన ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువులో వెనుకబడి ఉంటే ఉత్తీర్ణత సాధించడం కష్టంగా ఉంటుందన్నారు. ఇలాంటి చదువులతో పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తారని ప్రశ్నించారు. వెనుకబడిన టెన్త్ విద్యార్థులపై శ్రద్ధపెట్టి ప్రత్యేక తరగతులు నిర్వహించి, బాగా చదివించాలని టీచర్లను ఆదేశించారు. విద్యార్థులందరూ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దాలన్నా రు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. -
మంత్రి శంకర్ నారాయణ ఆకస్మిక తనిఖీలు
-
పగలు స్కూల్.. రాత్రి హోటల్..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసేందుకు వెళ్లిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అక్కడి దృశ్యాలను చూసి విస్తుపోయారు. గురువారం రాత్రి కళ్యాణ్‌పురిలోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్‌ను సందర్శించిన సిసోడియా తరగతి గదిలో ఓ జంట ఉండటంతో అవాక్కయ్యారు. వారు ఏకంగా తరగతి గదిలోనే వంటా వార్పూలో మునిగిపోవడంతో మంత్రితో పాటు పోలీస్ అధికారులు, ఇతరులు ఆశ్చర్యపోయారు. ఆ గదిలో ఇంకా గ్యాస్ సిలిండర్, కార్పెంటర్ పరికరాలతో గూడిన బ్యాగ్ కనిపించాయి. స్కూల్ గార్డు తమ బంధువులకు తరగతి గదిని రెంట్‌కు ఇచ్చారని మంత్రి ఆరా తీయగా వెల్లడైంది. మూడు నెలలుగా ఈ తంతు జరుగుతున్నదని చెప్పడంతో సిసోడియా కంగు తిన్నారు. ఈ విషయం స్కూల్ ప్రిన్సిపల్కూ తెలుసని స్కూల్ సెక్యూరిటీ గార్డు చెప్పడం గమనార్హం. మంత్రి అనంతరం స్కూల్ నిర్వాకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలను ఏ మాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. -
బుల్లెట్‌పై హరీశ్
సిద్దిపేటలో ఆకస్మిక తనిఖీలు సిద్దిపేటజోన్: ప్రభుత్వ వాహనం లేదు.. కాన్వాయ్ సందడి లేదు.. చుట్టూ అధునా తన ఆయుధాలతో ఉండే అంగరక్షకులు లేరు. ద్విచక్ర వాహనంపై ఎలాంటి బందో బస్తూ లేకుండా, సాదాసీదాగా మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌ను వెంటపెట్టుకుని రెండు గంటల పాటు పట్టణమంతా పర్యటించారు మంత్రి హరీశ్‌రావు. పార్టీలో ఆరడుగుల బుల్లెట్‌గా చెప్పుకొనే హరీశ్... ఆదివారం తెల్లవారుజాము నుంచి బుల్లెట్‌పై పట్టణమంతా కలియతిరుగుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. మంత్రి పర్యటన విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు బందోబస్తు నిమిత్తం వచ్చినప్పటికీ వారిని పంపించి సమస్యలను పరిశీలించారు. పలు కాలనీల్లో, ప్రధాన రోడ్ల వెంట ఆయన బుల్లెట్‌పై తిరుగుతూ పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. హరితహారం కింద పాత బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. పాత బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన మైటౌన్ ఎల్ఈడీ స్క్రీన్‌ను చూసిన ఆయన.. దాని స్థానంలో పెద్దసైజులో స్క్రీన్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు సూచించారు. అనంతరం మెదక్ రోడ్డులోని రైతుబజార్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు, చైర్మన్‌కు సూచనలు చేశారు. -
డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీ
కూసుమంచి: ఉప ముఖ్యమంత్రి, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య కూసుమంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ ఇక్కడ ఆగారు. ఆస్పత్రిలోకి డిప్యూటీ సీఎం ఒక్కసారిగా రావడంతో సిబ్బంది హడలెత్తిపోయారు. ఉరుకులు, పరుగులు పెట్టారు. రాజయ్య నేరుగా మెడికల్ ఆఫీసర్ గదిలోకి వెళ్లి ఓపీ రిజస్టర్లు, ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ శంకర్‌కుమార్ ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో నిల్వ ఉంచిన కుక్కకాటు, పాముకాటు మందులను తెప్పించి పరిశీలించారు. ఈ మందులను ఎల్లప్పుడు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ల్యాబ్ రూమ్‌ను పరిశీలించారు. ఇదే ఆస్పత్రి ఆవరణలో ఉన్న హోమియో ఆస్పత్రిని కూడా సందర్శించారు. ఆస్పత్రికి కొత్త భవనం కావాలని వైద్యాధికారి నర్సింహరాజు కోరడంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం వచ్చిన సమయంలో కొందరు పేషంట్లు ఆస్పత్రిలోనే ఉన్నారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఉమా మహేష్ అనే బాలుడిని ఆయన స్వయంగా పరీక్షించి, మందులు రాసి ఇచ్చారు. నువ్వు కూడా నాలా డాక్టర్ కావాలంటూ ఆ బాలుడిని దీవించారు. ఆస్పత్రికి వచ్చిన వృద్ధురాలను పలుకరిస్తూ పింఛన్ వస్తోందా అని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీ స్థాయిని పెంచాలి నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచిలోని పీహెచ్సీ స్థాయిని పెంచాలని స్థానిక టీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి సరిత, బారి వీరభద్రం, మాదాసు ఉపేందర్, రంజాన్ తదితరులు డిప్యూటీ సీఎం రాజయ్యను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. నాయకులు కూడా ఆస్పత్రుల అభివృద్ధికి సహకరించాలని రాజయ్య సూచించారు. ఆస్పత్రి నిర్వహణ సరిగా లేదని, డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని కూసుమంచికి చెందిన బారి వీరభద్రం ఫిర్యాదు చేయగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం చేసే వారిని సహించేది లేదన్నారు. ఆస్పత్రి తెరవకపోతే తనకు ఎవరైనా నేరుగా ఫోన్ చేయొచ్చని సూచించారు. -
నోయిడా పార్కుల్లో ‘మహిళా శక్తి’
నోయిడా: మహిళా శక్తి సమాజిక్ సమితి సభ్యులు గ్రేటర్ నోయిడా నగరంలోని పార్కుల్లో ఆకస్మిక తనిఖీలను మళ్లీ ప్రారంభించారు. పార్కుల్లోని ఆహ్లాదకరమైన వాతావారణాన్ని ఆస్వాదించాలే తప్ప అసభ్యంగా ప్రవర్తించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నామని సమితి సభ్యులు చెబుతున్నారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా జంటలు వ్యవహరించాలని సూచిస్తున్నామని అంటున్నారు. కానీ, ఇది ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పని, అయితే స్వచ్ఛందంగా సమితి సభ్యులు పార్కులను తనిఖీలు చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెలలో జంట పట్ల దురుసుగా.. గత నెలలో నగరంలోని పార్కుల్లో నైతిక పరివర్తన పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సమితి సభ్యులు ఓ జంట పట్ల దురుసుగా వ్యవహరిం చారు. దీంతో సభ్యులకు పోలీసులు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇది గడిచి నెల రోజులు కాక ముందే సమితీ సభ్యులు మళ్లీ గురువారం పార్కుల్లో నైతిక ప్రవర్తనపై పర్యాటకులకు అవగాహన కల్పించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. అయితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పర్యాటకుల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సమితి చర్యలను పోలీసులు తప్పుబడుతున్నారు. నైతిక ప్రవర్తనపై అవగాహన కల్పిస్తున్నాం.. రూపా గుప్తా సమితి అధ్యక్షురాలు రూపా గుప్తా మాట్లాడుతూ.. సమితికి చెందిన ఆరుగురు మహిళలు, స్థానికులు కలిసి రోజూ సాయంత్రం పార్కులను తనిఖీలు చేస్తారని చెప్పారు. ఈ తనిఖీల ద్వారా అనుకూల ఫలితాలు సాధించామని చెప్పారు. మొదటి డ్రైవ్‌లోనే చాలామంది ప్రజల్ని పార్కుల్లో గౌరవంగా ఉండేలా అవగాహన కల్పించామని చెప్పారు. పార్కుల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే అంశాలపై కొన్ని జంటలకు అవగాహన కల్పించామని చెప్పారు. అసభ్యంగా వ్యవహరించడం తప్పుగా సూచించామని, ఇలాంటి దృశ్యాలు పార్కులకు వచ్చే చిన్నారులపై దుష్ర్పభావాన్ని చూపుతాయని సూచించారు. ప్రధానంగా భారతీయ సమాజం ఉన్నతిని పరిరక్షించే నైతిక విలువ గురించి వివరించామని చెప్పారు. గతవారం చేపట్టిన ‘పార్కుల్లో నైతిక ప్రవర్తనపై స్పెషల్ డ్రైవ్’ సత్ఫలితాలిచ్చిందని అన్నారు. ఇలాంటి సమయంలో నగర పోలీసులు సమితి సభ్యులకు సహకరించాలని కోరారు. తనిఖీల సమయంలో పోలీసులు దూరంగా ఉండాలని కోరారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: ఎస్హెచ్ఓ ‘మేం కూడా పార్కుల్లో నైతిక పరివర్తనపై పర్యాటకులకు అవగాహ కల్పించాలని నిర్ణయించాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తాం, కానీ సమితీ సభ్యులతో కలిసి పనిచేయలేమని ఎస్హెచ్ఓ సమర్జిత్సింగ్ కాసనా అన్నారు. గతవారం సమితి సభ్యులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో దురుసుగా వ్యవహరించారని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు. -
ప్రమాణాల స్వామికే పంగనామాలా!
*కాణిపాకం దేవస్థానం గోడౌన్లో నాసిరకం సరుకులు *పాలకమండలి తనిఖీల్లో బయటపడిన వైనం *మిరియాల్లో ఎక్కువగా బొప్పాయి గింజలు *కుంకుమ పువ్వుకు బదులుగా కొబ్బరి పువ్వు కాణిపాకం : ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడినే కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారు. స్వామివారి ఏకాంత సేవకు వినియోగించే సరుకులను కూడా నాసిరకమైనవి సరఫరా చేస్తున్నారు. శుక్రవారం పాలకమండలి సభ్యుల ఆకస్మిక తనిఖీలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే లడ్డూ పోటును పాలకమండలి సభ్యులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లో నాసిరకం, నకిలీ సరుకులు ఉండడాన్ని గుర్తించారు. మిరియాల్లో ఎక్కువగా బొప్పాయి గింజలు ఉన్నాయి. కుంకుమపువ్వుకు బదులు కొబ్బరి తురిమి రంగు వేసి పదార్థాన్ని కాంట్రాక్టర్ సరఫరా చేసి ఉన్నారు. జీడిపప్పు మూడవ రకం, అభిషేక ప్రసాదాలకు వినియోగించే బియ్యం రెండో రకం ఉన్నారుు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్పర్సన్ లతా రాజ్‌కుమార్, సభ్యులు సుబ్రమణ్యం రెడ్డి,ఆలయ ఏఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తనిఖీల అనంతరం పాలక మండలి చైర్పర్సన్ లతా రాజ్‌కుమార్ మాట్లాడుతూ నాసిరకం, నకిలీ వస్తువులను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. నాసిరకం,నకిలీ సరుకులను పంపిణీ చేస్తున్నా ఆలయ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. స్వామివారి ఆర్జిత సేవకు వినియోగించే కుంకుమ పువ్వు సైతం నకిలీది కావడం బాధాకరమన్నారు. నకిలీ,నాసిరకం వస్తువుల వల్ల ప్రసాదాల నాణ్యత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అధికారుల సహకారమేనా? గత కొన్నేళ్లుగా తిరుపతికి చెందిన ఓ కాంట్రాక్టర్ స్వామివారి ఆలయానికి అవసరమైన సరుకులను అందిస్తుంటారు. వీటిని టెండరు ద్వారా మూడు నెలలకు ఒకసారి తెప్పించుకుంటుంటారు. బిల్లులు లక్షల్లో ఉంటున్నాయి. దీన్నిబట్టి ఎడాదికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలను మింగిస్తున్నారని తెలుస్తోంది. దేవస్థానం అధికారుల సహకారం వల్ల నాసిరకం సరుకులు సరఫరా అవుతున్నాయా అనే అనుమానాలున్నాయి.