పాముకాటుతో మహిళా రైతు మృతి
ముదిగుబ్బ : మండల పరిధిలోని నలాయకుంటపల్లిలో శనివారం సుజాత(38) అనే మహిళ పాముకాటుకు గురై మృతి చెందారు. వ్యవసాయ బోరుబావి కింద సాగుచేసిన కాయగూరల తోటలో కూలీలతో పని చేయిస్తుండగా ఆమెను పాము కరిచింది. చికిత్స కోసం హుటాహుటిన మండల కేంద్రంలోని ముదిగుబ్బకు తీసుకొచ్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించారు. మృతురాలికి భర్త చెన్నప్ప, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.