Sunitha Tati
-
‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం
‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న ఓ పెద్ద నేరం గురించి ఇండియాలో ఎవరూ మాట్లాడటం లేదు. మా ‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం కాబట్టి ప్రతి మహిళ ఈ చిత్రం చూడాలి’’ అని నిర్మాత సునీత తాటి అన్నారు. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్‌లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని’. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘గురు ఫిల్మ్స్‌పై నిర్మించిన 7వ చిత్రం ‘శాకిని డాకిని’. మహిళల సమస్యలపై మహిళలే మాట్లాడితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారని లీడ్ రోల్స్‌లో రెజీనా, నివేదలను తీసుకున్నాం. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. ఇదొక యూనివర్శల్ కథ.. అందరికీ నచ్చుతుంది. సుధీర్ వర్మ వేరే షూటింగ్లో ఉండటం వల్లే ‘శాకిని డాకిని’ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు.. నేటి నుంచి పాల్గొంటారు. సురేశ్ బాబుగారితో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ. మన చిత్రాలు కొరియన్, జపాన్ భాషల్లో చాలా రీమేక్ అవుతున్నాయి. థియేటర్లో సినిమా చూసినప్పుడు అందరం నవ్వుతాం.. ఏడుస్తాం. అదే ఓటీటీలో అయితే ఇంట్లో పర్సనల్‌గా అనుభూతి పొందుతాం. థియేటర్ అనుభూతే వేరు. మా బ్యానర్లో మరో నాలుగు కొరియన్ సినిమాలు రీమేక్ చేయనున్నాం.. వాటిలో సమంతతో ఓ సినిమా ఉంటుంది. డైరెక్టర్ బాపుగారంటే నాకు ఇష్టం. ఆయనలాంటి మూవీస్‌తో పాటు, ‘అవతార్’ లాంటి ఫ్యాంటసీ సినిమాలు డైరెక్ట్ చేయాలనుంది.. చేస్తాను’’ అన్నారు. -
ప్రతివారం ఓ బాహుబలి రాదు
‘‘నా దృష్టిలో కథ అనేది ఓ ప్రయాణం. కానీ కొన్ని పరిమితుల కారణంగా కథారచయితలకు మనం ఎక్కువగా ఫ్రీడమ్ ఇవ్వడం లేదని నాకనిపిస్తుంటుంది. అందుకే ఎక్కువగా కొరియన్ సినిమాలను రీమేక్ చేస్తున్నాం. అయినా కథలో సోల్‌ను తీసుకుని, మన నేటివిటికీ తగ్గట్లుగా మార్పులు చేయడం అనేది సులువైన పనేం కాదు. ‘శాకిని డాకిని’ సినిమాకు అక్షయ్ అనే కుర్రాడు స్క్రీన్‌ప్లే అందించాడు’’ అన్నారు సునీత తాటి. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు, సునీత తాటి, హ్యూన్యు థామస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఓ క్రైమ్‌ను ఎలా డీల్ చేశారు? అన్నదే ఈ సినిమా కథ. ‘మిడ్నైట్ రన్నర్స్’ చిత్రంలో హీరోలు నటించారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్స్‌ను పెట్టాం. ఇక మన దగ్గర కాస్త కథల కొరత ఉందని నా ఫీలింగ్. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన రాజమౌళిగారు ఉన్నారు. కానీ ప్రతి వారం ‘బాహుబలి’ లాంటి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే సినిమాలు థియేటర్స్‌కు రావు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రీమేక్ రైట్స్ కావాలని కొందరు ఫిల్మ్‌మేకర్స్ నన్ను సంప్రదించారు. ఈ విషయాన్ని రాజమౌళిగారి దృష్టికి తీసుకుని వెళ్లాను’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రంలో దామిని అనే పాత్ర పోషించాను. ఈ సినిమా నా కెరీర్లో ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రెజీనా. ‘‘ఈ చిత్రంలో షాలిని పాత్ర చేశాను. ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల టికెట్ డబ్బులు వృథా కావనే నమ్మకం మాకుంది’’ అన్నారు నివేదా థామస్. చదవండి: (నన్నీ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే) -
సినిమాల్లో... సగమెక్కడ?
వాళ్ళు... ఆకాశంలో సగం! అందరి జీవితాల్లోనూ సగం!! ప్రతి మనిషి జీవితానికీ మూలం వాళ్ళే! ప్రతి మగాడి విజయం వెనుకా వాళ్ళే!! కళలకు కేంద్రం వాళ్ళే! కలలకు అందమూ వాళ్ళే!! కానీ... పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలకు దక్కాల్సిన స్థానం దక్కుతోందా? సినీ లోకంలో స్త్రీకి ప్రాధాన్యం లభిస్తోందా? నలుగురు మహిళా టెక్నీషియన్లతో స్పెషల్ డిస్కషన్ ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు , మళ్లీ రాత్రి 11.30కు ‘మహానటి’ సినిమా చేసేప్పుడు ఈ సినిమాకు చెందిన యూనిట్లో 99శాతం మంది మహిళలే ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది - అనీ మాస్టర్, కొరియోగ్రాఫర్ పాతికేళ్ళ క్రితం నేను ఫస్ట్ సినిమాల్లో జాయిన్ అవుతానన్నప్పుడు మా నాన్నగారు కాళ్లు విరగ్గొడతానన్నారు. ఇప్పుడైతే పరిస్థితులు మారాయి. స్త్రీల టీమ్ వల్ల సినిమాలో మెల్ల మెల్లగా ఫిమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది. - సునీత తాటి, నిర్మాత ఇప్పుడు మేం మహిళా సాంకేతిక నిపుణులుగా రాణిస్తున్నాం అంటే అందుకు భానుమతీ రామకృష్ణ వంటి తొలితరం వారు వేసిన పునాదులే కారణం. స్త్రీలు సినిమాల్లోకి వస్తే... మన ఇంట్లో వాళ్ళ కన్నా... ఎదురింటి, పక్కింటివాళ్ళ వల్లే పెద్ద ప్రాబ్లమ్! - చైతన్య పింగళి, రైటర్ అండ్ కో-డైరెక్టర్ ఒక మహిళా సాంకేతిక నిపుణురాలిగా నేను రాణిస్తున్నాను అంటే దానికి కారణం నా కుటుంబం నుంచి నాకు లభించిన సపోర్టే. - మోనికా రామకృష్ణ ప్రొడక్షన్ డిజైనర్ - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ