Suryarao
-
తెలుగు సాంస్కృతిక వికాస రారాజు
పిఠాపురం మహారాజారావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ (1885 –1965) ఆంధ్రదేశపు సంస్కరణ పోషణకు, సాంస్కృతిక కళా వికాసానికీ, సత్పరిపాలనకూ ఎనలేని కృషి చేశారు. తన గురువు దివాన్ మొక్కపాటి సుబ్బారాయుడు చూపిన అభ్యుదయ మార్గంలో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికై అలుపెరుగక పరిశ్రమించారు. వివిధ రంగాల్లో సూర్యారావు చేపట్టిన కార్యక్రమాలు ఎన్నదగ్గవి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ పిలుపునందుకుని పాతిక వేలు అందించి, ఆనాటి జమీందార్లలో దేశభక్తికి ఊపిరులూదారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన ‘శాంతినికేతన్’ కలకత్తాలోని సిటీ కాలేజి; రాజమండ్రిలోని ఆస్తిక కళాశాల, టౌన్ హాలు నిర్మాణానికీ ఆర్థికంగా ఆయన అందించిన సేవలు అనన్యసామాన్యమైనవి. సంఘ సంస్కరణోద్యమానికి బాటలు వేసిన ‘బ్రహ్మసమాజం’ కార్యక్రమాలకు అన్ని విధాలా సాయం అందించారు. 1933లో బ్రహ్మసమాజ సూత్రధారి రాజా రామ్మోహన్రాయ్ శత వర్ధంతిని నిర్వహించారు. ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని ఈ సందర్భంగా ప్రచురించారు. అలాగే నాలుగవ అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ గౌరవాన్ని పొందిన రెండవ భారతీయ రాజుగా ఘనత సాధించారు. ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ను మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లాంటి సమగ్రమైన నిఘంటువు తెలుగులో కూడా అవసరమనే ఆశయంతో ‘సూర్యరాయాంధ్ర’ నిఘంటువు నిర్మాణాన్ని ఒక బృహత్కార్యంగా చేపట్టి తెలుగుజాతికి అందించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అనాథ ఆశ్రమంగా ‘కరుణాలయం’ స్థాపించారు. నిమ్న వర్గాల పురుషుల పేరు చివర ‘గాడు’ను చేర్చి అవమానకరంగా పిలవడాన్ని నిషేధిస్తూ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బిల్లును ప్రవేశపెట్టి విజయం సాధించారు. గాంధీజీ చేపట్టిన మద్యపాన నిషేధ ఉద్యమం కంటే ముందుగానే పిఠాపురం సంస్థాన పరిధిలో కల్లు తాగడాన్ని నిషేధించారు. కాకినాడలోని పీఆర్ కళాశాల ద్వారా దేశంలో అత్యున్నత విద్యనందించి చరిత్రలో ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎనలేని కృషి చేసిన పిఠాపురం రాజాను స్మరించుకోవడం మన బాధ్యత. – ర్యాలి ప్రసాద్, చారిత్రక పరిశోధకులు (అక్టోబర్ 5న పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూర్ జయంతి) -
సాంస్కృతిక పునరుజ్జీవన సారథి
కళా సాంస్కృతిక సారస్వత పిపాసిగా, ప్రజా తంత్రవాదిగా పేరొందిన పిఠాపురం మహారాజా రావువెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ (1885–1965) తెలుగు నేల మీద సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవితాంతం తోడ్పడిన మహామనీషి. అణగారిన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు ఆలోచించిన అరుదైన మానవతావాది. యావత్ దేశానికి తన సేవలు అందించిన అజరామర కృషీవలుడు. స్వయంగా కవి, రచయిత, రసజ్ఞుడు, తత్వవేత్త అయిన సూర్యారావు జీవితం నిజానికి ఒక మహా సముద్రం. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, మొక్కపాటి సుబ్బారాయుడు మొదలగు ఉద్దండుల సార«థ్యంలో అనేక రంగాల్లో సూర్యారావు చేసిన సేవలు ఎన్నదగ్గవి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ విరాళాల కోసం ప్రపంచవ్యాప్తంగా పిలుపు ఇచ్చినపుడు పాతిక వేలు పంపిన రాజావారి పేరు ఆనాడే దేశవ్యాప్తంగా మారుమోగింది. రవీంద్రనాథ్ టాగోర్ శాంతినికేతన్, కలకత్తాలోని సిటీ కాలేజి మొదలు రాజ మండ్రిలోని ఆస్తిక కళాశాల, టౌన్ హాలు వరకూ ఆర్థికంగా ఆయన వితరణ పొందని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. ఆధునిక సంఘ సంస్కరణోద్యమానికి గొప్ప తోడ్పాటు నిచ్చిన బ్రహ్మసమాజోద్యమ చరిత్రలో చెరగని ముద్ర సూర్యారావుది. దక్షిణ భారతదేశంలో ఈ ఉద్యమానికి ఎనలేని సేవచేసిన వ్యక్తి ఆయన. యావత్ దేశంలోనే తలమానికమనే విధంగా ఎంతో ఖర్చుపెట్టి కాకినాడలో బ్రహ్మసమాజ మందిరాన్ని నిర్మించి హేమచంద్ర సర్కార్ వంటి నేతని బెంగాల్ నుండి ముఖ్య అతిథిగా తీసుకు వచ్చిన రాజాగారు, వంగదేశ మేధావి పండిత శివనాథ శాస్త్రిగారు రచించిన ‘బ్రహ్మ సమాజ చరిత్ర’ అనే బృహత్తర గ్రంథాన్ని కాకుండా, 1933లో రాజారామ్మోహన్ రాయ్ శతవర్ధంతిని జరిపి ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని ప్రచురించారు. ఆధ్యాత్మిక సమానత్వాన్ని ఇతోధికంగా ప్రచారం చేసిన సూర్యారావు నాలుగవ అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బరోడా మహారాజు మినహా ఈ ఖ్యాతిని అందుకున్న ఏకైక భారతీయ మహారాజు ఈయన మాత్రమే. వైజ్ఞానిక ప్రగతిని మనçస్ఫూర్తిగా ఆహ్వానించి తూర్పు, పాశ్చాత్య దేశాల సమన్వయాన్ని ఆకాంక్షించారు. అసంఖ్యాక విశిష్ట గ్రంథాలను ప్రచురించడం, అనేకమంది బుద్ధి జీవులకు తోడ్పాటును అందించడం చేసిన సూర్యారావు ఆంధ్ర సాహిత్య పరిషత్తును మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వంటిది తెలుగులో కూడా తీసుకురావాలనే సంకల్పంతో సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి అనితరసాధ్యమైన మహత్కార్యాన్ని చేబట్టి సుసాధ్యం చేసారు. ఆర్థికత కంటే ఆత్మగౌరవమే ప్రధానమని నమ్మిన సూర్యారావు ఆఖరు క్షణం వరకూ అలానే బతికారు. అనాథల కోసం దక్షిణ భారతదేశం లోనే మొట్టమొదటి ఆశ్రమంగా ‘కరుణాలయం’ స్థాపించారు. బహుజనుల కోసం కంటి తుడుపు చర్యలు కాకుండా, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, బహుజనుల్ని పేరు చివర గాడు అని చేర్చి హీనంగా సంబోధించే సమాజంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంతోమంది ఛాందస సాంప్రదాయవాదులు వ్యతిరేకించినప్పటికీ గ్రామాల్లో ‘గాడు’ అనే పదంతో ఉత్పత్తి కులాల వార్ని, ముఖ్యంగా దళిత బహుజనుల్ని పిలవడాన్ని నిషేధించాలనే బిల్లును ప్రవేశపెట్టి దుమారం రేపారు. భాష, సాహిత్యం, సంగీతం, చిత్రకళ, తర్కం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, క్రీడలు, రాజకీయాలు, సేవా రంగం, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా అనేకానేక అంశాల్లో కృషిచేసి ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎంతో కృషిచేసిన పిఠాపురం మహా రాజా సూర్యారావు కృషిని స్మరించుకోవడం సాంస్కృతిక పునర్వికాసాన్ని స్వాగతిస్తున్న ఆలోచనాపరులందరి కర్తవ్యం. (నేడు పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూర్ జయంతి సందర్భంగా...) – గౌరవ్ -
వర్సిటీల సమస్యలపై పోరాడాలి
ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమ్మేళనంలో ఎమ్మెల్సీ రాము బాలాజీచెరువు (కాకినాడ): రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలతో పాటు అధ్యాపకుల సమస్యలపైనా ఎస్ఎఫ్ఐ పోరాడాలని ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు రాము సూర్యారావు పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ యూనివర్సిటీ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే విద్యావ్యవస్థకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేసి విద్యారంగాన్ని కాపాడాలన్నారు. ‘పోరాడు, సా«ధించు’ నినాదంతో ఎస్ఎఫ్ఐ పని చేస్తుందని, అదే సిద్ధాంతంతో సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపే విద్యాలయాలపై ప్రభుత్వం దృష్టి సారించేలా ఆ సంస్థ పోరాడాలని అన్నారు. సర్కారు తీరును చాటిన ఆర్థికమంత్రి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు వై.రామం మాట్లాడుతూ యూనివర్సిటీల అభివృద్ధికి పైసా కూడా కేటాయించమని, వాటి అభివృద్ధికి వర్సిటీలే వనరులు సమకూర్చుకోవాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉపకులపతుల సమావేశంలో చెప్పడంతోనే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి అర్థమౌతుందన్నారు. జేఎన్టీయూకే చీఫ్ లైబ్రేరియన్ వి.దొరస్వామినాయక్ మాట్లాడుతూ సమాజంలో కీలకపాత్ర పోషించే యూనివర్సిటీల అభివృద్ధికి సహకారమివ్వక పోవడంపై చాలా దురదృష్టకరమని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి వంటి పథకాలకు కోట్లకు కోట్లు ఖర్చుచేసి, యూనివర్సిటీలను గాలికొదిలేయడం బాధాకరమన్నారు. ఆ పథకాలకు వర్సిటీ అధ్యాపకులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ పోరాడితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. విద్యారంగ సమస్యలపై పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక సభ్యులు చలసాని శ్రీనివాస్, రెడ్డి, ఎస్ఎఫ్ఐ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యుత్‌శాఖలో కలకలం
►నర్సీపట్నం సబ్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నం ►విశాఖ కేజీహెచ్‌కు తరలింపు ►అధికారుల వేధింపుల వల్లేనని ఎస్ఎంఎస్లు ►పోలీస్ కేసు నమోదు, దర్యాప్తు నర్సీపట్నం: ఉన్నతాధికారుల వేధింపులకు తట్టుకోలేకపోతున్నాను..మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.. నర్సీపట్నం ప్రశాంతనగర్లోని తన స్థలం ఆక్రమణ విషయంలో ఆర్డీవో సూర్యారావు కూడా అన్యాయం చేశారు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇదీ విద్యుత్‌శాఖ సబ్ ఇంజినీర్ జి.శివప్రసాద్ బుధవారం సన్నిహితులు, కుటుంబ సభ్యులకు పంపిన ఎస్ఎంఎస్. ఆ వెంటనే ఇంటిలో ఉన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన విద్యుత్‌శాఖలో కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణకు చెందిన శివప్రసాద్ నర్సీపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో సబ్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. నర్సీపట్నంకు చెందిన అపర్ణను వివాహం చేసుకుని పెదబొడ్డేపల్లిలో ఉంటున్నాడు. పదేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నతాధికారుల పనిభారం మోపుతున్నారని, వారి వేధింపులను తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సన్నిహితులు, కుటుంబసభ్యులకు ఉదయం 10 గంటల సమయంలో ఎస్ఎంఎస్లు పంపా డు. ట్రాన్స్‌కో డీఈఈ, ఏడీఈ, ఏఈలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడిని కావడంతో ప్రాంతీయ తత్వంతో పాటు దళితుడను అయినందున వివక్ష చూపుతున్నారని ఎస్ఎంఎస్ల్లో పేర్కొన్నాడు. 11 గంటల సమయంలో నిద్ర మాత్రలు మిం గాడు. అపస్మారకస్థితికి చేరుకున్న అతనిని కుటుంబ సభ్యు లు 108లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. బాధితుని భార్య అపర్ణ విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ ఇంటికి వచ్చి రోజూ బాధపడే వాడని తెలిపింది. ఉద్యోగం చేయాలనిపించటం లేదని చెబుతుండే వారన్నారు. తన భర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన డీఈ, ఏడీఈ, ఏఈలపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె కంటతడి పెట్టారు. ఆమె ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు నెలలుగా గైర్హాజరు నెల రోజులు సెలవు పెట్టిన శివప్రసాద్ నాలుగు నెలలుగా విధులకు హాజరుకాలేదు. సెలవు ముగిశాక కూడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో అతనిని ఎస్ఇ కార్యాలయానికి సరెండర్ చేశాం. కావాలని తప్పుడు అరోపణలు చేస్తున్నాడు. ఏనాడూ అతనిపై వేధింపులకు పాల్పడలేదు. రమేష్, విద్యుత్‌శాఖ డీఈ ఆయన ఎవరో తెలియదు వివిధ సమస్యలతో కోర్టుకు అనేక మంది వస్తుంటారు. న్యాయ, న్యాయాలు పరిశీలించి తీర్పు ఇస్తాం. ఎవరికి అన్యాయం చేసే విధంగా కోర్టు తీర్పు ఉండదు. కె.సూర్యారావు,ఆర్డీవో, నర్సీపట్నం