suspicious accounts
-
అనుమానాస్పద క్లెయిమ్స్‌పై ఐటీ కన్ను
న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్లలో అనుమానాస్పద ఆదాయ పన్ను రీఫండ్ క్లెయిమ్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాజ్యసభకు తెలిపారు. 2016–17లో 9,856గా ఉన్న ఈ సంఖ్య 2018–19 నాటికి 20,874కి చేరిందన్నారు. ఆదాయం, పెట్టుబడులకు పొంతన లేకుండా భారీ రీఫండ్స్ కోసం క్లెయిమ్ చేస్తున్న పన్ను చెల్లింపుదారుల రిటరŠన్స్‌పై ఆదాయ పన్ను శాఖ స్క్రూటినీ జరుపుతోందని మంత్రి వివరించారు. స్క్రూటినీ అనంతరం క్లెయిమ్ తప్పని తేలిన పక్షంలో కేసును బట్టి రీఫండ్‌ను నిరాకరించడంతో పాటు జరిమానా, ప్రాసిక్యూషన్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. 2015–16లో రూ. 1.22 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ రీఫండ్స్ 2018–19 నాటికి రూ. 1.43 లక్షల కోట్లకు పెరిగాయని ఆయన వివరించారు. అనుమానాస్పద క్లెయిమ్స్‌కు ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరగకుండా పక్కకు తీసి పెట్టేలా ఐటీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. మరోవైపు, 2017–18లో 4.63 కోట్ల ఐటీ రిటర్న్‌లు దాఖలు కాగా 2018–19 జనవరి నాటికి ఇది 37% పెరిగి 6.36 కోట్లకు చేరిందని చెప్పారు. 2018–19లో ఐటీఆర్‌లు గడువులోగా ఫైల్ చేయాలంటూ పన్ను చెల్లింపుదారులకు 25 కోట్ల పైచిలుకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపినట్లు శుక్లా తెలిపారు. -
వాట్సాప్ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలనం నిర్ణయం తీసుకుంది. రానున్న కాలంలో లక్షలకొద్దీ అనుమాన్సాద వాట్సాప్ ఖాతాలను తొలగించనుంది. ముఖ్యంగా అసంబద్ధ వార్తలను, ఫేక్ న్యూస్ లను వ్యాప్తి చేసే గ్రూపులే టార్గెట్‌గా ఈ చర్యను చేపట్టనుంది. అంతేకాదు ఈ మేరకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు కూడా హెచ్చరికలను జారీ చేసింది. ఎన్నికల సమయంలో బల్క్‌గా సందేశాలను పంపించే అవకాశం ఉందని, తద్వారా తాము అందించే ఉచిత సేవ దుర్వినియోగంకానుందని వ్యాఖ్యానించింది. ఈ ప్రయత్నాలను అడ్డకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ గురువారం ఒక ప్రకన జారీ చేసింది. దీని ద్వారా తమ మెసేజింగ్ ప్లాట్‌ఫాంను సురక్షితంగా ఉంచాలని భావిస్తునట్టు తెలిపింది. అలాగే ఈ ఏడాది జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్, ఇతర అధికారులతో చర్చించిన అనంతరం ఈ ప్రక్రియను మరింత విస్తరిస్తామని వెల్లడించింది. వివిధ గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున వాట్సాప్ సందేశాలను పంపిస్తున్న ఖాతాలను గుర్తించి మరీ వేటు వేయనుంది. నెలకు 20లక్షల అనుమానిత ఖాతాలను రద్దు చేస్తోందట. గతంలో వివాదాస్పదంగా వ్యవహరించిన, వేధింపులకు పాల్పడిన ఫోన్ నంబర్‌ను, లేదా రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించిన కంప్యూటర్ నెటవర్క్‌ను తమ వ్యవస్థలు గుర్తించగలవని పేర్కొంది. తమది బ్రాడ్కాస్ట్ ప్లాట్‌పాం కాదు అనే విషయాన్ని దేశంలోని పలు రాజకీయ పార్టీలు గుర్తించాలని వాట్సాప్ కమ్యూనికేషన్ హెడ్ కార్ల్ వూగ్ ప్రకటించారు. గత కొన్ని నెలలుగా దీనిపై వారికి అవగాహన కల్పించామని, దీన్ని గుర్తించాలని లేదంటే అలాంటి వివాదాస్పద అకౌంట్లను నిషేధిస్తామని ఆయన హెచ్చరించారు. కాగా వాట్సాప్‌కు భారతదేశంలో 200 మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. -
ఆ బ్యాంక్ అనుమానాస్పద ఖాతాలు రద్దు
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తర్వాత ఉద్యోగుల అవినీతితో ప్రముఖ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడం బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది. కొన్ని అనుమానాస్పద ఖాతాలను తాత్కాలింగా రద్దు చేసింది. ఉద్యోగుల అక్రమాలపై కఠిన చర్యల్లో భాగంగా "అపూర్వమైన అడుగు" తీసుకున్నామని సోమవారం వెల్లడించింది. అనుమానాస్పద లావాదేవీల ఖాతాల వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించినట్టు యాక్సిస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కొంతమంది అనుమానిత ఖాతాల అనుమానాస్పద లావాదేవీల నివేదికలను (ఎస్.టి.ఆర్.లను) ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాఖలు చేసినట్టు తెలిపింది. దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రక్రియ విజయవంతానికి, డిజిటల్ లావాదేవీలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాగా గతవారం మూడు కిలోల బంగారాన్ని సీజ్ చేసిన ఈడీ ఇద్దరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్లను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదుచేశారు. అటు బ్యాంకు కూడా అక్రమ లావాదేవీల ఆరోపణలతో 19 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు ఢిల్లీ బ్రాంచ్ పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.