swachha Hyderabad
-
ఇలా అయితే ‘స్వచ్ఛ ర్యాంకు’ ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా మారుస్తామని..స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలుపుతామని జీహెచ్ఎంసీ అధికారులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. స్వచ్ఛ నగరం కోసం పలు ప్రణాళికలు మారుస్తూ దేన్నీ పూర్తి చేయడం లేదు. ఆ తంతు ఒక ఎత్తు కాగా, కనీసం ప్రజల నుంచి ‘ఫీడ్‌బ్యాక్’ తీసుకునే అంశంలోనూ పూర్తి శ్రద్ధ చూపలేదు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2020’ మొత్తం 6 వేల మార్కులకు కాగా.. అందులో 1500 మార్కులు నగర పౌరుల ఫీడ్‌బ్యాక్‌కే ఉన్నాయి. గతంలో వివిధ అంశాల్లో నగరం మెరుగ్గా ఉన్నప్పటికీ ఫీడ్‌బ్యాక్‌లో వెనుకబడినందునే ర్యాంక్ తగ్గిందని చెప్పుకున్నారు. ఆ విషయం తెలిశాకైనా ఫీడ్‌బ్యాక్ అంశంలో మెరుగుపడేందుకు చర్యలు తీసుకోలేదు. ఈనెల 4 నుంచి 31వ తేదీ వరకు ప్రజలు తమ ఫీడ్‌బ్యాక్‌ను నాలుగు విధాలుగా తెలియజేయవచ్చు. వెబ్సైట్, యాప్, ఫోన్ల ద్వారా ఇందుకు అవకాశముంది. ఈ విషయాల్ని నగర పౌరులకు తెలియజేయడంతోపాటు.. ఫీడ్‌బ్యాక్‌లో భాగంగా ఉండే ఏడు ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చేలా అవగాహన కల్పించాలి. ఇందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ.. సకాలంలో కాకుండా గడువు ముగియనున్న తరుణంలో కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లే ఎంటమాలజీ సిబ్బందికి స్వచ్ఛసర్వేక్షణ్‌కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలిచ్చి పంపుతున్నారు. ఈ పుస్తకాల్లో వారు ఇంటిలోని వారి పేరు రాయడంతో పాటు మొబైల్ నెంబర్ వేయాలి. వారికి స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి తెలియజేయడంతో పాటు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరి.. వారి మొబైల్లో యాప్‌ను డౌన్లోడ్ చేయించాలి. యాప్ డౌన్లోడ్ అయ్యాక ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఓటీపీ నమోదు చేయడం తదితరమైనవి వివరించాలి. ఇవన్నీ చేశాక ఫీడ్బ్యాక్లోని ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా సూచించాలి. ఈ పనులు చేసినట్లు వారి సంతకం కూడా తీసుకోవాలి. వారి వద్ద మొబైల్ ఫోన్ లేకుంటే.. తమ మొబైల్ ఫోన్ నుంచైనా వారి పేరు.. వివరాలతో ఫీడ్‌బ్యాక్ పంపించాలని నిర్ణయించారు. తద్వారా ఎంతమంది ఫీడ్‌బ్యాక్ పంపించారో తెలుసుకునేందుకు వీలవుతుంది.దీంతోపాటు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే మిగతా విధానాలను కూడా తెలియజేయాలని కూడా భావించారు. ఈ వివరాలు నమోదు చేసేందుకు ముద్రించిన పుస్తకాలు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి. ఇవన్నీ సర్కిళ్లకు.. అక్కడినుంచి ఎంటమాలజీ సిబ్బందికి చేరి.. వారు ఇంటింటికీ వెళ్లేందుకు సెలవులు పోను మిగిలింది దాదాపు ఐదు రోజులు. ఈ స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమం ద్వారా ఏమేరకు ప్రయోజనం లభించగలదో సంబంధిత అధికారులకే తెలియాలి. నాలుగో తేదీనుంచే ఈ సర్వే ఉందని తెలుసు. అప్పటి నుంచే ఈ కార్యక్రమం చేపట్టి ఉంటే బాగుండేది. తీరా గడువు ముగుస్తున్న సమయంలో చేస్తున్న ఈ ప్రయత్నం పుస్తకాల మద్రణ ఖర్చు తప్ప.. పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించి అడిగే ప్రశ్నల్లో ‘మీ ఇంటి వ్యర్థాలను తడి,పొడి వేర్వేరుగా ఇవ్వమని మీ చెత్త సేకరించే వాళ్లు అడుగుతున్నారా ? అనేది ఒక ప్రశ్న. దీనికి ‘అవును.. ప్రతిసారి’ అని సమాధానం ఇవ్వాల్సిందిగా చెప్పమని ఎంటమాలజీ సిబ్బందికి సూచిస్తున్నారు కానీ.. వారా విషయం చెప్పగలరా అన్నదే అంతుబట్టడం లేదు. ఎందుకంటే.. వాస్తవానికి నగరంలో తడిపొడి వేరు చేసి ఇవ్వమని అడుతున్నవారు లేరు సరికదా.. అవగాహన ఉన్న కొన్ని కుటుంబాల వారు వేరుచేసి ఇచ్చిన చెత్తను సైతం కలగలిపే ఆటోల్లో తీసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్లోనగర ర్యాంకు వెనుకబడిందిలా.. సంవత్సరం ర్యాంక్ 2016 19 2017 22 2018 27 2019 35 -
‘స్వచ్ఛ’మే లక్ష్యం!
రూ.195.91 కోట్లు మంజూరు త్వరలో పనులు ప్రారంభం నాలాలు.. మంచినీళ్లు, రహదారులకు ప్రాధాన్యం వినతుల్లో వీటిదే అగ్రస్థానం సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో అందిన వినతుల పరిష్కారం వైపు అడుగులు పడుతున్నాయి. దీనికోసం జీహెచ్ఎంసీ రూ.195.91 కోట్లు విడుదల చేసింది. రెండు విడతల్లో అందిన విజ్ఞప్తుల మేరకు నాలాలు.. మంచినీళ్లు.. రహదారులు, డ్రైనేజీలే నగరంలోని ప్రధాన సమస్యలని స్పష్టమైంది. ప్రాధాన్య క్రమంలో ఈ పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్‌ను 400 యూనిట్లుగా విభజించి... ఒక్కో యూనిట్‌కు రూ.50 లక్షల వంతున రూ.200 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రూ.195.91 కోట్లు విడుదల చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేశారు. స్థానిక అవసరాలపై అందిన విజ్ఞప్తుల మేరకు మొత్తం 8,303 పనులు చేయాల్సి ఉంటుందని మెంటర్లు, నోడల్ అధికారులు గుర్తించారు. దీనికి రూ. 718.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రాధాన్య క్రమంలో 5,071 పనులను ఎంపిక చేశారు. వీటికి రూ.195.91 కోట్లు మంజూరు చేశారు. వీటిలో సీసీ రోడ్లకు రూ.46.41 కోట్లు, నాలాలకు రూ.21.90 కోట్లు, డ్రైనేజీ పనులకు రూ.38.35 కోట్లు, మంచినీటి సరఫరాకు రూ.23.19 కోట్లు కేటాయించారు. ఈ పనులను వెంటనే చేపట్టాల్సిందిగా ఇంజినీర్లను ఆదేశించారు. మూడు రోజుల్లో స్వల్పకాలిక టెండర్లు పిలిచి, త్వరగా పనులు చేపట్టాలన్నారు. ఈమేరకు బడ్జెట్ ఎంట్రీలు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ పనుల పురోగతిని ప్రతి సోమవారం నిర్ణీత ప్రొఫార్మాలో నివేదించాలని కమిషనర్ సూచించారు. అదే సెంటిమెంట్ సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ 6ను శుభసూచకంగా భావించే జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ స్వచ్చ హైదరాబాద్ పనులకు నిధుల విడుదలలోనూ దీన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. రూ.195 కోట్లకు (అదనపు మొత్తాన్ని మినహాయిస్తే)పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేశారు. 195లోని అంకెలన్నింటినీ కలిపితే 6 అవుతోంది. డ్రైవర్ కమ్ ఓనర్ వాహనాలు, జీహెచ్ఎంసీ బడ్జెట్లోనూ అంకెల మొత్తం 6 కావడం తెలిసిందే. స్వచ్ఛ హైదరాబాద్‌లోనూ సంపన్నులకే? స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా మంజూరైన నిధుల్లోనూ సంపన్నులు గల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలున్న సర్కిల్-10 (ఖైరతాబాద్)కే ఎక్కువ కేటాయించారు. ఈ ప్రాంతానికి రూ.24.48 కోట్లు మంజూరు చేశారు. నిధుల మంజూరులో ఇదే అగ్రస్థానంలో ఉంది. తర్వాతి రెండు స్థానాల్లో సర్కిల్-4 (చార్మినార్) రూ.18.47 కోట్లు, తార్నాక (రూ.17 కోట్లు) ఉన్నాయి. -
స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొందాం : విజయారెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకురాలు పి. విజయారెడ్డి అన్నారు. శుక్రవారం పంజగుట్ట డివిజన్ పరిధిలోని తబేలా బస్తీలో ఆమె స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. తబేలాబస్తీలో ఉన్న మజీద్‌లో ప్రార్థనల అనంతరం పలువురు ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రమదానం చేసి ఆయా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. మట్టికుప్పలు, చెత్తను పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్ ఓ బృహత్తర కార్యక్రమమని, దీన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మన పరిసరాలు బాగుంటేనే మనం బాగుంటామని, ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. -
‘ గ్రేటర్’ లక్ష్యంగా స్వచ్ఛ హైదరాబాద్!
జంటనగరాల్లో అధికార పార్టీ నేతల హడావుడి స్వయంగా కాలనీలు తిరిగిన సీఎం కేసీఆర్ వాడలను చుట్టివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో, అధికార పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా బస్తీలు తిరగడం.. వాడల్లో ప్రజల తో మమేకం కావడం... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా జంటనగరాలను చుట్టి రావడం.. చర్చనీయాంశమైంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’ పేరిట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పీఠమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలను పూర్తి చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్లో ప్రజలను నేరుగా కలవడం, వారి సమస్యలను వినడం, తాత్కాలికమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సి పనులకు హామీలు ఇవ్వడం కోసం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఉపయోగపడిందని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఎంఐఎం పట్టున్న పాతబస్తీతోపాటు విపక్ష టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధుల్లోనూ సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు అయిదు రోజులపాటు ఉద్యమంగా జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పరిశీలించిన వర్గాలు ఇది కచ్చితంగా గ్రేటర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా చేపట్టిందేనని వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం అయిదు రోజుల్లో సుమారు 7 లక్షల మంది ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా క లుసుకోగలిగామని జీహెచ్ఎంసీ అధికారికంగానే ప్రకటించింది. వివిధ వర్గాల ప్రజల నుంచి రోడ్ల మరమ్మతులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, గ్రంథాలయాలు, జిమ్‌ల ఏర్పాటు వంటి పనుల కోసం రూ.600 కోట్ల పనులకు ప్రతిపాదనలకు కూడా అందాయి. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఏకంగా ఐదు వందల బృందాలను రంగంలోకి దింపారు. నగర ప్రజల ముంగిట్లోకి వెళ్లి, వారిని నేరుగా కలిసి మాట్లాడారు. ప్రధానంగా నగరంలోని వివిధ బస్తీ వాసుల్లో విశ్వాసం నింపేలా వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ వరసగా రెండు రోజుల పాటు హామీలు ఇచ్చారు. యూనివర్సిటీ జాగాల్లో పక్కా ఇళ్ళు కట్టిస్తామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రధానంగా తాగునీరు, పక్కా ఇళ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై అధికార పార్టీ నేతలు దృష్టి కేంద్రీకరించారు. పాతబస్తీలో ఎంఐఎం నేతల నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన కార్యక్రమం కావడంతో నగరంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అనివార్యంగా పాల్గొనడమే కాకుండా, ఎలాంటి విమర్శలు చే యలేకపోయారు. మొత్తంగా గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరించదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
పరిష్కార వేదికగా...
సమస్యల నుంచి ప్రజలకు విముక్తి ఇళ్లు, నాలాలు,కలుషిత జలాలపైనే వినతులు రూ. 200 కోట్లు మంజూరు రూ. 600 కోట్ల పనులకు విజ్ఞప్తులు ముగిసిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం కేవలం పారిశుద్ధ్య కార్యక్రమాలకే పరిమితం కాకుండా... ప్రజా సమస్యలు గుర్తించేందుకు ఉపయోగపడింది. గవర్నర్ నుంచి ఐఏఎస్‌లు, సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా భాగస్వాములైన ఈ కార్యక్రమంలో ప్రజల ‘నాడి’ని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న వారిని స్వచ్ఛ టీమ్ సభ్యులుగా ఎంపిక చేసి.. ప్రజల అవసరాలను, డిమాండ్లను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఆక్రమణల పాలైన నాలాల వల్ల తలెత్తుతున్నముంపు, కలుషిత నీటి సమస్యలను ప్రజలు గట్టిగా వినిపించారు. ఇళ్లు, పింఛన్లు, వైద్యం, రేషన్ కార్డులను ఎక్కువగా కోరారు. ఈ కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తులకు అనుగుణంగా పనులు చేపట్టడానికి రూ.200 కోట్లు సిద్ధంగా ఉంచినప్పటికీ... అదనపు నిధులు అవసరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. పనులను స్వల్ప, దీర్ఘకాలికమైనవిగా విభజించి పరిష్కరించే యోచనలో ప్రభుత్వం ఉంది. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములైన ప్యాట్రన్లు/మెంటర్లతో శుక్రవారం సమీక్షించనున్నారు. అప్పటికి దీనిపైస్పష్టత వచ్చే అవకాశం ఉంది. పారిశుద్ధ్య కార్మికులకు వరాలు స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు, వారి సమస్యలపై సీఎం శ్రద్ధ కనబరిచారు. వారి వేతనాలు పెంచడంతో పాటు జీహెచ్ఎంసీలోని 20 వేల మంది కార్మికులకు దశల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వారితో పాటు వివిధ ప్రాంతాల్లోని 2 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇదే సందర్భంలో ఓయూ భూముల్లో ఇళ్లు కట్టిస్తామనడం వివాదానికి దారి తీసింది. తాగునీటి పైపుల్లో డ్రైనేజీ నీరు కలుస్తున్న సమస్యను పరిష్కరించేందుకు రూ.3వేల కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. నాలాలను మెరుగుపర చడానికి ప్రస్తుతం రూ.400 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సమస్య లేదని సీఎం తెలిపారు. పాతబస్తీకి తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు రెండు డబ్బాల విధానాన్ని ప్రారంభించడంతో పాటు, వాటిని ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించేందుకు 2500 ఆటోట్రాలీలతో పేదలకు ఉపాధి కల్పిస్తామన్నారు. తద్వారా చెత్త తరలింపు, నిరుద్యోగులకు ఉపాధి అనే రెండు ప్రయోజనాలు నెరవేరనున్నాయి. నగరం నుంచి రోజుకు సగటున 3600 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తుండగా, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా రోజుకు సగటున 8 వేల టన్నుల చెత్త, డెబ్రిస్‌ను అదనంగా సేకరించగలిగారు. మొత్తం 32వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త, డెబ్రిస్‌ను తరలించారు. అందిన వినతులు.. వాటి పరిష్కార చర్యలపై ఈనెల 26న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుగనుంది. కొనసాగుతుంది... పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతుందని జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్, కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అక్రమాలకు చెక్
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లో అంతులేని అవినీతి పటిష్ట ఎన్ఫోర్స్మెంట్తో అడ్డుకట్ట వేస్తాం ‘స్వచ్ఛ హైదరాబాద్’ అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ సిటీబ్యూరో: ‘ఇప్పుడున్న హైదరాబాద్ ఎటు పడితే అటు పెరిగింది. దాన్ని సరిచేస్తాం. శాస్త్రీయంగా ఆలోచించి మాస్టర్‌ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దుతాం’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం ‘స్వచ్ఛ హైదరాబాద్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ హెచ్ఎండీయే, జీహెచ్ఎంసీల్లో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. ఇకపై అలా జరగకుండా అక్రమాలకు ముకుతాడు వేయాల్సిందేనన్నారు. ఇకపై పటిష్టమైన ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందన్నారు. మాస్టర్‌ప్లాన్ కనుగుణంగా పద్ధతి ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అక్రమార్కులకు కళ్లెం వేసి సిటీని అందంగా తీర్చిదిద్దుదామన్నారు. రియోడిజెనీరో నగరాన్ని రోజుకు మూడుసార్లు శుభ్రం చేస్తారని, మనం కూడా స్వచ్ఛ హైదరాబాద్‌ను నిర్మించుకుందామన్నారు. బలహీనవర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలనే తలంపుతోనే డబుల్బెడ్రూమ్ ఆలోచన చేశానన్నారు. ఐడీహెచ్‌కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఇటీవల అక్కడకు వెళ్లాను.ఒక్కో ఇంటికి ఐదారు లక్షలు ఖర్చు చేస్తున్నాం. కానీ.. అక్కడి ప్రజల కళ్లలో కోటి మెరుపులు చూశానన్నారు. ఒకసారి ఇల్లు నిర్మిస్తే రెండు మూడు తరాల వారి వరకు ఇళ్ల అవసరం తీరాలని చెప్పారు. నగరంలోని రెండు లక్షల మందికి దశలవారీగా మూడు నాలుగేళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. స్లమ్ఫ్రీని అమలు చేస్తామన్నారు. కొన్ని రహదారులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ అమలు విధానం తదితర అంశాల గురించి కేసీఆర్ ఇలా వివరించారు... 300 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్నగర ప్రత్యేకతను నిలబెట్టాలి. స్వచ్ఛ హైదరాబాద్ లో సైనికాధికారులు, సైనికులు, పోలీసు అధికారులు, పోలీసులు పాల్గొంటారు. నగరంలోని ప్రతి ఇంటికి రెండు చెత్తడబ్బాలను ప్రభుత్వమే అందజేస్తుంది. తడి, పొడి చెత్తలకు వాటిని వేర్వేరుగా వినియోగించాలి. బస్తీవాసులు, టీమ్ సభ్యులకు టీషర్టులు, టోపీల పంపిణీ త్వరలోనే పత్రికలు, ఛానళ్ల ప్రతినిధులతో సమావేశమై విస్తృత ప్రచారం చేయాల్సిందిగా కోరతాం. కార్యక్రమంలో భాగస్వాములైన ఆరువేల మంది ఛేంజ్ ఏజెంట్స్ నెంబర్లు సేకరించి ఎప్పటికప్పుడు సమాచార పంపిణీ. స్వచ్ఛ హైదరాబాద్‌కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించారు. ఫేస్బుక్, వాట్సప్‌లోనూ సమాచార పంపిణీ బృందాలు బస్తీలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ సహాయం అవసరమైన విద్యార్థులు, క్రీడాకారులు, రోగగ్రస్తులను గుర్తించాలి. పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అందని అర్హులుంటే గుర్తించాలి. వారి వివరాలు సేకరించాలి. ఇళ్లులేని పేదలను గుర్తించాలి. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరచాలి. బస్తీల్లోని సంపన్నులను ప్రోత్సహించి వారి ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలి. చెరువుల్లో మురుగునీరు కలిసే ప్రాంతాలు గుర్తించాలి. ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న అందరితో స్వచ్ఛ భారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛభారత్‌లో పాల్గొనే బృందాలు.. వాటి పనితీరు తదితర అంశాలపై జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ప్రజలు కూడా స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములయ్యేందుకు ముందుకురావడంతో బృందాలు 425కు పెరిగాయన్నారు. సమరమర్థ నీటి వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక టాయ్లెట్లు తదితర అంశాలపై అస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాజరు ‘స్వచ్ఛ హైదరాబాద్’ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో పాటు మొత్తం మంత్రివర్గం, శాసనమండలి స్పీకర్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి రాజీవ్‌శర్మలతో సహ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాజరైంది. పార్లమెంటరీ కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ ఏఐఎస్‌లు, హెచ్ఓడీలతో సహ వెయ్యిమందికి పైగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అమలుకు సంబంధించి జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ 25 స్లైడ్స్‌తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని ఆసక్తిగా తిల కించిన కేసీఆర్ మధ్యలో కల్పించుకుంటూ సభికులకు మరింత వివరణ ఇచ్చారు. దేశంలోనే ప్రథమం: రాజీవ్‌శర్మ నగరంలో ప్రారంభిస్తున్న స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ లాంటి కార్యక్రమం దేశంలోనే ఏ రాష్ట్రంలో, ఏనగరంలో ఇంతవరకు చేపట్టలేదని ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ అన్నారు. ఉద్యమరూపంలో ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, మంత్రులు , ఏఐఎస్ అధికారులు ప్రత్యేకంగా ఒక యూనిట్‌ను స్వీకరించి నూరు శాతం పరిశుభ్రతకు కృషి చేయడం గతంలో ఎక్కడా జరగలేదన్నారు. 40 వేల మంది అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారన్నారు. అస్కి డెరైక్టర్ జనరల్ డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ వేస్ట్మేనేజ్మెంట్పై మాస్టర్‌ప్లాన్ రూపొందించాలన్నారు.