Swaroopanandendra saraswati swamiji
-
విశాఖ శ్రీ శారదా పీఠం విశిష్టత గురించి స్వరూపానందేంద్ర సరస్వతిగారు
-
గిరిజనులతో పాతికేళ్ల అనుబంధం
సాక్షి, పాడేరు (ఏఎస్సార్ జిల్లా): వివిధ ప్రాంతాల్లోని గిరిజనులతో విశాఖలోని శ్రీశారదా పీఠానికి పాతికేళ్ల అనుబంధం ఉందని, గిరిజనులంటే తమ పీఠానికి ప్రాణమని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. పాడేరు ఏజెన్సీలో టీటీడీ సహకారంతో నిర్మించిన రామాలయాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ.. గుమ్మలక్ష్మీపురం, అరకు లోయ, పాడేరు ప్రాంతాల్లోని గిరిజనులకు తమ పీఠం ద్వారా సేవ చేస్తున్నామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ, చలికాలంలో రగ్గులు, దుప్పట్లు, వంద గోవులను కూడా పంపిణీ చేశామన్నారు. ఆంజనేయ స్వామి గిరిజనుడేనని, ఆంజనేయుడి సహకారంతోనే శ్రీరాముడు లంకకు చేరి రావణాసురుడిని అంతమొందించారని, ఆ పోరాటంలోనూ గిరిజనులే ఉన్నారని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఆలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాల బాధ్యతను స్థానిక గిరిజనులకే శిక్షణ ఇచ్చేందుకు శారదా పీఠం సిద్ధంగా ఉందన్నారు. గిరిజనులకు సింహాచలం అప్పన్న దర్శనం చేయించడంతోపాటు చందనమాల వేయించి, భక్తిశ్రద్ధలతో దీక్ష పూర్తి చేయించి, రవాణా ఖర్చులు భరిస్తూ వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటికే అనేక ప్రాంతాల గిరిజనులతో పాటు పీవీటీజీ తెగను కూడా తిరుమల యాత్రకు తీసుకెళ్లామన్నారు. తొలుత పాడేరు మోదకొండమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దబ్బాపుట్టు గ్రామంలో రామాలయాన్ని ప్రారంభించారు. గిరిజనులంతా స్వామీజీకి పూలమాలలు వేసి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నర్సింగరావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు పాల్గొన్నారు. -
విశాఖ శ్రీశారదా పీఠానిది జ్ఞాన పరంపర
పెందుర్తి: పరంపర అంటే వంశ పారంపర్యం కాదని, జ్ఞానంతో కూడినదై ఉండాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. పురాతన పీఠాల కన్నా ముఖ్యమైన జ్ఞాన పరంపర విశాఖ శ్రీశారదాపీఠం సొంతమన్నారు. కర్ణాటక పర్యటనలో భాగంగా ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి హోళె నర్సిపూర్‌లోని గురుస్థానాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి సందర్శించారు. పరమ గురువు సచ్చిదానందేంద్ర స్వామి శివైక్యమైన ప్రాంతంలోని గురు సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక ప్రకాశ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ముద్రించిన గ్రంథాలను పరిశీలించారు. ప్రముఖ వేదాంతి ప్రకాశానందేంద్రతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సచ్చిదానందేంద్ర పాద రేణువే విశాఖ శ్రీశారదాపీఠమన్నారు. ఆయన శిష్యునిగా ఎంతో గర్వపడుతున్నానని.. తన పరమ గురువుల శిష్యరికం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దైర్యంగా ధర్మపోరాటాలు చేస్తున్నామంటే అది సచ్చిదానందేంద్ర సరస్వతి అనుగ్రహమే అన్నారు. సంస్కృతంలో ఉన్న తైత్తిరీయోపనిషత్తును తెలుగులోకి అనువదించి వేద విద్యార్థులకు పాఠంగా బోధించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గణపతి సచ్చిదానంద జన్మదినోత్సవానికి హాజరు మైసూర్‌లోని దత్త పీఠాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి సందర్శించారు. గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. సచ్చిదానందకు జ్ఞాపిక బహూకరించారు. అనంతరం స్వామీజీలను సచ్చిదానంద ఘనంగా సత్కరించారు. పలు అంశాలపై ఇరువురు చర్చించారు. -
ఆదిశంకరుని అడుగుజాడలే స్ఫూర్తి
పెందుర్తి: వేదపరిరక్షణ, హైందవధర్మ రక్షణ ధ్యేయంగా శారదాపీఠం ముందుకు సాగుతోందని శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఆదిశంకరుని అడుగుజాడలే తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదాపీఠంలో బుధవారం స్వామి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నాగులచవితి పర్వదినం రోజున జరిగే ఈ వేడుకలో భాగంగా స్వామి.. పీఠ ఆస్థానదేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, సుబ్రహ్మణ్యస్వామికి, దాసాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తుండగా ఆయనకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాదపూజ చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర అనుగ్రహభాషణ చేస్తూ.. మతం కోసం ఏ ఒక్కరూ నోరు మెదపని రోజుల్లోనే తాను నిర్భయంగా మాట్లాడానని చెప్పారు. హిందూమతాన్ని ఉద్ధరించే వారిలో బ్రాహ్మణజాతి తర్వాతే ఎవరైనా ఉంటారన్నారు. కాషాయం జెండా పట్టుకున్నంత మాత్రాన మతం నిలబడదని చెప్పారు. ఇప్పుడైతే హిందూమతం కోసం ఎంతోమంది పోరాటం చేస్తున్నారన్నారు. భారతదేశపు మూలాల నుంచి అద్వైత సిద్ధాంతాన్ని వెలికి తీసింది ఆదిశంకరాచార్యులేనని.. ఆయన ఆలోచనలు తలచుకుంటూ పురుడుపోసుకున్నదే విశాఖ శ్రీశారదాపీఠమని చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉపాసనతో అభివృద్ధి సాధించిందని, రాజశ్యామల అమ్మవారి ఆరాధనతో ప్రఖ్యాతి చెందిందని తెలిపారు. తమ పీఠంలో ఆత్మజ్ఞానం గురించి నిరంతరం చర్చ జరుగుతుంటుందని చెప్పారు. స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ గురువులు సూర్యచంద్రులతో సమానమన్నారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను విస్మరిస్తే ముప్పు తప్పదని చెప్పారు. శారదాపీఠం విలక్షణమైనదని, యావత్ భారతం పీఠం వైపు చూస్తోందంటే అది గురువుల కృప మాత్రమే అని పేర్కొన్నారు. వేదసభలో వివిధ శాఖలకు చెందిన వందలాదిమంది పండితులు పాల్గొన్నారు. స్వామి చేతుల మీదుగా మూడువేల మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన, ఎంపీలు డాక్టర్ బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్సీలు చైతన్యరాజు, దాడి వీరభద్రరావు, భక్తులు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామికి సీఎం శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూ పానందేంద్ర స్వామి పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం స్వరూపానందేంద్ర స్వామికి ఫోన్ చేసి మాట్లాడారు. -
ఆలయ మర్యాదలు, వివాదాలు వద్దు
సాక్షి, అమరావతి/పెందుర్తి: విశాఖలోని శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా పలు ఆలయాలు ఆలయ మర్యాదలు పాటించాలంటూ ఈ నెల 9న దేవదాయ కమిషనర్‌కు తాము రాసిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పీఠం మేనేజర్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. శారదాపీఠాన్ని, స్వామీజీని వివాదాల్లోకి లాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శారదాపీఠం తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. దీన్ని రికార్డ్ చేసిన హైకోర్టు.. శారదాపీఠం రాసిన లేఖను పలు ఆలయాలకు పంపుతూ దేవదాయ కమిషనర్ జారీచేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 18న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా ఆలయ మర్యాదలు పాటించే విషయంలో దేవదాయశాఖ అదనపు కమిషనర్ ఈనెల 12న జారీచేసిన మెమోను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కాకుమాను లలితకుమార్ మరో ఇద్దరు సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. మంగళవారం విచారించాల్సిన కేసుల జాబితా దీపావళి ముందే సిద్ధమైనప్పటికీ, ఈ వ్యాజ్యాన్ని మంగళవారం విచారించేందుకు హైకోర్టు ప్రత్యేకంగా ఓ అనుబంధ జాబితా తయారుచేసింది. దాన్లో ఈ వ్యాజ్యాన్ని మొదటì æకేసుగా చేర్చింది. ఇప్పటికే సిద్ధమైన జాబితాను పక్కనపెట్టి, ఈ అనుబంధ జాబితాలోని కేసులకు హైకోర్టు ప్రాధాన్యతను ఇవ్వడం విశేషం. 2019 మే నుంచి చిన్న విషయాలను పెద్దవిగా చూపుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడం, వాటిని న్యాయస్థానాలు విచారిస్తుండడం మొదలైందని ఏజీ శ్రీరాం చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. సన్యాసి అయిన స్వామీజీ జన్మదినం జరుపుకోవడం ఏమిటన్నారు.. సంప్రదాయం మేరకే పీఠం కోరిక శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగాఆలయాల నుంచి స్వామీజీకి తీర్థప్రసాదాలతో పాటు శేషవస్త్రాలు అందజేయడం 2004 నుంచి ఆనవాయితీగా వస్తోందని విశాఖ శారదాïపీఠం ప్రతినిధులు తెలిపారు. ఆ సంప్రదాయం మేరకే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని పీఠం కోరిందని పేర్కొన్నారు. నేడు స్వామీజీ జన్మదినోత్సవం విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదిన మహోత్సవం బుధవారం జరగనుంది. పండగ వాతావరణంలో వేడుకలు జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. -
పండుగల నిర్ణయంలో ఏకాభిప్రాయం ఉండాలి
పెందుర్తి: పండుగలను నిర్ణయించే విషయంలో పంచాంగకర్తలు ఏకాభిప్రాయానికి రావాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. పండుగల విషయంలో పంచాయితీలు సరికాదన్నారు. భవిష్యత్‌లో జరగబోయే ప్రమాదాలను, ఉపద్రవాలను అంచనావేయడం వంటి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పంచాంగకర్తలు దృష్టి సారించాలన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడమీ తరఫున ఆదివారం దైవజ్ఞ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. పండుగల విషయంలో విభేదాలను పక్కనపెట్టి, పంచాంగకర్తలు అందరూ ఏకతాటిపై నిలవాలన్నారు. రాబోయే ప్లవ నామ సంవత్సరానికి సంబంధించి పండుగల విషయంలో ఏకాభిప్రాయంతో పంచాంగాలను ప్రచురించాలని కోరారు. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పంచాంగకర్తలందరితో పెద్దఎత్తున దైవజ్ఞ సమ్మేళనం నిర్వహించాలని సంకల్పించామని పేర్కొన్నారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, అర్చక ట్రైనింగ్ అకాడమి డైరెక్టర్ కృష్ణశర్మ, దేవాలయ పాలన సంస్థ డైరెక్టర్ ద్రోణంరాజు రామచంద్రరావు, పలువురు పంచాంగకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం రెండురోజులు మాత్రమే
-
స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్ష ఫ్రారంభం
-
స్వరూపానందేంద్ర సర్వస్వతి ఆసీస్సులు తీసుకున్న కేసీఆర్
-
రుషికేశ్‌లో చాతుర్మాస్య దీక్ష చేసిన స్వామీజీ
-
ఐదు రోజుల పాటు శారదాపీఠం వార్షికోత్సవాలు
విశాఖపట్నం : విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలను శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్వామిజీ తెలిపారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వనదుర్గకు హోమాలు నిర్వహిస్తున్నామన్నారు.