tarzan
-
హాలీవుడ్ టార్జాన్ రాన్ ఎలీ ఇకలేరు
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ (86) ఇకలేరు. ఆయన మరణించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాన్ ఎలీ కుమార్తె క్రిస్టెన్ వెల్లడించారు. ‘‘ఓ గొప్ప వ్యక్తి ఈ ప్రపంచానికి దూరమయ్యారు. అలాగే నేను నా తండ్రిని కోల్పోయాను. నటుడిగా, రచయితగా, కుటుంబంలోని వ్యక్తిగా, కోచ్‌గా, గురువుగా, నాయకుడిగా ఆయన రాణించారు’’ అని క్రిస్టెన్ పేర్కొన్నారు. ఇక అమెరికాలోని టెక్సాస్‌లో 1938లో జన్మించారు రాన్ ఎలీ. కెరీర్ ఆరంభంలో ‘సౌత్ పెసిఫిక్’, ‘ది ఫిన్డ్ హూ వాక్డ్ ది వెస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన తర్వాత టెలివిజన్ సిరీస్ ‘టార్జాన్’లో నటించే అవకాశం రాన్ ఎలీకి దక్కింది. టార్జాన్‌గా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రాన్ ఎలీకి విపరీతమైనపాపులారిటీ వచ్చింది.ఇంకా ‘ప్లే హౌస్ 90, థ్రిల్లర్, ఫేస్ ది మ్యూజిక్’ వంటి సిరీస్‌లలో నటించారు రాన్. అలాగే ‘డాక్ సావేజ్: ది మ్యాన్ ఆఫ్ బ్రాంజ్, వన్స్ బిఫోర్ ఐ డై’ వంటి చిత్రాల్లోనూ నటించారాయన. ‘షీనా’ సిరీస్ తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్న రాన్ ‘ఎక్స్‌పెక్టింగ్ ఆమిష్’ (2014) అనే సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు. ఇదే ఆయనకు చివరి సినిమా. ఈ సంగతి ఇలా ఉంచితే... రాన్ ఎలీ ఎప్పుడు మరణించారనే విషయంపై క్రిస్టెన్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన కొన్ని రోజుల క్రితమే మరణించారని, మరణ వార్తను క్రిస్టెన్ కాస్త ఆలస్యంగా బయటపెట్టారని వార్తలు వస్తున్నాయి. -
'టార్జాన్' హీరో కన్నుమూత.. నెల రోజులకు ప్రకటించిన కుమార్తె
హాలీవుడ్ ప్రముఖ నటుడు రాన్ ఎలీ (86) అనారోగ్యంతో మరణించారు. 1966 నుంచి 1968 సమయంలో టార్జాన్ షో NBC టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారం అయింది. ఈ షో అప్పట్లో భారీగా పాపులర్ కావడంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. టార్జాన్ చిత్రంలో తన పాత్రకు ఎనలేని గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అయిపోయారు. అయితే, రాన్ ఎలీ మరణించారని ఆయన కుమార్తె కిర్‌స్టెన్ ఎలీ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.తన తండ్రి మరణంతో ఆమె ఒక పోస్ట్‌ను కూడా పెట్టారు. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆమె పేర్కొన్నారు. ' నా తండ్రి ఒక రోల్‌మోడల్.. ఆయన్నూ అందరూ హీరోగా పిలుస్తారు. నటుడిగా, రచయితగా, కోచ్‌గా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎంతో కష్టపడి తన చుట్టూ ఒక బలమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మరణం మాకు తీరని లోటుగా ఎప్పటికీ ఉండిపోతుంది.' అని ఆమె తెలపింది.2001లో తన నటనకు గుడ్‌బై చెప్పిన రాన్ ఎలీ ఆపై రచయితగా మారారు. ఈ క్రమంలో రెండు మిస్టరీ నవలలను ఆయన రాశారు. తన కెరియర్లో సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 1938లో అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించిన ఎలీ.., 1959లో తన స్కూల్మెట్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. సెప్టెంబరు 29న కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని లాస్ అలమోస్లోని తన ఇంట్లో ఎలీ మరణించారు. అయితే, ఈ విషయాన్ని ఆయన కుమార్తె చాలా ఆలస్యంగా ప్రపంచానికి తెలిపారు. -
నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు
డిజిటల్ కాలంలో కూడా చేతబడులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుటు, విలన్ టార్జాన్ అలియాస్ ఎదిరె లక్ష్మినారాయణ గప్తా. రామ్ గోపాల్ వర్మ ‘గాయం’ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన ఆ తరువాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా వందల సినిమాల్లో నటించాడు. ఈ క్రమంతో తన భార్య మరణంతో నటనకు బ్రేక్ ఇచ్చిన టార్జాన్ తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ రంగంలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు లక్ కూడా ఉండాలన్నాడు. చదవండి: తండ్రి బర్త్‌డేకు సర్ప్రైజ్ ఇవ్వబోతోన్న సుస్మిత కొణిదెల ‘దేవుడు దయ వల్ల నన్ను ప్రేక్షకులు ఆదరించారు. అలా 30 ఏళ్లపాటు సినిమాల్లో నటుడిగా కొనసాగాను. సినీ కేరీర్ పరంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాని అనుకోని పరిస్థితుల వల్ల మధ్యలో బిబినెస్ మొదలు పెట్టాను. ఎందుకంటే మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుకు రూ. 2వేలు మాత్రమే ఇచ్చేవారు. అవి సరిపోక వ్యాపారం చేసేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. ఇక తనన కుటుంబం గురించి చెప్పుకొస్తూ.. తనది ఆంధ్రప్రదేశ్‌లోని పరిగి సమీపంలో రాపోలు అనే పల్లెటూరని చెప్పాడు. ‘మేము ముగ్గురం అన్నదమ్ములం. మా నాన్న ఊరి సర్పంచ్‌గా చేసేవారు. ఈ క్రమంలో మేమంటే పడని వారు, మా దగ్గరి బంధువులే మా కుటుంబానికి చేతబడి చేశారు. దీనివల్ల రెండేళ్లు అనారోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం’ అంటూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నాడు. చదవండి: బాలయ్య సినిమాకు నో చెప్పిన విలక్షణ నటుడు అంతేగాక ‘చేతబడి ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. మా అమ్మ, నాన్న, అన్నయ్య, నాకు చేతబడి చేశారు. దీంతో మా అన్నయ్య ఏం తిన్నా వాంతులు చేసుకునేవాడు. నాకు అయితే నీళ్లు తాగిన వెంటనే బయటకు వచ్చేవి. కడుపు నొప్పి అయితే చాలా తీవ్రంగా ఉండేది. అలా మేము 13 ఏళ్లు నరకం చూశాం. అన్ని నష్టాలే దీంతో ఉన్నవి అన్ని అమ్మేసి హైదరాబాద్‌కు వచ్చేశాం. ఇక్కడ వచ్చాక డబ్బులు లేక తినడానికి తిండి దొరక్క కష్టాలు పడ్డాం. దీంతో ఏ పని దొరికితే అది చేసేవాళ్లం. ఈ క్రమంలో ట్రాన్స్‌పోర్టు బిజినెస్ ప్రారంభించాం. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయి. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది’ అని పేర్కొన్నాడు. అయితే ఇప్పటికీ తన సొంత గ్రామానికి వెళ్లినప్పుడు అనారోగ్యం బారిన పడతానని. అక్కడ నీళ్లు తాగితే వెంటనే బయటకు వస్తాయని, కడుపు నొప్పి వస్తుందని చెప్పాడు. ఇప్పటికీ చేతబడులు ఉన్నాయని, మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుసు అన్నాడు. అమావాస్య, పౌర్ణమిలను నమ్మినప్పుడు చేతబడి ఉందని కూడా నమ్మాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చదవండి: అయ్య బాబోయ్..అషురెడ్డితో ఆర్జీవీ అలా.. వీడియో వైరల్ -
41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు
హనోయి/వియాత్నం: కరోనా కారణంగా మనం కొద్ది రోజులపాటు ఇంటికి పరిమితం కావడానికి చాలా కష్టపడ్డం. చుట్టూ మనవారు నలుగరు ఉన్నప్పటికి.. బందీలుగా ఫీలయ్యాం. అలాంటిది ఓ వ్యక్తి దాదాపు 41 ఏళ్లుగా నాగరిక సమాజానికి దూరంగా అడవిలోనే ఉంటూ.. అక్కడ దొరికేవి తింటూ.. బతికాడు. ఊహ తెలిసిన నాటి నుంచి కేవలం అన్న, తండ్రిని మాత్రమే చూడటంతో అసలు లోకంలో ఆడవారు ఉంటారనే విషయమే అతడికి తెలియదు. ఇక వారిలో శృంగార వాంఛలు అసలు లేనేలేవు అంటే తప్పక ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం ఈ రియల్ టార్జాన్ లైఫ్ స్టోరీ నెట్టింటో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. వియాత్నంకు చెందిన హో వాన్ లాంగ్ చాలా చిన్నతనంలో అతడవిలోకి వెళ్లాడు. 1972నాటి వియాత్నం యుద్ధం వల్ల అతడి జీవితం ఇలా మారిపోయింది. ఈ యుద్ధంలో అతడి తల్లి, ఇద్దరు తోబుట్టువులు మరణించారు. హో వాన్ లాంగ్, అతడి తండ్రి, సోదరుడు మాత్రం యుద్ధ సమయంలో తప్పించుకుని అడవిలోకి వెళ్లారు. మనిషి కనిపించిన ప్రతి సారి వారు అడవిలో మరింత లోపలికి పయనం చేశారు. అలా నాగరిక సమాజానికి పూర్తిగా దూరం అయ్యారు. అక్కడే జీవిస్తూ.. అడవిలో దొరికే పండ్లు, తేనే, చిన్న చిన్న జంతువులను వేటాడి తింటూ కాలం గడిపారు. ఈ నలభై ఏళ్లలో ఈ ముగ్గురు తండ్రికొడుకులు కేవలం ఐదుగురు మానవులను మాత్రమే చూశారు. ఎలా వెలుగులోకి వచ్చారంటే.. ఇలా అడవిలో జీవనం సాగిస్తున్న వీరిని 2015లో అల్వారో సెరెజో అనే ఫోటోగ్రాఫర్ గుర్తించి.. అడవి నుంచి వారిని బయటకు తీసుకువచ్చాడు. అక్కడే సమీపంలో ఉన్న ఓ గ్రామంలో వారిని ఉంచాడు. ఈ సందర్భంగా అల్వారో మాట్లాడుతూ.. ‘‘మనుషులను చూసిన ప్రతి సారి వీరు అడవిలో మరింత దూరం వెళ్లేవారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటేంటే వీరికి లోకంలో స్త్రీలు ఉంటారని తెలియదు. ఇప్పుడిప్పుడే వారిని గుర్తించగలుగుతున్నారు. కానీ నేటికి స్త్రీ, పురుషుల మధ్య తేడా ఏంటో వీరికి తెలియదు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే వీరిలో శృంగారవాంఛలు అసలు లేవు. ఇక హోవాన్ లాంగ్ తండ్రి నేటికి కూడా వియాత్నం యుద్ధం ముగియలేదు అనుకుంటున్నాడు’’ అన్నాడు. మంచి, చెడు తేడా తెలియదు.. ‘‘హో వాన్ లాంగ్‌కు మంచి, చెడు తేడా తెలియదు. వేటాడటంలో దిట్టం. ఎవరినైనా కొట్టమంటే.. చచ్చేవరకు కొడతాడు. చంపమని ఆదేశిస్తే.. వెంటాడి వేటాడుతాడు. తప్ప మంచి, చెడు తెలియదు. ఎందుకంటే అతడి ఏళ్లుగా అడవిలో ఉండటం వల్ల హోవాన్ లాంగ్ మెదడు చిన్న పిల్లల మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడిప్పిడే హో వాన్ లాంగ్ నాగరిక జీవితానికి అలవాటు పడుతున్నాడు. తొలి ఏడాది వీరిని పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఇక్కడి వాతావరణంలో ఉండే బాక్టీరియా, వైరస్ల దాడికి తట్టుకోలేకపోయారు. ఇక్కడి రణగొణ ధ్వనులు వీరికి నచ్చడం లేదు. కాకపోతే జంతువులు మనుషులతో స్నేహంగా ఉండటం వారిని ఆశ్చర్యానకి గురి చేస్తుంది’’ అన్నాడు అల్వారో. చదవండి: 16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై... -
ఘోర ప్రమాదం.. ‘టార్జాన్’ దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జెట్ విమానం కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. వీరిలో నటుడు జోయ్ లారా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జోయ్ లారా ‘టార్జన్’ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. శనివారం ఉదయం టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానం వెళ్తుండగా.. 11 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. సౌత్ నాష్‌విల్లేలోని పెర్సీ స్ట్రీక్ లేక్‌లో విమాన శకలాలు కూలినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ ఘటనలో చనిపోయినవాళ్లలో నటుడు జోయ్ లారా, అతని భార్య గ్వెన్ ష్వాంబ్లిన్ ఉన్నారు. కాగా, ఈ దుర్ఘటనలో శకలాలు చెల్లాచెదురు అయ్యాయని, సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, లారా(విలియమ్ జోసెఫ్ లారా) 1989లో వచ్చిన ‘టార్జాన్ ఇన్ మాన్‌హట్టన్’ సినిమా ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత 1996 నుంచి ఏడాదిపాటు టెలికాస్ట్ అయిన ‘టార్జాన్ ది ఎపిక్ అడ్వెంచర్స్’ టీవీ సిరీస్ ద్వారా గ్లోబల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ నిపుణుడైన లారా.. టార్జాన్‌గా డూప్ లేకుండా స్టంట్స్ చేసేవారు. ఇక చాలా ఆలస్యంగా 55 ఏళ్ల వయసులో లారా.. గ్వెన్ ష్వాంబ్లిన్ను 2018లో వివాహం చేసుకున్నాడు. చదవండి: ఆమెతో డేటింగ్ కోసం క్యూ -
15 మందికి నారీ శక్తి పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: పోడు వ్యవసాయంలోనూ, గ్రామీణ మహిళల వికాసంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పడాల భూదేవి, 93 ఏళ్ల వయసులో కెరీర్ ఆరంభించి చండీగఢ్ అద్భుతంగా పేరు సంపాదించి, ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిన శతాధిక వృద్ధ అథ్లెట్, మష్రూమ్ మహిళ, జార్ఖండ్ లేడీ టార్జాన్ సహా 15 మంది 2019 సంవత్సరానికిగాను నారీ శక్తి పురస్కారాలను గెలుచుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఈ అవార్డులను వారికి ప్రదానం చేశారు. మహిళా సాధికారత, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో సానుకూల మార్పుల్ని తీసుకువచ్చే మహిళలకు ఏటా మహిళా శక్తి పురస్కారాలు అందజేస్తారు. బహుమతి గ్రహీతల్లో శ్రీకాకుళంకు చెందిన పడాల భూదేవితో పాటు వీణా దేవి (40–బీహార్), అరిఫా జాన్ (33–శ్రీనగర్, జమ్మూ కశ్మీర్), చారి ముర్ము (47–జార్ఖండ్), నిలజా వాంగ్మో (40–లేహ్), రష్మీ ఊర్థర్దేశ్ (60–పుణే, మహారాష్ట్ర), మాన్ కౌర్ (103–పాటియాలా, పంజాబ్), కళావతీ దేవీ (68–కాన్పూర్, ఉత్తరప్రదేశ్), తాషి, నుంగ్షీ (కవలలు) (28– డెహ్రాడూన్ – ఉత్తరాఖండ్), కౌషికి చక్రవర్తి (38–కోల్‌కతా, పశ్చిమబెంగాల్), అవని చతుర్వేది, భావనాకాంత్, మోహనాసింగ్ (వాయుసేన మొదటి మహిళా పైలెట్లు), భగీరథి అమ్మా (105)– కాత్యాయని(98) (అలప్పుజ–కేరళ)లు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. పౌష్టికాహార లోపాల్ని నివారించండి: ప్రధాని నారీశక్తి అవార్డు పొందిన 15 మందిలో 14 మందితో ప్రధాని మోదీ తన నివాసంలో ముచ్చటించారు. పిల్లల్లో, మహిళల్లో ఉన్న పౌష్టికాహార లోపాల్ని నివారించడం, నీటిని బొట్టు బొట్టు సంరక్షించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నారీ మణులు సాధించిన లక్ష్యాలు కేసు స్టడీలుగా యూనివర్సిటీలకు ఉపయోగపడతాయని కొనియాడారు. అవార్డు గ్రహీతల్లో కశ్మీర్‌కు చెందిన ఆరిఫా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటర్నెట్పై నిషేధం తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తోందని ప్రధాని దృష్టికి తెచ్చారు. భూదేవి విజయగాథ ముగ్గురు ఆడపిల్లల తల్లినని తాను ఏనాడూ చింతించ లేదని భర్త వదలి వేస్తే కన్న వారింటిలో ఉండి గ్రామీణ, గిరిజన మహిళల వికాసానికి నడుం కట్టానని నారీశక్తి అవార్డు గ్రహీత పడాల భూదేవి అన్నారు. ఆమె అవార్డు అందుకున్న అనంతరం ప్రధాని మోదీ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో తన అనుభవాలను వివరించారు. గిరిజనుల్లో సవర తెగకు చెందిన తనకు చిరుప్రాయంలోనే వివాహమైతే ముగ్గురూ ఆడపిల్లలనే కన్నానని మెట్టినింటి వారు బయటకు పంపేశారన్నారు. తండ్రి చాటు బిడ్డగా పొలం పనిని నేర్చుకున్నానని, తనలాంటి వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నానన్నారు. 1–70 గిరిజన చట్టంలోని హక్కులు, మహిళా హక్కులను గురించి సభల్లో తెలుసుకున్నానని ఆ చట్టం కింద మహిళలను పెద్ద సంఖ్యలో సమీకరించి కొన్ని వేల ఎకరాల పోడు భూమిని సేకరించి చిరుధాన్యాల సాగుకు పూనుకున్నామన్నారు. పంటను మార్కెట్‌కు పంపితే డబ్బులు వస్తాయి కానీ పౌష్టికాహారం అందదు, అందుకే వాల్యూ అడిషన్ను చేకూర్చాలని నిర్ణయించాము. కంపెనీలను ఏర్పాటు చేసి చిరుధాన్యాలను పొడిగా మార్చి మార్కెటింగ్ చేయడం, బిస్కెట్లుగా తయారు చేయడం వంటివి మొదలు పెట్టాము. ఈరోజు తాము 15,000 మంది ఐసీడీఎస్ పథకం కింద ఉన్న బాలబాలికలకు (3–4 ఏళ్లలోపు) బిస్కెట్లు సరఫరా చేసి పౌష్టికాహారం అందజేయగలుగుతున్నాము. కలెక్టర్ సహకారంతో పంటలను మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాము. రైతుల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఆమె వివరిస్తుండగా ప్రధాని అభినందించారు. భూదేవి తాను ప్రసంగించేటపుడు తనకు హిందీ రాదని అయినా హిందీలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాననన్నారు. ఆమె చక్కగా హిందీ , కొన్ని ఇంగ్లీషు పదాలతో కలగలిపి చేసిన ప్రసంగం ప్రధానిని హత్తుకుంది. మీరు హిందీ చాలా బాగా మాట్లాడారు. మాట్లాడలేననే చింత వద్దు అని అన్నారు. -
కొడుకు చేతిలో హత్యకు గురైన నటుడి భార్య
కాలిఫోర్నియా : ‘టార్జాన్’ నటుడు రాన్ ఏలీ భార్య వాలెరీ లుండిన్ ఎలీ కొడుకు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం కాలిఫోర్నియాలోని తమ నివాసంలో చోటుచేసుకుంది. వివరాలు.. మంగళవారం సాయంత్రం రాన్ ఎలీ కుటుంబంలో గొడవ మొదలైంది. ఇది గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించగా అప్పటికే ఆరవై ఏళ్ల లుండిన్ మరణించినట్లు తెలిపారు. అయితే తన శరీరంపై కత్తితో దాడి చేసినట్లు గాట్లు ఉన్నాయని, ఆమెను హతమార్చింది సొంత కుమారుడు కామెరాన్ ఎలీ(30)గా పోలీసులు గుర్తించారు. కామెరాన్ ఆచూకీ కోసం గాలించగా.. ఇంటి వెలుపల అతడు కనిపించాడని, పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపి చంపేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఇక్కడ జరిగిన ప్రమాదంలో రాన్ ఏలీకి ఏమైనా గాయాలు అయ్యాయా అనేది మాత్రం తెలియలేదు. అంతకముంతే అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతి చెందిన ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, కుటుంబం మధ్య జరిగిన వివాదాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 1960లో వచ్చిన టెలివిజన్ కార్యక్రమం టార్జాన్‌తో రాన్ ఎలీ ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. రాన్ ఏలీ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరి కుమార్తెలు(కిర్‌స్టెన్, కైట్‌ల్యాండ్) కాగా ఒక్కడే కుమారుడు. అంతేగాక హత్యకు గురైన వాలెరీ లుండిన్ ఒకప్పటి మిస్ ఫ్లోరిడా. -
మేకింగ్ ఆఫ్ మూవీ - టార్జాన్
-
టార్జాన్
1985లో రిలీజైన ‘టార్జాన్’ ఫ్లాపా యావరేజా హిట్టా సూపర్హిట్టా ఎవ్వరూ చెప్పలేరు. కాని చాలామంది ఈ సినిమాను రకరకాల కారణాల వల్ల చూశారు. టార్జాన్ కథ అప్పటికే బాలసాహిత్యం ద్వారా పాప్యులర్ కావడం ఒక కారణమైతే నేషనల్ జియోగ్రఫిక్ వంటి చానెల్స్ అందుబాటులో లేని రోజుల్లో అడవులు చూపించే ఏ సినిమా అయినా చూడాలనే కుతూహలం ప్రేక్షకులకు ఉండేది. దానికి తోడు దర్శకుడు బి.సుభాష్ తెలివిగా కిమి కాట్కర్ అందాలను ఆరబోయడంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకులందరినీ ఊపేసింది. ఆ రోజులో అలా తెర మీద ఒక హీరోయిన్ని దాదాపు నగ్నంగా చూపడం పెద్ద విశేషం. టార్జాన్‌గా నటించిన హేమంత్ బిర్జే కన్నడిగుడు. ఎత్తుగా కండలతో ఉండటం తప్ప యాక్టింగ్‌లో పస లేకపోవడం వల్ల రాణించలేదు. కిమి మాత్రం మరికాస్త ముందుకెళ్లి అమితాబ్‌తో ‘హమ్’ వంటి సినిమాల వరకూ నటించింది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ శంతనును పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో లేదంటే పుణె శివార్లలో ఇండస్ట్రీకి దూరంగా జీవిస్తోంది. టార్జాన్కు బప్పి లాహిరి చేసిన పాటలు పెద్ద హిట్. జిలేలే జిలేలా ఆయొ ఆయొ జిలేలా..... మేరే సాత్ గావోనా జూబీ జుబి జుబి జూబీ... టార్జాన్ మై టార్జాన్... ఆ రోజుల్లో మోగిపోయాయి. ఆ సినిమా వచ్చాకే చిరంజీవి ‘అడవి దొంగ’ రావడం యాదృచ్చికం కాదు. -
అలా... ఆ అడవిలో ఆమె పెళ్లయిపోయింది!
‘టార్జాన్’’ సినిమాల్లో చూస్తుంటాం... పాష్‌గా, జోష్‌గా ఉండే పట్టణ ప్రాంత అమ్మాయి...అమాయకంగా, మొరటుగా కనిపించే టార్జన్ ప్రేమలో పడుతుంది. ‘సినిమాలో సాధ్యం కానిదేముంది’ అని వెక్కిరింపుగా అనుకుంటాంగానీ...నిజజీవితంలో కూడా అలాంటివి జరుగుతుంటాయి అని చెప్పడానికి అందమైన యువతి శారా బేగం గురించి మనం తప్పక చెప్పుకోవాలి. ఇంచుమించుగా టార్జాన్ సినిమా కథల్లా ఉండే నిజజీవితంలోని ఓ ఆసక్తికరమైన కథ ఇది... బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ శారా బేగంకు తొమ్మిదేళ్ల వయసు నుంచి ఒక కోరిక ఉండేది... అమెజాన్ అడవుల్లో ఉండే ఆదివాసులను చూడాలని. ఆ కోరిక తనతో పాటు పెరిగి పెద్దయిపోయింది. ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో లండన్‌లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని హురోని తెగ ప్రజల జీవనశైలి గురించి అధ్యయనం చేయడానికి ఈక్వేడర్ అడవుల్లోకి వెళ్లింది శారా. ఆ అడవిలో హురోని తెగకు చెందిన వాళ్లు మూడు వేల వరకు ఉంటారు. వారు శారాకు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడికి వెళ్లిన తరువాత... బయటి వ్యక్తిగా శారా ఎప్పుడూ ప్రవర్తించలేదు. వాళ్లలో భాగమైపోయింది. అల్లికల నుంచి వేట వరకు అన్నీ నేర్చుకుంది. ఈలోపు కథలో చిన్న ట్విస్ట్.... ఉన్నట్టుండి ఒకరోజు తెగ పెద్దలు శారాను ఒక గుడిసెలోకి పిలిచి వివస్త్రగా మార్చివేసి తమ సంప్రదాయ దుస్తులను ధరింప చేశారు. తమ సంప్రదాయానికి సంబంధించిన మంత్రాలు చదవడం ప్రారంభించారు. ఏం జరుగుతుందో శారాకు అర్థం కాలేదు. ‘‘నువ్వు మాకు రాణిలాంటిదానివి. మా తెగ యోధుడు జింక్టోతో నీకు వివాహం జరిపిస్తున్నాం. లైంగిక అవసరాల కోసం నిన్ను వాడుకోవడానికి ఇలా చేయడం లేదు. మా తెగ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారిని, ఇష్టమైన అమ్మాయిలను ఇలా గౌరవిస్తాం’’ అన్నారు పెద్దలు. వారి అమాయకత్వానికి ఆశ్చర్యపడిందో, ముచ్చటపడిందో, తనకు తాను రాజీ పడిందో తెలియదుగానీ... జింక్టోతో జరిగిన తన పెళ్లి తంతును ఆమె ప్రతిఘటించలేదు. విశేషం ఏమిటంటే, జింక్టో కూడా తనకు బాగా నచ్చాడు. ‘‘జింక్టో బలశాలి, నేర్పరి అయిన వేటగాడు మాత్రమే కాదు... మంచి హృదయం ఉన్నవాడు’’ అని జింక్టో గురించి మెచ్చుకోలుగా మాట్లాడింది శారా. రెండు వారాలు తరువాత తిరిగి లండన్‌కు చేరుకుంది శారా. ఈ రెండు వారాల్లోనే హురోని తెగల ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకుంది. వారి మనసులో చోటు సంపాదించకుంది. లండన్‌కు వచ్చిన తరువాత తన అడవి అనుభవాలను ‘అమెజాన్ సోల్స్’ పేరుతో డాక్యుమెంటరీగా నిర్మించింది. ఇది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రశంసలు అందుకొంది. ఆమె సాహసాన్ని అందరూ కొనియాడారు. శారా అడవికి దూరమై పోవచ్చుగానీ, ఆమె హృదయంలో హురోని తెగ ప్రజలు ఉన్నారు. వారి గురించి కబుర్లను ఇప్పటికీ ఫేస్బుక్లో ఆసక్తికరంగా రాస్తూనే ఉంది శారా బేగం. ‘‘వెనక్కి వెళ్లి అందరినీ చూసి రావాలని ఉంది’’ అని కూడా ఆమె అంటోంది. -
తొలి తరం టార్జాన్ స్టార్ మృతి
వెండితెర మీద టార్జాన్‌గా తొలిసారి నటించిన హాలీవుడ్ నటుడు డెన్నీ మిల్లర్ (80) మరణించారు. ఆయనకు లూ గెరిగ్ వ్యాధి ఉన్నట్లు జనవరిలో గుర్తించారు. చికిత్స చేసినా ఉపయోగం లేకపోవడంతో లాస్ వెగాస్‌లో మరణించినట్లు ఆయన ఏజెంటు డేవిడ్ మాస్ తెలిపారు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుండే మిల్లర్.. తొలుత యూసీఎల్ఏ టీం కోసం బాస్కెట్ బాల్ ఆడేవారు. బ్లేక్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వచ్చిన 'ద పార్టీ' చిత్రంలో కూడా ఆయన నటించారు. 1959లో వచ్చిన టార్జాన్.. ద ఏప్ మ్యాన్ సినిమాలో మిల్లర్ టార్జాన్‌గా నటించారు. ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో తన భారీ పర్సనాలిటీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.