హాలీవుడ్ ప్రముఖ నటుడు రాన్ ఎలీ (86) అనారోగ్యంతో మరణించారు. 1966 నుంచి 1968 సమయంలో టార్జాన్ షో NBC టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారం అయింది. ఈ షో అప్పట్లో భారీగా పాపులర్ కావడంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. టార్జాన్ చిత్రంలో తన పాత్రకు ఎనలేని గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అయిపోయారు. అయితే, రాన్ ఎలీ మరణించారని ఆయన కుమార్తె కిర్‌స్టెన్ ఎలీ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.
తన తండ్రి మరణంతో ఆమె ఒక పోస్ట్‌ను కూడా పెట్టారు. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆమె పేర్కొన్నారు. ' నా తండ్రి ఒక రోల్‌మోడల్.. ఆయన్నూ అందరూ హీరోగా పిలుస్తారు. నటుడిగా, రచయితగా, కోచ్‌గా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎంతో కష్టపడి తన చుట్టూ ఒక బలమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మరణం మాకు తీరని లోటుగా ఎప్పటికీ ఉండిపోతుంది.' అని ఆమె తెలపింది.
2001లో తన నటనకు గుడ్‌బై చెప్పిన రాన్ ఎలీ ఆపై రచయితగా మారారు. ఈ క్రమంలో రెండు మిస్టరీ నవలలను ఆయన రాశారు. తన కెరియర్‌లో సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 1938లో అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించిన ఎలీ.., 1959లో తన స్కూల్‌మెట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. సెప్టెంబరు 29న కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని లాస్ అలమోస్‌లోని తన ఇంట్లో ఎలీ మరణించారు. అయితే, ఈ విషయాన్ని ఆయన కుమార్తె చాలా ఆలస్యంగా ప్రపంచానికి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment