tourist destinations
-
ప్రపంచ పర్యాటక దినోత్సవం: టాప్ 10 పర్యాటక ప్రాంతాలు (ఫొటోలు)
-
శ్రీకాకుళం.. ఆకట్టుకునేలా పర్యాటక రంగం
ఆర్థిక చోదక శక్తుల్లో పర్యాటక రంగం ఒకటి. ప్రపంచంలో చాలా దేశాలు కేవలం టూరిజం పరిశ్రమపైనే ఆధారపడి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మన దేశం, రాష్ట్రంలో పర్యాటక రంగం కొంత పురోగతి సాధిస్తున్నా.. ప్రకృతి అందాలకు నెలవైన చాలా ప్రాంతాలు ఇప్పటికీ గుర్తింపునకు, అభివృద్ధికి నోచుకోవడం లేదు. వాటిలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. అతి పొడవైన సముద్ర తీరం, కోనసీమ లాంటి ఉద్దానం, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలు తదితర ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా.. పర్యాటకంగా వాటిని తీర్చిదిద్దే కృషి ఇప్పుడిప్పుడే మొదలైంది. టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఓవైపు సాగర తీరం.. మరోవైపు మన్యం.. మధ్యలో కొండలు తదితర ఆహ్లాదకర అందాలతో జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. ఏటా ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రభుత్వం జిల్లా లోని టూరిస్ట్ స్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించడమే కాకుండా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. ఆధ్మాత్మిక ప్రదేశాలను సైతం అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఉన్న చారిత్రక ప్రదేశాలకు కొత్త హంగులద్ది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధి పథంలో... ► ఇప్పటికే శాలిహుండాన్ని పర్యాటక సౌకర్యాల కేంద్రంగా రూ.2.27 కోట్లతో అభివృద్ధి చేశారు. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ► పాతపట్నం నీలమణి అమ్మవారి ఆలయాన్ని రూ. 50లక్షలతో అభివృద్ధి చేశారు. ► తాజాగా శ్రీముఖలింగం క్షేత్రాన్ని ప్రసాదం స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.56 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ► శ్రీకూర్మం క్షేత్రాన్ని రూ.20 కోట్లతో, అరసవిల్లి క్షేత్రాన్ని రూ.30కోట్లతో ప్రసాదం స్కీమ్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. అరసవిల్లిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమాచారం కేంద్రం, పర్యాటకుల సౌకర్యాల కేంద్రం ఏర్పాటుకు ఏడు సెంట్లు భూమిని దేవదాయ శాఖ ఇప్పటికే కేటాయించింది. దీనిలో 32 గదులు కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నారు. రోప్‌వే ద్వారా అందాలు.. రోప్ వేలతో జిల్లా అందాలను తిలకించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో తొమ్మిది రోప్‌వే మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. వీటిలో నాలుగింటి కోసం రూ.119.34 కోట్లతో అంచనా నివేదిక ఇప్పటికే కేంద్రానికి వెళ్లింది. రెండో విడతలో మిగతా ఐదింటికి ప్రతిపాదనలు పంపించనుంది. ► శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా నుంచి పొన్నాడ కొండ వరకు రూ. 32.40 కోట్లతో, శాలిహుండం బుద్ధు ని కొండ నుంచి వేణుగోపాలస్వామి ఆలయం వరకు రూ.25.56 కోట్లతో, పలాసలో నెమలికొండ వద్ద రూ. 22.68 కోట్లతో, ఇచ్ఛాపురంలో రూ.17.64 కోట్లతో రోప్‌వే వేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇవన్నీ మంజూరైతే జిల్లా పర్యాటకంగా మరింత ప్రగతి సాధించనుంది. పర్యాటక ప్రదేశాలెన్నో... ► జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదు. అరసవల్లి, శ్రీకూర్మం, శాలిహుండం, శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జునస్వామి తదితర ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ► తేలుకుంచి, బారువ, తేలినీలాపురం, దంతపురి, పొందూరు, కొరసవాడ, మందస, గొట్టా బ్యారేజీ, శాలిహుండం, పొన్నాడ కొండ తదితర చారిత్రక ప్రదేశాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ► తేలినీలాపురం, తేలుకుంచి గ్రామాలు విదేశీ పక్షుల విడిది కేంద్రంగా ఆకట్టుకుంటున్నాయి. ► రాష్ట్రంలో అత్యంత పొడవైన తీరరేఖ జిల్లాలోనే ఉంది. 193 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో పర్యాటకులు విహరించడానికి అనువైన ప్రదేశాలెన్నో. కళింగపట్నం, బారువ, శివసాగర్, గనగళ్లవానిపేట, మొగదలపాడు వంటి బీచ్‌లు టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రదేశాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిమగ్నమైంది. శాలిహుండం, బారువ బీచ్‌ను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది. శివసాగరం, గనగలవానిపేట, కళింగపట్నం బీచ్‌లను కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. -
కిసాన్ రైలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రైళ్లు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్లు, వేగంగా పాడయ్యే పదార్థాల రవాణా.. ఇవీ రైల్వేల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు. రూ.70,000 కోట్ల బడ్జెట్‌తో వీటిని అమలు చేస్తారు. గత ఏడాది సవరించిన బడ్జెట్ రూ.69,967 కోట్లు. రిఫ్రిజిరేటర్ కోచ్‌లతో కిసాన్ రైలు రైతుల కోసం తెచ్చే ‘కిసాన్ రైల్లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పదార్థాలను తరలించడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి దేశ వ్యాప్తంగా ఆటంకాలు లేని జాతీయ సప్లయ్ చెయిన్ నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లకు కూడా రిఫ్రిజిరేటర్ కోచ్‌లను అనుసంధానిస్తారు. ఇక రైల్వే విస్తరణ ప్రణాళికలను కొనసాగించేందుకు మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్లో రూ. 1.61 లక్షల కోట్లకు పెంచారు. కొత్త లైన్లకు రూ.12 వేల కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోణంలో కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. గేజ్ మార్పునకు రూ. 2,250 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 5,786.97 కోట్లు, సిగ్నలింగ్, టెలికం వ్యవస్థకు రూ. 1,650 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల సదుపాయాల కల్పనకు రూ. 2,725.63 కోట్లు కేటాయించారు. సరుకు రవాణా 1,265 మెట్రిక్ టన్నులు ఉండవచ్చు. ప్రయాణికులు, సరుకు రవాణా ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ. 61 వేల కోట్లు, సరుకు రవాణా నుంచి రూ. 1.47 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. రెవెన్యూ ఖర్చులో జీతాలను రూ. 92,993.07 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 6 వేల కోట్లు ఎక్కువగా ఉంది. -
దుర్గంచెరువు భాగ్యనగరానికే ఐకాన్
ముచ్చట గొలిపే ప్రకృతి అందాలు.. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో చెరువులు కొత్త అందాలను సంతరించుకోనున్నాయి. దుర్గం చెరువుతోపాటు మరో 14 చెరువులు సరికొత్త రూపు దాల్చనున్నాయి. కార్పొరేట్ కంపెనీల సహకరంతో పలు చెరువులు సుందర తటాకాలుగా మారనున్నాయి. ఆయా చెరువులను ప్రభుత్వం టూరిజం కేంద్రాలుగా మార్చనుంది. గచ్చిబౌలి: దుర్గం చెరువు కొద్ది నెలల్లోనే టూరిజం స్పాట్‌గా మారనుంది. అమెరికాలోని లాస్‌వెగాస్ లేక్ మాదిరిగా వాటర్ ఫ్లోటింగ్ లైట్లతో దుర్గం చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రాత్రి సమయంలో కేబుల్ బ్రిడ్జిపై విద్యుత్ కాంతులు వెదజల్లనున్న ఎల్ఈడీ లైట్లకు ఫ్లోటింగ్ లైట్లు తోడుకానున్నాయి. చెరువు చుట్టూ 4 కిలోమీటర్లు చైనా ఫ్లోటింగ్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. మార్చి నాటికి లైట్లను అమర్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. చెరువుపై కేబుల్ బ్రిడ్జి, చుట్టూ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, గ్రీనరీ, ఒక వైపు కేబుల్ బ్రిడ్జి, మరో వైపు దుర్గం చెరువు అభివృద్ధితో చెరువును చూసేందుకు ఆసక్తి కనబర్చుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుందర తటాకంగా దుర్గం చెరువు భాగ్యనగరానికే ఐకాన్‌గా మారనుంది. ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారిని అనుకొని ఉన్న ఖాజాగూడలోని పెద్ద చెరువుకు కొత్త హంగులు దిద్దనున్నారు. వెల్స్ ఫార్గో కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి (సీఎస్ఆర్)లో భాగంగా చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. ఐటీ కారిడార్‌లోని 14 చెరువుల అభివృద్ధి పనులను ఆయా కంపెనీలు చేపడుతున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల అభివృద్ధికి గ్లోబల్ క్లైమేట్ ఫండ్ వెయ్యి కోట్ల నిధులను అందించనుందని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి తెలిపారు. దుర్గం చెరువు చుట్టూ ఫ్లోటింగ్ లైట్లు.. కె.రహేజా కార్పోరేట్ కంపెనీ దుర్గం అభివృద్ధికి ఇప్పటికే దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దుర్గం చెరువును టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలని ప్రతిపాదించడంతో కె.రహేజా గ్రూపు చెరువు చుట్టూ 4 కిలోమీటర్లు రూ.3.5 కోట్ల విలువైన వాటర్‌లో ఫ్లోటింగ్ లైట్లు, వాటర్ ఫౌంటేన్లు అమర్చనున్నారు. ఇప్పటికే చైనాకు చెందిన కంపెనీలకు ప్రతిపాదనలు పంపగా రెండు నమునాలను రహేజా గ్రూపుకు పంపారు. మరో రెండు నమూనాలు రావాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే జీహెచ్ఎంసీ అమోదం తెలుపనుంది. ►ఎంట్రెన్స్ ప్లాజా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గ్రీనరీ , ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసింది. ►చుట్టూ 4 కిలో మీటర్ల పొడవునా 7 మీటర్ల వెడల్పులో‡ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. u రెండు ట్రాక్‌ల మధ్య గ్రీనరీ ఏర్పాటు చేస్తారు. ►100 మీటర్ల పొడవున స్కై వాక్ రానుంది. ►ఆంపి థియేటర్ రానుంది. పెద్ద చెరువు కొత్త సొబగులు... ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారి నుంచి ఖాజాగూడ వరకు విస్తరించి ఉన్న పెద్ద చెరువును కొత్త హంగులతో తీర్చిదిద్దనున్నారు. వెల్స్ ఫార్గొ కంపెనీ మూడు కోట్లకు పైనే నిధులతో పెద్ద చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. అభివృద్ధి పనులను యునైటెడ్ వేస్ సంస్థకు అప్పగించింది. ఇప్పటికే ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. చెరువు చుట్టు రెండు కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్, అర కిలోమీటరు సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. గ్రీనరీ, ల్యాండ్‌స్కేప్, చిల్డ్రెన్స్ ప్లే ఏరియా, బటర్ ఫ్లై పార్క్, హెర్బల్ గార్డెన్, చెరువులోని నీటిని శుద్ధి చేసేందుకు 5 వేల వెట్లాండ్ మొక్కలు నాటనున్నారు. ఎంట్రెన్స్, ఎగ్జిట్ ప్లాజా, టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. 14 చెరువుల అభివృద్ధి ... ఐటీ కారిడార్‌లోని చెరువులు, కుంటలను అభివృద్ధి చేసేందుకు వివిద కంపెనీలు ముందకు వచ్చాయి. కొన్ని కంపెనీలు చెరువులæఅభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నాయి. దుర్గం చెరువు– కె.రహేజా గ్రూపు, పెద్ద చెరువు–వెల్స్పార్గొ, మల్కం చెరువు–అపర్ణ, బర్లకుంట–జేపి మోర్గాన్, కుడికుంట–పెర్నాడ్ రికార్డ్, మేడికుంట–ఎక్సిగాన్, నల్లగండ్ల చెరువు–అపర్ణ, ప్రగతినగర్ చెరువు– శ్రీశ్రీ ఫౌండేషన్, నిథమ్ చెరువు, ఎల్లమ్మ చెరువులను ఈఎఫ్ఐ అభివృద్ధి చేస్తోంది. కొండాపూర్‌లోని రంగన్న కుంటతో పాటు మరో మూడు చెరువులను అభివృద్ధి చేసేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. చెరువుల అభివృద్ధికి వెయ్యి కోట్లు... వివిధ చెరువుల అభివృద్ధికి దక్షిణి కొరియాలోని గ్లోబల్ క్లైమేట్ ఫండ్ వెయ్యి కోట్ల నిధులు అందించనుంది. జీహెచ్ఎంసీకి రెండు విడతలుగా రూ.400 కోట్లు , హెచ్ఎండీఏకు రూ.600 కోట్లు ఇవ్వనున్నారు. ఇలా 14 చెరువులను అభివృద్ధి చేయనున్నాం. – హరిచందన దాసరి, అడిషనల్ కమిషనర్, వెస్ట్ జోనల్ కమిషనర్ -
ఆట, పాటలకే ప్రాధాన్యం
ఎండాకాలం సెలవులు వస్తున్నాయంటే చాలు. ఎంతో సంతోషంగా ఉండేది. సెలవుల్లో అమ్మా నాన్నలతో కలిసి దేశంలోని పర్యాటక ప్రాంతాలు తిరిగేవాళ్లం. 5 నుంచి పదో తరగతి చదివే వరకు భరతనాట్యం, వీణ, కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. వీడియో గేమ్స్‌తో ఎంజాయ్ చేశా. కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ల దగ్గరికి వెళ్లి అక్కడ వ్యవసాయ పొలాలు చూశా. నేను తొమ్మిదో తరగతి పూర్తికాగానే ఉత్సాహంతో సెలవుల్లోనే పదో తరగతి పుస్తకాలు చదివా. వేసవి సెలవులను ఎంతో సంతోషంగా గడిపాను. - తాండూరు ఏఎస్పీ చందనదీప్తి... ఈ ఫొటోలో భరతనాట్యం చేస్తున్న బాలికను గుర్తుపట్టారా? అదేనండీ.. తాండూరు ఏఎస్పీ చందనదీప్తి. వేసవి సెలవుల్లో తన చిన్ననాటి అనుభవాలను బుధవారం ‘సాక్షి’తో పంచుకుంది. వేసవి సెలవులు వచ్చాయంటే పర్యాటక స్థలాలను సందర్శించడంతో పాటు భరతనాట్యం, వీణ, కర్ణాటక సంగీతం నేర్చుకునే దానిని. వీడియో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేశా. కొన్ని రోజులు అమ్మమ్మ ఇంటికి వెళ్లి, అక్కడ వ్యవసాయ పొలాలను చూడడం, అక్కడే ఆడుకునేందుకు ఇష్టపడేదాన్ని. అమ్మమ్మ రోజూ రామాయణం, భారతం గురించి చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినేదాన్ని. నాన్న గనుల శాఖలో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగం రీత్యా తను చిత్తూరు, నల్గొండ తదితర జిల్లాలో పనిచేశారు. దీంతో అక్కడే నా బాల్యం కొనసాగింది. అక్కడి స్నేహితులతో కలిసి వేసవి సెలవుల్లో షటిల్, క్రికెట్ ఆడా. ఇంకా తెలుగు, ఇంగ్లిష్‌లో పద్యాలు కూడా రాశా. బాల్యం ఓ తీపి గుర్తు. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ఆడుకోవడం ఓ మరిచిపోలేని అనుభూతి.