trafffic jam
-
రద్దీ రోడ్డుపై బుల్ రైడ్.. నెటిజన్స్ ఫైర్
పెట్రోల్ ధరను భరించలేకపోతే ప్రయాణాన్ని షేరింగ్ ప్లాన్ చేసుకుంటాం. నడవగలిగే దూరమైతే కాళ్లకే పనిచేబుతాం. కానీ దేశ రాజధానిలో ఓ వ్యక్తి వినూత్నంగా దర్శనమిచ్చాడు. రద్దీ రోడ్లలో ఎద్దుపై సవారీ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ దృశ్యాలను కెమెరాలో బందించి ఇన్‌స్టాలో షేర్ చేశాడు. పెట్రోల్ ధరలు ఇంతలా పెరిగితే ఇదే బెటర్ అంటూ రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో కుందేలు ఆకారంలో ఉండే హెల్మెట్ పెట్టుకుని ఎద్దుపై సవారీ చేశాడో వ్యక్తి. తాడును చేతుల్లో పట్టుకుని ఎటు వెళ్లాలో ఎద్దుకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. రోడ్డంతా రద్దీగా ఉన్నా.. నడిరోడ్డుపై దర్జాగా సాగిపోతున్నాడు. పోలీసు అధికారి కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ చర్యను పబ్లిక్ న్యూసెన్స్‌గా నెటిజన్లు భావించారు. View this post on Instagram A post shared by Bull Rider (@bull_rider_077) సదరు వ్యక్తిపై మరికొందరు నెటిజన్లు ఫైరయ్యారు. జంతువులను హింసించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీ రోడ్డుపై నీ గొడవ ఏంట్రా? బాబు అంటూ ఆ వీడియోకు కామెంట్లు పెట్టారు. ఈ వీడియోకు 1,93,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో 3.8 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. ఇదీ చదవండి: ఏడు కోట్ల విలువైన డైమండ్ రింగ్ మాయం.. తీరా చూస్తే.. -
రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై దాడి.. చివరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్
మహబూబ్‌నగర్ క్రైం: కిరాణ సామాన్లు తీసుకుంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై దాడి చేయడం పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు గవినోళ్ల వెంకట్‌రెడ్డిపై దాడి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు శనివారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట జడ్చర్ల–మహబూబ్‌నగర్ రోడ్డుపై ధర్నా చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస కాలనీకి చెందిన గవినోళ్ల వెంకట్‌రెడ్డి శనివారం సాయంత్రం 5:40గంటల ప్రాంతంలో ఎస్వీ మార్ట్ దగ్గర కిరాణా సామాన్లు తీసుకుంటున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్‌గౌడ్ కొంతమందితో అక్కడికి వచ్చి కాంగ్రెస్‌కు ప్రచారం చేశావని తనపై దాడి చేస్తూ సూపర్మార్కెట్లో నుంచి బయటకు తెచ్చారని వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహేష్ వెల్లడించారు. రెండు గంటల పాటు ధర్నా దాడిఘటనపై కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇటూ జడ్చర్ల వైపు అటూ బస్టాండ్ వైపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ సమయంలో ఒకరిద్దరూ రోగులు ఆస్పత్రికి వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. ఆందోళన చేస్తున్న వారితో జిల్లా అదనపు ఎస్పీ రాములు చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అదేవిధంగా వెంకట్‌రెడ్డి ఇంటికి ఇద్దరూ కానిస్టేబుల్స్‌ను రక్షణగా ఇచ్చారు. ఇది చదవండి: రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై దాడి.. చివరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్ -
Hyderabad Rains Photos: హైదరాబాద్‌లో వానంటే వణుకే (ఫొటోలు)
-
హైదరాబాద్ లో కుండపోత వర్షం...
-
ఓజోన్ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిత్యం రోడ్డెక్కుతున్న లక్షలాది వాహనాల పొగ కారణంగా భూస్థాయి ఓజోన్ మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే సమయాల్లో.. ప్రధానంగా ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పరిస్థితి అధికంగా ఉన్నట్లు పీసీబీ తాజా అధ్యయనంలో తేలింది. ఈ పరిణామంతో నగరవాసులు అస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊపిరాడక సతమతం.. వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలతో పాటు ఓజోన్ వాయువులు.. గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలియడంతో పాటు సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 120 నుంచి 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతుండడం గమనార్హం. ఓజోన్‌తో నష్టాలివే.. ♦శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. చికాకు, అసహనం, శ్వా స తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. తలనొప్పి, పార్శ్వపు నొప్పి హేతువవుతోంది.మోతా దు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ♦ ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, అస్త మా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాయుకాలుష్యమే. ఉపశమనం ఇలా.. ♦ ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్లు ధరించాలి. కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్యం, భూస్థాయి ఓజోన్‌తో కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ♦ కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. గ్రేటర్ పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. ప్రతి వాహనానికీ ఏటా పొల్యూషన్ చెక్ పరీక్షలను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించాలి. ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి. -
గూగుల్‌తో పోలీసు విభాగం కీలక ఒప్పందం
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ మూస ధోరణిలో నడుస్తోంది. చిన్న జంక్షన్లలో 90 సెకన్లు, పెద్ద జంక్షన్లలో 240 సెకన్లలో సిగ్నల్స్ సైకిల్ పూర్తవుతుంది. అంటే సదరు జంక్షన్‌లోని ఓ రోడ్‌కు గ్రీన్‌లైట్ ఆగి రెడ్‌లైట్ పడిన తర్వాత మళ్లీ గ్రీన్‌లైట్ పడటానికి పట్టే సమయం ఇది. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై ఉంటోంది. ఉదాహరణకు బేగంపేట మీదుగా సికింద్రాబాద్–పంజగుట్ట మధ్య ఉన్న రహదారినే తీసుకుంటే ఉదయం వేళల్లో సికింద్రాబాద్ వైపు నుంచి, రాత్రిపూట బేగంపేట దిశ నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో ఉన్న జంక్షన్లలో మాత్రం సిగ్నల్ సైకిల్ ఒకేలా పనిచేస్తోంది. దీంతో ఆయా జంక్షన్లలోని కొన్ని రోడ్లు ఖాళీగా, మరికొన్ని బంపర్ టు బంపర్ జామ్‌తో కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితి విద్యాసంస్థలు, వాణిజ్య ప్రాంతాలు, ప్రభుత్వ–ప్రైవేట్ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తరచూ కనిపిస్తోంది. దీంతో ట్రాఫిక్ విభాగం ఓ జంక్షన్‌లోని ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలిస్తే సిగ్నల్స్ సైకిల్లోనూ మార్పు తీసుకురావచ్చని భావించింది. దీని కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో (ఐటీఎంఎస్) అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) విధానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. దీని కోసం గూగుల్ సంస్థతో పోలీసు విభాగం ఓ కీలక ఒప్పందాన్ని చేసుకుంది. స్మార్ట్ఫోన్లతో గుర్తిస్తున్న గూగుల్.. కీలక మార్గాలు, జంక్షన్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన పూర్తి సమాచారం గూగుల్ వద్ద రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంటోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆ సంస్థకు సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు తమ లొకేషన్ తెలుసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉంటారు. దీంతో ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్లు తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. వీటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఆ సంస్థ ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఏ రహదారిలో, ఏ దిశలో సెల్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయనేది గుర్తిస్తోంది. రహదారులపై ఉన్న సెల్ఫోన్లు సాధారణంగా వాహనచోదకులవే అయ్యి ఉంటాయి. ఇలా రోడ్లపై ఉన్న ట్రాఫిక్ వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్ సంస్థకు చేరుతున్నాయి. వీటి ఆధారంగానే ఆ సంస్థ తమ మ్యాప్స్‌లో ట్రాఫిక్ రద్దీ ఉన్నరహదారుల్ని ఎరుపు రంగులో చూపిస్తుంటుంది. ప్రస్తుత సమస్య.. ప్రతి ట్రాఫిక్ జంక్షన్లో ఉన్న నాలుగు రోడ్లలో ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైట్ వెలుగుతూ సిగ్నల్స్ సైకిల్ నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు. అయినా ట్రాఫిక్ సిగ్నల్స్ సైకిల్లో మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్ లైన్ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా, రెడ్‌లైన్ ఉన్న రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. పరిష్కారం.. ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఓ జంక్షన్‌లోని 4 రహదారుల్లో ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలిస్తే సిగ్నల్స్ సైకిల్లోనూ మార్పు తీసుకురావచ్చు. సమస్యకు గూగుల్ సాయం.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆ సంస్థకు సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు తమ లొకేషన్ తెలుసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉంటారు. దీంతో ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్లు తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. దీంతో ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన పూర్తి సమాచారం గూగుల్ వద్ద రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంటోంది. ఏపీఐ కోసం ఆ సంస్థతో ఒప్పందం.. గూగుల్ వద్ద ఉన్న ఈ వివరాలను వాహన చోదకులు, ప్రజలకు ఉపయుక్తంగా వినియోగించాలని పోలీసు విభాగం యోచించింది. దీంతో ట్రాఫిక్ అప్డేట్స్తో కూడిన గూగుల్ సర్వర్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కంట్రోల్ చేసే సర్వర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా అనుసంధానించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇది అమల్లోకి రావడంతో గూగుల్ సర్వర్ ఆధారంగా ఓ జంక్షన్ సమీపంలోని రహదారుల్లో వాహనాల రద్దీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సర్వర్‌కు చేరుతుంది. దీన్ని ఆటోమేటిక్‌గా గుర్తించే ఆ సర్వర్ సిగ్నల్స్ సైకిల్‌ను మారుస్తుంది. దీంతో ఓ చౌరస్తాకు సంబంధించి రద్దీ ఉన్న మార్గాల్లో ఎక్కువ సేపు గ్రీన్‌లైట్ వెలుగుతుంది. రద్దీని బట్టి ఆయా మార్గాల్లో సిగ్నల్స్ సైకిల్‌ను సర్వర్ మార్చేస్తూ ఉంటుంది. అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టంగా పిలిచే దీని ఫలితంగా ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతోపాటు వాహనచోదకుల సమయం సైతం ఆదా అవుతుంది. ఇప్పటికే ఈ విధానాన్ని గచ్చిబౌలి చౌరస్తాలో ప్రయోగాత్మకంగా వినియోగించారు. విజయవంతం కావడంతో 3 కమిషనరేట్లలోని దాదాపు అన్ని జంక్షన్లలోనూ వినియోగించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్‌ను నిర్వహిస్తున్న బెల్ సంస్థ కాంట్రాక్ట్ నవంబర్‌లో పూర్తయి కొత్త కాంట్రాక్ట్ మొదలవుతుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఐటీఎంఎస్ ప్రాజెక్టు అదే సమయానికి 3 కమిషనరేట్లలోనూ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నుంచి ఐటీఎంఎస్‌లో భాగంగా ఏటీసీఎస్ విధానం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించనుంది. ప్రజలకు ఎంతో ఉపయుక్తం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో అంతర్భాగంగా అమల్లోకి రానున్న అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టంను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షించాం. మంచి ఫలితాలు ఇస్తున్న ఈ విధానం ప్రజలకు, వాహనచోదకులకు ఉపయుక్తంగా మారుతుంది. మౌలిక వసతుల కల్పన, ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితరాల్లో ఉన్న ఇబ్బందుల్ని అధిగమిస్తున్నాం. త్వరలోనే ఏటీసీఎస్‌ను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నాం. గూగుల్ సంస్థ సహకారంతో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే సర్వర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. - అనిల్‌కుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ -
‘కొత్త’ మోజు... ‘పాత’కు బూజు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ కమిషనరేట్‌లో గురువారం భేటీ అయిన రహదారి భద్రత కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించిన వాటిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొన్ని కొత్త ప్రతిపాదనలు రూపొందించే అంశాలు ఉన్నాయి. అయితే ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వాటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. కీలక ప్రాంతాల్లో అవసరమైన ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉన్న రోడ్లలోనే స్వల్ప మార్పులు చేయడం, వాడుకలో లేని వాటిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ చెప్పడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ముం దుకు సాగని ప్రతిపాదనల్లో కీలకమైనవి ఇవీ... మలక్‌పేటలో ‘మూడో మార్గం’... నగరంలోని అత్యంత కీలకమైన, క్లిష్టమైన మార్గాల్లో దిల్సుఖ్నగర్–చాదర్‌ఘాట్ ఒకటి. ఈ రూట్లో మలక్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఉన్న (ఆర్యూబీ) అనునిత్యం ట్రాఫిక్ జామ్స్‌కు కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఉన్న రెండు మార్గాలకు తోడుగా కనీసం మరోటి నిర్మించాలని దాదాపు నాలుగేళ్ల క్రితం నుంచి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అనేకసార్లు భేటీ అయిన రైల్వే, ట్రాఫిక్, మెట్రో రైల్ అధికారులు ఎప్పటికప్పుడు త్వరలో పని మొదలంటూ ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇన్నే ళ్లు గడిచినా ఇప్పటి వరకు అక్కడ కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు. ఫలితంగా రద్దీ వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించాలంటూ వాహనచోదకులు నరకం చవిచూస్తున్నారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ సైతం దీనికి సమీపంలోనే ఉండటంతో పండుగల సీజన్లో బాధలు వర్ణనాతీతం. విమానాశ్రయం ‘మీదుగా’ రహదారి... బేగంపేట నుంచి బోయిన్‌పల్లికి వెళ్లాలంటే ప్రస్తుతం సికింద్రాబాద్ మీదుగా వెళ్లాల్సిందే. దాదాపు 18 ఏళ్ల క్రితం బేగంపేట నుంచి బోయిన్‌పల్లికి ఓ షార్ట్‌కట్ రూట్ ఉండేది. బేగంపేట పోలీసుస్టేషన్ దాటిన ఎడమవైపు తిరిగి ఎయిర్ ఇండియా ఆఫీస్ మీదుగా వెళ్లే ఈ దారి దాదాపు 80 అడుగుల వెడల్పు ఉండేది. ఆపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఈ మార్గాన్ని స్వాధీనం చేసుకుంది. బేగంపేట–సికింద్రాబాద్ మార్గం నిత్యం రద్దీతో నరకాన్ని చూపిస్తుంటుంది. విమానాశ్రయం శంషాబాద్‌కు తరలిపోవడంతో పాత మార్గాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నించాలని దాదాపు ఐదేళ్ల క్రితం ట్రాఫిక్ అధికారులు భావించారు. అప్పట్లోనే రెండు దఫాలుగా స్థానిక అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. ప్రాథమిక దశలోనే ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇది సాకారమైతే బేగంపేట నుంచి బోయిన్పల్లి వైపు వెళ్లే వారి ప్రయాణ దూరం దాదాపు 6 కిమీ మేర తగ్గడంతో పాటు ట్రాఫిక్ జామ్స్ అధిగమించవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ వద్ద స్కైవాక్... కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2011లో ‘ప్రాజెక్ట్ 100 డేస్’ ప్రకటించారు. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో సమస్యల పరిష్కారానికి రైల్వేస్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. కీలకమైన కో–ఆర్డినేషన్ కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా రెండు వైపులా ఉన్న బస్టాండ్ల వరకు స్కైవాక్ నిర్మించాలని క్షేత్రస్థాయి పర్యటన తర్వాత నిర్ణయించింది. వీటి నిర్మాణం వల్ల రోడ్డుకు అడ్డంగా పాదచారులు నడవటం, ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటడం, చిరు వ్యాపారుల ఆక్రమణలు తదితర సమస్యలు శాశ్వతంగా తొలగుతాయని యోచించారు. కనీసం సమీపంలోని ఈ మూడు ప్రాంతాల మధ్య తొలివిడతగా స్కైవాక్‌లు ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటికీ ఈ ప్రతిపాదనలు ఫైళ్లల్లోనే మగ్గుతున్నాయి. -
నిత్యం ట్రాఫిక్‌జామే
కల్వర్టు నిర్మాణపనులతో వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు పట్టణంలోకి వచ్చే ప్రధానరహదారిపై ఎల్‌ఆర్‌పల్లి ప్రాంతం వద్ద కల్వర్టు నిర్మాణపనులు కొనసా...గుతుండటంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు రెండునెలలుగా ఈ పరిస్థితి ఉంది. గత నెల 5వ తేదీన రహదారులు, భవనాలశాఖ అధికారులు నూతన కల్వర్టు నిర్మాణం కోసం పాత కల్వర్టును తొలగించారు. అయితే సాంకేతిక సమస్యలు, కొందరు ఇళ్ల యజమానులు కోర్టుకెళ్లిన నేపథ్యంలో నూతన నిర్మాణం నిలిచిపోయింది. గత 20 రోజుల క్రితం నిర్మాణ æపనులు చేపట్టినా అవి ఇంకా పూర్తికాలేదు. దీంతో పట్టణంలోకి రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ బస్సులకు రహదారి లేకపోవడంతో అవి డిపోకే పరిమితమయ్యాయి. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 100 పడకల ఆస్పత్రి సైతం కల్వర్టు అవతల ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. 21 రోజుల్లో కల్వర్టు నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పిన అధికారులు సకాలంలో పనులు పూర్తిచేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇరుకుగా ఉండే ప్రత్యామ్నాయ రోడ్డులో ప్రతి అరగంటకోమారు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌జామ్ అవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి కల్వర్టు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. -
చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ జామ్...
-
చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ జామ్...
హైదరాబాద్: వారాంతం కావడంతో గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. రద్దీ రెట్టింపవడంతో... ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. సరిపడా బస్సులు, రైళ్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణలో భద్రాచలం, మణుగూరు పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇక కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లేవారు కూడా ట్రాఫిక్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులతో పుష్కరాలకు వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. ఓ దశలో పోలీసులపై పుష్కరాలకు వెళ్లే వాహనదారులు తిరగబడే పరిస్థితి కనిపించింది. ఇక చొప్పదండి నుంచి ధర్మారం చేరుకునేందుకు సుమారు 6 గంటల సమయం పడుతుందని పుష్కరాలకు వెళ్లేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దమొత్తంలో ట్రాఫిక్ జామ్ అయినా ఒక్క పోలీస్ కూడా కనిపించలేదని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని పుష్కరాలకు వెళ్లేవారు మండిపడుతున్నారు. తాము హైదరాబాద్ నుంచి ఉదయం 5.30గంటలకు బయల్దేరామని ఇప్పటివరకూ ఇంకా ధర్మపురి చేరుకోలేని పరిస్థితి నెలకొందని, వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయినట్లు ట్రాఫిక్‌లో చిక్కుకున్న రంగాచారి కుటుంబసభ్యులు 'సాక్షి'కి సమాచారం అందించారు. కాగా ఇక పుష్కరాల సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని రహదారులపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో యుద్ధప్రతిపాదికన ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ, రేపు సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి గోదావరి పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లే రహదారులు, జేబీఎస్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్గేట్ల వద్ద వాహనాలను ఎక్కువసేపు ఆపకుండా త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలు మళ్లించాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ అధికమవుతున్న నేపథ్యంలో పుష్కరఘాట్ల వద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ పుష్కరఘాట్ వద్ద మంచి నీటి సదుపాయం, వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పుష్కరఘాట్లలో 24గంటలపాటు గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.