రద్దీ రోడ్డుపై బుల్ రైడ్.. నెటిజన్స్ ఫైర్ | Delhi Man With Bunny Helmet Rides A Bull On Busy Road | Sakshi
Sakshi News home page

రద్దీ రోడ్డుపై బుల్ రైడ్.. నెటిజన్స్ ఫైర్

Published Thu, Dec 14 2023 5:20 PM | Last Updated on Thu, Dec 14 2023 5:31 PM

Delhi Man With Bunny Helmet Rides Bull On Busy Road - Sakshi

పెట్రోల్ ధరను భరించలేకపోతే ప్రయాణాన్ని షేరింగ్ ప్లాన్ చేసుకుంటాం. నడవగలిగే దూరమైతే కాళ్లకే పనిచేబుతాం. కానీ దేశ రాజధానిలో ఓ వ్యక్తి వినూత్నంగా దర్శనమిచ్చాడు. రద్దీ రోడ్లలో ఎద్దుపై సవారీ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ దృశ్యాలను కెమెరాలో బందించి ఇన్‌స్టాలో షేర్ చేశాడు. పెట్రోల్‌ ధరలు ఇంతలా పెరిగితే ఇదే బెటర్ అంటూ రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 

ఢిల్లీలో కుందేలు ఆకారంలో ఉండే హెల్మెట్ పెట్టుకుని ఎద్దుపై సవారీ చేశాడో వ్యక్తి. తాడును చేతుల్లో పట్టుకుని ఎటు వెళ్లాలో ఎద్దుకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. రోడ్డంతా రద్దీగా ఉన్నా.. నడిరోడ్డుపై దర్జాగా సాగిపోతున్నాడు. పోలీసు అధికారి కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ చర్యను పబ్లిక్ న్యూసెన్స్‌గా నెటిజన్లు భావించారు.

సదరు వ్యక్తిపై మరికొందరు నెటిజన్లు ఫైరయ్యారు. జంతువులను హింసించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీ రోడ్డుపై నీ గొడవ ఏంట్రా? బాబు అంటూ ఆ వీడియోకు కామెంట్లు పెట్టారు. ఈ వీడియోకు 1,93,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో 3.8 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. 

ఇదీ చదవండి: ఏడు కోట్ల విలువైన డైమండ్‌ రింగ్‌ మాయం.. తీరా చూస్తే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement