trained
-
సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాద శిబిరాలు?
పాక్ ఉగ్రవాదులు గత కొద్దిరోజులుగా భారత సరిహద్దుల్లోకి చొరబడుతున్నారని ఇటీవల జరిగిన ఉగ్రదాడులు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా కథువాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. మరోవైపు ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి అందుతున్న నిధులకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం వెల్లడయ్యింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ నడుపుతున్న ఉగ్రవాద శిబిరాల జాబితా కూడా దీనిలో ఉంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ తమ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, మాజీ ఎస్‌ఎస్‌జీలు, కొందరు సైనికులతో కూడిన ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు ఇచ్చి భారతదేశానికి పంపుతోందని తెలుస్తోంది. అలాగే పాక్ ఈ ఉగ్రవాదులకు ఎం4 లాంటి ఖరీదైన ఆయుధాలు, బుల్లెట్లను అందిస్తోంది. చొరబాటు సమయంలో ఉగ్రవాదులకు సహాయం అందించే గైడ్లకు కూడా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు అందజేస్తోందని తెలుస్తోంది. అలాగే స్మార్ట్ ఫోన్లు, రేడియో సెట్లను ఉగ్రవాదులు విరివిగా వినియోగిస్తున్నారని సమాచారం.ఇదిలా ఉండగా తాజాగా భారత సైన్యం సరిహద్దుల్లోని కంచెలు, సొరంగాల తనిఖీని ముమ్మరం చేసింది. భారతదేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు ఆహారం కోసం ఐదారు వేల రూపాయలు ఖర్చు చేస్తారని తెలుస్తోంది. పాక్ ఆర్మీ సహాయంతో ఈ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ తన ఉగ్రవాద శిబిరాలను తిరిగి యాక్టివేట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి శిబిరాలు సరిహద్దుల్లోని నికియాల్, జాంద్రుత్, ఖురేటా కోట్లి, సమానీ, అబ్దుల్ బిన్ మసూద్, సమన్, కోట్‌కోటేరాలో ఉన్నట్లు తెలుస్తోంది. -
కరోనాను గుర్తించే పనిలో తేనెటీగలు
సాక్షి,న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పెను సంక్షోభాన్ని సృష్టించింది. కరోనా అంతానికి గ్లోబల్‌గా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికి కచ్చితమైన పరిష్కారం లభించలేదు. ముఖ్యంగా వైరస్‌ను గుర్తించేందుకే ఎక్కువ సమయం పడుతోంది. దీంతో తొందరగా కరోనాను గుర్తించే పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నెదర్లాండ్స్ పరిశోధకులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలను పసిగట్టేలా తేనెటీగలకు శిక్షణనిస్తున్నారు. తేనెటీగలకు వాసన పసిగట్టే అసాధారణ గుణం ఉందని, అదే తమ రీసెర్చ్‌కు దోహదపడుతుందని చెబుతున్నారు. కరోనా నిర్దారణ పరీక్షలకు గంటలు లేదా రోజులు పట్టవచ్చు, కాని తేనెటీగల నుండి ప్రతిస్పందన వెంటనే ఉంటుంది. ఈ పద్ధతి చౌకగా కూడా ఉంటుంది. కోవిడ్ టెస్ట్ ఫలితాలకోసం వేచి ఉండే సమయం తగ్గనుందని భావిస్తున్నారు. అంతేకాదు పరీక్షలు కొరత ఉన్న దేశాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. (కరోనా విలయం: డీఆర్డీవో డ్రగ్‌కు గ్రీన్ సిగ్నల్) నెదర్లాండ్స్ యూనివర్సిటీలో బయో వెటర్నరీ ల్యాబ్‌లో తెనేటీగల సామర్ధ్యంపై పరిశోధనలు చేస్తున్నారు. మొదట కోవిడ్ ఇన్ఫెక్షన్ శాంపిళ్లను వాసన వీటికి చూపుతారు. పువ్వుల్లో మకరందాన్నే ఆఘ్రాణించే రీతిలోనే ఇవి స్ట్రా లాంటి నాలుకలతో వాటి వాసన పీల్చుతాయని ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వైరాలజీ ప్రొఫెసర్ విమ్ వాన్ డెర్ పోయెల్ చెప్పారు. ఆ తరువాత ‘రివార్డు’గా చక్కర కలిపిన నీటిని వీటికి ఇస్తామన్నారు. అయితే ఇన్ఫెక్షన్ సోకని శాంపిల్ ని చూపితే వీటికి ఈ రివార్డు ఉండదని తెలిపారు. కోవిడ్ నమూనాలను చూపినప్పుడు మాత్రం దీన్ని స్వీకరించేందుకు ఇష్టపడట. చక్కెర నీటిని తీసుకున్న తేనెటీగలు, ఈ నమూనాల శాంపిళ్లను అందించినపుడు నాలుకలను చాచవని చెప్పారు. తేనెటీగలను సేకరించేవారి నుంచి తాము వీటిని తీసుకువచ్చి ప్రత్యేక హార్నెసెస్ వంటి వాటిలో ఉంచుతామన్నారు. ఇలా వీటి వల్ల కోవిడ్ ఫలితాలను త్వరగా గుర్తించవచ్చునన్నారు. వీటి రెస్పాన్స్ తక్షణమే ఉంటుందన్నారు. ఇది చౌక అయిన పధ్దతి అని, టెస్టులు తక్కువగా జరిగే దేశాల్లో ఇది ప్రయోగాజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. (కళ్లు తెరవండి! లేదంటే 10 లక్షల మరణాలు: లాన్సెట్ హెచ్చరిక) అయితే దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదని ఘెంట్ విశ్వవిద్యాలయంలో తేనెటీగలు, కీటకాలు, జంతు రోగనిరోధక శాస్త్రాన్ని అధ్యయనం చేసే ప్రొఫెసర్ డిర్క్ డీ గ్రాఫ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇలాంటివి పనికి రావని, కరోనా నిర్దారణ పరీక్షల కంటే కూడా ఇతర పనులకోసం వాటిని వినియోగించుకుంటానని వెల్లడించారు. క్లాసిక్ డయాగ్నస్టిక్ పరికరాలనే కోవిడ్ టెస్టులకు వినియోగించుకోవడం మంచిదన్నారు. 1990 ప్రాంతాల్లో అమెరికాలోని రక్షణ విభాగం ‘‘ఇన్సెక్ట్ స్నిఫింగ్" అనే సాంకేతికతను వాడిందని, పేలుడు పదార్థాలను, విషపదార్థాలను గుర్తించడానికి తేనెటీగలు, కందిరీగలను వినియోగించుకుందని ఆయన పేర్కొన్నారు. (కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!) -
'మృగాళ్ళ' ముందు మార్షల్ ఆర్ట్స్ విఫలం!
నోయిడాః మానవత్వం లేని మృగాళ్ళ ముందు మార్షల్ ఆర్ట్స్ కూడా పనికి రావడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా... మహిళల్లో అవగాహన పెరిగినా రాక్షసత్వానికి బలవంతులూ బలైపోతున్నారు. రాజధాని నగరంలో సంచలనం రేపిన నిర్భయ ఘటన అనంతరం.. అటువంటి ఘటనలే పునరావృతం అవుతున్నా కఠిన చట్టాలు మాత్రం అమల్లోకి రావడంలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్ లో జరిగిన గ్యాంగ్ రేప్ లో బాధితురాలు 13 ఏళ్ళ మైనర్ బాలిక మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది ఉండటంతో 30 నిమిషాలపాటు దుండగులతో పోరాడి చివరికి దారుణానికి బలైన ఘటన.. అందర్నీ ఆలోచింపజేస్తోంది. దేశంలో గ్యాంగ్ రేప్ లు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ కాన్పూర్ జాతీయ రహదారిపై దోపిడీ దొంగల ముఠా.. అటుగా ప్రయాణిస్తున్న కుటుంబంపై దాడిచేసి, ఓ మహిళ సహా ఆమె కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలసిందే. అయితే బాధిత 13 ఏళ్ళ బాలిక మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది ఉండటంతో సుమారు అరగంట పాటు దుండగులతో పోరాడినట్లు తెలుస్తోంది. అయితేనేం చివరికి సామూహిక దాడిని ఎదుర్కోలేక, మానవ మృగాల పైశాచికత్వానికి బలవ్వాల్సిన దుస్థితి ఎదురైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నోయిడానుంచీ షాజహాన్‌పూర్ కు కారులో వెడుతున్న కుటుంబాన్ని అడ్డగించిన ఆరుగురు సభ్యుల దోపిడీ దొంగల ముఠా... కారులోని ఇతర కుటుంబ సభ్యులను తాళ్ళతో కట్టి, వాహనంలోని మహిళను, 13 ఏళ్ళ కుమార్తెను బయటకు లాగి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అంతేకాదు వారివద్ద ఉన్న నగలు, నగదు, సెల్ ఫోన్లు సైతం దోచుకెళ్ళారు. అయితే తమ కుమార్తె మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిందని, దుండగులను ఎదుర్కొనేందుకు సుమారు అరగంటపాటు తీవ్రమైన పోరాటం జరిపిందని బాధితురాలి తండ్రి తెలిపారు. చివరికి ఆమెను ఎదుర్కోలేని దుండగులు.. తనపైనా, అన్నగారిపైనా కాల్పులకు పాల్పడ్డంతో వారి క్షేమాన్ని కోరి... తమ బిడ్డ దుండగులకు లొంగిపోయినట్లు ఆయన వివరించారు. ఘటన అనంతరం పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకోగా వారిని బాధితులు గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి దుర్ఘటనలు ఉత్తరప్రదేశ్ లోని శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కుటుంబ సభ్యులతో వెడుతున్న మహిళలకే భద్రత లేకపోతే ఇంకెవరికుంటాయంటూ ప్రశ్నిస్తున్నాయి. -
మహిళా పోలీసులకు శిక్షణ
ఘజియాబాద్: పోలీసింగ్‌లో మహిళా కానిస్టేబుళ్లకూ మరింత ప్రాధాన్యం కల్పించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని రకాల నేరాలను దర్యాప్తు చేసేలా వారిని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. హత్యలు, దోపిడీలు, దాడులు, నేరస్థలాల పరిశీలనలో వారికి భాగస్వామ్యం కల్పించడం ద్వారా దర్యాప్తు నైపుణ్యాలను పెంచుతామని ఘజియాబాద్ తొలి ఎసెస్పీ సచ్చీ ఘిల్డియాల్ ఆదివారం అన్నారు. ‘మహిళా పోలీసులు కూడా పురుషుల్లానే పని చేయాలని మేం కోరుకుంటున్నాం. వారిని కూడా నేరం జరిగిన ప్రదేశాలకు పంపిస్తాం. దాడుల నిర్వహణలోనూ భాగస్వామ్యం కల్పిస్తాం. దర్యాప్తులో నైపుణ్యం సాధించడానికి మహిళా పోలీసులను పురుష సహోద్యోగులతోపాటు ఘటనాస్థలాలకు పంపిస్తాం’ అని 2002 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఘిల్డియాల్ అన్నారు. ఘజియాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 427 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. వీరిని కార్యాలయాలు, ట్రాఫిక్ విభాగాల్లో నియమించారు. హత్యలు, దోపిడీలు, దాడుల వంటి కేసుల దర్యాప్తునకు అనుమతించడం లేదు. ఈ 427 మందిలో 13 మంది ఎస్ఐలు, ఇద్దరు హెడ్-కానిస్టేబుళ్లు, 312 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ‘నేరస్తులు ఉన్న ప్రాంతాల్లో దాడులు నిర్వహించినప్పుడు మహిళా పోలీసులను అక్కడికి తీసుకెళ్లడం లేదు. ఇక నుంచి వాళ్లు కూడా దాడులు నిర్వహిస్తారు’ అని ఎసెస్పీ ఈ సందర్భంగా వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో పనిచేసినప్పుడు స్థానిక బందిపోటు దొంగలు పలువురిని అరెస్టు చేయడంతో ఆమెకు సాహస పురస్కారం కూడా దక్కింది. అయితే ఎన్నికల సంఘం ఘజియాబాద్ ఎసెస్పీ ధర్మేంద్ర సింగ్‌ను బదిలీ చేయడంతో ఘిల్డియాల్ ఇక్కడికి వచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట్లకు మహిళా పోలీసులను పంపించి దర్యాప్తు చేయిస్తామని ఈమె చెప్పారు. ‘కొందరు మహిళలను పీసీఆర్ వ్యాన్లలో నియమించినా నేరస్తులను వెంబడించడం వంటి సమయాల్లో వారిని రానివ్వడం లేదు. ఇలాంటి పనుల్లోనూ మహిళా పోలీసులను నియమిస్తామంటూ ఎసెస్పీ ఘిల్డియాల్ చేసిన ప్రకటన హర్షణీయం. ఆమె మహిళలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు’ అని నోయిడాలోని సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి కవిత అన్నారు.