వివక్షకు గురైన సిక్కు పౌరుడికి పరిహారం
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో వివక్షకు గురైన సిక్కు పౌరుడొకరు పరిహారం పొందాడు. వివక్ష చూపి తనకు ఉద్యోగం రాకుండా చేసిన సంస్థ నుంచి 50 వేల డాలర్లు పరిహారం అందుకున్నాడు. పారామస్కు చెందిన గురుప్రీత్ ఎస్. కెర్హా(29) గడ్డం కలిగివున్నాడనే కారణంతో 2008లో వివక్షకు గురయ్యాడు.
లిటిల్ ఫాల్స్లోని కారు డీలర్షిప్ కంపెనీ ట్రై-కౌంటీ లెక్సస్లో ఉద్యోగానికి గురుప్రీత్ దరఖాస్తు చేశాడు. అయితే గడ్డం కలిగివున్నాడనే కారణంతో అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ఆ కంపెనీ నిరాకరించింది. దీనిపై గురుప్రీత్ న్యాయపోరాటానికి దిగాడు. సమాన ఉపాధి, అవకాశాల సంఘాన్ని ఆశ్రయించాడు.
చివరకు అతడికి 50 వేల డాలర్ల పరిహారం చెల్లించేందుకు కంపెనీ ముందుకు రావడంతో వివాదం పరిష్కారమయింది. ఈ మేరకు నవంబర్ 15న సమాన ఉపాధి, అవకాశాల సంఘంతో నెవార్క్తో ట్రై-కౌంటీ లెక్సస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తమ కంపెనీపై వచ్చిన వివక్ష ఆరోపణలను ట్రై-కౌంటీ లెక్సస్ తోసిపుచ్చడం గమనార్హం.