Triple murder case
-
సంఘమిత్ర కుటుంబానికి అసోం సీఎం పరామర్శ
తీవ్ర చర్చగా మారిన అసోం ట్రిపుల్ మర్డర్ కేసులో బాధిత కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పరామర్శించారు. ఈ క్రమంలో లవ్ జిహాదీ అంశం ప్రస్తావించిన ఆయన.. నిందితుడు నజిబుర్ పైనా సంచలన ఆరోపణలు చేశారు. ఇది మొత్తంగా లవ్ జిహాద్ పరిణామమే. బాధిత కుటుంబం హిందూ.. అలాగే నిందితుడు ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు. ఫేస్బుక్లో హిందూ పేరుతో పరిచయం పెంచుకుని.. ఆమెను ట్రాప్ చేశాడు. కోల్‌కతాలో ఆ ఇద్దరూ ఉన్నప్పుడు ఆమెపై డ్రగ్స్ ప్రయోగించినట్లూ తేలింది అని తెలిపారాయన. నిందితుడు నజిబుర్ రెహమాన్ బోరా తన మతం మార్చేసి.. ఆమెను మోసం చేశాడు. అతను డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి. ఆమెకూ డ్రగ్స్ ఇచ్చి లోబర్చుకున్నాడు. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆపై ఆమెను హింసించడంతో.. భరించలేకే పుట్టింటికి వచ్చేసింది అని సీఎం హిమంత వెల్లడించారు. కరోనా సమయంలో బాధితురాలి సోదరి అంకిత ఈ లవ్ జిహాదీ అంశంపై తనకు లేఖ రాసిందని.. కానీ, ఆ టైంలో ఆ లేఖ తన దాకా రాకపోవడం వల్ల ఇవాళ ఇంత ఘోరం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహిళ గతంలో తన భర్తను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్ టైంలో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన సంఘమిత్ర, నజిబూర్లు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయారు. ఆపై ఆమెపై దొంగతనం కేసు పెట్టించి నెలపాటు జైలు పాలు చేసింది ఆమె కుటుంబం. తిరిగి మళ్లీ పారిపోయిన జంట.. ఈసారి వివాహం చేసుకుని కాపురం పెట్టింది. ఓ బాబు కూడా పుట్టాడు. అయితే మనస్పర్థలతో ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుని నజిబూర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జైలుపాలైన నజిబూర్.. కోపంతో రగిలిపోయి సోమవారం ఆమె ఇంటికి వెళ్లాడు. భార్య సంఘమిత్రను, ఆమె తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జునూ ఘోష్‌లను పదునైన ఆయుధంతో హతమార్చాడు నిందితుడు నజిబూర్ రెహమాన్ బోరా(25). ఆపై తొమ్మిది నెలల బిడ్డను చంకనెక్కించుకుని గోలాఘాట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో నిందితులను ఎవరినీ ఉపేక్షించం. 15 రోజుల్లో ఛార్జిషీటు నమోదుచేసి నిందితుణ్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో నిలబెడతామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. అసోం హోం మంత్రిత్వ శాఖను కూడా ఆయనే పర్యవేక్షిస్తుండడంతో.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమించి బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేకూరుస్తానని చెబుతున్నారాయన. -
కృష్ణా: ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసు కొట్టివేత
సాక్షి, కృష్ణా జిల్లా: సంచలనం సృష్టించిన ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆధారాలు లేవంటూ ఈ కేసును ఏడీజే(జిల్లా అదనపు జడ్జి) కోర్టు కొట్టివేసింది. అక్టోబర్ 24, 2014న కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురయ్యారు. రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తడంతో హత్య కోసం ఢిల్లీ నుంచి కాంట్రాక్టు కిల్లర్లను మాట్లాడారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను ఢిల్లీలోనే అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి గంధం మారయ్య, పగిడి మారయ్యలు వచ్చారు. వారిని తీసుకెళ్లేందుకు ఏలూరు నుంచి వారి తండ్రి గంధం నాగేశ్వరరావు వచ్చారు. అంతకుముందే విమానాశ్రయం వద్ద బాలాజీ, మహేష్, శివలు ఎరుపురంగు కారులో క్యాప్‌లు ధరించి ఉన్నారు. వీరితో పాటు పల్సర్ బైక్‌పై హంతకముఠా సభ్యుడు(షూటర్స్బ్యాచ్ )కూడా అక్కడే ఉన్నట్టు పోలీసులు కేసు రిపోర్టులో పేర్కొన్నారు. చదవండి: ప్రియునితో జీవిస్తోందని భర్త కిరాతకం? విమానం దిగి బయటకు వచ్చి తవేరా కారు ఎక్కగానే ఆ ముగ్గురూ చంపాల్సిన వ్యక్తులని షూటర్‌కు చూపించారు. దీంతో అతను షూటర్స్‌కు సమాచారం అందించాడు. తవేరా కారును ఆ షూటర్స్ మరో కారులో వెంబడించి గంధం నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్యలను హతమార్చారు. శివ, మహేష్, బాలాజీలు ఘటన అనంతరం గుంటూరు వెళ్లి కారును వదిలి బస్సులో చెన్నై వెళ్లారు. -
త్రిబుల్ మర్డర్ కేసులో ముద్దాయికి ఉరి
ప్రొద్దుటూరు క్రైం: త్రిబుల్ మర్డర్ కేసులో ముద్దాయి కరీముల్లాకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్ వీధిలో నివసించే ఉప్పలూరు చాంద్‌బాషా, గుల్జార్‌బేగం దంపతులకు ఓ కుమార్తె (కరీమున్నీసా), ముగ్గురు కుమారులు(కరీముల్లా, మహబూబ్‌బాషా, మహ్మద్ రఫీ). రఫీ మినహా ఇద్దరు కుమారులు, కుమార్తెకు పెళ్లిళ్లు అయ్యాయి. కరీముల్లా గతంలో తల్లిదండ్రుల వద్దే ఉండేవాడు. అయితే అతను కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో.. తల్లిదండ్రులు పక్క వీధిలో వేరే కాపురం పెట్టించారు. ఆ సమయంలో కొందరి చెప్పుడు మాటలు విన్న కరీముల్లా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనపై నింద వేయడంతో.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కరీముల్లా మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాడు. గర్భిణి అయిన చెల్లెలు కరీమున్నీసా కూడా పుట్టింటికి వచ్చింది. భార్యతో విడాకులు ఇప్పించాలని కరీముల్లా అడుగుతుండగా.. తల్లిదండ్రులు సర్ది చెబుతూ వచ్చారు. దీంతో 2021 ఏప్రిల్ 25వ తేదీన కరీముల్లా కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. ఆ మరుసటి రోజు(26వ తేదీ) తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న తల్లి గుల్జార్‌బేగం, చెల్లి కరీమున్నీసా, తమ్ముడు రఫీని కరీముల్లా రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా.. ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. ముగ్గురిని తానే హత్య చేశానని కరీముల్లా అంగీకరించడం.. నేరం రుజువు కావడంతో జడ్జి జి.రమేశ్‌బాబు ఉరిశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రొద్దుటూరు కోర్టు చరిత్రలో ఇది మొదటి ఉరిశిక్ష తీర్పు అని ఏపీపీ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
‘నా భర్తను ఇండియాకు పిలిపించండి.. అన్యాయంగా ఇరికించారు’
సాక్షి, కడప అర్బన్: దేశం కాని దేశంలో బతుకుదెరువుకోసం వెళ్లిన తన భర్తను కువైట్ వాసులు ఒకే కుటుంబానికి చెందిన మూడు హత్యకేసుల్లో అన్యాయంగా ఇరికించారని, ఎలాంటి శిక్ష పడనీయకుండా తన భర్తను ఇండియాకు రప్పించి న్యాయం చేయాలని వెంకటేష్ భార్య స్వాతి విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్పాకు చెందిన పిలోళ్ల శ్రీరాములు కుమారుడు వెంకటేష్ కువైట్‌లో ఓ సేఠ్ వద్ద టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్దియా పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన సేఠ్ అహ్మద్ (80), అతని భార్య కాల్దా (62) కుమార్తె అసుమ (18)ను దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసి అక్కడి జైల్లో ఉంచారు. ఆయన భార్య స్వాతి కూడా కువైట్‌లోని ఓ న్యాయవాది ఇంట్లో పనిచేస్తోంది. అయితే న్యాయవాది సహాయంతో ఈ నెల 10న కువైట్ నుంచి వైఎస్సార్ జిల్లాకు వచ్చిన వెంకటేష్ భార్య స్వాతి శుక్రవారం తన పిల్లలు జయవర్ధన్, విష్ణువర్ధన్, అత్తామామలు శ్రీరాములు, రమణమ్మ, కుటుంబసభ్యులతో కలిసి కడపలోని కలెక్టరేట్‌కు వచ్చారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి వారివద్దకు వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, అమాయకుడైన తన భర్త వెంకటేష్‌ను ప్రభుత్వం చొరవ తీసుకుని కాపాడి ఇండియాకు రప్పించాలని కలెక్టర్ వి.విజయకుమార్ రాజుకు స్వాతి విజ్ఞప్తి చేసింది. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వానికి, విదేశాంగశాఖకు విషయాన్ని వివరిస్తూ వినతిపత్రాన్ని పంపిస్తామని చెప్పారు. -
వరంగల్ కుటుంబం హత్య: వదిన వల్లే అన్న మారాడని..
సాక్షి, వరంగల్ : చిల్లర మల్లర తిరుగుళ్లకు.. జల్సాలకు డబ్బులు తగలేసిన మహ్మద్ షఫీ అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యకు యత్నించాడా? ‘చావడమెందుకు చంపడమే పరిష్కారం’ అన్న స్నేహితుల బ్రెయిన్వాష్తో హంతకుడిగా మారాడా? చావాలనుకున్న షఫీ 15 రోజుల కిందట మనసు మార్చుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడా?’ అంటే నిజమేనంటోంది నిందితుల నేరాంగీకార పత్రం. సంచలనం కలిగించిన వరంగల్‌లోని ఎల్బీ నగర్లో బుధవారం తెల్లవారుజామున ముగ్గురి దారుణహత్య, మరో ఇద్దరిని గాయపరిచిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సొంత తమ్ముడే మరో ఐదుగురితో కలిసి దారుణానికి ఒడిగట్టిన సంఘటనపై కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఆ ఐదుగురి ప్రోద్బలంతోనే పథకం... చావే మార్గమనుకున్న షఫీకి స్నేహితులు, సహచరులు బోయిని వెంకన్న, ఎండీ.సాజీద్, రాగుల విజేందర్, ఎండీ.మీరా అక్బర్, ఎండీ.పాషాలు.. ‘నువ్వెందుకు చావాలి.. మీ అన్నను చంపడమే మేలు’ అన్న మార్గం చూపించారు. దీంతో మనసు మార్చుకున్న షఫీ అన్నతోపాటు అతని కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు పదిహేను రోజుల క్రితం స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఐదు వేటకత్తులతోపాటు వరంగల్ నగరంలో బ్యాటరీతో పనిచేసే రంపాన్ని కొనుగోలు చేశాడు. వీటిని తన ఇంటిలోనే భద్రపర్చాడు. పథకం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో మిగతా నిందితులు షఫీ ఇంటిపైన కలుసుకుని ఎవరెవరు ఏమి చేయాలి? అన్నకోణంలో హత్యాకాండకు పథక రచన చేశారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తమ వెంట ఒక జత బట్టలను తీసుకుని సాజిద్, ఎండీ.పాషాల ఆటోల్లో మిగతా ముగ్గురు.. బయలుదేరారు. షఫీ తన అన్న ఇంటికి మార్గం చూపించేందుకు బైక్‌పై ముందు వస్తుండగా, అతని వెనుక ఆటోల్లో మిగతా వారు వచ్చారు. చదవండి: సీక్రెట్ యాప్‌తో భార్య ఫోన్ ట్యాగింగ్.. ఆమెపై నీడలా భర్త ఇంటి తలుపు కట్‌చేసి, కళ్లల్లో కారం చల్లి... చాంద్‌పాషా ఇంటి ముందు ఆటోలో ఆగిన ఆరుగురు ముందుగా ఎలక్ట్రిక్ రంపం శబ్దం పక్క ఇళ్ల వాళ్లకు వినిపించకుండా ఉండేందుకు ఆటోను స్టార్ట్‌చేసి ఎక్స్‌లేటర్ పెంచారు. వెంకన్న అనే వ్యక్తి రంపాన్ని తీసుకోగా, మిగతా వారు వేట కత్తులతోపాటు కారం ప్యాకెట్లను పట్టుకున్నారు. చాంద్ పాషా ఇంటి ప్రధాన ద్వారం తలుపును రంపంతో కట్ చేసి ఇంటి కరెంట్‌ను నిలిపివేశారు. ప్రధాన ద్వారాన్ని మిషన్ కట్ చేసే క్రమంలో వచ్చిన శబ్దానికి చాంద్‌పాషా నిద్రనుంచి లేచి గట్టిగా అరిచాడు. ఆ తరువాత అతని భార్య సాబీరా బేగం, బావమరిది ఖలీల్‌పాషా, కుమారులు ఫహద్‌పాషా, సమద్‌పాషాలు నిద్రనుంచి లేచి ముందుకు వచ్చారు. నిందితులు ఒక్కసారిగా చాంద్ పాషా కుటుంబ సభ్యులపై కారం చల్లి ఒకరు రంపం మిషన్‌తో, మిగతా ఐదుగురు వేట కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చాంద్‌పాషాతోపాటు సాబీరాబేగం, ఖలీల్‌పాషాలు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడగా, వారికి వరంగల్ ఎంజీఎంలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. కర్కశత్వంలోనూ మానవత్వం.. డబ్బుల వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని దారుణహత్యలకు ఒడిగట్టిన మహ్మద్ షఫీ.. చాంద్‌పాషా కూతురు రుబీనాను మాత్రం చంపకుండా ‘బయటకు వెళ్లిపో (బాహర్ చలో)’ అంటూ గద్దించాడు. ఈ విషయాన్ని నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. షఫీకి ముగ్గురు కూతుళ్లుండగా, అందులో ఇద్దరికి పెళ్లిళ్లు కాగా మరొకరు పెళ్లికి ఉన్నారు. రుబీనా అతని చిన్న కూతురుతోపాటు షఫీతో సన్నిహితంగా ఉండేదట. దీంతో హత్యలు జరుగుతున్న సమయంలో ‘ఈ గొడవలతో నీకు సంబంధం లేదు.. నువ్వు బయటకు వెళ్లూ’ అని పంపినట్లు నిందితుడు షఫీ వెల్లడించినట్లు సమాచారం. రుబీనాకు పెళ్లయింది. ఆమె భర్త ఉపాధి కోసం ఖతార్‌కు వెళ్లగా.. చాంద్‌పాషా ఇంట్లోనే ఉంటోంది. నిందితులు ఆరుగురు.. వీరే 1. మహ్మద్ షఫీ, తండ్రి పేరు మనీసాబ్, వయసు 51, నివాసం మదీనా వీధి, కాశిబుగ్గ, వరంగల్ జిల్లా(ప్రధాన నిందితుడు మృతుడి తమ్ముడు) 2. బోయిని వెంకన్న, తండ్రి పేరు చంద్రయ్య, వయసు 45, శాంతినగర్, నర్సంపేట, వరంగల్ 3. ఎండీ సాజీద్, తండ్రి పేరు మునీర్, వయసు 32, డాక్టర్స్ కాలనీ, వరంగల్. 4. రాగుల విజేందర్, తండ్రి పేరు పాపయ్య, గోపిరెడ్డిపల్లి, రేగొండ మండలం, భూపాలపల్లి 5. ఎండీ మీరాఅక్బర్, తండ్రి పేరు ఇమామ్ బేగ్, వయసు 40, సుభాష్ నగర్, ఉర్సు, వరంగల్ 6. ఎండీ పాషా, తండ్రి పేరు హుస్సేన్, వయసు 37, ఎంహెచ్ నగర్, వరంగల్ వదిన వల్లే అన్న మారాడని.. అప్పుల పాలైన షఫీని తన భార్య తరచూ మందలించేదని, ఆ బాధ భరించలేక అన్న చాంద్‌పాషాతో అప్పులు చెల్లించి తన వాటా ఇవ్వాలని వాగ్వాదానికి దిగేవాడన్న ప్రచారం ఉంది. చాంద్‌పాషా భార్య సాబీరా బేగం తనకు డబ్బులు ఇవ్వకుండా అన్నపై ప్రభావం చూపుతుందని, వదిన పూర్తిగా తన అన్నను మార్చేసిందని కూడా ఇరుగు పొరుగు వారితో షఫీ చెప్పేవాడట. ఈ క్రమంలోనే అన్నతోపాటు వదినపైన కక్ష పెంచుకున్న షఫీ కిరాతకంగా చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అన్నదమ్ముల భార్యలు సైతం తరచూ గొడవలు పెట్టుకున్న సందర్భాలున్నట్లు చెబుతున్నారు. -
కామిరెడ్డిపల్లి త్రిబుల్ మర్డర్ కేసు కొట్టివేత
సాక్షి, ధర్మవరం/అనంతపురం: నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన కామిరెడ్డిపల్లి త్రిబుల్ మర్డర్ కేసులో జిల్లా మహిళా కోర్టు(జిల్లా 4వ అదనపు జడ్జి) న్యాయమూర్తి బి.సునీత గురువారం తీర్పునిచ్చారు. కేసులో నిందితులుగా ఉన్న 20 మందిపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా పరిగణించారు. వివరాలు.. 2011లో ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు, అతని కొడుకు దాసరి ఆంజనేయులు, కూతురు పద్మావతి కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద హత్యకు గురయ్యారు. ఈ కేసులో మాజీ కౌన్సిలర్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, అతని చిన్నాన్న కామిరెడ్డిపల్లి ఆదిరెడ్డి, సోదరుడు రవీంద్రారెడ్డి, మల్లాకాల్వ రామమోహన్‌రెడ్డి, రావులచెరువు ప్రతాపరెడ్డి, మరో 17 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 2011 సెప్టెంబర్ 15న కనగానపల్లి పోలీసులు సెక్షన్–324, 326, 307, 302,120బీ కింద కేసు నమోదు చేశారు. ధర్మవరం, అనంతపురం కోర్టుల్లో కేసు నడిచింది. (టీడీపీలో ‘చిచ్చు’ బుడ్డి) 35 మంది సాక్షులను విచారించిన కోర్టు కేసులో నిందితులుగా మొత్తం 22 మంది ఉండగా, వారిలో మూడేళ్ల క్రితం తిమ్మప్ప, ప్రకాష్ చనిపోయారు. మిగిలిన 20 మందిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. కాగా రెండు నెలల పాటు ఈ కేసును విచారించిన జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి మొత్తం 35 మంది సాక్షులను విచారించారు. వీరితోపాటు అప్పట్లో కేసు నమోదు చేసిన ముగ్గురు పోలీసు అధికారులను కూడా విచారణ చేశారు. నేరం రుజువు కాకపోవడంతో మొత్తం 20 మంది నిందితులను నిర్దోషులుగా తీర్పునిస్తూ న్యాయమూర్తి కేసు కొట్టేశారు. -
ఆధారాల్లేవు.. హత్యకేసులో మాజీ ఎంపీకి విముక్తి!
యూత్ కాంగ్రెస్ నేత హత్య కేసులో వివాదాస్పద మాజీ ఎంపీ, ఆర్జేడీ నేత మహహ్మద్ షాబుద్దీన్‌కు విముక్తి లభించింది. తగినన్ని ఆధారాలు లేవంటూ ఆయనను జెంషెడ్పూర్ కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టింది. జెంషెడ్పూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ మిశ్రాతోపాటు మరో ఇద్దరిని హత్య చేసినట్టు షాబుద్దీన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ అభియోగాలను రుజువు చేసేందుకు తగినంతగా ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని పేర్కొంటూ.. జెంషెడ్పూర్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అజిత్‌కుమార్ సింగ్ ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. బిహార్‌లో పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న షాబుద్దీన్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆయన వీడియో కాన్ఫరేన్స్ ద్వారా సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నలుగురు నిందితులపై 2006లో కోర్టు అభియోగాలను కొట్టివేసింది. మరో ముగ్గురు విచారణలోనే చనిపోయారు. 1989 ఫిబ్రవరి 2న దుండగులు కాంగ్రెస్ నేత ప్రదీప్ మిశ్రా కారును ఆపి.. ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనతోపాటు ఆయన స్నేహితులు జనార్దన్ చౌబే, ఆనంద్‌రావు ప్రాణాలు కోల్పోయారు. -
ట్రిపుల్ మర్డర్‌కు రెండేళ్లు
నేటికీ దొరకని సూత్రధారి భూతం గోవిందు గన్నవరంః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెదఆవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసులోని నిందితులు శుక్రవారం స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. కాల్పుల కేసుకు శనివారంతో రెండేళ్ళు పూర్తికానుంది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారులు పగిడిమారయ్య, పెదమారయ్యలు 2014 సెప్టెంబర్ 24న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కారులో ఏలూరుకు వెళ్తుండగా పెదఆవుటపల్లి వద్ద దుండగులు కాల్చి చంపడం తెలిసిందే. కుటుంబ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ హత్యాకాండలో మొత్తం 49 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇప్పటివరకు 45 మందిని నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో 35 మంది వరకు బెయిల్‌పై విడుదలకాగా హత్యలు చేసిన ఢిల్లీకి చెందిన పది మంది కిరాయి షూటర్లు జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ముగ్గురు మినహా 42 మంది నిందితులు కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. విచారణను తిరిగి వచ్చెనెల 7వ తేదికి న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు భూతం గోవింద్‌తో పాటు మరో ముగ్గురు షూటర్లు ఇప్పటికీ దొరక్కపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. సూత్రధారి గోవిందు దొరికితే తమకు న్యాయం జరగదని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
రక్త చరిత్రకు ఏడాది
విజయవాడ సిటీ : పెద అవుటపల్లిలో ట్రిపుల్ మర్డర్ ఘటన జరిగి ఏడాది పూర్తయింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామ కక్షలకు ఈ ఘటనలో మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ 24న పెద అవుటపల్లి జాతీయ రహదారిపై ప్రత్యర్థులను వెంబడించి వేటాడిన దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు మారయ్య (40), పగిడి మారయ్య (35)లను హతమార్చారు. విదేశాల్లో తలదాచుకున్నట్టు పోలీసులు చెబుతున్న ప్రధాన నిందితుడు, అతని సోదరుడు మూడు హత్యలకు కుట్ర చేసి ఏడాది గడిచినా పోలీసులకు చిక్కలేదు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసులో ఢిల్లీకి చెందిన కిరాయి హంతకులు పాల్గొన్నారు. కేసు దర్యాప్తులో పోలీసులు మొదట చూపిన ఉత్సాహం ఆ తర్వాత చూపకపోవడమే ప్రధాన నిందితుల ఆచూకీ దొరకకపోవడానికి కారణంగా తెలుస్తోంది. కిరాయి షూటర్లు సహా 20 మందికి పైగా నిందితులను కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసినా, ప్రధాన కుట్రదారులు మాత్రం నేటికీ చిక్కకపోవడం గమనార్హం. ఆరోజు ఏం జరిగిందంటే.. ముంబైలో తలదాచుకొని కోర్టు వాయిదాకు వస్తున్న గంధం మారయ్య, పగిడి మారయ్యతో పాటు వారిని తోడ్కొని వెళ్లేందుకు వచ్చిన తండ్రి నాగేశ్వరరావు పెద అవుటపల్లి జాతీయ రహదారిపై ఆగంతకులు జరిపిన కాల్పుల్లో మృతిచెందారు. పినకడిమి గ్రామంలో గంధం, భూతం కుటుంబాల మధ్య బెడిసికొట్టిన ప్రేమ వివాహం కక్షలను రాజేస్తే, పంచాయతీ పోరు ఆజ్యం పోసింది. ఈ క్రమంలోనే 2014 ఏప్రిల్ 6న ఏలూరు జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా తూరపాటి నాగరాజును పేర్కొన్న పోలీసులు అతని కుమారునితో పాటు గంధం మారయ్య, పగిడి మారయ్యలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ముంబైలో తలదాచుకున్న గంధం సోదరులు కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనంలో వెళుతూ హత్యకు గురయ్యారు. ఈ కేసులో విదేశాల్లో ఉంటున్నట్టు చెపుతున్న భూతం గోవింద్, ఇతని సోదరుడు శ్రీనివాసరావుతో పాటు 30 మంది వరకు నిందితులుగా పేర్కొన్నారు. దర్యాప్తు ఇలా.. రెండోసారి పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే ట్రిపుల్ మర్డర్ జరగడంతో ఈ కేసును పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పినకడిమి గ్రామాన్ని జల్లెడ పట్టిన పోలీసులు గంధం, భూతం కుటుంబాల మధ్య నెలకొన్న వైరమే మూడు హత్యలకు కారణంగా నిర్ధారించారు. ఓంబీర్ పరారవ్వగా గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసుల సాయంతో కుట్రదారులైన పంకజ్, మంజిత్సింగ్తో పాటు షూటర్లు ప్రతాప్‌సింగ్, ధర్మవీర్, నితిన్, నీరజ్, సతీష్‌కుమార్‌లను అరెస్ట్ చేశారు. వీరి సమాచారం ఆధారంగా చిన్న శ్రీనివాసరావుతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భూతం అనుచరులు, బంధువులు సహా 17 మందిని అరెస్ట్ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు విదేశాల్లో ఉన్న ప్రధాన కుట్రదారు గోవింద్‌ను రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్టు అప్పటి పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇది జరుగుతుండగానే హైదరాబాద్‌లో అజ్ఞాత జీవితం గడుపుతున్న తూరపాటి నాగరాజుపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే అధికారులు మారారు. స్టేషన్ స్థాయిలో సైతం మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో కేసుపై పోలీసులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. ఏడాది ముగిసినా ప్రధాన నిందితులు పట్టుబడకపోవడం గమనార్హం. -
'పెద్దఅవుటపల్లి' కేసులో మరో ముగ్గురి అరెస్ట్
విజయవాడ: పెద్దఅవుటపల్లి వద్ద జరిగిన తండ్రి, ఇద్దరు కుమారుల హత్యకేసులో మనో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టు హాజరుపరిచారు. వీరికి ఈనెల 15 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటివరకు ఈ కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన తండ్రీకొడుకుల్ని ఆగస్టు 24న కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లి వద్ద తుపాకులతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. -
పోలీసులనే బురిడీ కొట్టించారు
విజయవాడ సిటీ : రాష్ట్రంలో సంచలనం కలిగించిన పెద అవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసు నిందితుల అరెస్టులో పోలీసులను మధ్యవర్తులు బురిడీ కొట్టించారు. నిందితులు నేరుగా తమ వద్దకే వచ్చి లొంగిపోతారని పోలీసులు ధీమాతో ఉన్నారు. వారి దిమ్మ తిరిగేలా ఆరుగురు నిందితులు కోర్టులో లొంగిపోయి ఝలక్ ఇచ్చారు. ఏలూరుకు చెందిన తమ న్యాయవాది ద్వారా ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులైన పురాణం గణేష్, ఊరా గోపి, తూరపాటి పెదబాబు, సిరిగిరి గోపరాజు, కిన్నెర శ్రీను, చేజర్ల వెంకటేష్ గురువారం ఉదయం గన్నవరం కో ర్టులో లొంగిపోయారు. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై గత సెప్టెంబర్ 24న జరిగిన గంధం నాగేశ్వరరావు, ఆయన ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్య హత్య కేసులో 22 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిలో ఢిల్లీకి చెందిన కిరాయి హంతకులు ఎనిమిది మంది కాగా.. మిగిలిన వారు పినకడిమి గ్రామానికి చెందిన కుట్రదారులు. ప్రధాన కుట్రదారుడు భూతం గోవింద్ విదేశాల్లో తల దాచుకోగా.. మిగిలిన వారు ఈ హత్యల తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు.. ఈస్ట్‌జోన్ ఏసీపీ ఉమామహేశ్వరరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు. కేసులో ఆధారాల సేకరణ, నిందితుల పట్టివేతను సిట్‌కు అప్పగించారు. అరెస్టయింది వీరే సిట్ ఏర్పాటుకు ముందే ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల సాయంతో కిరాయి షూటర్స్ ప్రతాప్‌సింగ్ అలియాస్ అనుజ్, ధరమ్వీర్ అలి యాస్ సల్లు, నితిన్, నీరజ్‌తో పాటు కుట్రదారులతో ఒప్పందం చేసుకున్న మంజిత్‌సింగ్, సతీష్‌కుమార్, పంకజ్ అలియాస్ ప్రకాష్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సిట్ బృందం పినకడిమి గ్రామానికి చెందిన భూతం బాలాజీ, పాస్తం మహేష్, పాలపాటి శివను అక్టోబర్ 16వ తేదీన అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు ‘సిట్’ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతూ గాలి స్తోంది. ఈ బృందం కళ్లుగప్పి ఆరుగురు నింది తులు గురువారం కోర్టులో లొంగిపోయారు. ఏమార్పు నిందితులకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉన్నట్టు తెలిసింది. వీరు లొంగిపోనున్నారనే సమాచారంతో మధ్యవర్తులు విధిం చిన షరతులకు పోలీసులు అంగీకరిం చినట్లు చెబుతున్నారు. నిందితులు నేరుగా వచ్చి తమ వద్ద లొంగిపోతారనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఎలాగు వచ్చి లొంగిపోతారనే ఉద్దేశంతో సిట్ బృందం వీరిపై పెద్దగా దృష్టి సారించలేదు.ఈ క్రమంలో ముందుగా ఇచ్చిన మాటకు విరుద్ధంగా కోర్టులో లొంగిపోవడంతో పోలీసులు ఖిన్నులయ్యారు. ఈ అంశంపై మధ్యవర్తుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన పోలీసులు.. మిగిలిన వారినైనా పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. -
హైవేపై కాల్పుల నిందితులకు 25వరకూ రిమాండ్
గన్నవరం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెదఅవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం ఉదయం గన్నవరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వారికి ఈనెల 24వ తేదీ వరకూ న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కాగా అంతకు ముందు సీపీ ....అయిదు గంటల పాటు నిందితులను విచారించారు. మూడు హత్యల కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సులో కమిషనరేట్‌కు తీసుకు వచ్చారు. గత నెల 24న కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. -
ట్రిపుల్ మర్డర్ కిల్లర్స్‌ను తీసుకొచ్చిన పోలీసులు
విజయవాడ/పెనమలూరు: రాష్ట్రంలో సంచలనం కలిగించిన పెదఅవుటుపల్లి ట్రిపుల మర్డర్ కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సులో కమిషనరేట్‌కు తీసుకొచ్చారు. గురువారం రాత్రి 7గంటల సమయంలో విజయవాడ నగరానికి తీసుకొచ్చిన వీరిని పెనమలూరులోని తూర్పు డివిజన్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. వీరిని శుక్రవారం కోర్టు ద్వారా జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు. గత నెల 24వ తేదీన కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి గ్రామం సమీపంలోని 5వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఆగంతుకుల కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, ఇతని కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పినకడిమి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే వీరి హత్యలు జరిగినట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని కళ్యాణిపురా ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులు ప్రతాప్‌సింగ్ అలియాస్ అనుజ్, ధరమ్ వీరు అలియాస్ సల్లు, నితిన్, నీరజ్‌తో పాటు హత్యలకు కుట్రదారులైన మంజీత్‌సింగ్, సతీష్‌కుమార్, పంకజ్ అలియాస్ ప్రకాశ్‌ను మంగళవారం ఢిల్లీ పోలీసుల సహకారంతో డిప్యూటీ పోలీసు కమిషనర్(శాంతి భద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్ నేతృత్వంలోని బృందం అరెస్టు చేసింది. వీరిని అక్కడి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు పిటి(ప్రిజనర్స్ ట్రాన్సిట్) వారెంట్‌పై ఇక్కడికి తీసుకొచ్చారు. -
మూడు హత్యల ఘటనలో దొరికిన మరో క్లూ!
-
మూడు హత్యల ఘటనలో దొరికిన మరో క్లూ!
విజయవాడ: విజయవాడ-ఏలూరు హైవేపై పెద్దవుటపల్లి వద్ద నిన్న జరిగిన మూడు హత్యలకు సంబంధించి మరో క్లూ దొరికింది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటనాస్థలానికి 5 కిలో మీటర్ల దూరంలో తొట్టిపాడు టోల్గేట్ వద్ద పార్క్ చేసిన పల్సర్ బైకును పోలీసులు కనుగొన్నారు. ఈ పల్సర్ బైకు నెంబరు ఏపి 27 ఏఎస్ 3400. నిన్నటి నుంచి ఆ బైకు అక్కడే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. షూటర్స్‌కు సమాచారం ఇచ్చేందుకు ఈ బైకును నిందితులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులు వాడిన కారును కూడా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వాళ్లు బస చేసిన రాయల్ హంపీ హోటల్ వెనుక భాగంలోనే వారు వాడిన కారును వదిలి వెళ్లారు. కారులోని రెండు కత్తులు, తుపాకీతో పాటు రాడ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలు చేసిన తర్వాత వీరంతా హోటల్‌కు చేరుకుని, తాపీగా బిర్యానీ తిని వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, హత్యకు గురైనవారు ముందుగానే పోలీస్ రక్షణ అడిగినట్లు తెలుస్తోంది. అయితే గన్నవరం నుంచి రక్షణ కల్పించడం సాధ్యంకాదని, ఏలూరు వచ్చిన తరువాత రక్షణ కల్పిస్తామని పోలీసులు వారికి చెప్పినట్లుగా చెబుతున్నారు. పోలీసుల రక్షణ లేకుండా రావడం వల్లే వారు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. **