tukaram gate
-
హైదరాబాద్: ఫలించిన యాభై ఏళ్ల కల!
సాక్షి, సికింద్రాబాద్: ‘తుకరాంగేట్ రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించిన ఆర్యూబీ అమలులోకి వచ్చింది. యాభై సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితం అయిన వంతెన కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి వచ్చింది. 2018 జూలై నుంచి అందుబాటులోకి వచ్చిన ట్రాఫిక్ ఆంక్షలు తొలగిపోయాయి. ► కరోనా తదితర సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగి ఐదేళ్ల కాలంలో నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కొద్ది రోజుల క్రితమే నిర్మాణం పూర్తయిన వంతెనను రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావుగౌడ్ వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపారు. ► ఐదు దశాబ్దాలుగా ఎన్నికల నినాదంగా మారిన వంతెన నిర్మాణం పనులు పూర్తయి అందుబాటులోకి రావడంతో తుకారాంగేట్ పరిసర ప్రాంతాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే వంతెన అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు సమూలంగా పరిష్కారం లభించినట్టయింది. చదవండి: ఇటుక అండగా.. ఇల్లు చల్లన! కూల్ బ్రిక్స్ తయారీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 26 సార్లు గేట్ పడేది... ► సికింద్రాబాద్ నుంచి లాలాపేట్, మల్కాజిగిరి ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు తుకారాంగేట్ రహదారి ఒక్కటే పెద్దదిక్కుగా ఉంది. నిత్యం లక్ష వాహనాల రాకపోకలు ఈ దారిగుండా ఉంటున్నట్టు ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ► తుకారాంగేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా నిత్యం వంద వరకు రైళ్ల రాకపోకలు ఉంటున్నాయి. ప్రతీ 40 నిమిషాలకు ఒకమారు లెవల్ క్రాసింగ్ వద్ద గేటు వేసేవారు. మొత్తంగా రోజుకు 20 నుంచి 26 సార్లు గేటు పడుతుండడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయేవి. ► రూ.20.10 కోట్ల వ్యయంతో తుకారాంగేట్ ఆర్యూబీ నిర్మాణం పనులు పూర్తి చేశారు. జీహెచ్ఎంసీ, దక్షిణ మధ్యరైల్వేలు సంయుక్తంగా వంతెనను నిర్మించారు. జీహెచ్ఎంసీ రూ.15.14కోట్లు, రైల్వేశాఖ రూ. 13.95 కోట్లు విడుదల చేయడం ద్వారా నిర్మాణం పనులు పూర్తి చేశారు. చదవండి: వినూత్న ‘పెండ్లిపత్రిక’.. పారేయకండి.. మట్టిలో పాతిపెడితే.. ట్రాఫిక్ మళ్లింపులకు తెర ► వంతెన నిర్మాణం పనులు ప్రారంభం అయిన కొద్ది రోజుల ముందు నుంచి తుకారాంగేట్ రహదారి మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి తుకారాంగేట్ రైల్వేగేట్ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఇతర మార్గాల మీదుగా మళ్లించారు. ► నాలుగు సంత్సరాల అనంతరం తుకారాంగేట్ రైల్వే వంతెన మీదుగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మల్కాజిగిరి, మౌలాలి, నేరెడ్మెట్ తదితర ప్రాంతాల వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పాయి. -
హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మరో నాలుగు ప్రాజెక్టులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. బహదూర్‌పురా ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్ ఆర్‌యూబీలు ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన జీహెచ్ఎంసీ.. తాజాగా బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్ సైతం మార్చిలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. దీంతో ఎస్సార్డీపీలో భాగంగా నాలుగు అభివృద్ధి ఫలాలతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గనున్నాయి. బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ 2020 ఆగస్టులో అందుబాటులోకి వచ్చింది. ఎడమవైపు ఫ్లై ఓవర్ వచ్చేనెల రెండో వారంలో అందుబాటులోకి రానున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వీలును బట్టి మిగతా మూడు ప్రాజెక్టులు కూడా వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపిన అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. చదవండి: వెలుగులోకి ‘వెబ్ సిరీస్ సూరి’ మరో వ్యవహారం బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఒవైసీ జంక్షన్ వైపు నుంచి ఉప్పల్ జంక్షన్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ చిక్కులు ఉండవు. ప్రయాణవేగం పెరుగుతుంది. ప్రయాణ సమయం, వాహనాల ఇంధన,నిర్వహణ వ్యయం కూడా తగ్గుతాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఎస్సార్డీపీలో భాగంగా ప్రభుత్వం రూ. 25వేల కోట్లకు పైగా ఖర్చయ్యే ఫ్లై ఓవర్లు, మేజర్ కారిడార్లు, స్కైవేలు, అండర్‌పాస్‌లు, మేజర్ కారిడార్లు, ఆర్ఓబీలు,ఆర్‌యూబీలు, తదితరమైన వాటి నిర్మాణం చేపట్టడం తెలిసిందే. వాటిల్లో పూర్తయిన పనులతో ఆయా మార్గాల్లో సాఫీ ప్రయాణంతో ట్రాఫిక్ చిక్కులు తగ్గాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. బైరామల్ గూడ ఫ్లై ఓవర్.. అంచనా వ్యయం : రూ. 28.64 కోట్లు ఫ్లై ఓవర్ పొడవు : 780 మీటర్లు వెడల్పు :12.50 మీటర్లు లేన్లు : 3 ప్రయాణం : ఒక వైపు -
రూ. 9.58 కోట్ల భారీ చోరీ
- ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీలో గోల్‌వూల్ - ఇద్దరు ఉద్యోగులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు - పరారీలో ఉన్న నిందితులు హైదరాబాద్: ఏటీఎంలలో డబ్బులు నింపే ఉద్యోగులు ఏజెన్సీని మోసం చేసి డబ్బును అపహరించిన ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... అనంతపూర్ జిల్లాకు చెందిన లోకేశ్ రెడ్డి, పాతబస్తీకి చెందిన ప్రవీణ్ గత కొన్ని నెలలుగా మహేంద్రా హిల్స్ త్రిమూర్తి కాలనీలోని ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలో పని చేస్తున్నారు. సుమారు 52 బ్యాంకుల ఏటీఎంలకు ఈ ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా డబ్బులు సరఫరా చేస్తారు. అయితే డబ్బులు సరఫరా చేసే ఉద్యోగం చేస్తున్న లోకేశ్‌రెడ్డి, ప్రవీణ్‌లు ఏజెన్సీలో నుంచి డబ్బులు తీసుకెళ్తున్నారు కాని ఏటీఎంలలో క్యాష్ మాత్రం వేయడం లేదు. గత కొన్ని రోజులుగా ఇదేవిధంగా చేస్తూ వస్తున్నారు. అయితే, ఏప్రిల్‌లో ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ యాజమాన్యం ఏజెన్సీని వేరేవాళ్లకు అమ్మేసింది. దీంతో లెక్కలు చూస్తున్న సమయంలో 9.98 కోట్లు మాయం అయినట్లు అందులో తేలింది. దీంతో ఆ ఏజెన్సీ మేనేజర్ నాగరాజు శనివారం స్థానిక తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏటీఎంలకు క్యాష్ సరఫరా చేసే లోకేశ్ రెడ్డి, ప్రవీణ్‌లపై అనుమానం ఉన్నట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఉద్యోగులు లోకేశ్ రెడ్డి, ప్రవీణ్‌లు పరారీలో ఉన్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన సఫారీ, 3 బైక్‌లు ధ్వంసం
-
ఇంట్లోకి దూసుకెళ్లిన సఫారీ, 3 బైక్‌లు ధ్వంసం
హైదరాబాద్ : నగరంలోని తుకారం గేట్ వద్ద టాటా సఫారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ఓ ఇంట్లోకి సఫారీ దూసుకెళ్లడంతో 3 బైక్‌లు సహా ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.