Tunnel works
-
Uttarkashi tunnel collapse rescue: పీడకల... అగ్నిపరీక్ష
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు. ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్‌లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్ బేడియా(22) అనే కార్మికుడు వెల్లడించాడు. ‘‘నవంబర్ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా, హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్ధాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మచీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి రెండు రోజులపాటు బతుకుతామన్న ఆశ లేకుండాపోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం. బయట పడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోని రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసిపట్టుకొని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజులపాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి. మేమంతా కలిసి నిత్యం దేవుడిని ప్రార్థించేవాళ్లం. చివరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. మొదట్లో కష్టంగా గడిచింది సొరంగంలో తాము చిక్కుకున్నట్లు తెలియగానే ఆందోళనకు గురయ్యామని ఉత్తరాఖండ్‌లోని చంపావత్ గ్రామానికి చెందిన పుష్కర్‌సింగ్ ఐరే అనే కార్మికుడు చెప్పాడు. మొదట్లో చాలా కష్టంగా గడిచిందని, చనిపోతామని అనుకున్నామని, క్రమంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తొలుత సరైన ఆహారం లేదు, బయటున్నవారితో మాట్లాడే వీలు లేదని అన్నాడు. ఒంటిపై ఉన్న బట్టలతోనే 17 రోజులపాటు ఉండాల్సి వచి్చందని, స్నానం చేయలేదని, సొరంగం లోపలంతా అపరిశుభ్రంగా మారిందని తెలియజేశాడు. ప్లాస్టిక్ షీట్లపై నిద్రించామని పేర్కొన్నాడు. ఆహారం, నీరు అందిన తర్వాత ఊపిరి పీల్చుకున్నామని చెప్పాడు. కాలక్షేపం కోసం పేకాడామని, కాగితాలను క్రమపద్ధతిలో చింపుతూ ఉండేవాళ్లమని వివరించాడు. సాక్సులతో బంతులు చేసి, చోర్–సిఫాయి ఆట ఆడామని, పాటలు పాడుకున్నాం తెలిపాడు. నిత్యం యోగా, వాకింగ్ చేశాం.. సొరంగం నుంచి బయటకు వచి్చన 41 మంది కార్మికులతో మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సొరంగంలో ఉన్నప్పుడు నిత్యం యోగా, వాకింగ్ చేశామని, తద్వారా మనోస్థైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డామని, ఆత్మవిశ్వాసం పెంచుకున్నామని ప్రధానమంత్రికి కార్మికులు తెలియజేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల్లో చిక్కుకుంటే మన ప్రభుత్వం కాపాడిందని, స్వదేశంలోనే ఉన్న తామెందుకు భయపడాలని భావించామని అన్నారు. రిషికేశ్ ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు సిల్క్యారా టన్నెల్ నుంచి బయటకు వచి్చన కార్మికులను బుధవారం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు హెలికాప్టర్లో తరలించారు. డిజాస్టర్ వార్డులో చేర్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి కూడా పరీక్షిస్తామని, అవసరమైన వారికి తగిన చికిత్స అందిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడిన వారిని ఇళ్లకు పంపిస్తామని వెల్లడించారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధులను కూడా సిల్క్యారా నుంచి బస్సుల్లో ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. కార్మికుల గ్రామాల్లో సంబరాలు ఖిరాబేడా గ్రామం నుంచి మొత్తం 13 మంది యువకులు సొరంగం పనుల కోసం ఉత్తరకాశీకి చేరుకున్నారు. అదృష్టం ఏమిటంటే వారిలో ముగ్గురు మాత్రమే సొరంగంలో చిక్కుకున్నారు. బాధితులుగా మారిన మొత్తం 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖిరాబేడాలో అనిల్ బేడియా తల్లి 17 రోజులపాటు తల్లడిల్లిపోయింది. కుమారుడు జాడ తెలియక ఆందోళనకు గురైంది. ఇంట్లో వంట చేసింది లేదు. ఇరుగు పొరుగు అందించిన భోజనంతో కడుపు నింపుకుంది. ఎట్టకేలకు కుమారుడు అనిల్ బేడియా సొరంగం నుంచి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ బేడియా(55)కు పక్షవాతం. ఏకైక కుమారుడు రాజేంద్ర సొరంగం నుంచి బయటపడడంతో అతని ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రశంసలందుకున్న నాగపూర్ నిపుణుల సేవలు సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. నిపుణులు తమవంతు సేవలందించారు. కార్మికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా, కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగకుండా వీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ డబ్ల్యూసీఎల్కు నిపుణులు సొరంగం వద్దే మకాం వేశారు. భారీ యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టడంతో సొరంగం లోపల కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతుండేవి. ప్రమాదకర స్థాయికి చేరగానే యంత్రాలను ఆపించేవారు. వారి సేవలు ప్రశంసలందుకున్నాయి. సొరంగంలో కార్మికులు భుజాలపై ఎత్తుకున్నారు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల్లో ఢిల్లీకి చెందిన ఫిరోజ్ ఖురేïÙ, యూపీకి చెందిన మోను కూమార్ తొలుత సొరంగంలోని కార్మికుల వద్దకు చేరుకున్నారు. తమను చూడగానే కార్మికులు ఆనందంతో భుజాలపై ఎత్తుకున్నారని ఫిరోజ్ వెల్లడించాడు. ‘‘మాకు పండ్లిచ్చారు. పేర్లు అడిగారు. అరగంట పాటు సొరంగంలో ఉన్నాం’’ అని మోను కూమార్ చెప్పాడు. తాము కార్మికుల వద్దకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం వచ్చారని పేర్కొన్నాడు. కార్మికులను కాపాడినందుకు తాము డబ్బులేమీ తీసుకోలేదని తెలియజేశాడు. తల్లిదండ్రుల ఫొటో చూస్తూ కాలం గడిపా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీ జిల్లా భైరాంపూర్కు చెందిన 25 ఏళ్ల మంజీత్ చౌహాన్ సిల్క్యారా టన్నెల్లో చిక్కకొని, 17 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అతడి రాకతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మంజీత్ తల్లిదండ్రులు భైరాంపూర్లో ఉంటున్నారు. అతడి సోదరుడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రుల ఫొటో మంజీత్ వద్ద ఉంది. ఆ ఫొటో చూస్తూ ధైర్యం తెచ్చుకొని సొరంగంలో కాలం గడిపానని, ఒత్తిడిని అధిగమించానని చెప్పాడు. ‘‘సొరంగం లోపలిభాగం కూలిన సమయంలో అక్కడికి కేవలం 15 మీటర్ల దూరంలోనే పని చేస్తున్నాను. తొలుత అసలేం జరిగిందో అర్థం కాలేదు. క్రమంగా అది పీడ కలగా మారింది. ప్రమాదం జరిగాక మొదటి 24 గంటలు చాలా కష్టంగా గడిచాయి. మేమంతా భయందోళనకు గురయ్యాం. ఆకలి, దాహం, నీరసం, నిరాశ వంటివి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాలుగు అంగుళాల పైపు గుండా అధికారులు ఆహారం, నీరు పంపించిన తర్వాత మా మానసిక స్థితి మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలియడంతో మాలో మనోధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగాం. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నాన్నకు చెప్పా. ఫోన్ వాల్‌పేపర్‌లో నా తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఉండిపోయేవాడిని. ప్రాణాలపై ఆశ కోల్పోకుండా అది ఉపయోగపడింది. సొరంగంలో అటూ ఇటూ నడుస్తూ ఉండేవాళ్లం. పైపు గుండా అధికారులు పంపించిన పప్పు నాకెంతో నచ్చింది. సొరంగంలో చిక్కుకున్న మేమంతా ఒకరికొకరం మంచి మిత్రులుగా మారిపోయాం. మా కష్ట సుఖాలు తెలియజేసుకున్నాం. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేకపోవడం పట్ల విచారంగా ఉంది. ఇంటికెళ్లిన తర్వాత మ్యాచ్ హైలైట్స్ చూస్తా’’ అని మంజీత్ చౌహాన్ ఉత్సాహంగా చెప్పాడు. సొరంగం పనులు కొనసాగుతాయి ఉత్తరాఖండ్‌లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం పనులు కొనసాగుతాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. కూలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు, సేఫ్టీ ఆడిట్ ముగిసిన తర్వాత పనులు యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన 900 కిలోమీటర్ల ‘చార్ధామ్ యాత్ర ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా టెన్నల్‌ను నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్‌ధామ్‌లో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానించడానికి కేంద్రం రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నాలుగు క్షేత్రాలను చుట్టిరావడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 27న శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2020 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరుగుతోంది. కేబినెట్ భేటీలో మోదీ భావోద్వేగం సిల్క్యారా సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచి్చంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ మంగళవారం రాత్రి సమావేశమైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తలచుకొని ప్రధానమంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు. కార్మికులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు స్వయంగా ఆరా తీశారని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. దేశ విదేశాల్లోని భారతీయులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. -
Uttarakhand Tunnel Crash: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: పది రోజులకుపైగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకుతెచ్చే డ్రిల్లింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దేశ, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక, డ్రిల్లింగ్ పనుల్లో భారీ పురోగతి కనిపిస్తోందని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద కొండను తవ్వుతుండగా లోపల 57 మీటర్లమేర సొరంగం కూలిందని సహాయక బృందాలు అంచనావేస్తున్నాయి. ఇందులో ఇప్పటికే 39 మీటర్లమేర తవ్వగా బుధవారం సాయంత్రానికి మరో ఆరు మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసి ‘సహాయక’పైపును విజయవంతంగా జొప్పించారు. వీరి అంచనా ప్రకారం మరో 12 మీటర్లు తవ్వితే కారి్మకులు చిక్కుకున్న చోటుకు పైపు చేరుకోవచ్చు. దాదాపు మీటరు వ్యాసమున్న ఈ స్టీల్ పైపులోంచి కారి్మకులను బయటకు తీసుకురావాలని ప్రణాళిక సిద్దంచేసిన సంగతి తెల్సిందే. కార్మికులను బయటకు రాగానే వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు ఛాతి డాక్టర్లతో కూడిన 14 మంది వైద్య బృందాన్ని ఘటనాస్థలి వద్ద సిద్ధంగా ఉంచారు. 12 అంబులెన్సులను, 41 పడకల తాత్కాలిక ఆస్పత్రిని సిద్ధంచేశారు. మరీ అత్యవసరమనుకుంటే వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి ఆగమేఘాల మీద తరలించేందుకు హెలీకాప్టర్‌ను తెప్పించనున్నట్లు సమాచారం. బగ్వాల్ పండుగ వారితోనూ చేసుకుందాం ‘‘డ్రిల్లింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. వారితో కలిసే స్థానిక బగ్లాల్ పండగ జరుపుకుందాం’’ అని ప్రధాని కార్యాలయం మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే ఘటనాస్థలి వ్యాఖ్యానించారు. దీపావళి పండగ తర్వాత స్థానిక గర్వాల్ ప్రాంతంలో బగ్వాల్ పండగ జరుపుకోవడం ఆనవాయితీ. అక్కడి బగ్వాల్ను ఈ ఏడాది గురువారం జరుపుకుంటున్నారు. మరోవైపు, రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. సొరంగంలో కూలింది ఎక్కడ ? సిల్క్యారా బెండ్ నుంచి మొదలుపెట్టి బార్కోట్ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో ఆ మార్క్ దాటి సొరంగం లోపలి వైపుగా కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడలై్పన శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు యతి్నస్తున్నారు. -
Uttarakhand Tunnel Crash: కొండ పైనుంచి టన్నెల్లోకి రంధ్రం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా సొరంగం కూలి అప్పుడే ఏడు రోజులైంది. లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతుండగా, అధికారులు మరో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చారు. శుక్రవారం నిలిపివేసిన అమెరికన్ ఆగర్ యంత్రం డ్రిల్లింగ్ పనులను మళ్లీ ప్రారంభించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) రూపొందించిన తాజా ప్రణాళిక ప్రకారం..సొరంగం నిర్మాణ పనులు సాగుతున్న కొండ పైనుంచి సొరంగంలోకి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. కొండ పైనుంచి 1,000 నుంచి 11,00 మీటర్ల పొడవైన రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పనులు ప్రారంభించాం. రేపు మధ్యాహ్నం కల్లా ఇది సిద్ధమవుతుంది’అని బీఆర్వోకు చెందిన మేజర్ నమన్ నరులా చెప్పారు. ‘ముందుగా 4–6 అంగుళాల రంధ్రాన్ని తొలిచి లోపల చిక్కుబడిపోయిన వారికి అత్యవసరాలను అందిస్తాం. పరిస్థితులు అనుకూలిస్తే మూడడుగుల వెడల్పుండే రంధ్రాన్ని 900 మీటర్ల పొడవున తొలుస్తాం. దీని గుండా లోపలున్న వారు కూడా బయటకు చేరుకోవచ్చు’అని బోర్డర్ రోడ్స్ డీజీ ఆర్ఎస్ రావు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారుల బృందం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. కార్మికులను కాపాడేందుకు నిపుణులు వివిధ రకాలైన అయిదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రధాని మాజీ సలహాదారు, ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఓఎస్డీ భాస్కర్ ఖుల్బే చెప్పారు. ఇలా ఉండగా, శిథిలాల నుంచి డ్రిల్లింగ్‌ను మరింత సమర్థంగా కొనసాగించేందుకు శనివారం ఇండోర్ నుంచి ఒక యంత్రాన్ని తీసుకువచ్చారు. దీనిని కూడా బిగించి, డ్రిల్లింగ్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. డ్రిల్లింగ్ పనులు మళ్లీ మొదలు: శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో అయిదో పైపును లోపలికి పంపేందుకు డ్రిల్లింగ్ పనులు సాగుతుండగా సొరంగంలో ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దం వినిపించింది. దీంతో, వెంటనే పనులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ శబ్ధం సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందిలో వణుకు పుట్టించింది. డ్రిల్లింగ్‌ను కొనసాగిస్తే టన్నెల్ మరింతగా కూలే ప్రమాదముందని నిపుణుడొకరు చెప్పారు. మొత్తం 60 మీటర్లకు గాను 24 మీటర్లలో శిథిలాల గుండా డ్రిల్లింగ్ పూర్తయిందన్నారు. ఇలా ఉండగా, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల సంఖ్య 41గా తేలినట్లు అధికారులు వివరించారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన దీపక్ కుమార్ కూడా లోపలే ఉండిపోయారని అన్నారు. -
ఇప్పటికే వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ -1 పనులు పూర్తి
-
సాకారమవుతున్న ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల దశాబ్దాల కల
-
పోలవరంలో మరో కీలక ఘట్టానికి శ్రీకారం
సాక్షి, అమరావతి/దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది. ప్రాజెక్టులో అంతర్భాగమైన 960 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను వేగవంతం చేసింది. ఈ కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రె జర్ టన్నెళ్ల తవ్వకం పనులను శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద మేఘా సంస్థ ప్రారంభించింది. పోలవరం హె డ్ వర్క్స్ (జలాశయం) పనులతోపాటు జలవిద్యు త్ కేంద్రం పనులను రివర్స్ టెండరింగ్‌లో దక్కిం చుకున్న మేఘా సంస్థ.. జలవిద్యుత్ కేంద్రం పనులను మార్చి 30న ప్రారంభించింది. ఈ పనుల్లో ఇప్పటికే 18.90 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులను పూర్తిచేసింది. జలవిద్యుత్ కేం ద్రం పునాది పనులను జలవనరుల శాఖ అదికారులు పర్యవేక్షిస్తుండగా.. విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను జెన్కో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున మూడు వేల టీఎంసీల మేర గోదావరి జలాలు సముద్రం లో కలుస్తున్నాయి. ఈ వరద నీటిని ఒడిసి పట్టి.. ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు భారీగా వి ద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలి పేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. జలవిద్యుత్ కేంద్రం పనితీరు ఇలా.. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)కు ఎడమ వైపున జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో 960 మెగాగాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 35.52 మీటర్ల నుంచి నీటిని ప్రెజర్ టన్నెళ్ల ద్వారా పంపిస్తారు. టన్నెళ్లకు దిగువన కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు. అధిక ఒత్తిడితో ఎత్తు నుంచి నీరు పడినప్పుడు వర్టికల్ కెప్లాన్ టర్బైన్లు వేగంగా తిరగడంవల్ల విద్యుత్ ఉత్పత్తవుతంది. ఇందుకోసం 145 మీటర్ల పొడవున 9 మీటర్ల వ్యాసంతో 12 ప్రెజర్ టన్నెళ్లను తవ్వే పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. ఈ టన్నెళ్లకు చివరన తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి.. భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు. ప్రెజర్ టన్నెళ్ల వైపు నీటిని మళ్లించడానికి వీలుగా 206 మీటర్ల పొడవున 294 మీటర్ల వెడల్పుతో జలాశయం నుంచి అప్రోచ్ ఛానల్ తవ్వుతారు. దీని ద్వారా ప్రెజర్ టన్నెళ్లకు నీటిని విడుదల చేయడం ద్వారా వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను తిరిగేలా చేసి.. విద్యుదుత్పత్తి చేస్తారు. టర్బైన్ల నుంచి దిగువకు వచ్చిన నీటిని టెయిల్ రేస్ ఛానల్ ద్వారా ఈసీఆర్‌ఎఫ్‌కు దిగువన నదిలోకి కలుపుతారు. ఈ వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను భోపాల్‌కు చెందిన బీహెచ్ఈఎల్ సంస్థ తయారుచేస్తోంది. ఈ విద్యుత్ కేం ద్రంలో వినియోగిస్తున్న టర్బైన్లు ఆసియాలోనే అత్యంత పెద్దవి. ప్రెజర్ టన్నెల్ తవ్వకం పనుల ప్రారంభోత్సవంలో జెన్కో ఎస్ఈ ఎస్. శేషారెడ్డి, ఈఈలు ఎ. సోమయ్య, సి. హనుమ, ఎలక్ట్రికల్ ఈ ఈ వై. భీమధనరావు, ఇరిగేషన్ ఈఈ పాండురంగారావు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం ముద్దుకృష్ణ, ఏజిఎం క్రాంతికుమార్, కోఆర్డినేటర్ ఠాగూర్‌చంద్ పాల్గొన్నారు. హిమాలయ విద్యుత్ కేంద్రాల స్థాయిలో.. హిమాలయ నదుల్లో నీటి లభ్యత అధికంగా ఉండటంవల్ల వాటిపై నిర్మించే జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ అధికంగా ఉత్పత్తవుతుంది. అలాగే, గోదావరి నదిపై ఎగువన మహారాష్ట్రలో జైక్వాడ్ డ్యామ్ నుంచి దిగువన ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ అతిపెద్ద నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు పోలవరం ఒక్కటే. దీని సామర్థ్యం 194.6 టీఎంసీలు. పోలవరం వద్ద నీటి లభ్యత అధికంగా ఉండటంవల్ల హిమాలయ నదులపై ఉన్న విద్యుత్ కేంద్రాలకు దీటుగా పోలవరం విద్యుత్ కేంద్రంలోనూ కరెంట్‌ను ఉత్పత్తి చేయవచ్చునని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతరాయాలు లేకుండా కారుచౌకగా విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా రాష్ట్రంలో భారీఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని.. అలాగే ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడడానికి అది దోహదం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఇవీ చదవండి: ఏపీ: దేశంలోని తొలి ప్రయోగం.. వాట్సాప్.. రైతుల హేట్సాఫ్ -
మేఘా ‘జోజిలా’ టన్నెల్ పనులు ప్రారంభం
న్యూఢిల్లీ: శ్రీనగర్ లోయ, లేహ్‌ను అనుసంధానించేందుకు ఉద్దేశించిన జోజిలా టన్నెల్ నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. నిర్దేశించుకున్న షెడ్యూల్ కన్నా ముందుగా నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కాగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) పోటీ సంస్థల కన్నా అత్యంత తక్కువగా కోట్ చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఎంఈఐఎల్ రూ. 4,509.5 కోట్లకు బిడ్ వేసింది. సుమారు 14.15 కి.మీ. పొడవుండే ఈ టన్నెల్‌ను షెడ్యూల్ ప్రకారం ఆరేళ్లలో పూర్తి చేయాలి. ఇది పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్‌గా నిలుస్తుంది. శ్రీనగర్–లేహ్ మధ్య ప్రయాణ సమయం 3 గం.ల నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది. శ్రీనగర్–కార్గిల్–లేహ్ జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తున ఉండటంతో ఇది వ్యూహాత్మక ప్రాజెక్టుగా మారింది. సాధారణంగా శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్–లేహ్ మధ్య మార్గాన్ని మూసేయాల్సి ఉంటోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాది పొడవునా ప్రయాణాలకు వీలవుతుంది. -
మళ్లీ పెరిగిన అంచనాలు
విజయనగరం కంటోన్మెంట్: తారక రామ తీర్ధ సాగర్ పనులకు మరో అవరోధం ఎదురయ్యింది. ఎప్పటికప్పుడు వాయిదాలు, గడువులతోనే సా....గుతున్న పనులకు మరో ఆటంకం ఎదురయింది. ప్రాజెక్టుకు అటవీ అనుమతులు రాకపోయినా అంచనాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని రామతీర్థం కొండ లోంచి తవ్వాల్సిన సుమారు కిలోమీటరు పైగా సొరంగం పనులకు సంబంధించి 2008లో రూ.11 కోట్లు మంజూరయ్యాయి. వాటితో అప్పట్లో పనులు చేస్తే సకాలంలో పూర్తయ్యేది. కానీ అటవీ అనుమతులు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడంతో పనులు సాగడం లేదు. ఇప్పుడు ఈ సొరంగం పనులు చేపట్టేందుకు అవసరమైన అధునాతన మెషీన్లు కొనుగోలు చేయడానికి అప్పటి నిధులు చాలవని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ఇప్పుడు ఈ టన్నెల్ తవ్వాలంటే సుమారు రూ. 40 కోట్లు ఖర్చవుతుందని అధికారులు, కాంట్రాక్టర్లు అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. టన్నెల్ బోరింగ్ మెషీన్లు ఇక్కడే తయారు చేసి పనులు చేయాలి. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఏళ్ల తరబడి అటవీ అనుమతులపేరుతో కాలయాపన చేస్తుండటంవల్ల టన్నెల్ పనులు అలానే నిలిచిపోయాయి. పెరిగిన ధరలిస్తే తప్ప పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేయడంతో ప్రాజక్టుకు మరో ఆటంకం ఎదురయినట్టయింది. -
ప్రాణహిత చేవెళ్ల పనులు జరుగుతున్నాయిలా!
-
ఎస్ఎల్బీసీపై ముందుకెళ్లేదెలా?
♦ నేడు అన్ని పక్షాల నేతలతో సీఎం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం ♦ 1983లో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ప్రస్థానం ♦ 2005 ఆగస్టులో రూ.2,813 కోట్లకు పరిపాలనా అనుమతులతో తొలి అడుగు ♦ ప్రస్తుతం 43.89 కిలోమీటర్ల సొరంగం పనుల్లో పూర్తయింది 24 కిలోమీటర్లు ♦ ఇప్పటి వరకు రూ.1,925 కోట్ల పనుల్లో రూ.1,185 కోట్ల పనులు పూర్తి ♦ మిగిలి ఉన్న మరో రూ.700 కోట్ల పనులు పెండింగ్ ♦ ఎస్కలేషన్ ఖర్చుల కింద రూ.783కోట్లు అడుగుతున్న కాంట్రాక్టు సంస్థ ♦ అడ్వాన్సు కింద రూ.150 కోట్లు తక్షణం ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీ జలాలను వినియోగించుకొని తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో పురుడు పోసుకున్న శ్రీశైలం ఎడమ కాల్వ(ఎస్ఎల్బీసీ) సొరంగం పనులపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రాజెక్టు ఆరంభం నుంచీ ఓ ప్రహసనంలా మారిపోయిన సొరంగ పనుల్లో వేగంపెంచే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. పనులు ప్రారంభించి పదే ళ్లు గడుస్తున్నా సగం పనులు సైతం పూర్తికాకపోవడం, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా దీనిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపై అన్ని పక్షాలతో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చ సం దర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం1983లో.. పనుల ఆరంభం 2005లో.. శ్రీశైలం నుంచి నీటిని తరలించాలంటే గ్రావిటీ ద్వారా సాధ్యం కాదని ఎప్పుడో నిపుణలు తేల్చారు. సొరంగం ద్వారా నీటిని తరలించడమే మార్గమని తేల్చిచెప్పారు. దీంతో తొలిసారిగా 1983లో ఎస్ఎల్బీసీకి పునాది పడింది. సొరంగం తవ్వకానికి రూ.480కోట్ల మేర అంచనాలు వేశారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సొరంగం పనులను పక్కనపెట్టి ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ నుంచి అంతే స్థాయి నీటిని ఎత్తిపోతల ద్వారా ఇచ్చేందుకు నిర్ణయించడం, ఎత్తిపోతల పనులను సైతం వేగిరం చేసి దాన్ని పూర్తి చేయడంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తిగా మరుగునపడ్డాయి. మధ్యలో 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగం పనులకు అంచనా వేయించగా అది రూ.967కోట్లుగా, 1997లో టీడీపీ ప్రభుత్వం మరోమారు అంచనా వేస్తే అది రూ.1,250 కోట్లకు పెరుగుతూ వచ్చింది. అంచనాలు వేసినా పనులు మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. తిరిగి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొరంగం పనులకు అంకురార్పణ చేసింది. అయితే అప్పటికే సొరంగం పనుల అంచనా ఏకంగా రూ.2,813 కోట్లమేర పెరిగింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం 2005 ఆగస్టులో టెండర్లు పిలవగా రూ.1,925కోట్ల పనులను కోట్ చేసిన జయప్రకాశ్ అసోసియేట్ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించింది. ఈ పనులను 2010 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలు, వరదలు పనులను ఆలస్యం చేశాయి. పూర్తయింది రూ.1185 కోట్ల పనులే! ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల్లో రెండు సొరంగాలు తవ్వాల్సి ఉండగా మొదటిదాన్ని శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్నెవారిపల్లె వరకు తవ్వాల్సి ఉంది. మొత్తం 43.89 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉండగా ఇందులో ఇప్పటి వరకు కేవలం 24 కిలోమీటర్లు పూర్తికాగా మరో 19.8 కిలోమీటర్ల మేర ఇంకా సొరంగం తవ్వాల్సి ఉంది. ఇక రెండో సొరంగం నల్లగొండ జిల్లాలో 7.25 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇది పూర్తయినా, ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటికోసం ఇప్పటికే రూ.1185.38 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా పనులు పూర్తి చేసేందుకు మరో రూ.700ల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉండగా, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా సదరు కాంట్రాక్టు సంస్థ గతంలో ఇచ్చిన జీవో 13 మేరకు ఎస్కలేషన్ చార్జీలను భరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అలా రూ.783 కోట్ల వరకు చెల్లిస్తేనే పనులు వేగిరం అవుతాయని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో తన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వెంటనే రూ. 150 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం చేయలేదు. ఇక వీటితో పాటే ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్ కింద 2.20లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు పరిధిలోని లోయర్ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(7.6 టీఎంసీలు), మరో లక్ష ఎకరాలకు నీరందించే ఉదయసముద్రం(6.7టీఎంసీలు) ప్రాజెక్టు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. వీటి పరిధిలో ముంపునకు గురయ్యే సుమారు 3వేల ఎకరాల భూమికి పరిహారం చెల్లించాల్సి ఉంది. గతంలో ఇచ్చిన పరిహారం చాలా తక్కువగా ఉన్న దృష్ట్యా దానిని పునఃపరిశీలన జరపాలన్న డిమాండ్ అక్కడి నిర్వాసితుల నుంచి వస్తోంది. ఈ అంశాలను పరిష్కరిస్తేనే ఎస్ఎల్బీసీ పనులు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న టెండర్‌ను కొనసాగించడమా, లేక రద్దు చేయడమా, రద్దు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? లేదా కాంట్రాక్టు సంస్థ కోరుతున్నట్లుగా రూ.150 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాలా అనే అంశాలపై గురువారం వివిధ పార్టీల నేతలు, నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో చర్చించనున్నారు. -
నిలిచిన వెలిగొండ పనులు
పూర్తిగా ఆగిపోయిన వెలిగొండ ప్రాజెక్టు రెండు మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులకు మళ్లీ బ్రేక్ పడింది. పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెండో టన్నెల్ పనులు నిలిచిపోగా..పది రోజుల నుంచి మొదటి టన్నెల్ పనులు కూడా ఆగిపోయాయి. గత నెలలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు ఏడాదిలోపు పూర్తి చేసి నీరందిస్తామని ప్రకటించారు. పనులు ఆగిపోవడంతో సీఎం హామీ అమలుపై సందేహాలు నెలకొన్నాయి. గట్టి రాయే ప్రధాన అడ్డంకి.. పనులు నిలిచిపోవడానికి ప్రధాన కారణం సొరంగ మార్గం తవ్వేటప్పుడు గట్టి రాయి పడటమే. ఈ రాయి తగిలి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) ముందు భాగంలోని బ్లేడ్లు విరిగిపోతున్నాయి. మొదటి టన్నెల్ వ్యాసార్ధం 8 మీటర్లు కాగా..రెండో టన్నెల్ వ్యాసార్ధం 9.2 మీటర్లు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నెలకు 400 మీటర్ల దూరం పనిచేయాల్సి ఉండగా..ఇప్పటి వరకు 250 నుంచి 275 మీటర్లకు మించి పనులు సాగలేదు. మొత్తం మీద ఇప్పటి వరకు మొదటి సొరంగం 9 కి.మీ, రెండో సొరంగం 12 కిలోమీటర్ల పొడవున టన్నెల్ నిర్మాణం పూర్తయింది. ఇందు కోసం సుమారు రూ.850 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. బిల్లుల చెల్లింపు, అనుమతుల్లోనూ జాప్యం: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెండో టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వివిధ అనుమతులు, బిల్లుల చెల్లింపులో జాప్యం కూడా కారణమైంది. శ్రీశైలం రిజర్వాయర్ వద్ద నిర్మించే హెడ్ రెగ్యులేటర్‌కు పోయేందుకు అటవీశాఖ, నీటి పారుదల శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. మొదటి టన్నెల్ పనులు పది రోజుల నుంచి నిలిచిపోయాయి. బలమైన రాయి తగలడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ కట్టర్లు విరిగిపోతున్నట్లు గుర్తించారు. జర్మనీ, అమెరికా దేశాల నుంచి ఈ కట్టర్లు తెప్పించాల్సి ఉంది. రాయికి తగినట్లు మిషన్లు తయారు చేసేందుకు..రాయి పటిష్టతను పరీక్షించేందుకు విదేశాలతో పాటు చెన్నై ఐఐటీకి పంపారు. ఫలితాలు వచ్చాక వాటిని అనుసరించి కట్టర్లు తయారు చేయించి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అప్పటి వరకు టన్నెల్ నిర్మాణంలో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. తొలుత అంచనాల మేరకు 2008 నాటికి మొదటి టెన్నెల్ పనులు పూర్తి కావాల్సి ఉండగా..2010లో పనులు ప్రారంభించారు. 2012 జూన్‌కు పనులు ముగించాలని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా..ఈ ఏడాది చివరికి కూడా పనులు పూర్తయ్యే అవకాశం లేదు.