Two MLAs
-
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు.. రూ.100కోట్లు సీజ్!
రాంచీ: జార్ఖండ్‌లోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దాడులు నిర్వహించింది ఆదాయ పన్ను శాఖ. లెక్కల్లో చూపని సుమారు రూ.100 కోట్ల లావాదేవీలు, పెట్టుబడులను గుర్తించి సీజ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు, ఇనుప గనుల వ్యాపారాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో పాటు వారి సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలను గత వారం రోజులుగా సోదాలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ. ఈ మేరకు దాడులకు సంబంధించి మంగళవారం ఓ ప్రకటన చేసింది సీబీడీటీ. ‘నవంబర్ 4న ప్రారంభించి ఇప్పటి వరకు 50 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. అందులో రాంచీ, గొడ్డా, బెర్మో, దుమ్కా, జంషెడ్పూర్, ఛాయ్‌బాసా, బిహార్‌లోని పాట్నా, హరియాణాలోని గురుగ్రామ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ప్రాంతాలు ఉన్నాయి. దాడులు నిర్వహించిన ఎమ్మెల్యేలు కుమార్ జైమంగళ్ అలియాస్ అనుప్ సింగ్, ప్రదీప్ యాదవ్.’ అని సీబీడీటీ తన ప్రకటనలో తెలిపింది. బొగ్గు క్రయవిక్రయాల్లో ఉన్న పలు వ్యాపార సంస్థలపై ఈసోదాలు నిర్వహించామని వెల్లడించింది. రు.2కోట్ల నగదు, రూ.100 కోట్లకుపైగా లెక్కల్లో చూపని లావాదేవీలు, పెట్టుబడులను గుర్తించినట్లు తెలిపింది సీబీడీటీ. బెర్మో నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జైమంగళ్ ఈవిషయంపై రాంచీలో విలేకరులతో మాట్లాడారు. ఐటీ దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఐటీ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎంతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఇటీవలే బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయగా.. ఇప్పుడు అధికార కూటమి నేతలపై ఐటీ దాడులు జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. చైనానే కారణం? -
ఆర్ఎస్ఎల్పీకి భారీ షాక్
పట్నా: ఆర్ఎస్ఎల్పీ అధినేత కుష్వాహాకు ఆ పార్టీ సభ్యులు గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికలలో పరాభవంతో కుంగిపోతున్న సమయంలోనే ఆదివారం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆధ్వర్యంలోని జేడీ(యూ)లో చేరారు. ఎమ్మెల్యేలు లలన్‌పాశ్వాన్, సుధాంశు శేఖర్, ఎమ్మెల్సీ సంజీవ్‌సింగ్‌లు తమ చేరికను ధ్రువపరస్తూ శాసనసభ స్పీకర్ విజయకుమార్ చౌదరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ హరూన్ రషీద్‌కి ఆదివారం లేఖలు పంపినట్లు తెలిసింది. తమ చేరికను అనుమతిస్తున్నట్లుగా జేడీయూ నుంచి సైతం వారు లేఖను అందజేసినట్లుగా తెలిసింది. -
'ఆ ఇద్దరి ఎమ్మెల్యేల వివాదం వ్యక్తిగతం'
-
సమన్వయం, సమష్టితత్వం అంటే ఇదే..!
కాంగ్రెస్ పార్టీని చూసి, ఆ పార్టీ నాయకులను గమనించి రాజకీయాల్లో ఏదైనా కూడా సులభంగా నేర్చుకోవచ్చునని ఇతరపార్టీల నాయకులు చెబుతుంటారు. దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీని, నాయకుల తీరును చూసి... ఏ విధంగా ఉండకూడదన్నది కూడా తెలుసుకోవచ్చునంటున్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో అనేక సమస్యలున్నా విడివిడిగా ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా పార్టీ నాయకులు వ్యవహరిస్తుండడం పట్ల సీనియర్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానప్రతిపక్షంగా రాణించేందుకు పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నా, ఆ మేరకు అధికారపక్షం తన నిర్ణయాలతో అవకాశం కల్పిస్తున్నా ఏ మాత్రం పుంజుకోలేకపోతున్నారని పెదవి విరుస్తున్నారు. సొంత ఇమేజీని పెంచుకునేందుకు, మీడియాలో సొంత ప్రచారాన్ని పొందేందుకే నేతలు మొగ్గుచూపడం పార్టీని దెబ్బతీస్తోందంటున్నారు. అంతేకాకుండా ఒకరికి పేరు రాకుండా మరొకరు ప్రయత్నించడం, సీనియర్లు, జూనియర్లు గ్రూపులుగా విడిపోవడం సమష్టితత్వం కొరవడిందంటున్నారు. చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ తాజా ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని లేవదీయాల్సింది పోయి ఒకటి, రెండు జిల్లాల్లో చిన్న, చిన్న ఆందోళనలు,నిరసనలకు పరిమితం కావడాన్ని ఉదహరిస్తున్నారు. అంతేకాకుండా సీఎం సొంతజిల్లాలో దళితుల భూమి ఆక్రమణపై మెదక్ జిల్లా నాయకులకు సంబంధం లే కుండా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించడం, విడిగా మీడియాతో మాట్లాడడాన్ని గుర్తుచేస్తున్నారు. ఇవన్నీ కూడా వ్యక్తిగత మైలేజీ కోసం తప్ప పార్టీ ఇమేజీని, సమష్టితత్వాన్ని, సమన్వయాన్ని పెంచేందుకు ఉపయోగపడవని, తమ పార్టీనాయకులను చూసి రాజకీయాల్లో ఏ విధంగా వ్యవహరించకూడదనేది నేర్చుకోవచ్చునని చెబుతున్నారు.