Ujjaini Mahankali Temple
-
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందడి
-
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఆదివారం తెల్లవారుజాము నుంచే మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఇక ఆషాఢమాస జాతరలో భాగంగా ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మహంకాళి దేవాలయాన్ని విద్యుద్దీపాలు, పూలు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి కుటుంబసభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. #LashkarBonalu #SecunderabadBonalu #Bonalu pic.twitter.com/zf1zbzl0WY — Talasani Srinivas Yadav (@YadavTalasani) July 9, 2023 -
మహాకాల్ కారిడార్: ఉజ్జయిని నిండా ఆధ్యాత్మికతే
ఉజ్జయిని: ప్రధాని మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ మొదటి దశను ప్రారంభించారు. అనంతరం, ధోతి, గమ్చా ధరించి ప్రఖ్యాత మహాకాళేశ్వరాలయం గర్భగుడిలో పూజలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. వలసపాలన సంకెళ్లను తొలగించుకుంటున్నామని, సాంస్కృతిక ప్రాముఖ్యత గల ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ‘ఉజ్జయినిలోని ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత ఉంటుంది. ఉజ్జయిని ప్రతి మూలలో దైవిక శక్తి ప్రసారం అవుతుంది. భారత దేశ శ్రేయస్సు, జ్ఞానం, గౌరవం, సాహిత్యానికి వేలాది సంవత్సరాలుగా ఉజ్జయిని సారథ్యం వహించింది’ అని పేర్కొన్నారు. ‘పునరుద్ధరణతో నవకల్పన వస్తుంది. వలస పాలనలో కోల్పోయిన వాటిని దేశం పునర్నిర్మిస్తోంది, గత కీర్తిని పునరుద్ధరించుకుంటోంది’ అని ప్రధాని చెప్పారు. మహాకాల్ కారిడార్ ప్రాజెక్ట్ ఉజ్జయిని చైతన్యాన్ని పెంచుతుందని అన్నారు. చార్ధామ్ యాత్రను ఏడాదంతా జరుపుకునేలా రహదారులను అభివృద్ధి చేశామన్నారు. అంతకుముందు, ఉజ్జయిని చేరుకున్న ప్రధాని మోదీకి కారిడార్ వద్ద సాధువులు, మత పెద్దలు స్వాగతం పలికారు. వారికి నమస్కరించుకుంటూ ఆయన ముందుకు సాగారు. అనంతరం ‘శివలింగం’ నమూనాను రిమోట్ బటన్ నొక్కి ఆవిష్కరించి, మహాకాల్ లోక్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. బ్యాటరీ కారులో వెళ్తూ ఆయన కారిడార్‌ను పరిశీలించారు. మల్లకంభం విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. కారిడార్‌లో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్లు ఆ ప్రాంతానికి మరింత శోభనిచ్చాయి. కారిడార్ ప్రారంభంలో కొద్ది దూరంలో నంది ద్వార్, పినాకి ద్వార్ ఏర్పాటు చేశారు. ప్రధాని వెంట గవర్నర్ మంగూ భాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి సింధియా ఉన్నారు. రిమోట్ నొక్కిశివలింగాకృతిని ఆవిష్కరించడం ద్వారా మహాకాల్ కారిడార్ తొలిదశను జాతికి అంకితంచేస్తున్న మోదీ కారిడార్ విశేషాలివీ... ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడి మహా కాళి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇలా జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహాక్షేత్రాలు ఉజ్జయిని, కాశీ, శ్రీశైలం మాత్రమే. మత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మహా కాళేశ్వరాలయ అభివృద్ధి కోసం దేశంలోనే పొడవైన మహాకాల్ లోక్ కారిడార్‌కు కేంద్రం శ్రీకారం చుట్టింది. కారిడార్ పొడవు 900 మీటర్లు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.856 కోట్లు. రూ.351 కోట్లతో తొలి దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 108 అందమైన పిల్లర్లతో కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ పిల్లర్లపై శివుని ఆనంద తాండవంతో పాటు మరెన్నో శివపార్వతుల భంగిమలను చెక్కుతున్నారు. ప్రధాన ద్వారం నుంచి ఆలయం దాకా 93 శివుని విగ్రహాలతో శివపురాణాన్ని చిత్రించారు. ప్రతి విగ్రహంపైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే సంబంధిత సమాచారమంతా వస్తుంది. ప్రాజెక్టులో భాగంగా రుద్రసాగర్ వంటి హెరిటేజ్ నిర్మాణాలను కూడా పునరుద్ధరించి సుందరీకరిస్తున్నారు. ఆలయాన్ని క్షిప్రా నదితో అనుసంధానించేందుకు 152 భవనాలను సేకరించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కృత్రిమ మేధ సాయంతో మొత్తంప్రాంతంపై నిరంతర నిఘా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని ఏటా కోటిన్నరకు పైగా భక్తులు సందర్శిస్తుంటారు. కారిడార్ పూర్తయ్యాక ఈ సంఖ్య రెట్టింపవుతుందని అంచనా. కారిడార్ ప్రాజెక్టు స్థానికంగా ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించనుంది. దీనివల్ల నగర ఆర్థికానికి కూడా ఊపు లభించనుంది. ఇదీ చదవండి: మహాకాళేశ్వరుడి మంత్రశక్తి జ్యోతిర్లింగం.. ప్రధాని మోదీ ఆవిష్కరించబోయే కారిడార్ ప్రత్యేకతలు ఇవే! -
నేడు ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి అమిత్ షా.. పోలీసుల ప్రత్యేక నిఘా
సాక్షి, హైదరాబాద్: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దర్శించుకొనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో దేవాలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. మహంకాళి పోలీసులు బందోబస్తు ఏర్పా టు చేశారు. శనివారం రాత్రి నుంచే దేవాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. చదవండి: మునుగోడు సభకు అమిత్ షా -
అమ్మవారికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి దంపతులు
-
మనసున్న పరిపూర్ణ
ఆమె ఈవో అన్నపూర్ణ ఆకలి చూసి అన్నంపెట్టే చెయ్యి ఆధ్యాత్మికత దారులు వేసే చేత కష్టం ఎరిగి కాపాడే తత్వం స్పందించే మనసున్న పరిపూర్ణ ఉదయం నిద్రలేచే సరికే ఆ రోజు చేయాల్సిన పనులు మన కోసం ఎదురు చూస్తుంటాయి. ఇంటి బాధ్యతలు చక్కబెట్టుకుని ఉద్యోగానికి వెళ్తే అక్కడ మరికొన్ని బాధ్యతలు, సమస్యలు నవ్వుతూ ఎదురొస్తాయి. మనసును కంట్రోల్లో పెట్టుకుని అన్నింటినీ చిరునవ్వుతో పూర్తి చేయాలి. కొన్నాళ్లకు ఆ నవ్వు జీవం కోల్పోయి ప్లాస్టిక్ నవ్వులా మిగులుతుంది. నవ్వుకి తిరిగి జీవం రావాలంటే... మనలో ఒత్తిడిని తాను ఆఘ్రాణించి మనకు ఆహ్లాదాన్నిచ్చే ప్రదేశం ఒకటి కావాలి. మనలో చాలామందికి అది ఆలయమో, ప్రార్థనా మందిరమో అయి ఉంటుంది. ‘ఆలయానికి వచ్చే వారికి సాంత్వన కలిగించేటట్లు ఉండాలి ఆలయ వాతావరణం. మా ఉద్యోగ బాధ్యతలు పైకి భగవంతుని సేవగా కనిపిస్తాయి. కానీ మా విధి నిర్వహణ భగవంతుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సేవకే ఎక్కువగా అంకితమై ఉంటుంది’ అన్నారు హైదరాబాద్, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ. ప్రాచీన ఆలయమే పెద్ద బాలశిక్ష బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి అధికారిగా నియమకానికంటే ముందు అన్నపూర్ణ 32 ఆలయాలకు ఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. ‘‘అఆలు, గుణింతాలు, వాక్యాలు చదవడం నేర్చుకున్న తర్వాత పెద్ద బాలశిక్ష చదవాలి. అక్షరాభ్యాసం రోజే పెద్ద బాలశిక్ష చేతిలో పెడితే ఉద్యోగ బాధ్యత భూతంలా భయపెడుతుంది. అందుకే 2001లో ఈవోగా నాకు తొలి బాధ్యతగా హైదరాబాద్‌లోని వివేక్‌నగర్ హనుమాన్ ఆలయం కేటాయించినప్పుడు... మొదట ఏదైనా చిన్న ఆలయాన్నివ్వమని అడిగాను. సికింద్రాబాద్, రాష్ట్రపతి రోడ్లో ఉన్న లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ బాధ్యతలిచ్చారు. అది నాలుగు వందల ఏళ్ల నాటి ప్రాచీన ఆలయం. స్థానికులకు అక్కడ ఒక ఆలయం ఉన్న పట్టింపు కూడా ఉండేది కాదు. పూజారులు పూజ చేసి ఉదయం పది లోపు వెళ్లిపోయేవాళ్లు. ఆడవాళ్లు గుడికి రావడానికి వెసులుబాటు దొరికే సమయానికి గుడి మూసేస్తే ఎలా వస్తారని టైమింగ్స్ పొడిగించాను. సహస్రనామాలు చదివే మహిళలతో గ్రూప్ తయారు చేశాను. ఐదుగురు మహిళలు స్వచ్ఛందంగా పని చేశారు. వారితో కలిసి కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి కుంకుమార్చనకు రావలసిందిగా ఆహ్వానించాను. ఈవోగా రాకముందు నేను సెక్రటేరియట్లో ఉద్యోగం చేసిన అనుభవంతో చాలామంది ప్రముఖులతో పరిచయం ఉంది. నాయకులను, ఇతర ప్రముఖులను గుడికి ఆహ్వానించాను. దాంతో స్థానికులు కూడా అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు’’ అని తొలి ఆలయ బాధ్యత నిర్వహించిన రోజులను గుర్తు చేసుకున్నారు అన్నపూర్ణ. ధార్మిక వైద్యసేవ ప్రముఖ ప్రభుత్వ వైద్యశాలకు అనుబంధంగా ఉన్న ధర్మశాల నిర్వహణ బాధ్యత కూడా ధర్మాదాయ శాఖ నిర్వహణలోనే ఉండేది. పేషెంట్ హాస్పిటల్లో ఉంటే, వారికి సహాయంగా వచ్చిన వాళ్లకు ధర్మశాలలో బస సౌకర్యం ఉండేది. పది రూపాయల నామమాత్రపు ఫీజుతో గది ఇచ్చేవారు. పేదవాళ్లకు ఆసరాగా ఉండాల్సిన ఆ ధర్మశాల అన్నపూర్ణ బాధ్యతలు చేపట్టే నాటికి పేదరికానికి చిరునామా గా ఉండేది. కరెంట్ బిల్లు బకాయిల కారణంగా పవర్ కట్ అయింది. ఆమె ప్రభుత్వానికి తెలియచేసి గదులకు రిపేర్లు, వాటర్ ఫిల్టర్, బోరు, రోడ్డు వేయించారు. పూలకుండీలు పెట్టించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచారు. ఇదే ఫార్ములాను ఆలయాల నిర్వహణలో కూడా పాటించడమే ఆమె విజయ రహస్యం. 650 ఆలయాలున్న తెలంగాణ రాష్ట్రంలో 150 మంది సభ్యులున్న ఆలయాల ఈవోల సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి దారి తీసిన నమ్మకం కూడా. ఈ ఏడాది జూన్‌లో గెజిటెడ్ అధికారిగా ప్రమోషన్ రావడంతో ఈవోల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారామె. ‘‘ప్రశాంతత కోసం ఆలయానికి వస్తారు. ఆలయంలో దర్శనం అయ్యే లోపు అసహనానికి లోనవుతుంటారు. ఆలయంలో పూల చెట్లు, మంచి శిల్పాలు, చిత్రాలతో ఆహ్లాదంగా ఉంటే భక్తులు ఆ మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అలాగే ఆలయంలో పార్కింగ్ సౌకర్యం లేకపోతే భక్తుల మనసు వాళ్ల వాహనం మీదనే ఉంటుంది. అందుకే బల్కంపేట ఆలయం బాధ్యతలు తీసుకున్న వెంటనే పార్కింగ్ లాట్ మీద దృష్టి పెట్టాను’’ అన్నారామె. నిత్యావసర సరుకుల పంపిణీ లష్కర్ బంగారు బోనం సికింద్రాబాద్ లష్కర్ బోనాల పండగ తెలంగాణ జిల్లాలతోపాటు... తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. మూడు నెలల ముందు నుంచి ఏర్పాట్లు మొదలవుతాయి. రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం చేయించడం తన చేతుల మీద జరిగినందుకు సంతోషంగా ఉందన్నారు అన్నపూర్ణ. ఆ ఏడాది లష్కర్ బోనాలకు 35 లక్షల మంది భక్తులు రావడం కూడా రికార్డు. కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు నాయకులు, మహిళలు వెయ్యి బోనాలతో మొదలుపెట్టి పదిహేను వందల బోనాలతో ఆలయానికి చేరిన విషయాన్ని చెబుతూ ‘‘బతకడానికి ఎన్నో ఉద్యోగాలున్నాయి. నాకు ఇలాంటి ఉద్యోగం రావడం మా అమ్మానాన్నలు చేసిన పుణ్యమే. బల్కంపేట అమ్మవారికి బంగారు చీర కట్టించి, బంగారు బోనం పెట్టాలనేది ఇప్పుడు నా ముందున్న కల’’అన్నారు అన్నపూర్ణ. కరోనా ఇక్కట్లు అన్నపూర్ణ తండ్రి జనార్ధనరావు నల్గొండ జిల్లా, తుంగతుర్తి మండలం, వెంపటి గ్రామంలో పటేల్. రోజుకు కనీసంగా వందమందికి తక్కువ లేకుండా పంచాయితీకి వచ్చేవారు. పొరుగూళ్ల నుంచి వచ్చిన వారికి అన్నం పెట్టి పంపించడం అన్నపూర్ణ తల్లి కౌసల్యాదేవి బాధ్యత. అన్నం పెట్టడంతోపాటు కూతురికి అన్నపూర్ణ అని పేరు పెట్టడం యాధృచ్చికం కావచ్చు. కానీ అన్నపూర్ణకు అన్నం పెట్టే అలవాటు మాత్రం వారసత్వంగా వచ్చింది. కరోనా వైరస్ ఇళ్లలో పని చేసుకునే వాళ్ల ఉపాధిని కాలరాసింది. పూజారులకు భగవంతుడికి పూజ చేసి హారతి కానుకలు లేకుండా ఒట్టిచేతులతో ఇళ్లకెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చింది. హాస్పిటల్లో పేషెంట్లకు తోడుండే సహాయకులు అన్నం తినడానికి చిన్న కాకా హోటల్ కూడా తెరుచుకోని దుస్థితి. ఇలాంటి వాళ్ల కోసం ఈ ఐదు నెలలుగా పని చేస్తున్నారు అన్నపూర్ణ. తన అన్నదమ్ములను, స్నేహితులను ప్రోత్సహించి సహాయం చేయిస్తున్నారు. ‘‘మనకు ఉన్న దాంట్లో నలుగురికి అన్నం పెడితే భగవంతుడు మనల్ని కాపాడుతాడు’’ అని అమ్మ చెప్పిన మాటలు నాలో బాగా నాటుకున్నాయని చెప్పారు అన్నపూర్ణ. వినాయక చవితికి మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తారామె. గత ఏడాది మలేసియాలో మహిళాదినోత్సవం పురస్కారం అందుకోవడం వెనుక ఆమె చేసిన ఇన్ని పనులున్నాయి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎన్. రాజేశ్ రెడ్డి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ దగ్గర ఆహారం పంచుతున్న అన్నపూర్ణ -
ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు
-
రామ భక్తుడిగా రాహుల్ గాంధీ!?
సాక్షి, న్యూఢిల్లీ : ఇదివరకు ఎన్నికలు సమీపిస్తున్నాయంటే కేంద్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రజల్లోకి వివిధ రకాలుగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించేవారు. ఊరు, వాడా తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించే వారు. ఎక్కడికెళితే అక్కడి సమస్యలను ఏకరువు పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేవారు. రాజకీయ ప్రత్యర్థులను ఆడిపోసుకునేవారు. ఇంకా ప్రజల్ని ఆకర్షించేందుకు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసేవారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్ మారిపోయింది. బీజేపీ నాయకులు ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ప్రధానంగా ‘హిందూత్వ’ నినాదాన్ని అందుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ముస్లిం పక్షపాత పార్టీ అని ఆడిపోసుకుంటున్నారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు తాను కూడా హిందూత్వ వాదినని చెప్పుకోవడం కోసమేమో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివ భక్తుడిగా మారిపోయారు. ఇక ఆయన్ని జంధ్యం ధరిస్తున్న బ్రాహ్మణుడని పార్టీ వారు ప్రచారంలో పెట్టారు. అందుకని రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ముందుగా అక్కడి హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ సోమవారం నాడు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఉజ్జయినిలోని మహా కాళేశ్వరుడి ఆలయాన్ని సందర్శించడమే కాకుండా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అక్కడ రాహుల్ గాంధీ గోత్రం అడిగారంటే ఆయన అగ్రవర్ణానికి చెందిన బ్రాహ్మణుడిగా ప్రచారం జరగాలనే. నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని మొదటి నుంచి లౌకికవాద, ఉదారవాద కుటుంబంగానే భారత రాజకీయాల్లో గుర్తించారు. రాజీవ్‌గాంధీ, క్రైస్తవ మతానికి చెందిన సోనియా గాంధీని పెళ్లి చేసుకోవడంతో కాంగ్రెస్‌పై క్రైస్తవ ముద్ర వేసేందుకు ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీజేపీ ప్రయత్నిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందే రాహుల్ గాంధీ జంధ్యం వేసుకునే బ్రాహ్మణుడు కాగా, పార్టీ బాధ్యతలు స్వీకరించాక పూర్తి స్థాయి శివభక్తుడిగా మారిపోయారు. సెప్టెంబర్ నెలలో రాహుల్ గాంధీ టిబెట్‌లోని కైలాస యాత్రకు కూడా వెళ్లి వచ్చారు. గత ఏప్రిల్ నెలలో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయన ఆ రాష్ట్రంలోని పలు గుళ్లూ గోపురాలను సందర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ, అనుబంధ హిందూత్వ సంఘాలు అయోధ్య నినాదాన్ని అందుకుంది. ఈ విషయంలో బీజేపీని అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ రామ భక్తుడిగా మారిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. -
‘కేసీఆర్.. శ్యామల కన్నీళ్లు కనిపించలేదా’
సాక్షి, హైదరాబాద్ : బంగారు తెలంగాణలో సగభాగం అయిన మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళల ఓట్లతో రాష్ట్రంలో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్.. నేడు వారి సమస్యలు పట్టించుకోవడం లేదని, మహిళలు నరకకూపంలోకి వెళ్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఆదివారం జరిగిన బోనాల వేడుకల్లో మహిళలు కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. మేం మాట్లాడితే రాజకీయాలని కొట్టిపారేస్తారని, మరి భవిష్యవాణి చెప్పిన అమ్మవారే ఇలాంటివి చెప్పడం రాష్ట్రం మొత్తం టీవీల్లో చూసిందన్నారు. ఆకుల విజయం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బంగారు బోనం తెచ్చినా కూడా మహిళల్లో ఆనందం లేదు. అధికారులు, పోలీసుల దురుసు ప్రవర్తనతో జోగిని శ్యామల కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మీ ప్రభుత్వ చేతకాని తనం. శ్యామల కన్నీళ్లు మీకు కనిపించలేదా కేసీఆర్. బంగారు బతుకమ్మతో పాటు బంగారు బోనం సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎంపీ కవితది అయింది. రాష్ట్రంలో మహిళ అంటే కవిత ఒక్కరేనా. ఇంకో మహిళ కూడా కనిపించడం లేదా.? నిన్న మహిళా రిపోర్టర్లు, యాంకర్లు అక్కడ ధర్నా చేయాల్సిన దుస్థితి. భవిష్యవాణి చెప్పే వారు(స్వర్ణలత), జోగిని శ్యామల ఇలా అందరూ ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి ఆలోచించాలి. కవితకు ఏం అర్హత ఉంది? సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు జాతర చేసుకుంటుంటే సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీస్ అధికారి సుమతి దురుసుతనానికి మీరు కారణం కాదా. స్వామీజీని బహిష్కరించిన తీరు, జోగిని పట్ల మీ తీరుపై మీరు సమాధానం చెప్పాలి. వచ్చే రోజుల్లో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరిస్తున్నాం. సికింద్రాబాద్‌లో బోనాన్ని ఏ అర్హతతో కవిత ఎత్తుకున్నారు. కవితకు, సికింద్రాబాద్‌కు ఏమైనా సంబందం ఉందా. సీఎం కేసీఆర్ సతీమణి బోనం ఇస్తే మాకు ఏ అభ్యంతరం ఉండేది కాదు. బోనాల నేపథ్యంలో జరిగిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని’ ఆకుల విజయ డిమాండ్ చేశారు. బంగారు బోనం సమర్పించిన ఎంపీ కవిత తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్ శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం
-
ఉజ్జయిని మహంకాళి: స్వర్ణలత భవిష్యవాణి
-
ప్రభుత్వంపై, అధికారులపై అమ్మవారి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు బోనం సమర్పించామని సంతోష పడుతున్నారు.. కానీ నాది నాకే సమర్పించారని చెప్పారు. బంగారు బోనం సమర్పించినా.. తాను దుఖంతో ఉన్నానని.. తన దర్శనానికి వచ్చే భక్తులు సైతం ఈ ఏడాది దుఃఖంతో వచ్చారని స్వర్ణలత అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారు స్వర్ణలత ద్వారా భవిష్యవాణి వినిపించారు. తనకు బంగారు బోనం వద్దని.. సంతోష బోనం సమర్పించాలని అమ్మవారు రంగంలో సూచించారు. ‘నా సన్నిధికి వస్తున్న భక్తులు దుఖంతో వస్తున్నారు. దుఖంతోనే పోతున్నారు. ఈ ఏడాది మాత్రం భక్తులు సంతోషంగా లేరు. నా భక్తులు సంతోషంగా ఉన్నారని మీరు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. మాటల్లో ఉన్నంతగా చేతల్లో మాత్రం పనులు లేవు. నా బిడ్డలు, అడపడుచులందరు ఎడుపులతో ఉన్నారు. మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినా.. నేను మాత్రం ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ప్రజలకు మేలు చేస్తున్నామని అనుకుంటున్నారు.. కానీ కీడు చేస్తున్నారు. ప్రజలందరూ శాపాలు పెడుతున్నారు. నేను ఎప్పుడు శాపం పెట్టలేదు. ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ఆ భాద్యత నాది. నా ఆశీర్వాదం అందరికి ఉంటుంది. నాకు మాత్రమే మొక్కులు సమర్పించడం కాదు. ప్రజలను సంతోషపెట్టండి. వచ్చే రోజుల్లో నా భక్తులకు ఇబ్బందులు కాకుండా చూసుకోండి. నేనెప్పుడూ న్యాయం పక్షాన నిలబడుతా. కోరినన్ని వర్షాలు ఉన్నాయి. వచ్చే రోజుల్లో వర్షాలు కురుస్తాయి. పాడి పంటలు బాగా పండుతాయని’ అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
శ్యామల ఫైర్.. స్పందించిన తలసాని
సాక్షి, హైదరాబాద్ : బోనాల పండుగ ఘనంగా జరిగిందని, విదేశీయులు సైతం ఈ సంబరాలకు హాజరయ్యారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందంటూ కొందరు కామెంట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం జరిగిన రంగం కార్యక్రమం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. జోగిని శ్యామల కాస్త ఇబ్బంది పడ్డారని విన్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. లక్షల మంది వచ్చినప్పుడు జరిగిన అసౌకర్యాన్ని ఆమె అర్థం చేసుకోవాలంటూ శ్యామలకు మంత్రి తలసాని సూచించారు. ‘చిన్న చిన్న అసౌకర్యాలు జరిగాయి. స్థలం తక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమే. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు బాగా సహకరించాయి. అయితే జోగిని శ్యామలకు ఆలయ పరిస్థితులు పూర్తిగా తెలుసు. ప్రభుత్వంపై ఆమె కామెంట్ చేయడం సరికాదు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని’ మంత్రి తలసాని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్ -
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు
-
జూలై 22 నుంచి మహంకాళి బోనాలు
చాంద్రాయణగుట్ట : జూలై 22వ తేదీ నుంచి లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి 108వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు సి.రాజ్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోనాల జాతర ఉత్సవాల వివరాలను వెల్లడించారు. జూలై 22వ తేదీన ఉదయం 8 గంటలకు జరిగే దేవి అభిషేకంతో ప్రారంభమయ్యే బోనాల జాతర ఉత్సవాలు ఆగష్టు 1 వ తేదీన ఊరేగింపుతో ముగుస్తాయన్నారు. 22వ తేదీన ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ, శిఖర పూజ, సాయంత్రం 6.15 గంటలకు కలశ స్థాపన ఉంటుందన్నారు. 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు లక్ష ఫలార్చన, 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలయ వేదిక నుంచి ఉమ్మడి దేవాలయాల ఘటాలకు స్వాగతం, రాత్రి 9 గంటలకు ఘట స్థాపన ఉంటుందన్నారు. 25వ తేదీన సాయంత్రం 4 గంటలకు లక్ష బిల్వార్చన, 26వ తేదీన సాయంత్రం 7 గంటలకు దీపోత్సవము, 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు శాకాంబరి పూజ, 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు లక్ష పుష్పార్చన, 29వ తేదీన లక్ష కుంకుమార్చన, 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు నవ ఛండీ హవనము, రాత్రి 9 గంటలకు తొట్టెల ఉంటుందన్నారు. 31వ తేదీన తెల్లవారుఝామున 4 గంటలకు బలిహరణ, ఉదయం 6 గంటలకు దేవి మహాభిషేకం అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభమవుతుందన్నారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణము, ఆగష్టు 1వ తేదీన ఉదయం 10 గంటలకు అష్టాదళపాద పద్మారాధన, మధ్యాహ్నం 12 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 2 గంటలకు పోతురాజు స్వాగతం, సాయంత్రం 4 గంటలకు భవిష్యవాణిని వినిపించే రంగం కార్యక్రమం ఉంటుందన్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ భవానీ రథయాత్ర అమ్మవారి ఊరేగింపు ఉంటుందన్నారు. కాగా ఈ బోనాల ఉత్సవాలకు గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సలహాదారులు జి.మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పి.వై.కైలాష్ వీర్, కోశాధికారులు జి.అరవింద్ కుమార్ గౌడ్, యు.సదానంద్ గౌడ్, తిరుపతి నర్సింగ్ రావు, ప్రచార కార్యదర్శి మహేష్, సభ్యులు ఎ.మాణిక్ ప్రభు గౌడ్, బల్వంత్ యాదవ్, బంగ్లా రాజు యాదవ్, విష్ణు గౌడ్, కె.వెంకటేష్, కప్పా కృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9,10 తేదీలలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాలు లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ తరఫున ఈ ఏడాది కూడా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాలను ఘనంగా నిర్వహించనున్నామని ఈ సందర్భంగా అధ్యక్షుడు సి.రాజ్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆలయ కమిటీ సభ్యులతోపాటు దాదాపు 150 మంది భక్తులతో కలిసి ఈ బోనాలను జరుపనున్నామన్నారు. కాగా ఈ బోనాల ఉత్సవాలకు సాంస్కృతిక శాఖ కార్యదర్శి సహకరించి 50 మంది కళాకారులను కూడా కేటాయిస్తున్నారన్నారు. రెండు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఈ బోనాలు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలలో నిజామాబాద్ ఎంపీ కవిత బోనం ఎత్తుకోనున్నారన్నారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలు కూడా హాజరు కానున్నారన్నారు. ఢిల్లీలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహించి అమ్మవారి ఆలయం వద్ద జరిగే బోనాల ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించనున్నామన్నారు. -
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న విజయమ్మ