Union Mines Ministry
-
భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ అవార్డు
న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ భారతి భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ నుంచి ప్రతిష్టాత్మక అవార్డ్ లభించింది. సస్టైనబుల్ మైనింగ్ విభాగంలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డును కంపెనీ సొంతం చేసుకుంది. భారతి సిమెంట్స్‌కు ఈ అవార్డు రావడం వరుసగా ఐదోసారి గమనార్హం.పర్యావరణహితమైన మైనింగ్ పద్ధతులు అవలంభించినందుకు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ అమలులో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు గానూ కేంద్ర మైనింగ్ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా భారతి సిమెంట్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా, మైన్స్ హెడ్ సుధాకర్ రాజు, సీఎస్ఆర్ హెడ్ నితేష్వర్లు ఈ అవార్డు అందుకున్నారు.భారతి సిమెంట్స్ కు వరుసగా ఐదోసారి అవార్డు రావడం గొప్ప విషయమని భారతి సిమెంట్స్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. పర్యావరణహితమైన మైనింగ్ నిర్వహించినందుకు గాను ఈ అవార్డు లభించిందని, భారతి సిమెంట్ టీం, మైనింగ్ కార్మికులు అద్భుతంగా పనిచేయడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1256 మైన్లు ఉంటే 68 మాత్రమే అవార్డుకు ఎంపికయ్యాయని వివరించారు. -
Geological Survey of India: జమ్మూకశ్మీర్‌లో 59 లక్షల టన్నుల లిథియం
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుత్ పరికరాల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన లిథియం నిక్షేపాలను తొలిసారిగా మన దేశంలో గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. ‘‘జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లా సలాల్ హైమనా ప్రాంతంలో లిథియం నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) గుర్తించింది’’ అని ట్వీట్ చేసింది. గనుల శాఖ 2018–19లో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 51 ఖనిజ క్షేత్రాలను కనిపెట్టింది. సంబంధిత సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసింది. బంగారంతో పాటు పొటాషియం, మాలిబ్డినం, ఇంకా ఇతర ప్రాథమిక లోహాల నిక్షేపాలను 11 రాష్ట్రాల్లో గుర్తించారు. బంగారం నిల్వలను 5 క్షేత్రాలను కనుగొన్నారు. జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనుల శాఖ తెలిపింది. భారత్ ప్రస్తుతం లిథియంను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. విద్యుత్ వాహనాల తయారీలో లిథియం చాలా కీలకం. ఇప్పుడు ఈ ఖనిజ నిల్వలు జమ్మూకశ్మీర్‌లో బయటపడడంతో రాబోయే రోజుల్లో దేశంలో విద్యుత్ వాహనాల తయారీ రంగం వేగం పుంజుకోనుంది. లిథియం దిగుమతుల భారం పెద్దగా ఉండదు కాబట్టి విద్యుత్ వాహనాల ధరలు దిగివచ్చే అవకాశాలున్నాయి. స్మార్ట్ఫోన్ల తయారీలోనూ లిథియం ఉపయోగిస్తారు. -
ఇతర రాష్ట్రాల్లోనూ మైనింగ్ కార్యకలాపాలు
రేపు కేంద్ర గనుల శాఖ సమావేశంలో టీఎస్ఎండీసీ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న మైనింగ్ బ్లాకులను దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ముడి ఇనుము, బాక్సైట్, సున్నపురాయి, బేస్ మెటల్ నిల్వలకు సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా వంద బ్లాక్‌లను గుర్తించింది. ఖనిజాల వెలికితీతలో ఉన్న అనుభవం, సామర్థ్యాన్ని బట్టి వేరే రాష్ట్రాలకు కూడా కేటాయించాలని నిర్ణయించింది. పొరుగు రాష్ట్రా ల్లోని మైనింగ్ బ్లాక్‌లను పొందేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ టీఎస్ఎండీసీ సమాయత్తమవుతోంది. మైనింగ్ బ్లాక్‌ల కేటాయింపులకు సంబంధించి ఈ నెల 12న ఢిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్ర గనుల శాఖ నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు సమర్పించనుంది. టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సింగరేణి సీఎండీ శ్రీధర్, మైనింగ్ విభాగం అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వ్యాపార దృక్పథంతో భవిష్యత్‌లో మైనింగ్ వెలికితీత కార్యకలాపాలపై టీఎస్ఎండీసీ దృష్టి సారిస్తుందని సుభాష్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ ఇతర దేశాల్లోనూ బొగ్గు వెలికితీత కార్యకలాపాలపై దృష్టి సారించింది. గతంలో ఏడు దే శాల నుంచి 13 గనుల నిర్వహణకు సంబంధించి ఆహ్వానం అందింది.