భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ అవార్డు | bharathi cements bags 5 star award from mines ministry | Sakshi
Sakshi News home page

భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ అవార్డు.. వరుసగా ఐదోసారి ఘనత

Published Wed, Aug 7 2024 7:19 PM | Last Updated on Wed, Aug 7 2024 7:45 PM

bharathi cements bags 5 star award from mines ministry

న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ సిమెంట్‌ తయారీ సంస్థ భారతి భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ నుంచి ప్రతిష్టాత్మక అవార్డ్‌ లభించింది. సస్టైనబుల్ మైనింగ్ విభాగంలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డును కంపెనీ సొంతం చేసుకుంది. భారతి సిమెంట్స్‌కు ఈ అవార్డు రావడం వరుసగా ఐదోసారి గమనార్హం.

పర్యావరణహితమైన మైనింగ్ పద్ధతులు అవలంభించినందుకు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ అమలులో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు గానూ కేంద్ర మైనింగ్ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా భారతి సిమెంట్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా, మైన్స్ హెడ్ సుధాకర్ రాజు, సీఎస్ఆర్ హెడ్ నితేష్వర్‌లు ఈ అవార్డు అందుకున్నారు.

భారతి సిమెంట్స్ కు వరుసగా ఐదోసారి అవార్డు రావడం గొప్ప విషయమని  భారతి సిమెంట్స్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. పర్యావరణహితమైన మైనింగ్ నిర్వహించినందుకు గాను ఈ అవార్డు లభించిందని, భారతి సిమెంట్ టీం, మైనింగ్ కార్మికులు అద్భుతంగా పనిచేయడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1256 మైన్లు ఉంటే 68 మాత్రమే అవార్డుకు ఎంపికయ్యాయని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement