‘ఉప్పాల’కు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు జిల్లా నుంచి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఉప్పాల రామమోహనరావు సోమవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఉప్పాల యడ్లపాడు మండలం జగ్గాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.