Vamshadhara Project
-
కృష్ణా, గోదావరి జిల్లాల అభివృద్ధికి నీరే ప్రధానం: ధర్మాన ప్రసాదరావు
సాక్షి, శ్రీకాకుళం: వంశధార ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకూ సుమారు రూ.2000 కొట్లు ఖర్చు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశా రాష్ట్రంతో ఇబ్బందులు కొనసాగితున్నాయని, ట్రిబ్యునల్ తీర్పుపై ఒడిశా కోర్టుకు వెల్లనున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. ప్రాజెక్ట్ అనుభవిస్తున్న మనకు ఉన్నంత శ్రద్ద ఒడిశాకు ఉండదని అన్నారు. అభ్యంతరాలు అన్నీ పూర్తి కావాలంటే మరో ఐదేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. గొట్ట దగ్గర ఒక లిప్ట్ పెట్టి హిరమండలం ప్రాజెక్టులో 19 టీఎంసీలు నింపితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ ఆలోచనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన సానుకూలంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. గొట్టా వద్ద ఎత్తిపోతల పధకానికి రూ. 300 నుంచి రూ.350 కొట్లు అదనపు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్ధ్యం నిండాలంటే ఎత్తిపోతల అవసరం ఏర్పడిందని చెప్పారు. రైతులు కమర్సియల్ క్రాప్స్ పండించాలన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాలు అభివృద్ధికి నీరే ప్రధానమని, ఒడిశా తగాదా దురదృష్టకరమని పేర్కొన్నారు. వంశధార ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి కావలసిందని తెలిపారు. వైఎస్సార్సీపీ హాయాంలోనే రైతులకు వంశధార ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తామని తెలిపారు. వచ్చే వేసవి నాటికి 2లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రిజర్వాయర్ నీటిని నిల్వచేయడం ద్వారా నాగావళి, వంశధార అనుసంధానం చేయవచ్చని తెలిపారు. నిర్వాసితుల సమష్యల పరిస్కారించాలని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. తిత్లీ తుఫాన్, వంశధార నిర్వాసితులకు అదనపు ప్యాకేజీ త్వరలోనే సీఎం జగన్ అందజేస్తామని తెలిపారు. త్వరలోనే సీఎం వైఎస్ చేతుల మీదుగా కాట్రగడ్డ బ్యేరేజ్‌కు పౌండేషన్ స్టోన్ వేస్తామని చెప్పారు. -
నదుల అనుసంధానం.. ఓ భగీరథయత్నం
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం అంటే.. ఎవరో కట్టిన కాలువలో నాలుగు చెంబుల నీళ్లు ఎత్తిపోయడమా.. ఆ కాలువలో వర్షపు నీటిని చూపించి రెండు నదులను అనుసంధానించేశామంటూ కోట్లు ఖర్చుపెట్టి ఈవెంట్లు చేయడమా... వేర్వేరు మార్గాలలో పయనించే రెండు నదులను అనుసంధానించడం ఓ భగీరథయత్నం.. ఇందుకు నిధులు మాత్రమే కాదు నిబద్ధత, దృఢ దీక్ష కూడా అవసరమే. పాలకులకు అవి ఉన్నప్పుడే అనుసంధాన యత్నాలు ఫలిస్తాయి. రెండు కాదు.. మూడు కాదు రాష్ట్రంలో మొత్తంగా ఆరు చోట్ల నదుల అనుసంధానం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రం పరిధిలోని నదుల అనుసంధానం పనులను వేగవంతం చేస్తూనే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ వంటి అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంపైనా కేంద్రంతో కలిసి కసరత్తు చేస్తోంది. నదుల అనుసంధానం అంటే ఇదీ.. నదుల అనుసంధానానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఒక నదిపై బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి వరద జలాలను మరో నదిపై నిర్మించే బ్యారేజీలోకి తరలించినప్పుడే ఆ రెండు నదులు అనుసంధానం చేసినట్లు లెక్క. గోదావరి నదిపై ఎలాంటి బ్యారేజీ నిర్మించకుండా..దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన పోలవరం కుడి కాలువ మీదుగా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి 2016లో గోదావరి జలాలను తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు నాటి సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని అప్పట్లో సీడబ్ల్యూసీ ఖండించడం గమనార్హం. రూ.145.34 కోట్లతో వంశధార–నాగావళి అనుసంధానం నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఖరీఫ్‌లో ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో హిరమండలం రిజర్వాయర్‌కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్ మట్టికట్ట 5.6 కి.మీ వద్ద నుంచి 33.583 కి.మీల పొడవున హెచ్చెల్సీ(హైలెవల్ కెనాల్)ను తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదులను అనుసంధానం చేసి, ఆయకట్టును సస్యశ్యామలం చేసే పనులను రూ.145.34 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 31.30 కి.మీ పొడవున హెచ్చెల్సీ తవ్వకం పనులను పూర్తి చేసింది. కేవలం 2.283 కి.మీల కాలువ తవ్వకం పనులు మాత్రమే మిగిలాయి. వాటిని ఖరీఫ్ నాటికి పూర్తి చేసి.. వంశధార–నాగావళి అనుసంధానాన్ని సాకారం చేయనున్నది. దీని వల్ల నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హెచ్చెల్సీ కింద కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం నుంచి గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు అనుసంధానం ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి అనుసంధానం.. తెలుగుంగ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా(శ్రీశైలం రిజర్వాయర్)–పెన్నా (సోమశిల రిజర్వాయర్)ను ఇప్పటికే అనుసంధానం చేశారు. సోమశిల వరద కాలువ 12.52 కి.మీ నుంచి రోజుకు 2,500 క్యూసెక్కులను తరలించి.. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో పోయడం ద్వారా కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి నదులను అనుసంధానం చేసే పనులను ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టింది. ఈ అనుసంధానం ద్వారా 1.23 లక్షల ఎకరాలకు నీళ్లందించనున్నారు. స్వర్ణముఖి నది పెన్నా ఉప నది. కృష్ణా–పెన్నా–పాపాఘ్ని అనుసంధానం.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం కింద 2009 నాటికే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా–పెన్నా నదులను అనుసంధానం చేశారు. పెన్నా ఉప నది అయిన పాపాఘ్ని పరీవాహక ప్రాంతం పూర్తిగా వర్షాభావ ప్రాంతంలో ఉంది. దీని వల్ల పాపాఘ్నిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి ద్వారా శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా నదీ వరద జలాలు.. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ వద్ద నుంచి జలాలను ఎత్తిపోసి.. పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్‌లోకి తరలించే పనులను చేపట్టారు. దీని ద్వారా 26 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కృష్ణా–వేదవతి అనుసంధానం.. కృష్ణా ఉప నది అయిన వేదవతిపై అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టును 1956లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. టీడీపీ సర్కార్ హయాంలో కర్ణాటకలో వేదివతిపై చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో బీటీపీలోకి చుక్క నీరు చేరడం లేదు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే నీటిని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీలోకి ఎత్తిపోయడం ద్వారా కృష్ణా–వేదవతి నదుల అనుసంధానం పనులను రూ.968 కోట్లతో చేపట్టింది. దీని ద్వారా బీటీపీ కింద 12 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు వర్షాభావ ప్రాంతంలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో చెరువులను నింపడం ద్వారా మరో 10,323 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కసరత్తు... గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. జానంపల్లి నుంచి గోదావరి–కృష్ణా(నాగార్జునసాగర్)–పెన్నా(సోమశిల)–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం చేసేలా ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) రూపొందించిన ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెబుతూ.. తక్కువ వ్యయంతో గరిష్టంగా వరద జలాలను ఒడిసి పట్టి.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలనూ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశాక.. వాటిని ఎన్‌డబ్ల్యూడీఏకు పంపి.. పనులు చేపట్టాలని నిర్ణయించారు. కేసీ కెనాల్‌తోనే నదుల అనుసంధానానికి నాంది.. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో సుంకేశుల వద్ద ఆనకట్ట నిర్మించి, అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లాలో పెన్నా నదిని అనుసంధానిస్తూ కేసీ కెనాల్ తవ్వకం పనులను 1863లో ప్రారంభించిన డచ్ సంస్థ 1870 నాటికి పూర్తి చేసింది. ఈ కాలువను నౌకా మార్గంగా వినియోగించుకుని వ్యాపారం చేసేది. వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ కాలువను 1882లో ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ సంస్థ నుంచి రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. సర్ ఆర్ధర్ కాటన్ ప్రతిపాదన మేరకు కేసీ కెనాల్‌ను 1933లో సాగునీటి వనరుగా మార్చింది. ఈ కాలువ కింద ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. దేశంలో కేసీ కెనాల్ ద్వారానే నదుల అనుసంధానం చేయడం ప్రథమం కావడం గమనార్హం. కేసీ కెనాల్ స్ఫూర్తితోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తుంగభద్రపై తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా తుంగభద్ర జలాలను పెన్నాపై నిర్మించిన మధ్య పెన్నార్ ప్రాజెక్టులోకి.. అక్కడి నుంచి చిత్రావతిపై నిర్మించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి తరలించేలా ప్రణాళిక రూపొందించి.. పనులు ప్రారంభించారు. ఈ పనులు 2009 నాటికి పూర్తయ్యాయి. దీని ద్వారా తద్వారా తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం పనులను 2009 నాటికి దివంగత సీఎం వైఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా 1,90,035 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. నదుల అనుసంధానానికి రాష్ట్రమే స్ఫూర్తి.. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం కోసం కృష్ణా నది నుంచి తన కోటాలో నుంచి ఐదు టీఎంసీల చొప్పున కేటాయించేందుకు ఫిబ్రవరి 15,1976న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలు అంగీకరించాయి. ఈ నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించేలా అక్టోబర్ 27, 1977న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. చెన్నైకి తాగునీటిని అందించడంతోపాటు 29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, 30 టీఎంసీల పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి.. కర్నూల్, వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టేందుకు 1978లో ప్రభుత్వం సర్వే పనులను చేపట్టింది. ఈ పనులను 2009 నాటికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. తెలుగుగంగలో భాగంగా కృష్ణా(శ్రీశైలం)–పెన్నా(సోమశిల)–పూండి రిజర్వాయర్(తమిళనాడు)ను అనుసంధానం చేశారు. దేశంలో అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ఈ పథకమే స్ఫూర్తి అని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి.. బీడు భూములకు మళ్లించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా నదులను అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రం పరిధిలోని ఆరు అనుసంధానాల పనులను చేపట్టాం. వంశధార–నాగావళి, గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు, కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి, కృష్ణా–పెన్నా–పాపాఘ్ని, కృష్ణా–వేదవతి అనుసంధానం పనులను వేగవంతం చేశాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అత్యధిక ప్రయోజనం చేకూరేలా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానం చేయడంపై కసరత్తు చేస్తున్నాం. నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
వంశధార ట్రిబ్యునల్ తీర్పు: వైఎస్సార్ దార్శనికతకు నిదర్శనం
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపు.. నిబద్ధత.. దార్శనికత కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) తుది తీర్పు ఇచ్చిందని నీటిపారుదల రంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలతోపాటు మిగులు జలాలపై పూర్తి హక్కును దక్కించుకోవాలంటే.. వాటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మించాలంటూ 1985 నుంచి 2004 వరకూ ప్రభుత్వాలకు వైఎస్సార్ సూచిస్తూ వచ్చారు. కృష్ణా, దాని ఉప నదులు, పెన్నా, దాని ఉప నది చిత్రావతిలపై కర్ణాటక సర్కార్ 1995 నుంచి 2004 మధ్య అనుమతి లేకుండా అనేక ప్రాజెక్టులు చేపట్టింది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ.. కృష్ణా మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ హక్కు రావాలంటే పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టాలంటూ అప్పటి సీఎం చంద్రబాబును నాటి ప్రతిపక్ష నేత వైఎస్సార్ డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. పర్యవసానంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 ఉమ్మడి ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తీర్పు ఇచ్చింది. మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దీనివల్ల మిగులు జలాలపై హక్కును ఏపీ కోల్పోవాల్సి వచ్చింది. జలయజ్ఞం కింద ఒకేసారి 85 ప్రాజెక్టులకు శ్రీకారం మే 14, 2004న వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జలయజ్ఞం కింద ఒకేసారి 85 ప్రాజెక్టులను చేపట్టారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో.. 1962 నుంచి కాగితాలకే పరిమితమైన వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2ను ఫిబ్రవరి 25, 2005న మొదలుపెట్టారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మించి.. రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను హైలెవల్ కాలువ ద్వారా తరలించి.. సింగిడి (0.686), పారాపురం (0.404), హిర మండలం (19.05)లో టీఎంసీలను నిల్వ చేయాలని ప్రణాళిక రచించారు. తద్వారా వంశధార ప్రాజెక్టు తొలి దశ కింద 2.10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటూ కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించవచ్చు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన నేరడి బ్యారేజీ వల్ల తమ భూభాగం ముంపునకు గురవుతుందని ఒడిశా సర్కార్ అభ్యంతరం తెలుపుతూ 2006లో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఒకవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరిస్తూనే.. మరోవైపు ప్రాజెక్టు ముందస్తు ఫలాలను శ్రీకాకుళం జిల్లా రైతులకు అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ డిజైన్‌ను మార్చారు. నేరడి బ్యారేజీ స్థానంలో కాట్రగడ్డ వద్ద సైడ్‌వియర్ (మత్తడి) నిర్మించి.. అక్కడి నుంచి సింగిడి, పారాపురం, హిర మండలం రిజర్వాయర్లకు తరలించేలా డిజైన్ చేసి పనులు చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పనులను పూర్తి చేశారు. వైఎస్సార్ వల్లే రాష్ట్రానికి న్యాయం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా వాదనను ఏళ్ల తరబడి విచారించిన వంశధార ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 2017న తుది తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునే సోమవారం ఖరారు చేసింది. దివంగత సీఎం వైఎస్సార్ చేపట్టిన కాట్రగడ్డ సైడ్వియర్తోపాటు ప్రతిపాదించిన నేరడి బ్యారేజీకి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. వంశధారలో 57.5 టీఎంసీలను వినియోగించుకునే పూర్తి స్వేచ్ఛను ఏపీకి ఇచ్చింది. వైఎస్సార్ ముందుచూపుతో వంశధార ప్రాజెక్టు ఫేజ్–2 స్టేజ్–2 చేపట్టకున్నా.. ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతుకు అందించాలనే నిబద్ధతతో కాట్రగడ్డ సైడ్‌వియర్ నిర్మాణాన్ని చేపట్టకపోయినా.. ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వ వాదనతో విభేదించి ఉండేదని న్యాయ నిపుణులు తేల్చిచెబుతున్నారు. చదవండి: గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు -
వంశధార ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరం: సీఎం జగన్
-
‘నేరడి’పై వివాదాల పరిష్కారానికి సీఎం చొరవ
సాక్షి, అమరావతి : వంశధార, జంఝావతి నదీ జలాల్లో వాటా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా వెనకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒడిశా సర్కార్‌తో సంప్రదింపులు జరిపి వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో కీలకమైన నేరడి బ్యారేజీ.. జంఝావతి రబ్బర్ డ్యామ్ స్థానంలో స్పిల్ వే నిర్మించడం ద్వారా వాటా జలాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. నేరడి బ్యారేజీ, ఝంజావతి ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించి.. వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చదవండి: రేపు రెండో విడత రైతు భరోసా ప్రారంభం నేరడిపై ఒడిశా అభ్యంతరం.. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి ఎనిమిది వేల క్యూసెక్కులను కొత్తగా నిర్మించే సింగిడి రిజర్వాయర్ (0.686 టీఎంసీలు), పారాపురం రిజర్వాయర్ (0.404 టీఎంసీలు), హిరమండలం రిజర్వాయర్ (19.05 టీఎంసీలు)లలో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: ‘ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము చేయరు’ ఒడిశా ప్రతిపాదన మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, ఆర్నెల్లలోగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 6, 2009న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు వంశధార ట్రిబ్యునల్‌ను ఫిబ్రవరి 24, 2010న కేంద్రం ఏర్పాటు చేసింది. ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేసి.. బామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్ వియర్(మత్తడి) నిర్మించి.. గరిష్ఠంగా ఎనిమిది టీఎంసీలు మళ్లించే పనులను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. జంఝావతి వివాదం ఇదీ.. జంఝావతి నదిలో 8 టీఎంసీల నీటి లభ్యతలో చెరి సగం వాడుకునేలా డిసెంబర్ 25, 1978న ఒడిశా, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ వాటా నీటిని వినియోగించుకోవడం కోసం విజయనగరం జిల్లాలో జంఝావతిపై కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 3.40 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బ్యారేజీ ద్వారా 24,410 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. ఒడిశాలో ముంపునకు గురయ్యే 1,175 ఎకరాలను సేకరించి అప్పగించడానికి అప్పట్లోనే ఒడిశా సర్కార్ వద్ద ఏపీ ప్రభుత్వం నిధులను డిపాజిట్ చేసింది. కానీ ఒడిశా సర్కార్ భూసేకరణ చేయలేదు. పూర్తిస్థాయి బ్యారేజీ నిర్మాణానికి అడ్డుతగులుతూ వచ్చింది. దాంతో జంఝావతి ఫలాలను ముందస్తుగా రైతులకు అందించడానికి 2006లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్‌ను నిర్మించారు. సంప్రదింపుల ద్వారా వివాదాలు పరిష్కారం.. వంశధారలో 115 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. ఇరు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేస్తూ సెప్టెంబర్ 13, 2017న ట్రిబ్యునల్ తుది తీర్పును ఇచ్చింది. నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీకి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఒడిశా సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు, వంశధార ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముంపు భూమిని గుర్తించేందుకు జాయింట్ సర్వేకు కూడా ఒడిశా సర్కార్ సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. వంశధార జలాల్లో రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన 57.5 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించారు. ఒడిశాలో ముంపునకు గురయ్యే భూమిని సేకరించడం, ముంపు గ్రామాలను ఖాళీ చేయించడంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించి... జంఝావతిపై 3.40 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి స్థాయి బ్యారేజీని నిర్మించడానికి మార్గం సుగమం చేయాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. -
ఇనుప సంకెళ్లు..
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో వంశధార ఎడమ ప్రధాన కాలువ కింద దాదాపు లక్షన్నర ఎకరాల ఆయకట్టు ఉంది. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు పరిధిలో ఇంజనీరింగ్ సర్కిళ్లు ఐదు ఉన్నాయి. అవి కన్స్ట్రక్షన్ డివిజన్ (హిరమండలం), కన్స్ట్రక్షన్ డివిజన్–2 (ఆమదాలవలస), ఇన్వెస్టిగేషన్ డివిజన్ (ఆమదాలవలస), మెయింటినెన్స్ డివిజన్ (నరసన్నపేట), మెయిన్ కెనాల్ డివిజన్ (టెక్కలి). వంశధార నీటి పారుదల వ్యవస్థలో భాగంగా ఉన్న పిల్ల కాలువలపై షట్టర్లు, వాక్ వే బ్రిడ్జిలను నిర్మించే ఉద్దేశంతో ఆయా శాఖల ఇంజనీర్లు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. 2006–07 ఆర్థిక సంవత్సరంలో 261 షట్టర్లు, 1058 వాక్‌వే బ్రిడ్జిలు, 2007–08లో 24 షట్టర్లు, 14 వాక్‌వే బ్రిడ్జిలు, 2008–09లో 22 షట్టర్లు, 245 వాక్‌వే బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 307 షట్టర్లను రూ.10.65 కోట్లతోను, 1,317 వాక్‌వే బ్రిడ్జిలను సుమారు రూ.51.41 కోట్లతోను నిర్మించేందుకు మూడు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన ఆదిత్యతేజ మెకానికల్ వర్క్స్, మణికంఠ ఫ్యాబ్రికేటర్స్, శ్రీకాకుళం నగరానికి చెందిన సాత్యవి ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఈ టెండర్లను దక్కించుకున్నాయి. మొత్తం 1,624 స్ట్రక్చర్లను రూ.62.02 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. టీడీపీ నాయకుల గగ్గోలు... వంశధార ఆయకట్టులోని పంటపొలాలన్నింటికీ సక్రమంగా సాగునీరు అందించేందుకు కాలువలపై షట్టర్లు, అలాగే రైతులు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వాక్‌వే బ్రిడ్జిలు నిర్మించడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. నిర్మాణానికి అవసరమైన ఇనుప రేకులు (ఎంఎస్ షీట్లు), స్క్రూ రాడ్లు, హ్యాండ్ రెయిల్స్ తదితర సామాగ్రి దాదాపు 80 శాతం నిర్మాణ ప్రదేశాలకు కాంట్రాక్టు సంస్థలు చేర్చాయి. 2009 సాధారణ ఎన్నికలు ముగిసే సమయానికి 9 షట్టర్లు, 41 వాక్‌వే బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యింది. మరో 21 షట్టర్లు, 227 వాక్‌వే బ్రిడ్జిల నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయి. అయితే ఆ ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఘోరంగా ఓడిపోయారు. ఈ పరాభవం నుంచి బయటపడటానికి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నెపం వేసేందుకు షట్టర్ల కుంభకోణం అంటూ గగ్గోలు మొదలెట్టారని బాధితులు వాపోతున్నారు. నిర్మాణ సామాగ్రి అధిక ధరకు కొనుగోలు చేశారని, సామాగ్రి లెక్కల్లో తప్పులు చూపించారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. దీనిపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఐదేళ్ల పాలనలో నత్తనడక... 2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ఆరోపణల్లో వాస్తవానికి నిగ్గు తేల్చే అవకాశం ఉన్నా ఆ దిశగా పట్టించుకోకపోవడం గమనార్హం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దర్యాప్తు వేగవంతంగా జరిగింది. వంశధార ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లలో 33 మంది 2009 ఆగస్టు నెల 3వ తేదీన సస్పెండ్ అయ్యారు. 2013 సంవత్సరంలో మరో 17 మందిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. కానీ టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత దర్యాప్తు నత్తనడకను తలపించింది. నరసన్నపేట, టెక్కలి పోలీస్టేషన్లలో నమోదైన కేసుల్లో దర్యాపు సక్రమంగా సాగలేదు. కేసును సీఐడీకి ప్రభుత్వం అప్పగించినా నేటికీ కొలిక్కిరాలేదు. తుప్పుపడుతున్న షట్టర్లు, సామగ్రి... తొలుత నిర్మాణం పూర్తయిన షట్టర్లు, వాక్‌వే బ్రిడ్జిలకు నిర్వహణ లేక తుప్పుపట్టిపోతున్నాయి. అర్ధంతరంగా నిర్మాణ పనులు నిలిచిపోయిన చోట్ల సామాగ్రి చోరీకి గురయ్యాయి. మిగిలిన సామాగ్రి ప్రస్తుతం తుప్పు పట్టేస్తున్నాయి. సుమారు రూ.20 కోట్ల విలువైన ఇనుప సామాగ్రి, విడిభాగాలను 2011 సంవత్సంలో సీఐడీ సీజ్ చేసింది. వీటిని నరసన్నపేట వంశధార కార్యాలయ ఆవరణలోని గోదాములతో పాటు జలుమూరు, బుడితి, శ్రీముఖలింగం, సీటీ పేట, హరిశ్చంద్రపురం, కోటబొమ్మాళి, టెక్కలి, పలాస మండలంలోని మొదుగపుట్ట తదితర చోట్ల ఉన్న గొదాముల్లో ఉంచారు. ప్రస్తుతం ఇవి పూర్తిగా తుప్పు పట్టాయి. వాటిని ఉపయోగించుకోవడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని గత కలెక్టరు పి.లక్ష్మీనరసింహం టీడీపీ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన సామాగ్రి ఎందుకూ పనికిరాకుండా పోతోంది. మరోవైపు షట్టర్లు లేక సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
వంశ‘ధార’ వచ్చేనా?
సాక్షి, అమరావతి: నదీ జలాలపై రాష్ట్ర ప్రజలను హక్కులను పరిరక్షించడంలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యానికి మరో తార్కాణమిది. గతేడాది సెప్టెంబరు 13న వంశధార నదీజలాల పరిష్కార న్యాయస్థానం (వీడబ్ల్యూడీటీ) ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు నింపుతూ ఇచ్చిన తీర్పును అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తనకు సన్నిహిత మిత్రుడని పదేపదే చెప్పుకొనే సీఎం చంద్రబాబు.. ట్రిబ్యునల్ తీర్పుపై ఒడిశా ప్రభుత్వంతో సకాలంలో చర్చించలేదు. ఈ నేపథ్యంలో వంశధార ట్రిబ్యునల్ తీర్పులో మార్పులు చేయాలని కోరుతూ ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీంతో వంశధార పరివాహక ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో మరోసారి అధ్యయనం చేయాలని నిర్ణయించిన ట్రిబ్యునల్ సోమవారం నుంచి ఈనెల 27 వరకు ఆంధ్రప్రదేశ్‌లో, 28, 29 తేదీల్లో ఒడిశాలో పర్యటించనుంది. కనీసం ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ట్రిబ్యునల్‌కు వివరించగలిగితే ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. 115 టీఎంసీలు.. చెరిసగం వంశధారలో 115 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని 1962లో తేల్చిన ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చెరో 57.5 టీఎంసీల చొప్పున కేటాయిస్తూ 1962 సెప్టెంబరు 30న తీర్పు చెప్పింది. వంశధార జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా.. దేశంలోనే అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. 1977 నుంచి కాగితాలకే పరిమితమైన వంశధార ప్రాజెక్టు రెండోదశ పనులకు రూ.933.90 కోట్లతో 2005 ఫిబ్రవరి 25న శ్రీకారం చుట్టారు. నేరడి బ్యారేజీపై ఒడిశా ప్రభుత్వ అభ్యంతరాలకు సహేతుకంగా సమాధానాలు చెబుతూనే ఆయకట్టుకు ముందుగా నీళ్లందించాలన్న లక్ష్యంతో వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ (మత్తడి) నిర్మాణపనులు ప్రారంభించారు. సైడ్ వియర్, నేరడి బ్యారేజీ పనులను సమాంతరంగా చేపట్టి.. గొట్టా బ్యారేజీ కింద 2,10,510 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు వరద కాలువ కింద 20 వేలు, హైలెవల్ కెనాల్ కింద ఐదు వేలు, హిర మండలం రిజర్వాయర్ కింద 20 వేలు వెరసి 45 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలని నిర్ణయించారు. కాట్రగడ్డ సైడ్ వియర్, నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఒడిశా ప్రభుత్వం 2006లో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కేంద్రం సంప్రదింపులు జరుపుతుండగానే.. వంశధార ప్రాజెక్టు రెండోదశ పనులను నిలిపేయాలంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆరునెలల్లోగా ఈవివాదాన్ని పరిష్కారించాలని సుప్రీంకోర్టు 2009 ఫిబ్రవరి 6న కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం 2010 ఫిబ్రవరి 24న వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్.. కాట్రగడ్డ సైడ్ వియర్ నిర్మాణానికి అనుమతి ఇస్తూ 2013 డిసెంబర్ 12న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ 2017 సెప్టెంబరు 13న తుది తీర్పు ఇచ్చింది. తీర్పు అమలును పట్టించుకోని సీఎం వంశధారలో 115 టీఎంసీల లభ్యత ఉంటుందని మరోసారి తేల్చిన ట్రిబ్యునల్ రెండురాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేస్తూ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీ సర్కార్‌కు అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నేరడి బ్యారేజీ జలాలను రెండు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకోవాలని సూచించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో రెండు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. నేరడి బ్యారేజి పూర్తయిన తరువాత కాట్రగడ్డ సైడ్ వియర్‌ను పూర్తిస్థాయిలో తొలగించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు అమలుకు వంశధార నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తీర్పుపై అభ్యంతరాలుంటే మూడునెలల్లో తెలపాలని సూచించింది. ‘దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుడిని. నలభై ఏళ్ల అనుభవం ఉంది.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పా.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నాకు మిత్రుడు’ అంటూ పదేపదే చెప్పే సీఎం చంద్రబాబు.. వంశధార ట్రిబ్యునల్ తీర్పు అమలులో చేతులెత్తేశారు. ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఉంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్పు అమలుకు అంగీకరించేదని, రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేదని.. కానీ సీఎం చంద్రబాబు తమ సూచనలను పట్టించుకోకుండా ఒడిశాతో చర్చించకుండా నిర్లక్ష్యం చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్పులో మార్పులు చేయాలని కోరుతూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడైనా వాదనలు సమర్థంగా వినిపించాలి వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ ముకుందశర్మ నేతృత్వంలో సభ్యులు జస్టిస్ బీఎన్ చతుర్వేది, ప్రతిభారాణి, సీఎస్ విద్యానాథన్, డి.శ్రీనివాసన్, గుంటూరు ప్రభాకర్, గణేశన్ ఉమాపతి, వై.రాజగోపాలరావు, ఎమ్మెస్ అగర్వాల్, సుఖ్‌దేవ్ సారంగి, కటారి మోహన్, వసీం ఖాద్రీలతో కూడిన బృందం సోమవారం నుంచి ఈనెల 27 వరకు శ్రీకాకుళం జిల్లాలో కాట్రగడ్డ సైడ్ వియర్, నేరడి బ్యారేజీ, హిరమండలం రిజర్వాయర్, గొట్టా బ్యారేజీలను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. 28, 29 తేదీల్లో ఒడిశాలో వంశధార పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను పరిశీలించి, అధికారులతో సమీక్షించనుంది. ఇప్పుడైనా ట్రిబ్యునల్ ముందు వాదనలు సమర్థంగా వినిపిస్తే వంశధార నదీ జలాలపై ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను పరిరక్షించవచ్చు. -
పోటెత్తిన ప్రవాహాలు
సాక్షి, అమరావతి: గత రెండు రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు ఉప్పొంగడంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, నాగావళి వరద ఉద్ధృతితో పోటెత్తుతున్నాయి. జీవనదులన్నీ జలకళతో ఉప్పొంగి ప్రవహిస్తుంటే పెన్నా నది మాత్రం వర్షాభావంతో జీవకళ కోల్పోయింది. రాయలసీమ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు లేక పెన్నాలో ఇసుక తిన్నెలు తప్ప నీటి జాడ లేదు. ఆల్మట్టి కళకళ కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో బుధవారం ఆల్మట్టిలోకి 95,136 క్యూసెక్కులు రాగా గేట్లు ఎత్తి దిగువకు 1,00,020 క్యూసెక్కులు విడుదల చేశారు. నారాయణపూర్ జలాశయంలోకి 99,160 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 1,01,011 క్యూసెక్కులు దిగువకు వదిలారు. శ్రీశైలానికి భారీ వరద తుంగభద్ర జలాశయంలోకి 1.25 లక్షల క్యూసెక్కులు వరద వస్తుండగా కాలువలకు 10,630 క్యూసెక్కులు, దిగువకు 1.38 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ఎగువ నుంచి భారీ వరద బుధవారం రాత్రికి శ్రీశైలానికి చేరనుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో 21.34 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 74,212 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 4,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 872.70 అడుగుల్లో 153.1687 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద కనీసం పది రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో శ్రీశైలం ఈదఫా నిండే అవకాశం ఉంది. గోదావరిలో పెరిగిన ప్రవాహం ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి, తాలిపేరులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8.6 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 6,37,067 క్యూసెక్కులు రావడంతో డెల్టా కాలువలకు 7,100 క్యూసెక్కులు వదిలారు. మిగతా 6,29,967 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు. ప్రస్తుత సీజన్లో గోదావరికి ఇప్పటివరకూ వచ్చిన గరిష్ఠ వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకూ 54.42 టీఎంసీల గోదావరి జలాలు కడలిలోకి వదిలారు. ఉగ్రరూపం దాల్చిన వంశధార ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళిలో వరద ఉద్ధృతి పెరిగింది. తోటపల్లి బ్యారేజీకి 35 వేల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వంశధారలో ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో శ్రీకాకుళం జిల్లాలో పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గొట్టా బ్యారేజీకి 45 వేల క్యూసెక్కులు వరద రావడంతో కాలువలకు విడుదల చేయగా 43 వేల క్యూసెక్కులను 22 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణమ్మ ఉరకలు ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో మున్నేరు, వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో వరద నిలకడగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి 28,973 క్యూసెక్కులు రాగా 8,945 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసి 20,028 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. పట్టిసీమ వట్టి కోతలే! రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులకు ఇంచుమించుగా ఒకేసారి వరదలు వస్తాయి. జూలై 3వ వారం నుంచి అక్టోబర్ వరకు రెండు నదులు ఒకేసారి వరదతో పోటెత్తుతాయి. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే. అంతకన్నా ఎక్కువ నీళ్లు వస్తే బ్యారేజీ గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయాల్సిందే. అందువల్లే పట్టిసీమ ఎత్తిపోతల పేరుతో గోదావరి వరద జలాలను పోలవరం కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి తరలించడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలకు బదులుగా పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే గ్రావిటీపై కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల గోదావరి నీళ్లను మళ్లించవచ్చని సూచించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే అంశాన్ని పలుసార్లు ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే ఏడు టీఎంసీలు సముద్రంలోకి.. ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ ద్వారా ఇప్పటికే ఏడు టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదులు ఒకేసారి పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలను, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. నీరందక కృష్ణా రైతుల ఆందోళన కృష్ణా నదికి వరద లేనప్పుడు కూడా కృష్ణా డెల్టా అవసరాలను తీర్చడంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం విఫలమైంది. గోదావరి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాల్వలోకి 8,400 క్యూసెక్కులు ఎత్తిపోసినా మార్గమధ్యలో వినియోగం, సరఫరా నష్టాలు పోనూ ప్రకాశం బ్యారేజీకి 6 వేల క్యూసెక్కులకు మించి ఏనాడూ చేరిన దాఖలాలు లేవు. కృష్ణా డెల్టాకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించాలంటే రోజుకు కనీసం 11 వేల క్యూసెక్కులు అవసరం. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే 6 వేల క్యూసెక్కులు డెల్టాకు ఏ మూలకూ సరిపోవు. దీంతో ఈ ఖరీఫ్‌లోనే నీరందక నాట్ల దశలోనే పంటలు ఎండిపోవడంతో రైతులు రోడ్డెక్కడం తెలిసిందే. ప్రకాశం బ్యారేజీకి కృష్ణా వరద నీరు పోటెత్తుతుండటంతో గత ఐదు రోజులుగా పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆపివేశారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, సాగునీటిరంగ నిపుణులు చేస్తున్న వాదన నిజమేనని మరోసారి రుజువైంది. -
చీవాట్లుపెడుతున్నా బుర్రకెక్కడంలేదు
విజయవాడ: అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు నిర్వహిస్తున్న మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్వాసితుల సమస్యలు తీర్చకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. నిర్వాసితుల సమస్యలపై కోర్టులు సైతం చీవాట్లుపెడుతున్నాప్రభుత్వాలకు బుర్రకెక్కడంలేదని మండిపడ్డారు. నిర్వాసితులు సంతృప్తి చెందకుండా ప్రాజెక్టు పూర్తి చేయలేరని వ్యాఖ్యానించారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడేందుకు వెళ్లిన వామపక్ష నేతలను అడ్డుకుని అరెస్ట్ చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. వంశధార ప్రాంతం ఏమైనా పాకిస్థానా.. ఎందుకు నిర్బంధం విధిస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు మాత్రం రాజకీయ వారసత్వం కోరుకోవచ్చు, నిర్వాసితులు మాత్రం భూమిపై హక్కు కోరితే చెల్లదంటున్నారని అన్నారు. మీకో నీతి, వారికో నీతా? అని సూటిగా అడిగారు. -
'వంశధార నిర్వాసితులపై దౌర్జన్యం'
-
'వంశధార నిర్వాసితులపై దౌర్జన్యం'
సాక్షి, విజయవాడ: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్వాసితులకు ఇంకా 90 శాతం ఇళ్లు ఇవ్వాల్సి ఉండగా ఇళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం దౌర్జన్యంగా వారిని ఖాళీ చేయిస్తోందన్నారు. కోర్టు ఆదేశాలున్నా అధికారులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నిర్వాసితులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 10న వామపక్షాల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలతో చలో వంశధార కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. -
10న ‘ఛలో వంశధార’ ఆందోళన
సాక్షి, అమరావతి: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిరసనగా అక్టోబర్ 10వతేదీన ‘ఛలో వంశధార’ ఆందోళన కార్యక్రమం చేపట్టాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విజ్ఞప్తి మేరకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ సహా పది వామపక్ష పార్టీలు ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం అరెస్ట్‌లకు దిగితే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం విజయవాడలో మధు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రావుల వెంకయ్య, ఇతర నాయకులు బి.వెంకటరెడ్డి, వై.కేశవరావు, కె.రామారావు, కిషోర్, డి.హరినాథ్, పి.వి.సుందరరాజు, దడాల సుబ్బారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ భూ నిర్వాసితులపై ఇంత నిర్భంధం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వాలు చట్టపరిధిలో వ్యవహరించాలని సూచించారు. ఆందోళనను వంశధార, పోలవరం ప్రాజెక్టులకే పరిమితం చేయవద్దన్నారు. రాష్ట్రంలో భూ సేకరణ చట్టప్రకారం జరగడం లేదని, వంశధార ప్రాజెక్టు సమస్య ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. విపరీతమైన జాప్యం వల్ల రూ.933 కోట్ల ప్యాకేజీ ఇప్పుడు రు.1,616 కోట్లకు చేరిందని చెప్పారు. కాంట్రాక్టర్లకు పెంచినట్లుగా నిర్వాసితులకు పరిహారం ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు. 16, 17న విజయవాడలో 30 గంటల ధర్నా 2013 భూ సేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కె.రామకృష్ణ పేర్కొన్నారు. మరో 7,200 మంది నిర్వాసితుల పునరావాసానికి స్థలాలు ఇవ్వాల్సి ఉందని వంశధార నిర్వాసితుల సంఘం ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై వచ్చే నెల 16, 17వ తేదీల్లో విజయవాడలో 30 గంటలపాటు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మధు ప్రకటించారు. నిర్వాసితులకు 36 రకాల పునరావాస సేవలు కల్పించాకే గ్రామాలను ఖాళీ చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు జగన్ పర్యటన
-
శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు జగన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం తొలిరోజున పాతపట్నం నియోజకవర్గంలోని హీర మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. శనివారం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి గ్రామం హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను జగన్ కలుసుకుని వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటారు. నేడు వైఎస్సార్సీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే వరద రామారావు ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరదరామారావు శుక్రవారం ఉదయం 11 గంటలకు రణస్థలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ పర్యటన వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ గురువారం విడుదల చేశారు. -
మేము అర్హులం కాదా!
హిరమండలం: యూత్ ప్యాకేజీకి మేము అర్హులమేనని, తక్షణమే మంజూరు చేయాలంటూ వంశధార నిర్వాసిత గ్రామం పాడలి యువకులు కోరారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్యకు గురువారం వినతిపత్రం ఇచ్చేందుకు యువకులు సమాయత్తమయ్యారు. ఆర్డీవో వీడియోకాన్ఫరెన్స్‌లో ఉన్నారని, కాసేపు ఆగాలంటూ స్థానిక రెవెన్యూ సిబ్బంది చెప్పారు. దీంతో కార్యాలయం ముందు బైఠాయించేందుకు యువకులు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కె.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో కార్యాలయానికి చేరుకొని యువకులపై హల్చల్ చేశారు. తామేమి గోలచేసేందుకు ఇక్కడకు రాలేదని తమ గోడును విన్నవించుకొనేందుకు వచ్చామని యువకులు తెలిపారు. దీంతో తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్‌తో ఎస్ఐ మాట్లాడి యువతతో స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ య్యూత్ ప్యాకేజీ వస్తుందని హామీ ఇచ్చారు. అర్హులను గుర్తించామని వారికి ప్యాకేజీ అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. -
పునరావాస జాబితాలను సిద్ధం చేయండి.
► జాయింట్ కలెక్టర్ చక్రధర్‌బాబు హిరమండలం : వంశధార రిజర్వాయర్‌కు సంబంధించి పునరావాసం కల్పించని, కల్పించిన నిర్వాసిత కుటుంబాల జాబితాలను సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం హిరమండలం సమీపంలోని బస్టాండ్ వెనుక భాగంలో గార్లపాడు, హిరమండలం నిర్వాసితుల పునరావాసం కోసం కేటాయించిన స్థలాన్ని జేసీ పరిశీలించారు. పాలకొండ ఆర్డీవో ఆర్ గున్నయ్య, తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్రావులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ స్థలం లోతట్టుగా ఉండటంతో నిర్వాసితులు ఇక్కడ పునరావాసం నిర్మించుకునేందుకు ముందుకురావడం లేదని తహసీల్దార్ జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ స్థలానికి బదులు ప్రభుత్వం కేటాయిస్తున్న రూ.5 లక్షల ప్యాకేజీ కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం జేసీ మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో ఇంకా ఎంతమంది పునరావాసం, ప్యాకేజీ కోరుతున్నారో గ్రామాల వారీగా తక్షణం జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జేసీ వెంట వంశధార ఎస్ఈ కె.అప్పలనాయుడు, డీఈ, ఆర్ఐలు గౌరీశంకర్, నీలిమ, వీఆర్వో ఆనందరావు తదితరులు ఉన్నారు. పునరావాస కాలనీ నిర్మాణాలు వేగవంతం కొత్తూరు: వంశధార ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల నిర్మాణాలు వేగవంతం చేయాలని జేసీ చక్రధర్‌బాబు ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. మండలంలోని మోట్టూరు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీలను జేసీ గురువారం పరిశీలించారు. కాలనీలో బోర్లు పాడైపోవడంతో తాగునీటికి, ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు పడుతున్నట్లు నిర్వాసితులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం జేసీ మాట్లాడుతూ అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. రోడ్లు, కాలువలు, మంచినీటి పథకాలు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు వేయాలని సూచించారు. ఆయనతో పాటు కొత్తూరు తహసీల్దార్ సావిత్రి, ఆర్ఐ భీమారావు, వీఆర్వో సంగమేశ్వరరావు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. పనులు చేపడితే సహించం సింగిడి(భామిని): వంశధార ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస చట్టం ప్రకారం పరిహారం అందించేవరకు పనులు జరగనివ్వబోమని సింగిడి దళితకాలనీ నిర్వాసితులు స్పష్టం చేశారు. గురువారం భామిని మండలం సింగిడి దళితకాలనీకి వెళ్లిన రెవెన్యూ, భూసేకరణ, వంశధార అధికారులను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సింగిడి దళిత కాలనీకి పునరావాస పరిహారం అందే అవకాశాలు లేవని ఉత్తర్వులు అందాయని, డీ–పట్టా భూముల్లో చెట్లకు పరిహరం వస్తుందని అధికారులు చెప్పగా నిర్వాసితులు అడ్డుతగిలారు. వరద కాలువకు 65 మీటర్ల దూరంలోని గృహ సముదాయాన్ని సర్వే చేసి గుర్తించి ఇప్పుడు పరిహరం రాదని చెప్పడం తగదన్నారు. న్యాయం జరిగే వరకు పనులు ముందుకు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. దీంతో తహసీల్దార్ జల్లేపల్లి గోపాలరావు, వంశధార ఈఈ విజయకుమార్, డీఈఈ నాగేశ్వరరావు, భూసేకరణ అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి సిర్ల ప్రసాద్, నిర్వాసితుల సంఘ అధ్యక్షుడు పి.గణపతి, వైఎస్సార్ సీపీ నాయకుడు మజ్జి సంజీవ్, మజ్జి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.