VB Gadgil
-
2018 కల్లా మెట్రో ప్రాజెక్ట్ పూర్తి: గాడ్గిల్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును డిసెంబర్-2018 కల్లా పూర్తి చేస్తామని ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ వీబీ గాడ్గిల్ స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ..జూన్ 2 నాటికి మెట్రో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. సివిల్ వర్స్క్లో వివాదాల వల్లే ప్రాజెక్ట్ పనులు పూర్తి అవ్వడానికి జాప్యం జరుగుతుందని చెప్పారు. -
వచ్చే ఉగాదికి మెట్రో పరుగులు
పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో పనులు: వీబీ గాడ్గిల్ ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫలక్‌నుమా మెట్రో డిపో పనులు ఉప్పల్ స్టేషన్లో రిటెయిల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించిన ‘మెట్రో’ ఎండీ సాక్షి,హైదరాబాద్: వచ్చే ఏడాది ఉగాది నాటికి(ఏప్రిల్ మాసం)లో హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభించే అవకాశాలున్నాయని ఎల్అండ్టీ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ వీబీ గాడ్గిల్ సూచనప్రాయంగా తెలిపారు. ప్రారంభించే తేదీని మాత్రం ప్రభుత్వమే ప్రకటిస్తుందన్నారు. ప్రస్తుతం మియాపూర్-ఎస్.ఆర్.నగర్ రూట్లో మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో ముందుగా నిర్ణయించిన మార్గం(ఒరిజినల్ అలైన్మెంట్) ప్రకారమే పనులు చేపడతామని.. అసెంబ్లీ ముందు నుంచి, సుల్తాన్‌బజార్ చారిత్రక మార్కెట్ మధ్య నుంచి మెట్రో పనులు జరగనున్నాయని స్పష్టం చేశారు. పాత నగరంలోనూ గతంలో నిర్ణయించినమార్గంలోనే పనులు చేపట్టే అవకాశాలున్నాయని, అయితే ఈ విషయంలో ఆస్తుల సేకరణకు బాధితులతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే పాతనగరంలో ఫలక్‌నుమా మెట్రో డిపోతోపాటు మెట్రో మార్గం పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మెట్రో అలైన్మెంట్ సహా ఇతరత్రా ప్రభుత్వంతో ఎలాంటి పేచీ లేదన్నారు. గురువారం ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన రిటెయిల్ అవుట్లెట్, వాణిజ్య ప్రకటనల బోర్డులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాగోలు-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గంలో బోయిగూడా, ఆలుగడ్డబావి, ఒలిఫెంటాబ్రిడ్జి ప్రాంతాల్లో రైలు ఓవర్‌బ్రిడ్జి(ఆర్ఓబీ)లను వచ్చే ఏడాది నవంబర్ నాటికి పూర్తిచేస్తేనే ఈ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అనుమతులు దక్కితే మియాపూర్-ఎస్.ఆర్.నగర్ రూట్లో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలుంటాయని చెప్పారు. అమీర్‌పేట్, గ్రీన్‌ల్యాండ్స్, యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ, విద్యుద్దీపాలు, మంచినీటి పైప్లైన్ల మార్పు పనులు కొలిక్కి వ స్తున్నాయన్నారు. మెట్రో స్టేషన్లలో రిటెయిల్ స్థలం, వాణిజ్య ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు, వ్యక్తులు హైటెక్‌సిటీ సైబర్‌టవర్స్‌లోని ఎల్అండ్టీ మెట్రో కార్యాలయాన్ని గాని లేదా ఎల్అండ్టీ మెట్రో వెబ్సైట్లోగాని సంప్రదించాలని తెలిపారు. -
'మెట్రో' కథనాలపై కేసీఆర్ ఆగ్రహం
-
'మెట్రో' కథనాలపై కేసీఆర్ ఆగ్రహం
మెట్రో రైల్వేపై వచ్చిన కథనాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నమని మండిపాటు సీఎంను కలిసి వివరణ ఇచ్చిన ‘మెట్రో’ ఎండీ, ఎల్అండ్టీ సంస్థ ఎండీ రెండో దశపై చర్చ కోసం ఢిల్లీకి సీఎస్, ప్రభుత్వ సలహాదారు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంపై ఎల్అండ్టీ సంస్థ చేతులెత్తేసిందంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమని.. ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే యత్నమని ఆయన మండిపడ్డారు. బుధవారం సీఎం కేసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టు పురోగతిపై ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, ‘ఎల్అండ్టీ మెట్రో రైల్’ ఎండీ వీబీ గాడ్గిల్, మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు పాపారావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ‘మెట్రో’పై పత్రికల్లో వచ్చిన కథనాలు చర్చకు రాగా... అవి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్అండ్టీ సంస్థ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం సాధారణ ప్రక్రియని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఎల్అండ్టీ రాసిన లేఖలోని కొన్ని అంశాలను మాత్రమే పేర్కొంటూ ప్రాజెక్టుపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా పలు పత్రికల్లో కథనాలు రావడంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టును కావాలనే తప్పుడు కోణంలో చూపించే యత్నం జరిగిందని అభిప్రాయపడ్డారు. మెట్రోరైలుకు సంబంధించిన సమస్యలు ఈ సమీక్షా సమావేశంలో పరిష్కారం అయ్యాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే మెట్రోరైలుకు సంబంధించి వచ్చిన కథనాలపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉదయమే సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీకి వివరణ ఇచ్చారు. సీఎం సచివాలయానికి వచ్చాక ఆయనను కూడా కలిసి విషయం వివరించారు. ఇదే సమయంలో ఎల్అండ్టీ మెట్రో ఎండీ వీబీ గాడ్గిల్ సైతం సచివాలయానికి చేరుకుని సీఎస్‌తో సమావేశమయ్యారు. అనంతరం సీఎంతో కొద్దిసేపు భేటీ అయ్యారు. రెండో దశ కోసం ఢిల్లీకి సీఎస్.. మెట్రో రైలు రెండో దశ పై ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సలహాదారు పాపారావు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతారని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే మెట్రోరైలు నిపుణుడు శ్రీధరన్ సలహాలు కూడా తీసుకుంటారని చెప్పారు. -
''అవాంతరాలున్నా మెట్రో పనులు ఆపలేదు''
-
అవాంతరాలున్నా మెట్రో పనులు ఆపలేదు: గాడ్గిల్
మెట్రోరైలు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఎల్అండ్టీ మెట్రోరైల్ సీఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. తాజాగా హైదరాబాద్ మెట్రోరైలు విషయమై చెలరేగిన వివాదం నేపథ్యంలో ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాజెక్టుకైనా అవాంతరాలు ఉంటాయని, వాటిని పరిష్కరించుకోడానికి కొన్ని వందల, వేల లేఖలు రాస్తుంటామని ఆయన అన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలని ఈనెల పదోతేదీన ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమేనని గాడ్గిల్ చెప్పారు. అయితే, దాన్ని యథాతథంగా తీసుకుని కథనాలు రాయడం వల్ల ఇబ్బంది అవుతుందన్నారు. తాము ఫిబ్రవరి నుంచే ప్రభుత్వానికి తమ సమస్యలపై లేఖలు రాస్తున్నామని గాడ్గిల్ చెప్పారు. అయితే ఇంతవరకు ఎక్కడా పనులు మాత్రం ఆపలేదన్నారు.ఇక మెట్రో మార్గంలో మార్పులపై ఇంతవరకు తమకు సమాచారం లేదని ఆయన అన్నారు. నిర్మాణ ప్రక్రియలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. సెప్టెంబర్ పదోతేదీన తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవమేనని ఆయన అన్నారు. తెలంగణ ప్రభుత్వం సహకారంతోనే ప్రాజెక్టు నడుస్తోందని, చిన్న ప్రాజెక్టుల విషయంలోనే చాలా ఉత్తరాలు రాస్తామని.. అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టులో కొన్ని వందల, వేల ఉత్తరాలు పరస్పరం రాసుకుంటామని ఆయన తెలిపారు. సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ఎలాగోలా పరిష్కరించుకుని, ముందుకు వెళ్లాలన్నదే తమ లక్ష్యమని, అయితే ఇలాంటి కథనాలు రాయడం వల్ల స్ఫూర్తి దెబ్బతింటుందని గాడ్గిల్ చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఉన్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోను చర్చించామన్నారు. -
2015 మార్చిలో పట్టాలపైకి ‘మెట్రో’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రోరైలు మొదటి దశ నాగోలు నుంచి మెట్టుగూడ వరకు(8 కిలోమీటర్ల మేరకు) 2015, మార్చిలో ఉగాది కానుకగా పట్టాలెక్కి నగరవాసులకు అందుబాటులోకి రానుందని ఎల్ అండ్ టీ, మెట్రోరైల్ ఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన హెచ్ఎంఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫైనల్ క్యాంపెయిన్ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోరైలుకోసం ప్రతిపాదన వచ్చిందని, దీనికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. రెండో దశలో మరో ఎనిమిది రూట్లను గుర్తించామని, కేంద్రం గ్రీన్సిగ్నలిచ్చి నిధులు మంజూరుచేస్తే ఆయా రూట్లలోనూ మెట్రోరైలు పరుగెడుతుందని తెలిపారు. హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశం మెట్రోరైలు పనులపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని, ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి ఎంతో అవసరమని చెప్పారు. మెట్రోరైల్ కోచ్ నమూనాను అక్టోబర్ 2న నగరవాసులకోసం ప్రదర్శించబోతున్నట్లు వెల్లడించారు. దీనిని నెక్లెస్‌రోడ్‌లో ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు. దక్షిణకొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైలు బోగీలను తయారు చేస్తోంది. ఇప్పటికే 171 బోగీలకు ఆర్డరిచ్చినట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.