నిర్లక్ష్యపు వేగానికి బ్రేకులు
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: వాహనాలను మితిమీరిన వేగంతో నడిపితే ఇకపై జేబు గుళ్లవడం ఖాయం. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపే వారి నడ్డివిరిచేందుకు రవాణశాఖ సిద్ధమవుతోంది. అతి వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ లేజర్ గన్ను అమర్చేందు కు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు స్పీడ్ లేజర్‌గన్‌కు శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన మెకానిక్ ఇంజినీర్ మరమ్మతులు చేపట్టారు. ఒకటి రెండు రోజుల్లో దీన్ని అమర్చనున్నారు. వాహన ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాల్లో దీనిని అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత వేగం కంటే అధిక వేగంతో వాహనం వెళ్తే లేజర్గన్లో ఉన్న కెమెరా సంబంధిత వాహనం నంబరను నమోదు చేస్తుంది. అనంతరం అధికారులు సంబంధిత వాహనచోదకుడికి రూ.1000 చెల్లించాల్సిందిగా నోటీసు జారీ చేస్తారు. ఒకటి రెండు రోజుల్లో ఈ పరికరాన్ని భోగాపురం లేదా
గజపతినగరం జాతీయ రహదారిపై ఏర్పాటు చేయనున్నట్లు ఇన్చార్జి ఆర్టీఓ ఐ.శివప్రసాద్‌రావు తెలిపారు.
వాహనం ప్రయాణించాల్సిన
వేగం(కిలోమీటర్లలో)
బైక్‌లు 50
ఆటోలు 30
ట్యాక్సీలు 65
లారీలు 65
బస్సులు 55
ట్రాక్టర్లు 55