Vijayawada district
-
పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’
విజయవాడ చిట్టినగర్‌కు చెందిన నొక్కొజు మల్లేశ్వరరావు కార్పెంటర్. అతనికి జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) పథకంలో ఇల్లు ఇప్పిస్తానని విజయవాడ 47వ డివిజన్ టీడీపీ నాయకుడు మాకిన విజయ్‌కుమార్ నమ్మబలికాడు. ఐదేళ్ల క్రితం మల్లేశ్వరరావు నుంచి రూ.1.60 లక్షలు వసూలు చేశాడు. ఇప్పటికీ ఇల్లు ఇప్పించలేదు. విజయ్‌కుమార్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయవాడ చిట్టినగర్‌లో బండిపై పూసలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే తమ్మన మాధవికి ఇల్లు ఇప్పిస్తానని విజయ్‌కుమార్ రూ. 3.20 లక్షలు వసూలు చేశాడు. ఇల్లు ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన బాధితురాలు మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల పేరిట జరిగిన భారీ మోసంలో చిన్న ఉదాహరణలు. ఇలా మోసపోయిన వారు నగరంలో 2 వేల మంది ఉన్నట్లు అంచానా. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ దందా బాధితుల ఫిద్యాదులతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 70 కోట్లు పేదల నుంచి వసూలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో టీడీపీ నాయకులు మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు.రోడ్లు, కాలువలు విస్తరణలో ఇళ్లు కొల్పోయిన పేదలకు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో నివాసం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించాయి. చదవండి: పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా: పేర్ని నాని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం పనులు 2014 వరకు నిర్విరామంగా కొనసాగాయి. విజయవాడ నగరంలో ఇళు కోల్పోయిన పేదల కోసం నగరంలోని జక్కంపూడి, ఆర్‌ఆర్‌పేట, సింగ్‌నగర్, కబేలా ప్రాంతాల్లో వంద ఎకరాల్లో 28,152 జీ ఫ్లస్ త్రి గృహాల నిర్మాణం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టిన టీడీపీ ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. అయితే అప్పటివరకు నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించింది. దీంతో విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఈ ఇళ్లను యధేచ్ఛగా అమ్మేశారు. ఆ నియోజకవర్గాలకు అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నాయకులు జలీల్‌ఖాన్, బొండా ఉమామహేశ్వరరావు కనుసన్నల్లోనే ఈ బాగోతం జరిగినట్లు తెలుస్తోంది. ఉచితంగా ఇవ్వాల్సిన ఈ ఇళ్లను డివిజన్లలో టీడీపీ నాయకులు ఒక్కొక్కరూ 200 గృహాలు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసి వారు రూ. కోట్లు దండుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు జక్కంపూడి, సింగ్‌నగర్, ఆర్‌ఆర్‌పేట, కబేలా ప్రాంతాల్లో జేఎన్ఎన్ఆర్యుఎం ఇళ్ల కేటాయింపు 2018లోనే పూర్తయింది. అయినా, టీడీపీ నాయకులు నకిలీ డాక్యుమెంట్లు, మునిసిపల్, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇళ్లు లేకపోయినా ఉన్నట్లు ప్రచారం చేసి పేదల నుంచి వసూళ్లు చేశారు. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లోని 41 డివిజన్లలో ఈ తరహా బాధితులు 2 వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరి నుంచి రూ. 60 నుంచి రూ.70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. చాలా మంది బాధితులు ముందుగా కొత్తపేట (టుటౌన్) పోలీసులను ఆశ్రయిస్తున్నాయి. అక్కడా విజయ్‌కుమార్ మాటే చెల్లుబాటు కావడంతో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు మాకిన విజయ్‌కుమార్ బాధితులు 35 మంది ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించారు. ఇతనితోపాటు 41వ డివిజన్లోని నాగోతు రామారావు, 57వ డివిజన్లోని ఎడిబోతు రమణ, 58వ డివిజన్లోని సోమేశ్వరరావు, రామారావు, 60వ డివిజన్లోని భువట ఉమా, శ్రీరాములు, 63వ డివిజన్లోని పైడి శ్రీను పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. -
విజయవాడ గుణదలలో రోడ్డు ప్రమాదం
-
దుర్గమ్మ చీరలపై కమిటీ వేసిన ఈఓ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శనివారం చీరలపై రేట్ల పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఈఓ సురేష్ బాబు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు అమ్మవారి చీర అసలు ధర అంచనా వేసి.. రేటు మార్చి మళ్లీ అమ్మకానికి పెట్టనున్నారు. దీంతో భక్తులు సమర్పించేటప్పుడు చీర ధర ఎంత చెబితే అంత రేటుకే అమ్మకానికి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది నుంచి సుమారు 2 వేలకు పైగా చీరలు మూలనపడి ఉన్నాయి. రూ.1000 చీరను రూ.5000కు ధర నిర్ణయించడంతో కొనుగోలు చేయడానికి భక్తులు వెనుకాడుతున్నారు. దుర్గమ్మ చీరల కొనుగోలుకు భక్తులు ఆసక్తి చూపకపోవడంతో.. గుట్టలుగా పేరుకుపోయాయి. చీరల కౌంటర్లని, భద్రపరిచిన స్టోర్ రూమ్‌ను పరిశీలించిన దేవాదాయశాఖ కమిషనర్ పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దసరా సమయంలో కూడా చీరలు అమ్ముడుపోలేదు. భక్తులు సమర్పించే చీరలను.. అమ్మవారి ప్రసాదంగా తిరిగి భక్తులకే దుర్గగుడి అధికారులు అమ్ముతున్నారు. -
ఆగండి.. క్షణం ఆలోచించండి..!
ఒక్క క్షణం ఆలోచించగలిగితే ఆత్మహత్య ఆలోచనలను దూరం చేయవచ్చు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కార మార్గం చూపదు. పైగా తమవారిని, తమను నమ్ముకున్న వారిని మరింత కష్టాల్లోకి నెడుతుంది. నేషనల్ క్రైం బ్యూరో సైతం నగర కమిషనరేట్ పరిధిలో ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు పేర్కొనడం గమనార్హం. సెప్టెంబరు 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రేమ విఫలం కావడం, కుటుంబ కలహాలు, విద్యలో రాణించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం తదితర కారణాలతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం చూపక పోగా.. వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతి ఏటా 3 వేల మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడుతుండగా మరో 8 వేల మందికిపైగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. పెరిగిన యువత ఆత్మహత్యలు ఆధునిక జీవన విధానంలో పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కొరవడటం, వారి కోసం సరైన సమయాన్ని వెచ్చించలేకపోవడం, పిల్లలు ఏమి చేస్తున్నారో పట్టించుకునే సమయం లేకపోవడం వలన పిల్లలు మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో టీనేజ్, 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాల తర్వాత రెండవ స్థానంలో ఆత్మహత్యలు ఉంటున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌కు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు విజయవాడ, గుంటూరు నగరాల్లో నమోదవుతున్నాయి. సంకేతాలు తెలుసుకోవచ్చు ఆత్మహత్యకు పాల్పడాలనుకునే వారిని ముందుగా గుర్తించవచ్చంటున్నారు మానసిన నిపుణులు. డల్‌గా ఉండటం, ఇతరులతో కలవకపోవడం, ఏకాంతంగా ఉండటం, ఆకలి, నిద్ర లేకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం, హాస్టల్లో ఉండేవారు రూంలో ఒంటరిగా గడపడం, విషాదభరితమైన సీరియల్స్ చూడటం, జోక్స్ వచ్చినా స్పందించకపోవడం వంటి లక్షణాలు వుంటాయని చెపుతున్నారు. అలాంటి వారు తమ మనస్సులోని బాధను ఎదుటి వారితో చెప్పుకోవడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెపుతున్నారు. నాకు చనిపోవాలని ఉంది.. ఈ జీవితం ఎందుకు.. ఏమీ సాధించలేక పోతున్నానని సన్నిహితుల వద్ద పదేపదే అనడం. ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చెట్టుకు ఢీకొట్టడం వంటివి చేస్తుంటారని చెపుతున్నారు. యువతలో పెరుగుతున్న సమస్యలు గతంలో 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడే వారు. కానీ నేడు ప్రేమ విఫలమవడం, చదువులో రాణించలేక పోవడం, ఒత్తిడి, నవ దంపతుల్లో సర్ధుబాటు సమస్యలు వంటి కారణాలతో యువత ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో ప్రతి ఆరు గంటలకు ఒక టీనేజ్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో స్త్రీల కంటే పురుషులు రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నారు. – డాక్టర్ టీఎస్ రావు, అధ్యక్షుడు, ఏపీ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆత్మహత్య ఆలోచన మానసిక సమస్యే ఆత్మహత్య ఆలోచన కూడా మానసిక సమస్యే. అలాంటి వారికి జీవితం విలువను తెలియచేయాలి. చనిపోయేందుకు దారికాదు.. బతికేందుకు మార్గాలు చూపించగలగాలి. ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవలకు కౌన్సెలింగ్‌తో చక్కటి పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురవకుండా పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆత్మహత్య ఆలోచన చేసే వారిని స్నేహితులు, కుటుంబ సభ్యులు ముందుగా లక్షణాలను గుర్తించి వారికి తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలి. – డాక్టర్ గర్రే శంకర్రావు, మానసిక విశ్లేషకుడు -
పుష్కరస్నానాలకు ఇబ్బంది ఉండదు: మంత్రి ఉమ
పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు నీటి ఇబ్బంది లేకుండా చూస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. సోమవారం మీడియా పాయింట్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీశైలంలో 860 అడుగులు ఉందని, నాగార్జునసాగర్ నుంచి 5,046 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారని తెలిపారు. పవర్ హౌస్ నుంచి కిందికి 3,884 క్యూసెక్కులు వదులుతుండగా పులిచింతల నుంచి 10,900 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారన్నారు. పులిచింతల వద్ద 7,800, కీసర వద్ద 1500 మొత్తం కలిపి 9,300 ఇన్‌ఫ్లో ఉందని చెప్పారు. సాగర్‌లో 5 టీఎంసీలు, పులిచింతలలో 2.7 టీఎంసీల కృష్ణాజలాలు ఉన్నాయని, వీటిని ప్రకాశం బ్యారేజ్ ద్వారా కాల్వలకు వదులుతామని చెప్పారు. ఇది కాకుండా పట్టిసీమ వద్ద గండి పూడ్చే పనులు జరుగుతున్నాయని, 11వ తేదీ నాటికి గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణనదిలో ఫెర్రిలోని పవిత్ర సంగమం వద్ద కలుస్తాయని చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం విషయంలోనూ కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఉమా ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే జాతిపితకు అవమానం జరగడాన్ని జీర్ణించుకోలేని దేవినేని ఉమా దీనిపై ఎదురుదాడికి దిగారు. విగ్రహం కాల్వలో పడవేయడం, దీనిపై కేవలం ఒక చానల్, ఒక పత్రికకే సమాచారం అందడంపై అనుమానం ఉందన్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారన్నారు. బొత్స సత్యనారాయణ జాతిపిత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండగా ప్రజాసమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం కేసులు పెట్టిందని, ఇప్పుడు వాటిని చూపించి చంద్రబాబు కేబినేట్లో క్రిమినల్స్ దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు ఉన్నారని ఆరోపించడం తగదని హితవు చెప్పారు.