Vishaka Sri Sarada Peetham
-
విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11గంటల 05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి 11గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. చదవండి: (శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం) -
శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం
సాక్షి, విశాఖపట్నం(పెందుర్తి): విశాఖ శ్రీశారదా పీఠాన్ని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం సందర్శించి రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. స్వామీజీ చేతుల మీదుగా శంకరాచార్య విగ్రహాన్ని అందుకున్నారు. ధర్మ పరిరక్షణ కోసం పీఠం చేస్తోన్న కృషిని సీఎంకు స్వరూపానందేంద్ర వివరించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే హరియాణాలో కూడా శ్రీశారదాపీఠం ఆశ్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖట్టర్ మాట్లాడుతూ..రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం హరియాణా ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. అంతకుముందు సీఎంకు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాగతం పలికారు. కాగా, ఆదివారం సాయంత్రం సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ఖట్టర్ సందర్శించారు. చదవండి: (AP: వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ల వేతనాలు పెంపు) -
ఢిల్లీలోనూ విశాఖ శారదా పీఠం సేవలు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ శారదా పీఠం కార్యక్రమాలను దేశ రాజధాని ఢిల్లీకి సైతం విస్తరించాలని పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంకల్పం అని, ఆ క్రమంలో అక్కడ ఆశ్రమం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వెల్లడించారు. ఇందుకోసం స్థలం కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. తెలుగు వారందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో ఆలయాన్ని, ఆశ్రమాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణలో శారదా పీఠం విశిష్ట సేవలందిస్తోందని, తాజాగా విశాఖ ఏజెన్సీ నుంచి గిరిజనులను తీర్థయాత్రలకు తీసుకెళ్లామని తెలిపారు. దళిత, గిరిజనుల కోసం ఎన్నో ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తరాదిన ఇప్పటికే తమకు కాశీ మహాక్షేత్రంతో పాటు రిషికేశ్ గంగానది తీరాన ఆశ్రమం ఉందని, హైదరాబాద్‌లోనూ నిర్మాణం పూర్తికాబోతుందని వెల్లడించారు. -
హిందూ ధర్మం.. విశ్వవ్యాప్తమే లక్ష్యం
పెందుర్తి/దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘ధర్మపోరాటాలకు శారదా పీఠం పుట్టిల్లు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మపోరాటాల ద్వారా పీఠం ఎన్నో విజయాలు సాధించింది’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ధర్మ జాగృతి కోసం దళితులు, గిరిజనులకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో తిరుమల యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి సోమవారం విశాఖ జిల్లా చినముíÙడివాడలోని శారదా పీఠం నుంచి 25 బస్సుల్లో 1,500 మంది దళితులు, గిరిజనులు తిరుమలకు బయల్దేరగా.. స్వరూపానందేంద్ర స్వామి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. రెండేళ్ల కిందట శ్రీకారం.. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి రెండేళ్ల కిందట హిందూ ధర్మ ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. 33 వేల కిలోమీటర్ల మేర ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యాత్ర సాగింది. స్వాత్మానందేంద్ర స్వామి మైదాన, అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మారుమూల గిరిజన తండాలను సందర్శించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సైతం తిరిగారు. అక్కడి గిరిజనులను హిందూ ధర్మం గురించి చైతన్య పరిచారు. దేవాలయ వ్యవస్థలోని లోటుపాట్లను గుర్తించి ఓ నివేదిక కూడా తయారుచేశారు. ప్రభుత్వానికి త్వరలో నివేదిక.. స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఇటీవల కొందరు పీఠంపై దు్రష్పచారం చేస్తున్నారని, అలాంటి వారికి ధర్మ ప్రచారంతోనే సమాధానం చెబుతున్నామన్నారు. ఉత్తరాధికారి తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ద్వారా దేవాలయ వ్యవస్థలోని లోపాలను గుర్తించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న తొలి పావంచా వద్ద స్వాత్మానందేంద్ర సరస్వతి నారికేళాలు సమర్పించారు. బుధవారం ఉదయం దళితులు, గిరిజనులు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. వెంకన్న దర్శనానికి తొలిసారి వెళ్తున్నా.. తిరుమల వెంకన్న దర్శనానికి తొలిసారి వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన శారదా పీఠానికి ధన్యవాదాలు. ఆ స్వామిని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోరిక ఇలా తీరింది. –సీలదేరి అప్పలమ్మ, లబరి గొంది శ్రీవారిని చూసే భాగ్యం కలిగింది.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. శారదా పీఠం వాళ్లు ఉచితంగా తీసుకెళ్లడం బాగుంది. ఆ స్వామిని చూసే భాగ్యం ఇన్నాళ్లకు కలుగుతోంది. –మజ్జి భీష్మ, అరకు -
ఆలయ మర్యాదలు, వివాదాలు వద్దు
సాక్షి, అమరావతి/పెందుర్తి: విశాఖలోని శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా పలు ఆలయాలు ఆలయ మర్యాదలు పాటించాలంటూ ఈ నెల 9న దేవదాయ కమిషనర్‌కు తాము రాసిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పీఠం మేనేజర్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. శారదాపీఠాన్ని, స్వామీజీని వివాదాల్లోకి లాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శారదాపీఠం తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. దీన్ని రికార్డ్ చేసిన హైకోర్టు.. శారదాపీఠం రాసిన లేఖను పలు ఆలయాలకు పంపుతూ దేవదాయ కమిషనర్ జారీచేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 18న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా ఆలయ మర్యాదలు పాటించే విషయంలో దేవదాయశాఖ అదనపు కమిషనర్ ఈనెల 12న జారీచేసిన మెమోను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కాకుమాను లలితకుమార్ మరో ఇద్దరు సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. మంగళవారం విచారించాల్సిన కేసుల జాబితా దీపావళి ముందే సిద్ధమైనప్పటికీ, ఈ వ్యాజ్యాన్ని మంగళవారం విచారించేందుకు హైకోర్టు ప్రత్యేకంగా ఓ అనుబంధ జాబితా తయారుచేసింది. దాన్లో ఈ వ్యాజ్యాన్ని మొదటì æకేసుగా చేర్చింది. ఇప్పటికే సిద్ధమైన జాబితాను పక్కనపెట్టి, ఈ అనుబంధ జాబితాలోని కేసులకు హైకోర్టు ప్రాధాన్యతను ఇవ్వడం విశేషం. 2019 మే నుంచి చిన్న విషయాలను పెద్దవిగా చూపుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడం, వాటిని న్యాయస్థానాలు విచారిస్తుండడం మొదలైందని ఏజీ శ్రీరాం చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. సన్యాసి అయిన స్వామీజీ జన్మదినం జరుపుకోవడం ఏమిటన్నారు.. సంప్రదాయం మేరకే పీఠం కోరిక శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగాఆలయాల నుంచి స్వామీజీకి తీర్థప్రసాదాలతో పాటు శేషవస్త్రాలు అందజేయడం 2004 నుంచి ఆనవాయితీగా వస్తోందని విశాఖ శారదాïపీఠం ప్రతినిధులు తెలిపారు. ఆ సంప్రదాయం మేరకే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని పీఠం కోరిందని పేర్కొన్నారు. నేడు స్వామీజీ జన్మదినోత్సవం విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదిన మహోత్సవం బుధవారం జరగనుంది. పండగ వాతావరణంలో వేడుకలు జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. -
ఆగష్టు 5, భారతీయ చరిత్రలో సుదినం: స్వామి స్వరూపానందేంద్ర
-
శారదా పీఠం చొరవతో వారణాసి నుంచి 44 మంది..
సాక్షి, విశాఖ : వారణాసిలో చిక్కుకుపోయిన 44 మంది తెలుగు రాష్ట్రాల యాత్రీకులు విశాఖ శారదా పీఠం చొరవతో సొంత ప్రాంతానికి చేరుకున్నారు. గత నెలలో వారణాసి విహార యాత్రకు వెళ్లిన 44 మంది తెలుగు రాష్ట్రాల యాత్రీకులు కరోనా ఆంక్షల కారణంగా కాశీలోనే చిక్కుపోయారు. లాక్ డౌన్ విధించిన దగ్గర నుంచి గత మూడు వారాలుగా వారణాసిలోని శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమంలో వారు తలదాచుకున్నారు .ఈ నేపధ్యంలో లాక్ డౌన్ మే మూడవ తేదీ వరకు పొడిగించడంతో యాత్రీకులను సొంత ఉర్లకు చేర్చేలా చొరవ చూపాలని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీలను ఆంధ్ర ఆశ్రమ నిర్వాహకులు సుందరశాస్త్రి సంప్రదించారు. ఈ విషయాన్ని విశాఖ శారదా పీఠాధిపతులు అధికారుల దృష్డికి తీసుకెళ్లగా.. శారదా పీఠాధిపతులు, ఏపీ అధికారుల చొరవతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం స్పందించి యాత్రీకులకు ప్రత్యేక అనుమతి మంజూరు చేసి పాస్‌లు ఇచ్చారు. దీంతో వీరంతా ప్రత్యేక బస్సులో వారణాసి నుంచి బయలుదేరారు. యాత్రీకులకి మార్గమధ్యంలో ఆహార కొరత లేకుండా భోజన ప్యాకెట్లను విశాఖ శారదాపీఠం వారణాసి శాఖ ఆంధ్ర ఆశ్రమం అందజేసింది. ఇందులో విశాఖ జిల్లాకే చెందిన 33 మంది యాత్రీకులు అర్ధరాత్రి విశాఖ చేరుకోవడంతో వారందరినీ వైద్య పరీక్షలకి ఆసుపత్రికి తరలించారు. -
శారదాపీఠాన్ని సందర్శించిన లక్ష్మీ పార్వతి
-
రిషికేశ్ చేరుకున్న వైఎస్ జగన్
-
రిషికేశ్ చేరుకున్న వైఎస్ జగన్
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడనుంచి ఆయన రిషికేశ్కు చేరుకున్నారు. రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను వైఎస్ జగన్ తీసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రత్యేక హోదా కాంక్షిస్తూ.. స్వరూపానందేంద్ర స్వామి రిషికేశ్ లోని చాతుర్మాసదీక్ష సందర్భంగా నిర్వహించిన హోమంలో ఆయన పాల్గొన్నారు. ఆషాఢ పౌర్ణమి రోజున చాతుర్మాస దీక్షా మహోత్సవాన్ని ప్రారంభించారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వామీ స్వరూపా నందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రిషికేశ్ లో నిర్వహిస్తున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) వైఎస్ జగన్ తోపాటు ఎంపీలు అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సీనియర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. హోమానికి ముందు వైఎస్ జగన్.. గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు. నదీమతల్లికి హారతి ఇచ్చారు. వస్రాలు సమర్పించారు. పూజలు నిర్వహించారు. పవిత్ర స్నానం ఆచరించాక.. చాతుర్మాస దీక్ష హోమం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో దాదాపు మూడు గంటలపాటు ఈ పవిత్ర కార్యక్రమంలో వైఎస్ జగన్ పాలుపంచుకున్నారు.