viswanatha reddy
-
సీమ నేలను కథగా చూపినవాడు
కేతు విశ్వనాథ రెడ్డికి 80 ఏళ్లు. తెలుగు కథా సాహిత్యంలో భీష్మ పితామహుడి వంటి ఆయనకు ఇప్పుడు సాహిత్య జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం విశేషం కాదు. కాని ఆయనను సత్కరించుకోకుండా ఎవరిని సత్కరించుకోగలం? తెలుగు కథను, రాయలసీమ కథను సగర్వంగా, సమున్నతంగా గౌరవించుకోవాలని అనుకున్న ప్రతిసారీ ఆ పూలహారం వెళ్లి పడేది కేతు విశ్వనాథరెడ్డి మెడలోనే. సీమ కథకు చేవ ఆయనది. చేర్పు ఆయనది. నేల మీద గట్టిగా నిలబడి చెప్పిన సాహిత్యమంతా నిలిచింది. కేతు విశ్వనాథరెడ్డి తన చూపును నేలన గుచ్చి కథలు రాశారు. నేల మీద తిరుగాడే మట్టి పాదాలు, రైతు పాదాలు, స్త్రీల పాదాలు, తెలియకనే బానిసలుగా బతుకుతున్నవారి పాదాలు... ఇవి ఆయన కథా వస్తువులు. రాయలసీమ కథలో మధురాంతకం రాజారాం గారిది ఒక కథాధోరణి అయితే కేతు విశ్వనాథ రెడ్డిది మరో కథాధోరణి. మధురాంతకం రాజారాం పాఠకుణ్ణి ఒప్పించడం కూడా అవసరమే అనుకుంటారు. కేతు విశ్వనాథ రెడ్డి ‘నేను జీవితాన్ని చూపుతాను... చూడగలిగిన వారంతా చూడండి’ అని ములాజా లేని ధోరణి పాటించారు. కఠిన సత్యాలను, నిష్టూర సత్యాలను సీమ ప్రజల తరఫున పాఠకుల ముందు పెట్టారు. రైతుకు, నేలకు ముడి తెగితే ఆ రైతు ఎలా గాలికి కొట్టుకుపోయి పతనమవుతాడో కేతు తన ‘నమ్ముకున్న నేల’ కథలో చూపుతారు. ఆ కథ రాసే సమయానికీ ఇప్పటికీ పరిస్థితి మారి ఉండొచ్చు. కాని ఆ సమయంలో ఆ కథ మొత్తం రాయలసీమ నేల పెట్టిన వెర్రికేక. కరువు నేలలో మనిషిలో జడలు విప్పే స్వార్థం పశుస్థాయి కన్నా ఘోరమైనది అని ‘గడ్డి’ కథలో ఆయన చూపుతారు. ప్రజలకు అందాల్సిన ఫలాలు ప్రజల వరకూ చేరడం లో, ఆఖరుకు గడ్డి పంపకంలో కూడా భాగాలుంటాయని కేతు చెప్తే పాఠకునికి కడుపు తరుక్కుపోతుంది. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలపై కేతు నిశితమైన వ్యాఖ్యానం వంటి కథలు రాశారు. ‘కూలిన బురుజు’ అందువల్లే గొప్ప కథగా నిలిచిపోయింది. ఆ కథలో ఒక డాక్టరు చేత ‘జబ్బు ఉంది అని కనిపెట్టడం గొప్ప కాదు. ఆ జబ్బుకు మందు కనిపెట్టడం గొప్ప’ అనిపిస్తారు. ఆ కథలో చాలా రోజుల తర్వాత తన ఊరికి వచ్చిన డాక్టరు పాత్ర ఊరిని చూసి దిగ్భ్రమ చెందుతుంది. ఊళ్లో ఎక్కడ చూడు కొట్లాటలూ కార్పణ్యాలే. తలాన్ని మార్చి చూస్తే సమస్య సరిగ్గా అర్థమవుతుంది. ఊరిలో ఉన్న వాళ్లకు తాము అలా ఎందుకున్నామో తెలియదు. ఊరు వదిలి వెళ్లిన డాక్టరుకు అర్థమవుతుంది. మగవాళ్ల పంతాలలో నలిగిపోయే స్త్రీలను ఈ కథలో కేతు గొప్పగా చూపుతారు. కేతు విశ్వనాథరెడ్డి రాయలసీమలోని ఆత్మీయ జీవనాన్ని మతాల మధ్య ఉండే సహనపూర్వకమైన జీవనాన్ని కథల్లో చూపారు. ‘పీర్లసావిడి’, ‘అమ్మవారి నవ్వు’ ఆ విషయాన్ని నిరూపిస్తాయి. ఆయన స్త్రీవాద దష్టితో రాసిన కథలూ విలువైనవి. స్త్రీలు చదువులో, ఉపాధిలో వివక్ష అవసరంలేని, లైంగిక వేధింపులకు తావు లేని జీవనం పొందాలని బలంగా కోరుకున్నారు. ‘రెక్కలు’ కథ అందుకు ఉదాహరణ. ‘సతి’, ‘ఇచ్ఛాగ్ని’... ఆ వరుసలో ఎన్నో. రాయలసీమ వాసికి వాన ఎంత ముఖ్యమో వాన కోసం ఎన్ని అగచాట్లు పడతాడో ‘వాన కురిస్తే’ కథలో దుఃఖం కలిగేలా చెబుతాడాయన. కేతు విశ్వనాథ రెడ్డి కేవలం కథకుడు కావడం వల్ల మాత్రమే తన సాహితీ జీవనాన్ని సాఫల్యం చేసుకోలేదు. అరసంలో పని చేశారు. కొ.కు. సంపుటాలకు సంపాదకత్వం వహించారు. వత్తి రీత్యా అధ్యాపకుడైనందున కథకునిగా కూడా శిష్యులను ప్రశిష్యులను తయారు చేశారు. కేతు ప్రోత్సాహంతో కథా సాహిత్యంలో కషి చేసిన, చేస్తున్న మేలిమి కథకులు ఇవాళ ఉన్నారు. హైదరాబాద్‌లో సుదీర్ఘకాలం నివసించి, తన నేల– కడపలో విశ్రాంత జీవనం గడుపుతున్న కేతు విశ్వనాథ రెడ్డి కథాలోకానికి ఒక పెద్ద దిక్కు. నేడు ఆయనకు జరుగుతున్న సత్కారం తెలుగు కథకు జరుగుతున్న సత్కారం. ఆ సభకు ఆయన కథలూ బారులు తీరుతాయేమో. పాఠకులమైన మనం ఆ సమూహంలో మెడ నిక్కించకుండా ఎలా ఉండగలం? కేతుగారికి హదయపూర్వక శుభాకాంక్షలు. డాక్టర్ తుమ్మల రామకృష్ణ వ్యాసకర్త, వైస్ చాన్సలర్, కుప్పం యూనివర్సిటీ (కేతు విశ్వనాథరెడ్డికి నేడు అనంతపురంలో ‘విమల సాహిత్య జీవిత పురస్కారం’ బహూకరిస్తున్న సందర్భంగా...) -
27న హాజీపూర్ కేసు తీర్పు
నల్లగొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్యకేసుకు సంబంధించి శుక్రవారం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును జడ్జి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో న్యాయమూర్తి విశ్వనాథరెడ్డి ముందు ప్రాసిక్యూషన్ తరఫున పీపీ కె.చంద్రశేఖర్ వాదించగా, నిందితుడి తరఫున న్యాయవాది ఠాగూర్ వాదనలు వినిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ వద్ద ముగ్గురు బాలికలపై అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసి బావిలో పాతిపెట్టిన ఘటనలో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దానిపై నల్లగొండలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ సాగింది. సాక్ష్యాలన్నింటినీ న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి చదివి వినిపించి అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అనంతరం కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది చంద్రశేఖర్ వాదిస్తూ, ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసింది శ్రీనివాస్‌రెడ్డే అని, అందుకు మెడికల్ రిపోర్టులు, సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండడం సరైంది కాదని, ఉరి శిక్ష విధించాలని అన్నారు. నిందితుడి తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లీగల్ ఎయిడ్ సంస్థ నియమించిన న్యాయవాది ఠాగూర్ శుక్రవారం తన వాదన వినిపించారు. హత్యలకు శ్రీనివాస్‌రెడ్డికి సంబం«ధం లేదని, సాక్ష్యాలు సక్ర మంగా లేవన్నారు. ఈనెల 8న కూడా ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 27వ తేదీకి వాయిదా వేశారు. -
చీకట్లో తోడేలు
చీకట్లో కుక్క గతికిన చప్పుడు వినిపించింది. కుక్కేనా?కంగారుపడి కళ్లు తెరిచాడు. నల్లటి నలుపు. కారు చీకటి. గదిలో ఏమీ కనిపించడం లేదు. తల దగ్గర పెట్టుకుని ఉన్న టార్చ్‌లైట్‌ను టప్‌మంటూ వెలిగించాడు. ఒక మనిషి నిలబడి ఉన్నాడు– ఆ అమ్మాయి కాళ్ల దగ్గర. ఆ అమ్మాయి విసుక్కుంటూ అటు తిరిగి పడుకోబోతూ అంది– ‘ఏం సార్. నిద్ర పట్టట్లేదా. నన్నుగానీ మీ పెళ్లాం అనుకుంటున్నారా ఏంది?’ లైట్ ఫోకస్ ఆ మనిషి వైపు తిరిగింది. ‘అదీ... దారి ఎటో కనిపించలేదు. నిద్ర పట్టక సిగరెట్ తాగుదామనుకుని లేస్తే ఈ అమ్మాయి కాలు తగిలింది’ నసిగాడు. ఆ అమ్మాయి ఈవైపు పడుకుని ఉంది. తలుపు ఆ వైపు ఉంది. తలుపు వైపు వెళితే అమ్మాయికి కాలెందుకు తగులుతుంది? టార్చ్ వేసి దారి చూపించాడు. అతడు పిల్లిలా బయటకు వెళ్లి అయిదు నిమిషాల సేపు తాత్సారం చేసి తిరిగి వచ్చి గుట్టుగా బెంచీ మీద సర్దుకున్నాడు. పాతకాలపునాటి గవర్నమెంట్ స్కూల్ గది అది. తెల్లవారితే పోలింగ్. ఆ డ్యూటీ మీద సాయంత్రం వచ్చి ఊరివాళ్లు ఇచ్చిన భోజనం చేసి నిద్రపోయారు. పోలింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు, హోంగార్డ్‌గా వచ్చిన ఆ అమ్మాయి. జిల్లా హెడ్‌క్వార్టర్స్ నుంచి అందరూ లారీలో బయలుదేరినప్పటి నుంచి గమనిస్తున్నాడు. పోలింగ్ ఆఫీసరు ఆ అమ్మాయితో చనువుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. గొప్పలు చెబుతున్నాడు.గొప్పతనం తనకే ఉన్నట్టుగా దర్పాలు పోతున్నాడు. అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్‌కి ఆ అమ్మాయిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తోంది. తనకు అంత వయసు కూతురు ఉంది. తన కూతురు చదువుకుంటోంది. ఈ అమ్మాయి హోమ్‌గార్డ్‌గా పని చేస్తోంది. తన కూతురు ఈ సమయంలో ఇంట్లో సురక్షితంగా నిద్రపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఈ పాతకాలం నాటి స్కూల్లో కాళ్ల దగ్గర కుక్కలాగా ఒక మగాడు తారాట్లాడుతుండగా.... చీకటి అలాగే ఉంది. మళ్లీ నిద్ర పట్టేసింది. బోరింగ్ శబ్దం వినవస్తుంటే మెలకువ వచ్చింది. కళ్లు తెరిచి చూశాడు. చీకటిగానే ఉంది. టార్చి వేసి టైమ్ చూసుకున్నాడు. ఐదుంపావు. గదిలో ఎవరూ లేరు. ఆ అమ్మాయి గొంతు వినిపించింది– ‘పీవో సారూ... ఇటువైపు రావద్దు. స్నానం చేస్తున్నా. కాసేపు ఆగి రండి. ఇటువైపు రావద్దన్నానా’ లేచి కూర్చున్నాడు. పీవో బూడిదరంగు నీడలాగా గదిలోకి వచ్చాడు. ‘అదీ కడుపులో బాగలేకపోతే లేచానండీ’ నసిగాడు. తెల్లవారిపోయింది. పోలింగ్ మొదలైపోయింది. పీవో ధుమధుమలాడుతూ డ్యూటీ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఓపిగ్గా డోర్ దగ్గర నిలబడి వచ్చే జనాన్ని అదుపుచేస్తూ లోపలికి పంపుతూ ఉంది. నవ్వు ముఖం. లొంగని నవ్వు ముఖం. ఆ నవ్వు చూస్తుంటే పీవోకి ధుమధుమ పెరిగిపోతోంది. డ్యూటీ ముగించుకుని ఆ రాత్రి తిరుగుప్రయాణంలో లారీ ఎక్కారు. పీవో, ఏపీవో, ఆ హోమ్‌గార్డు అమ్మాయి. ఉన్నట్టుండి పీవో వాగాడు– ‘పోలీసులు రేపులు చేశారని వార్తలు వస్తుంటాయి. ఏం... వాళ్లకు ఆడపోలీసులు సరిపోకనా? ఆడపోలీసులు ఉంటారుగా వాళ్లకు’ కచ్చ తీరింది. ఆ అమ్మాయి చురుగ్గా చూసింది. ‘ఏం నోరు సార్ మీది. ఈ మాట అన్న నోటితో మీరు అన్నం ఎలా తింటారు?’ అంది. డిస్ట్రిక్ హెడ్‌క్వార్టర్స్ వచ్చాక పీవో మాటవరుసకు వెళ్లొస్తానని కూడా అనకుండా వెళ్లిపోయాడు. ఏపీవో దగ్గరకు ఆ అమ్మాయి వచ్చింది సెలవు తీసుకోవడానికి. ‘ఎలా చేస్తున్నావమ్మా ఈ ఉద్యోగం’ ‘తప్పదు సార్. బతకాలంటే చేయకతప్పదు కదా.’ ‘మరి ఈ ఇబ్బందులు’ ‘ఇబ్బందులకు బయపడతామా సార్. ఎక్కడకు వెళ్లినా ఇలాంటి కుక్కలు ఉండనే ఉంటాయి’ మళ్లీ అంది– ‘ఆడదంటే నడుమూ వీపూ కండ అని మగాళ్లు అనుకునే వాతావరణం ఉన్నంతకాలం ఇది తప్పదు సార్’ ఆ మాట అంటున్నప్పుడు ఆ అమ్మాయి గొంతులో జీర కదలాడింది. ఏపీవో గుండెలో కూతురుని తలుచుకుని చిన్న భయం తారాట్లాడింది. తన కూతురు సురక్షితంగా తన రెక్కల కింద పెరుగుతోంది అనుకుంటున్నాడు గానీ ఆ రెక్కల బలమెంత... బయట గాలివాన ఎంత? పెద్ద ప్రశ్న. కథ ముగిసింది. కేతు విశ్వనాథ రెడ్డి రాసిన ‘రెక్కలు’ కథ ఇది. లోకం ఇలాగే ఉంటుందా... లోకం ఇలా ఇంకా ఎంతకాలం ఉంటుంది. సంఘంలో ఎందరో మగవాళ్లు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఉద్యోగులు, నాయకులు, సంస్థాధిపతులు, లెక్చరర్లు, టీచర్లు.... పగటి వేళ వాళ్లు మనుషులు కావచ్చు. చీకటి పడితే తోడేళ్లు కావచ్చు. స్త్రీల మాంసం కోసం కాచుకుని ఉండే ఇలాంటి తోడేళ్లను లొంగని ఆత్మబలం అనే చెప్పుతో కొట్టాలి. అలా కొట్టమని చెప్పే పైలం చెప్పే కథ, ఈ కథ– రెక్కలు. - కేతు విశ్వనాథరెడ్డి -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
బత్తలపల్లి: అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం వేల్పుమడుగు గ్రామానికి చెందిన గంగిరెడ్డిగారి విశ్వనాథరెడ్డి (35) అనే రైతు అప్పుల బాధతో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి, కామాక్షి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అమర్నాథ్రెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద కుమారుడు విశ్వనాథరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. వీరికి 11 ఎకరాల పొలముంది. వరుస పంట నష్టాలను ఎదుర్కొన్నారు. వర్షం లేక ఈసారి పంట సాగు చేయలేదు. ఆదినారాయణరెడ్డి, కామాక్షి పేరుపై బత్తలపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ధర్మవరం కెనరా బ్యాంకులో రూ.2.55 లక్షలు పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ రూ.20 వేలు మాత్రమే అయ్యింది. అలాగే పంటల సాగు, ఇతరత్రా అవసరాల కోసం ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ.6 లక్షల వరకు అప్పులు చేశారు. వీటిని తీర్చే మార్గం కన్పించకపోవడంతో విశ్వనాథరెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఓ పని నిమిత్తం అనంతపురం వెళుతున్నట్లు ఇంట్లో చెప్పాడు. అక్కడికెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తూ వేల్పుమడుగు బస్‌స్టాప్ వద్ద మోనోక్రోటోఫాస్ తాగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతనికి భార్య జాన్సీలక్ష్మీ, మూడేళ్ల కుమారుడు ఉన్నారు.