Water-tree scheme
-
నీరు–చెట్టు పథకంతో టీడీపీ అవినీతి!
సాక్షి, శ్రీకాకుళం : నీరు ఉంటేనే చెట్టు.. చెట్టు ఎదిగితేనే నీరు. ఈ రెండు ఉంటేనే జీవరాశుల మనుగడ. వీటికున్న ప్రాధాన్యత ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ గత ప్రభుత్వంలో నీరు లేదూ... చెట్టూ లేదూ.. కానీ నీరు–చెట్టు పథకం పేరుతో అవినీతి మాత్రం వటవృక్షంలా వేళ్లూనుకొనిపోయింది. పర్యావరణానికి దోహదపడాల్సిన వందల కోట్ల నిధులను టీడీపీ ప్రజాప్రతినిధులు అమాంతంగా మింగేశారు. నీటిని ఎంత చిలికినా వెన్న రాదన్నది ఎంత నిశ్చిత సత్యమో... చంద్రబాబు ప్రభుత్వంలో పథకం ఏదైనా నీతికి నీళ్లు వదిలి, పైకం పిండుకోవడం అంతే నిజం. ఏ పథకాన్ని ఏ లక్ష్యంతో ప్రవేశపెట్టినట్టు ప్రకటించినా.. ఆచరణలో దాన్ని తమ జేబులు నింపుకునే ప్రాజెక్టుగా మార్చేశారు. ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. కళ్ల ముందు అక్రమాలు కన్పించినా అడ్డుకోలేకపోయారు. అవినీతి రహిత పాలన దిశగా ముందుకెళ్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇప్పుడా ప్రయత్నం చేస్తోంది. నీరుచెట్టు నిధులను మేసేసిన నేతల గుట్టు రట్టు చేయాలని చూస్తోంది. గత నేతల మేత ఇలా.. శ్రీకాకుళం రూరల్‌లోని నారాయణపురం చానెల్లో నీరు–చెట్టు పథకం కింద పూడికతీత పనులు చేపట్టారు. అప్పటికే రూ.2.63 లక్షలతో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినా అదే చానెల్లో మళ్లీ పొక్లెయిన్ ద్వారా పూడికతీత పనులు చేపట్టారు. రూ.24 లక్షల వరకు బిల్లు కాజేశారు. విశేషమేమిటంటే నీరు పారుతుండగా పూడికతీత పనులు ఇక్కడ చేపట్టారు. దీన్నిబట్టి ఇక్కడ పనులు ఎలా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ⇔ ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధిలోని 2వ వార్డు కృష్ణాపురం గ్రామంలో కిల్లివానిచెరువులో తూతుమంత్రంగా పూడికతీత పనులు చేపట్టి రూ.10 లక్షలు డ్రా చేసేశారు. ఇదే మండలంలోని చిట్టివలస జగ్గన్న చెరువులో మట్టిని తీసి గట్టును చేసేందుకు రూ.7 లక్షలు పనులను టీడీపీ నేత దక్కించుకుని జేసీబీ సాయంతో ఉమ్మితడి పనులు చేపట్టి నిధుల కైంకర్యం చేశారు. ⇔ జెడ్పీ తాజీ మాజీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి సొంత గ్రామమైన ఎస్ఎంపురం పెద్ద చెరువులో నీరు–చెట్టు, ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టారు. ఒక్క నీరు చెట్టు కింద రూ.1.34 కోట్లు ఖర్చు చేశారు. నామమాత్రపు పనులు చేసి నిధులు దోచేశారు. మట్టిని రోడ్డు బెర్మ్కు వినియోగించారు. ⇔ నాడు మంత్రిగా వెలగబెట్టిన కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో తుమ్మసాగరంలో సుమారు రూ.45 లక్షలతో నీరు–చెట్టు పనులు చేపట్టారు. అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ కనుసన్నల్లో తాజా మాజీ సర్పంచ్ భర్త గున్న నాగభూషణరావు అరకొర పనులు చేపట్టారు. నిధులు మాత్రం పూర్తిగా డ్రా చేసేశారు. ఇలా చెప్పుకొనిపోతే జిల్లావ్యాప్తంగా ఇదే తరహాలో నీరు–చెట్టు అక్రమాలు ఎన్నో జరిగాయి. చెరువుల్లో పూడికలు తీయడం ద్వారా గట్లను పటిష్టం చేసి, నీటి వనరులను మెరుగుపర్చుకోవాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం కింద టీడీపీ నేతలు వందల కోట్లు వెనకేసుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో నీరు చెట్టు పనుల కోసం రూ.427.26 కోట్ల మేర ఖర్చు చేశారు. ఇందులో సగానికి పైగా స్వాహా చేసేశారు. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు యథేచ్ఛగా మట్టి మింగేశారు. మట్టి తవ్వకాల పేరుతో ఒకవైపు ప్రభుత్వం నుంచి నిధులు డ్రా చేసుకోగా మరోవైపు తవ్విన మట్టిన అమ్ముకుని కోట్లాది రూపాయలు సంపాదించారు. నీరు చెట్టు పథకం కింద చెరువుల్లో తవ్విన మట్టిని సామాజిక అవసరాలకు వినియోగించాలన్న ఆదేశాలను తెలుగు తమ్ముళ్లు బేఖాతర్ చేశారు. జిల్లావ్యాప్తంగా నీరు చెట్టు అక్రమాలు జరిగాయి. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్ వాల్, చెక్‌డ్యామ్‌లు, స్లూయిజ్‌లు,..ఇలా రకరకాల కాంక్రీటు పనుల రూపంలో కూడా పెద్ద ఎత్తున నిధుల స్వాహాకు పాల్పడ్డారు. కాంక్రీటు పనులు కొన్ని నాసిరకంగా, మరికొన్ని అసంపూర్తిగా చేసిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిచోట్ల పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేసుకోగా, మరికొన్ని చోట్ల పాత పనులకే పైపై మెరుగులు దిద్ది బిల్లులు చేసుకున్నారు. నీరు–చెట్టు పనులు దాదాపు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. ఏకపక్షంగా పనులు దక్కించుకుని నచ్చినట్టుగా నిధులు మింగేశారు. చెరువు తవ్వకాల్లో క్యూబిక్ మీటర్‌కు ప్రభుత్వం రూ.29 చెల్లించింది. ఈ లెక్కన ప్రభుత్వమిచ్చే మొత్తంతోపాటు అదనంగా మట్టి విక్రయంతో వచ్చిన సొమ్ముతో కోట్లు గడించారు. చెప్పాలంటే నీరు–చెట్టు ముసుగులో టీడీపీ నేతలంతా కోట్లకు పడగెత్తారు. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ అక్రమాలపై దృష్టి సారించింది. నేతలు మేసేసిన నీరు–చెట్టు పథకంపై విచారణకు ఉపక్రమించింది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయమని చెప్పడమే కాకుండా ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని ఆదేశించింది. వీటిపై సమగ్ర విచారణ విచారణ చేస్తే నేతల అవినీతి బట్టబయలు కానుంది. గత పాలకులు తిన్నదంతా కక్కించేందుకు అవకాశం ఉంటుంది. -
నీరు-చెట్టులో మితిమీరిన అవినీతి
► వాటాల కోసం అధికారులపై టీడీపీ నాయకుల ఒత్తిడి ► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు(సెంట్రల్): నీరు-చెట్టు పథకంలో అధికార పార్టీ నాయకులు మితిమీరిన అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీరు చెట్టు పథకం టీడీపీ నాయకుల ఇళ్లలో అవినీతి చెట్టుగా మారిందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి పనిలో టీడీపీ నేతలు వాటాలు తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రతి పనికీ అధికారులపై వాటాల కోసం ఒత్తిడి తెస్తున్నారన్నారు. మామూళ్లు ఇవ్వని అధికారులను ఏసీబీకి పట్టిం చడం వంటి పనులకు కూడా టీడీపీ నాయకులు పూనుకునే స్థాయికి చేరుకున్నారన్నారు. నీటి సంఘాల ఎన్నికల్లో కూడా దౌర్జన్యాలకు పాల్పడి వైఎస్సార్సీపీ ఉన్న చోట కూడా బలవంతంగా టీడీపీ నాయకులనే నీటి సంఘాల అధ్యక్షులుగా నియమించారని ఆరోపించారు. వారిని అడ్డంపెట్టుకుని నీరు చెట్టు పథకంలోని ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. నీరు చెట్టు పథకం కింద కోట్ల రూపాయలు అవినీతి పాల్పడుతున్నారన్నారు. కండలేరు, నెల్లూరులోని భూగర్భడ్రెయినేజీ తదితర పనులను సొంత కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు. సంగం బ్యారేజీ పనులు నత్త నడకన సాగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల పరిశీలించినా ఏ మాత్రం మార్పు లేదన్నారు. ఈ పనుల విషయలో అంచనాలు పెంచి కమీషన్ల కో సం కక్కుర్తి పడుతున్నారన్నారు. కొన్ని శా ఖల అధికారుల వద్ద బలవంతంగా మా మూళ్లు తీసుకుంటూ వారిచేత అవినీతి చేయించడం నిజం కాదా అని ప్రశ్నిం చారు. జిల్లా యువత విభాగం అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్, బీసీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు వెంకటశేషయ్య, శివప్రసాద్, చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి విష్టువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నవ్విపోదురుగాక..!
♦ కాసులవర్షం కురిపిస్తున్న నీరు-చెట్టు పథకం ♦ వాగుల్లో పూడికతీత పనులకు ఎగబడుతున్న నేతలు ♦ రూ.5లక్షల్లోపు పనులు నామినేషన్‌పై కేటాయింపు ♦ 15శాతం మొత్తంతో పనులు ముగిస్తున్న వైనం ♦ మిగతా దాంట్లో అధికారులకు 30శాతం పర్సంటేజీ సాక్షి ప్రతినిధి, కడప: నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు అన్నట్లుగా అధికారపార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై నీరు-చెట్టు పథకాన్ని దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు కాసులవర్షం కురిపించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. భూగర్భజల సంరక్షణ చర్యలు అటుంచితే, పైసల కోసమే పనులు చేస్తున్నట్లుగా తేటతెల్లమౌతోంది. నీరు-చెట్టు పనుల ద్వారా కాస్తయిన ప్రయోజనం ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ కాంట్రాక్టర్ల కోసమే పనులు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బుగ్గవంక మధ్యలో చేసిన పనులే ఇందుకు నిదర్శనం. చట్టానికి లోబడే పాలకపక్షం తెలివిగా జేబులు నింపుకొంటున్న వైనమిది. కడప నగరంలో బుగ్గవంక గురించి తెలియని వారుండరు. కడపను రెండు భాగాలుగా ఆ వంక చీల్చింది. గతంలోనే బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టారు. ఆ కారణంగా ప్రస్తుతం 80 మీటర్లు నుంచి 100 మీటర్లు వెడల్పుతో వంక విస్తరించి ఉంది. ఈ వంకపై తమ్ముళ్ల కన్నుపడింది. వంక మధ్యలో నీరు-చెట్టు పనులు మొదలుపెట్టారు. భూగర్భ జలసంరక్షణ చర్యలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే తెలుగుతమ్ముళ్లు ‘నీరు-చెట్టు’ పథకాన్ని కల్పతరువుగా మల్చుకుంటున్నారు. వారికి అధికారులు పక్కాగా సహకరిస్తున్నారు. వంద మీటర్లు వెడల్పు ఉన్న బుగ్గవంక మధ్యలో ఓ కాలువ తీస్తూ ప్రజాధనం లూఠీ చేస్తున్నారు. ఇదివరకే జమ్ముతో పేరుకుపోయిన ప్రాంతాన్ని జేసీబీతో బాగుచేయడం, కాలువగా రూపురేఖలు తేవడంతో పనిముగుస్తోంది. అయితే తూతూమంత్రపు వ్యవహారం కోసం దాదాపు రూ.69 లక్షలు ఖర్చుపెట్టి బుగ్గవంకలో తొలివిడతగా పనులు చేపట్టారు. నామినేషన్‌పై చేజిక్కించుకుంటూ.. నీరు-చెట్టు పనులను అధిక శాతం నామినేషన్‌పై తెలుగుతమ్ముళ్లకు అప్పగిస్తున్నారు. రూ.5 లక్షలు వరకూ నామినేషన్‌పై కేటాయిస్తూ పనులు సంఖ్యను పెంచుతున్నారు. ఈక్రమంలో చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడుతునే కాంట్రాక్టర్లకు నాలుగు రూకలు మిగిలిస్తూ తద్వారా లబ్ధి పొందేందుకు అధికారులు యత్నిస్తున్నారు. రూ.5లక్షల పనిని జెసీబీ ద్వారా రూ.75వేలతో కాంట్రాక్టర్ పూర్తిచేస్తున్నారు. తక్కిన మొత్తం అటు అధికారులకు 30శాతం పర్శేంటేజీలకు, ఇటు కాంట్రాక్టర్లు జేబుల్లోకి వెళ్తుతోంది. మునుపెన్నడూ ఇంతటి అధ్వానపు పనులు చేపట్టలేదని ప్రజలు వాపోతున్నారు. వర్షమొస్తే బుగ్గవంకలో నిలిచి ఉన్న నీర ంతా కొట్టుకుపోతుంది. అలాంటిది నిలిచిన నీటిని తరలించే క్రమంలో బుగ్గవంకలో ప్రత్యేక కాలువ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి దిగువ వైపు నుంచి పనులు చేస్తే కనీసం నిలిచిన నీరైనా వెళ్లిపోయేది. ఎర్రముక్కపల్లె ఎగువ భాగాన నీరు నిలిచే అవకాశమే లేదు. అలాంటి చోట కాలువ తీయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. రవీంద్రనగర్ దిగువన పనులు చేసిఉంటే మురికి నీరు నిల్వ లేకుండా వెళ్లిపోయి, కాస్తయిన ప్రయోజనం ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు కొనసాగుతోన్న దోపిడీ.... జిల్లాలో 1,776 పనులు రూ.100 కోట్లతో నీరు-చెట్టు కింద ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 536 పనులు పూర్తయ్యాయి. పేరుకే జలసంరక్షణ పనులు, నాయకుల దోపిడీకే అధిక ప్రాధాన్యం దక్కుతోంది. నాడు కాంగ్రెస్ పార్టీ నేతలుగా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సాన్నిహిత్యంతో లబ్ధి పొంది, నేడుటీడీపీ నేతలుగా కొనసాగుతోన్న ఆ సోదరులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే నీరు-చెట్టు దోపిడీ సాగుతున్నట్లు సమాచారం. అధికారులు వారి సిఫార్సులకు తలొగ్గి ఇష్టానుసారంగా పనులు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకే... బుగ్గవంకలో తీసే మధ్య కాలువ తమ్ము ళ్ల జేబులు నింపేందుకే. ఎక్కడైన చెరువులు, కుంటల్లో పూడిక తొలగిస్తే ఉపయోగం ఉంటుంది. ఎందుకు పనిరాని పనులు చేస్తూ కోట్లు దోపిడీ చేయడం దారుణం. ఆ నిధులను బుగ్గవంక సైడుగోడల కోసం ఖర్చుపెడితే కొంతవరకన్నా మేలు చేకూరేది. బుగ్గవంకలోని గుర్రపు డెక్క తొలగింపు చేయాల్సిన పనిలేదు. వర్షం వస్తే ఆ నీళ్లకు కొట్టుకుపోతుంది. ఇలా నిధులు స్వాహా చేస్తుంటే అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నిస్తున్నాం. - జి చంద్ర, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇది దోపిడీ పథకం నీరు-చెట్టు పూర్తిగా దోపిడీ పథకం. దీ నిని టీడీపీ నేతలే తప్పుబడుతున్నారు. బుగ్గవంకలో పూడికతీయాలని సీపీఎం తరపున పోరాటాలు చేస్తే స్పందించని అధికారులు, ఇలా నిధులు దండుకునేం దుకు అనుమత్విడంలోని మతలబు ఏమి టో అర్థం కావడంలేదు. గుర్రపు డెక్క తొలగింపునకు కోట్లు ఖర్చుచేస్తారా? ఈ నిధులు మరొకదానికి ఖర్చు చేసి ఉంటే ప్రయోజనం ఉండేది. ప్రజాధనం దుబారా తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని కార్యక్రమం. - ఒ శివశంకర్, నగర కార్యదర్శి,సీపీఎం తాత్కాలిక పనుల వల్ల ఒరిగేది శూన్యం... బుగ్గవంకలో నీరు-చెట్టు కింద చేసే తాత్కాలిక పనుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. తెలుగు తమ్ముళ్ల జేబులు నింపడానికే ఈ పనులు చేస్తున్నారు తప్పా ప్రజలకు ఉపయోగం లేదు. మళ్లీ నీళ్లు వచ్చి చెత్తాచెదారం పేరుకుపోతుంది. చెరువుల్లో పూడికతీసి, ఆనకట్టలను అభివృద్ధి చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయి. చెరువుల్లో తవ్విన మట్టిని కూడా టీడీపీ నాయకులు అమ్ముకోవడం దారుణం. - బి. నిత్యానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు. -
పోరాడితే మరోరకంగా ఫలితాలు: సీఎం
* ప్రతిపక్షాలు చెప్పినట్టు చేస్తే.. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లవుతుంది * ఇక్కడ ఆందోళన చేసే విపక్షాలు అదేదో ఢిల్లీలో చేయాలి * కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తెస్తే సంతోషిస్తా.. * కర్నూలు జిల్లా కురవళ్లి సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సాక్షి, కర్నూలు, సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు చెప్పినట్టుగా తాము కేంద్రప్రభుత్వంపై పోరాడితే.. తమ మంత్రులు రాజీనామా చేస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్టుగా చేస్తే కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్టుగా రాష్ట్రం పరిస్థితి తయారవుతుందన్నారు. నీరు-చెట్టు పథకం పనుల పరిశీలనలో భాగంగా శనివారం మధ్యాహ్నం సీఎం కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కురవళ్లి గ్రామంలో పర్యటించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని తాను అడుగుతూనే ఉన్నానని చెప్పారు. హోదా విషయంలో తాను రాజీపడుతున్నట్టుగా ప్రతిపక్షాలు విమర్శించడాన్ని తప్పుపట్టారు. హోదాకోసం రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలు అదేదో ఢిల్లీలో చేపట్టాలన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి డబ్బులు తెస్తే సంతోషిస్తామన్నారు. తాను ఎన్నడూ రాజీపడనని, సమస్యలపై పోరాడుతానని చెప్పుకొచ్చారు. ‘‘ప్రత్యేక హోదా విషయంలో నా తప్పు ఏమన్నా ఉందా తమ్ముళ్లూ? కేంద్రాన్ని హోదా విషయంలో అడుగుతున్నానా? లేదా? తమ్ముళ్లూ.. నా తప్పు లేదనుకుంటే చేతులెత్తండి’’ అంటూ కోరారు. అక్కడ మాట్లాడకుండా ఇక్కడ విమర్శిస్తారా? తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడితే ఏమీ మాట్లాడని వైఎస్సార్సీపీ నేతలు ఇక్కడ మాత్రం తనను విమర్శిస్తున్నారని చంద్రబా బు మండిపడ్డారు.అనంతరం ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు రూపొందించిన ‘మనం-మన గ్రామాభివృద్ధి’ పట్టికను ఆవిష్కరించారు. నేను కాబట్టే రుణమాఫీ చేశా ఇదిలా ఉండగా వైఎస్సార్ జిల్లా కడపలో ఉద్యాన పంటల రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో సీఎం మాట్లాడుతూ.. ‘‘విభజన చట్టంతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కట్టుబట్టలతో వచ్చాం. తెలంగాణ కంటే 11 శాతం మేరకు ఆదాయం తక్కువ.. జనాభా ఎక్కువ. ఇతర రాష్ట్రాలకంటే రూ.35 వేల మేరకు తలసరి ఆదాయం తక్కువ. ఈ పరిస్థితుల్లో రైతులకు రుణవిముక్తి కల్పించాలని నిర్ణయించాం. వేరేవారైతే రుణమాఫీ చేయలేరు. కష్టపడి రుణమాఫీ చేశాం’ అని చెప్పుకొచ్చారు. ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టుల ఏర్పాటుపై అభ్యంతరం తెలిపామని, ఈక్రమంలోనే తెలంగాణ ప్రాజెక్టులకు సైతం అభ్యంతరం చెప్పినట్లు వివరించారు. నేడు విదేశాలకు వెళ్లనున్న చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15న ఆయన విజయవాడ చేరుకుంటారు. ఇప్పటికే లోకేశ్, ఇతర కుటుంబసభ్యులు థాయ్‌లాండ్ వెళ్లారు. సీఎం థాయ్‌లాండ్ వెళ్లి అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలసి స్విట్జర్లాండ్ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత పర్యటన అని సమాచారం. సీఎం ఆదివారం తెలుగుదేశం మహానాడు తీర్మానాల కమిటీతో సమావేశమవుతారు. -
నీరు-చెట్టు.. అధికారుల కనికట్టు
- అన్నీ కాకిలెక్కలే! - పూడికతీత మట్టితో పచ్చనేతలకు కాసులు సాక్షి, విశాఖపట్నం: నీరు-చెట్టు పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారుతోంది. జిల్లాలో వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న మీడియం ఇరిగేషన్ చెరువులు 236 ఉంటే వందలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 3111 ఉన్నాయి. ఏప్రిల్‌లో తొలిదశలో రూ.4.97 కోట్ల అంచనాలతో 23 చెరువులకు, ఇటీవలే రెండోదశలో రూ.18.30 కోట్లతో మరో 69 చెరువుల ఆధునీకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది.తొలిదశలో తొమ్మిది చెరువుల్లో పనులు ప్రారంభించి వర్షాలు పడ్డాయనే సాకుతో పదిరోజుల పాటు నిలిపివేశారు. గత నెలాఖరు వరకు ఈ పనులు అసలు ప్రారంభమే కాలేదు. యలమంచిలి నియోజకవర్గంలో ఒక్క చెరువులో కూడా పనులు చేపట్టిన దాఖలాలు లేవు. బయ్యవరంలో ప్రారంభించి ఆ తర్వాత ఎక్స్‌వేటర్ మరమ్మతుకు గురైందనే సాకుతో పనులు నిలిపేశారు. ఇవి ఉదాహరణలు మాత్రమే.. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పనులు మొక్కుబడిగానే సాగుతున్నాయి. కొద్దిపాటి వర్షాలకే గత నెలలో వారం రోజుల పాటు పనులు నిలిపి వేశారు. ప్రస్తుతం 92 చెరువుల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే ఏకంగా 40 శాతం పూడికతీత పనులు పూర్తయ్యాయని అధికారులు లెక్కలు చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. నామినేషన్ పద్ధతిలో ఈ పనులను అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుయాయులకు కట్టబెట్టారు. వీరు సమకూర్చిన 49 ఎక్సవేటర్స్ అప్పుడే 11వేల గంటలపాటు పూడికతీతపనులు చేశాయని లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఎక్కడా పట్టుమని పదిహేను రోజులు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. మట్టి.. గ్రావెల్‌కు రెక్కలు చెరువుల్లోని మట్టి/గ్రావెల్‌కు రెక్కలొచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 3.56 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే వెలికితీసినట్టు లెక్కలుచూపుతున్నారు. 92 చెరువుల్లో 40 శాతం పనులు పూర్తయ్యాయంటే ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మట్టంతా ఏమైపోతుందని అడిగితే క్యూబిక్ మీటర్‌కు రూ.22 చొప్పున స్థానిక సంస్థలకు సీనరేజ్ కట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఈ మట్టి/గ్రావెల్ అమ్మకాల ద్వారా టీడీపీ నేతలు లబ్ధిపొందుతున్నారనే విమర్శలున్నాయి. వర్షాలు పడేలోగా పనులు పూర్తిచేసినట్టు రికార్డులు సృష్టించుకుని బిల్లులు డ్రా చేసుకోవాలన్నది ఎత్తుగడగా చెబుతున్నారు. మరో 30 నుంచి 40 శాతం పనులుండగానే పూర్తి చేసినట్టుగా చూపించి అందినకాడికి బొక్కేయాలన్న ఆలోచనతో అధికార పార్టీ నేతలున్నట్టు కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ఈ పనులపై నిఘా ఉంచకపోతే కోట్ల విలువైన మట్టి/గ్రావెలే కాదు.. కోట్లాదిరూపాయల ప్రజాధనం కూడా ఈ స్వాహారాయుళ్ల పరమయ్యే అవకాశం ఉంది. -
మట్టి కుంభకోణం రూ.150 కోట్లు
- వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ దుట్టా విమర్శ - న్యాయ విచారణకు డిమాండ్ - ట్రెంచ్ పనులు అడ్డుకున్నారని అరెస్ట్ హనుమాన్ జంక్షన్ : నీరు-చెట్టు పథకం పేరుతో మట్టిని అక్రమంగా అమ్ముకున్నారని, గన్నవరం నియోజకవర్గ పరిధిలో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని వైఎస్సార్సీపీ వైద్యవిభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దుట్టా రామచంద్రరావు విమర్శించారు. దీనిపై న్యాయవిచారణ చేపట్టాలని, అవినీతి జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం, కె.సీతారాంపురం గ్రామాల పరిధిలోని బాలయ్య చెరువుకు ఏకపక్షంగా ట్రెంచ్ వేయడాన్ని నిరసిస్తూ డాక్టర్ దుట్టా శుక్రవారం ఆ పనులను అడ్డుకున్నారు. దీంతో హనుమాన్ జంక్షన్ పోలీసులు ఆయనను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, ఎంపీటీసీలు బేతాళ ప్రమీలారాణి, మంగలపాటి కమలకుమారి, వైఎస్సార్ సీపీ నేతలు చిన్నాల లక్ష్మీనారాయణ, వెలగపల్లి ప్రదీప్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా దుట్టా విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికి లక్షా 50వేల ట్రక్కులు, టిప్పర్లతో చెరువు పూడిక మట్టి రియల్ ఎస్టేట్లకు తరలించారన్నారు. ట్రక్కుకు రూ.400, టిప్పరుకు రూ.2,500 వరకు వసూలుచేసిన దాఖలాలు ఉన్నాయన్నారు. మీటరు లోతు తవ్వాల్సిన చెరువులను మూడు నుంచి ఆరు మీటర్ల వరకు తవ్వి వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నిరుపేదలు, మిలటరీ కోటాలో చెరువు భూమిని పొందిన వారికి ఎటువంటి హెచ్చరికలు, నోటీసులు లేకుండా తవ్వకాలు జరపడాన్ని ఖండించారు. వైఎస్సార్ సీపీ వారికి అండగా ఉంటుందన్నారు. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న కోడూరుపాడు, వీరవల్లి, వేలేరు గ్రామాల చెరువుల్లో నీరు-చెట్టు పథకాన్ని అమలు చేయకుండా నిరుపేదలు ఉన్న ప్రాంతాల్లో దారుణాలకు పాల్పడటం విచారకరమన్నారు. నీరు-చెట్టు పథకం పేరుతో దోచుకుంటున్నారనే విషయాన్ని ఎమ్మెల్యే వంశీమోహన్ అంగీకరించి మట్టికి రూ.80 పైగా సొమ్ము వసూలుచేసిన వారి దగ్గర నుంచి నగదు వెనక్కి ఇప్పిస్తానని ప్రకటించడం గమనించాలని దుట్టా చెప్పారు. గుడివాడలో ఐదు ఎకరాల చెరువు మట్టికి ప్రభుత్వం వేలం నిర్వహిస్తే రూ.24 లక్షలకు పాడుకున్నారని తెలిపారు. నిబంధనలతో నిమిత్తం లేకుండా మట్టి తవ్వకాలు కొనసాగనిచ్చేది లేదని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
‘నీరు-చెట్టు’ పేరుతో పొట్టకొట్టొద్దు
పర్చూరు : మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కొని ‘నీరు-చెట్టు’ పేరుతో తమ పొట్టకొట్టొద్దంటూ రైతులు పర్చూరు- చీరాల ఆర్అండ్బీ రోడ్డుపై శనివారం రాస్తారోకో చేశారు. నాగులపాలెం గ్రామ పరిధిలోని 352/5 సర్వే నంబర్లోని 22.85 ఎకరాల్లో నీరు- చెట్టు కార్యక్రమంలో భాగంగా కుంట తవ్వేందుకు అధికారులు సర్వేకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న 30 కుటుంబాల సాగుదారులు రోడ్డుపై బైఠాయించారు. ఆదివాసీ సంక్షేమ సంఘం పర్చూరు నియోజకవ ర్గ కమిటీ నాయకులు, రైతులు మాట్లాడుతూ సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీలు మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో కుంట తవ్వేందుకు నాగులపాలెం పంచాయతీ కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తీర్మానం చేసిందని చెప్పారు. జీవనాధారమైన భూములను లాక్కొని పొట్టలు కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల్లో కుంటలు తవ్వి మట్టిని అమ్ముకోవాలని చూస్తున్నారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. హనుమంతరావు మాట్లాడుతూ వేల ఎకరాలు కబ్జా చేసినవారి వదిలేసి పేదల భూములు తీసుకోవడం అన్యాయమన్నారు. రాస్తారోకోతో రోడ్డు రాకపోకలు స్తంభించాయి. పోలీసులు సర్ది చెప్పడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. -
‘నీరు-చెట్టు’ మట్టి.. లే అవుట్లకే
సదాశయంతో సర్కారు చేపట్టిన పథకం రైతులకే తొలి {పాధాన్యమంటున్న అధికారులు అయితే రియల్టర్లకే దక్కనున్న ప్రయోజనం ఏది విత్తినా విరగపండే ‘నేలమ్మ కడుపు’లాంటి మాగాణాలే.. సేద్యానికి దూరమై, కేవలం ‘అమ్మకపు సరుకు’లా మారిపోతున్న రియల్ ఎస్టేట్ యుగం ఇది. ఈ సమయంలో ప్రభుత్వం చేపట్టిన ‘నీరు-చెట్టు’ పథకం.. మన్నును పచ్చని పైర్లకు వేదికగా మార్చి, మల్లెల రాశిలాంటి అన్నాన్ని సృష్టించే రైతులకు కాక.. భూమిని పచ్చనోట్లు ఉత్పత్తి చేసే కార్ఖానాగా మార్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ఉపయోగపడనుంది. రాజానగరం : భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు చెరువుల్లో నీటి నిల్వలను వృద్ధి చేయాలని, తద్వారా ఆయకట్టు భూములకు సాగు నీటిని పుష్కలంగా అందించాలని ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నీరు - చెట్టు’ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారనుంది. భూగర ్భ జ లాలతోపాటు పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం ద్వారా పచ్చదనాన్ని వృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం ఆశయం మంచిదే అయినా ఆచరణ మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 40 ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న చెరువులను ఉపాధి పనుల్లో అభివృద్ధి చేసే అవకాశమున్నా అలాంటి వాటిని అభివృద్ధి చేసే కంటే 100 ఎకరాల పైబడి ఆయకట్టు ఉన్న చెరువుల పట్లే రియల్ ఎస్టేట్ వ్యా పారులు మక్కువ చూపిస్తారనేది వాస్తవం. అలాంటి చెరువుల్లో చేపట్టే అభివృద్ధి పనులకు (లోతు చేయడం, చెరువు గర్భాన్ని విస్తరించడం) యంత్రాలను కూడా వాడవచ్చనే సవరణను ఈ వ్యాపారులు అనువుగా మలచుకుంటారని రైతులు అంటున్నారు. రాజమార్గం అంటున్న రియల్టర్లు.. కాగా ఈ పనులకు నిర్దేశించిన నియమ, నిబంధనల్లో చెరువు విస్తీర్ణాన్ని బట్టి మట్టిని ఎంతవరకు తీయవచ్చో సంబంధిత ఇంజనీరింగ్ అధికారి నిర్ణయిస్తారు. దానిని అనుసరించి మట్టి తవ్వకాలు చేపట్టాలి. తమ లే అవుట్లను ఎత్తు చేసుకునేందుకు అవసరమైన మట్టిని చెరువుల అభివృద్ధి నెపంతో తమకు అవసరమైన మేరకు తవ్వుకునేందుకు ఈ వెసులుబాటును ఉపయోగించుకుంటారని రైతు ప్రతినిధులు అంటున్నారు. వాస్తవానికి ఈ పథకంలో చెరువులను అభివృద్ధి చేసే సమయంలో వెలికి తీసే మట్టిని పొలాల్లో వేసుకునేందుకు రైతులకే మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. కాని ఆ విధంగా రైతులు మట్టిని తీసుకువెళ్లి పొలాలను మెరక చేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఎక్కడా లేదు. లే అవుట్లు మారుమూల గ్రామాల్లో కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏటా రెండు పంటలు పండే భూములను సైతం మంచి ధర వస్తే అమ్ముకోవాలని చూస్తున్న రైతులు చెరువుల్లో మ ట్టిని తీసుకువెళ్లి పొలాలను మెరక చేసే అవకాశాలు లేవు. ఇంతవరకు లేఅవుట్లలో మట్టిని రెవెన్యూ, మైనింగ్ అధికారులకు మామూళ్లు చెల్లించి అనధికారికంగా తీసుకుంటున్న తమకు ఈ పథకం నిజంగా రాజమార్గాన్ని చూపిస్తుందని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారే పేర్కొన్నారు. ఈ పను లు మండలస్థాయి కమిటీ పర్యవేక్షణ లో జరగవలసి ఉంది. ఆ కమిటీ సభ్యులు అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులే కావడంతో ప్రజా ప్రతినిధులు, అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులే ‘నీరు - చెట్టు’ పథకం నుంచి నిజమైన లబ్ధిని పొందుతారని జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కూడా అభిప్రాయపడ్డారు. రూ.105.92 కోట్లతో 2,850 పనుల గుర్తింపు జిల్లాలో ఈ పథకం ద్వారా రూ.105.92 కోట్ల వ్యయం కాగల 2,850 పనులు గుర్తించారు. వీటిలో 100 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న 324 భారీ సేద్యపు నీటి చెరువులు, 6,135 చిన్నతరహా సేద్యపు నీటి చెరువులు కూడా ఉన్నాయి. అలాగే 675 చెరువులకు మరమ్మతులతోపాటు 176 చెక్‌డ్యామ్‌లు, 400 మినీ ఇరిగేషన్ చెరువులు, 361 చిన్నపాటి చెరువులను అభివృద్ధి చేయనున్నామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. చెరువుల మట్టిని రవాణా చేసుకునేందుకు ట్రాక్టర్లు, లారీలకు నిబంధనల మేరకు అనుమతి అవసరమన్నారు. మొదటి ప్రాధాన్యం రైతులకే ఇస్తామని, వారు ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొందవచ్చని అన్నారు. రియల్ ఎస్టేట్ లే అవుట్లకు ఈ మట్టిని తరలించడానికి వీలుందనే విషయాన్ని ప్రస్తావించగా వారిది ఆఖరు ప్రాధాన్యం మాత్రమేనన్నారు.