Withdrawal Limit
-
ఫండ్స్‌కు కూడా త్వరలోనే టీప్లస్1
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్ల కేటాయింపు, ఉపసంహరణ సమయాన్ని ఒక్కరోజుకు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఇప్పటికే నగదు విభాగంలో అన్ని రకాల స్క్రిప్‌లకు టీప్లస్1 వధానం అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై దీని ప్రభావం ఉంటుందన్నారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్ల కేటాయింపు, ఉపసంహరణకు టీప్లస్2 విధానం అమలవుతోంది. ట్రేడ్ చేసిన తర్వాత నుంచి రెండో రోజు ముగింపునే యూనిట్ల కేటాయింపు, లేదా నగదు జమ ప్రస్తుతం సాధ్యపడుతోంది. టీప్లస్ 1 అమల్లోకి వస్తే ట్రేడ్ చేసిన మరుసటి రోజే లావాదేవీ సెటిల్మెంట్ పూర్తవుతుంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి ముందు వరకు టీప్లస్3 అమల్లో ఉండేది. ఈక్విటీలకు టీప్లస్1 అమల్లోకి వచి్చన వెంటనే, ఫండ్స్ టీప్లస్2కు మారాయి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఉపసంహరణ కాలాన్ని తగ్గించడం వల్ల తమ అంచనా ప్రకారం ఇన్వెస్టర్లకు రూ.230 కోట్ల మేర ప్రయోజనం సమకూరిందని మాధురి తెలిపారు ప్రస్తుతానికి సెబీ ముందు ఆరు మ్యూచువల్ ఫండ్ దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నట్టు వెల్లడించారు. నిబంధనలు వేగంగా అమలు.. పరిశ్రమ నిబంధనలను వేగంగా అమలు చేయడానికి పూర్తిగా కొత్త ఆర్కిటెక్చర్‌ను ప్రవేశపెట్డడాన్ని పరిశీలిస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. సెబీ ప్రకటించిన నిబంధన అమలు చాలా కష్టంగా ఉంటుందనే అభిప్రాయం భాగస్వాముల నుంచి వ్యక్తమవుతుండడంతో నూతన ఆర్కిటెక్చర్ఫై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఇదొక రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌గా పేర్కొన్నారు. నిబంధనల అమలులో పరిశ్రమకు సహకారం అందించే మాదిరిగా ఉంటుందన్నారు. నిబంధనలను పాటించేందుకు కంపెనీలు రూ.వేల కోట్లు ఖర్చు చేయాలని సెబీ కోరుకోవడం లేదన్నారు. డీలిస్టింగ్ సులభతరం.. డీలిస్టింగ్ విధానాన్ని సమీక్షిస్తామని సెబీ చైర్పర్సన్ హామీ ఇచ్చారు. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని డిసెంబర్ నాటికి విడుదల చేస్తామని ప్రకటించారు.డీలిస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే దీని ఉద్దేశ్యమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రివర్స్ బుక్ బిల్డింగ్ విధానంపై ఆందోళనలు ఉన్నట్టు చెప్పారు. కంపెనీలో 10 శాతానికి పైగా వాటా కొనుగోలు చేయడం ద్వారా ఆపరేటర్లు రేట్లను పెంచి, కంపెనీలకు భారంగా మారుతున్నట్టు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ ఆధ్వర్యంలోని కమిటీ ఈ అంశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. డీలిస్టింగ్‌కు ఫిక్స్డ్ ధర విధానాన్ని తీసుకురావచ్చని సంకేతం ఇచ్చారు. రివర్స్బుక్ బిల్డింగ్ విధానంలో వాటాదారులు తమకు నచి్చన ధరను కోట్ చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఫిన్‌ఫ్లూయెన్సర్స్ (ఆర్థికంగా ప్రభావితం చేసే వ్యక్తులు) పై సంప్రదింపుల పత్రాన్ని తీసుకువస్తామని సెబీ చైర్పర్సన్ తెలిపారు. ఫిన్ఫ్లూయెన్సర్ను సెబీ నియంత్రించలేదని స్పష్టం చేశారు. వారు తమ వ్యక్తిగత హోదాలో చేసే సిఫారసులను భారతీయ చట్టాల కింద నిషేధించలేమని స్పష్టం చేశారు. కాకపోతే వీరితో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా స్టాక్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ను నియంత్రించగలమన్నారు. తక్షణమే సెటిల్మెంట్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లావాదేవీ నమోదైన వెంటనే పరిష్కరించే సెటిల్మెంట్ విధానాన్ని (ఇన్స్టానియస్) తీసుకురావడమే తమ లక్ష్యమని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. ప్రస్తుతం దీనిపైనే దృష్టి పెట్టామని చెబుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావచ్చని సంకేతం ఇచ్చారు. నిజానికి సెబీ ఇటీవలే స్టాక్స్‌కు టీప్లస్1 సెటిల్మెంట్ను తీసుకొచి్చంది. నూతన విధానంలో దీన్ని మరింత తగ్గించనున్నట్టు తెలుస్తోంది. నూతన సెటిల్మెంట్ను అమలు చేసే విషయమై భాగస్వాములతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని సెబీ చైర్పర్సన్ తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లలో సమయం ఎంతో ముఖ్యమని చెబుతూ.. ఆలస్యం అనేది ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
విత్ డ్రా ఛార్జీల బాదుడు.. ఆర్బీఐ క్లారిటీ
ATM Withdrawal Alert: బ్యాంక్ ఖాతాదారులకు కొత్త సంవత్సరం నుంచే షాక్ తగలనుంది. జనవరి 1, 2022 నుంచి పరిమిత ఏటీఎం విత్‌డ్రాలు దాటితే ఛార్జీలు ఎక్కువే వసూలు చేయనున్నాయి సంబంధిత బ్యాంకులు. అయితే అది ఇంతకు ముందు చెప్పిందానికంటే ఎక్కువే ఉండొచ్చని ఆర్బీఐ మరోసారి సంకేతాలు ఇచ్చింది. క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ ఇటీవలె బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే బ్యాంకులు తమ ఖాతాదారులను ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాయి కూడా. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ , బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. 21రూ.ల కంటే ఎక్కువే! అయితే ఏటీఎం ఛార్జీల పెంపుపై విమర్శలు వస్తుండడంతో ఆర్బీఐ తన నొటిఫికేషన్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. DPSS.CO.PD.No.316/02.10.002/2014-2015 dated August 14, 2014 సర్క్యులర్ ప్రకారం.. ఉచిత ట్రాన్జాక్షన్స్ ముగిశాక సెయిలింగ్/క్యాప్ ప్రకారం.. కస్టమర్ల నుంచి 20రూ. వసూలు చేసుకునే వెసులుబాటు బ్యాంకులకు ఉంది. అయితే బ్యాంకుల మీద పడుతున్న హయ్యర్ ఇంటర్చేంజ్ రుసుమును భర్తీ చేయడానికి, పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లు బ్యాంకులకు సాధారణ వృద్ధి అందించడానికి 21.రూ.లకు సవరించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ ఛార్జీతో పాటు అదనంగా బ్యాంకులు ట్యాక్సులు వసూలు చేస్తాయి. కమిటీ సిఫారుసుల తర్వాతే.. ఏటీఏం ఛార్జీల మొత్తం స్వరూపాన్ని సమీక్షించడానికి ఆర్బీఐ జూన్ 2019లో అప్పటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజి కన్నన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సిఫారసులను జూలై 2020లో వెల్లడించింది. దీంతో సిఫారుసులపై సమీక్ష అనంతరం ఆర్బీఐ.. పెంపునకు అంగీకరిస్తూ ఒక నొటిఫికేషన్ జూన్ 10, 2021నే విడుదల చేసింది. క్యాష్ రీసైక్లర్ మెషిన్లో జరిగే లావాదేవీలకు కూడా ఈ సూచనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). కొత్త ఛార్జీల ప్రకారం.. 21రూ. + జీఎస్టీ పేరుతో ఇప్పటికే వెబ్సైట్లో అప్డేట్ చేశాయి హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు. విత్‌డ్రా లిమిట్‌ను అనుసరించి హెడ్‌డీఎఫ్‌సీ తన సొంత ఏటీఎంలలో ఐదు క్యాష్ విత్ డ్రా ట్రాన్జాక్షన్లకు ఉచితంగా అనుమతిస్తుండగా.. ఆ పరిధి దాటితే వసూలు చేయనుంది. అయితే బ్యాలెన్స్ ఎంక్వయిరీ,మినీ స్టేట్మెంట్, పిన్ ఛేంజ్ సర్వీసులను మాత్రం పరిమితులు లేకుండా ఫ్రీగా అందించనున్నట్లు తెలుస్తోంది. కానీ, నాన్-హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో మాత్రం ఎలాంటి సేవల్ని వినియోగించుకున్నా(ఫ్రీ ట్రాన్జాక్షన్స్ ముగిశాక) ఛార్జీలు వసూలు చేయనుంది. చదవండి: కార్డులతో చెల్లింపులు.. గూగుల్ అలర్ట్, జనవరి 1లోపు ఇలా చేయాల్సిందే! -
ఆ బ్యాంకుపై ఆర్బీఐ కొరడా: వినియోగదారులకు షాక్
సాక్షి,బెంగళూరు: కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. లిక్విడిటీ కొరత నేపథ్యంలో దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీని ప్రకారం ఈ బ్యాంకు ఖాతాదారులు ఆరు నెలల కాలానికి తమ పొదుపు ఖాతా నుండి రూ .1000 కన్నా ఎక్కువ ఉపసంహరించుకోలేరు. ఈ మేరకు బ్యాంకు సీఈవోకు ఆదేశాలు జారీచేసినట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. అయితే బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు కాదని, తన ఆర్థిక స్థితి మెరుగుపడే వరకు ఆంక్షలతో బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. బ్యాంక్ ప్రస్తుత లిక్విడిటీ స్థితిని పరిశీలిలంచిన ఆంక్షల నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అన్ని పొదుపు, కరెంట్ లేదా డిపాజిట్స్ ఏదైనా ఇతర ఖాతాల్లోని బ్యాలెన్స్నుంచి 1000 రూపాయలకు మించకుండా ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే కొత్త రుణాలు ఇవ్వడం, డిపాజిట్లు తీసుకోవడం, ఇతర వ్యాపారంపై కూడా ఆరు నెలలపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే షరతులకు లోబడి డిపాజిట్లపై రుణాలు తీసుకోవచ్చని తెలిపింది. 99.58 శాతం డిపాజిటర్లు పూర్తిగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) భీమా పథకం పరిధిలోకి వస్తారని రెగ్యులేటర్ పేర్కొంది. -
లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్బీఐ కీలక ప్రతిపాదన
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగం బ్యాంకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక నెల తాత్కాలిక నిషేధం ముగిసిన వెంటనే ఈ బ్యాంకును డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) తో విలీనం చేయనుంది. ఈ మేరకు ఒక ముసాయిదా పథకాన్ని ఆవిష్కరించినట్లు మంగళవారం వెల్లడించింది.ఇందుకు డీబీఐఎల్ 2,500 కోట్ల రూపాయల అదనపు మూలధనాన్ని ముందస్తుగా సమకూరుస్తుందని ఆర్బీఐ తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్‌మనోహరన్‌ను బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. ముసాయిదా పథకంపై ఇరు బ్యాంకుల సభ్యులు, డిపాజిటర్లు ఇతర రుణదాతల నుండి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది. ఇవి 2020 నవంబర్ 20 న సాయంత్రం 5 గంటలలోపు తమకు చేరాలని ఆర్బీఐ తన నోటీసులో తెలిపింది. మరోవైపు లక్ష్మి విలాస్ బ్యాంక్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం మారటోరియం విధించింది. ఈ రోజు (నవంబరు, 17వ తేదీన) సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 16 వరకు మారటోరియం అమలులో ఉండనుంది. మారటోరియం సమయంలో విత్‌డ్రా లిమిట్‌ను 25వేలకు కుదించింది. ఈ వెంటనే ఆర్బీఐ విలీన ప్రతిపాదనని ప్రకటించడం గమనార్హం. కాగా ఇటీవల జరిగిన బ్యాంక్ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకు తీరుపై ఆగ్రహంతో ఉన్న వాటాదారులు (దాదాపు 60 శాతం) భారత బ్యాంకింగ్ చరిత్రలోనే తొలిసారిగా ప్రస్తుతం తాత్కాలిక ఎండీ, సీఈఓగా ఉన్న సుందర్‌ను తిరిగి ఆ పదవిలో తిరిగి నియమించే తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో పాటు మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఎన్ సాయిప్రసాద్, గోరింక జగన్మోహన్ రావు, రఘురాజ్ గుజ్జర్, కేఆర్ ప్రదీప్, బీకే మంజునాథ్, వైఎన్ లక్ష్మీ నారాయణలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా తిరిగి నియమించే తీర్మానాన్ని కూడా భారీ మెజార్టీతో వ్యతిరేకించిన సంగతి విదితమే. -
ఓ మై గాడ్... వెంకన్నే రక్షించాడు!
సాక్షి, అమరావతి: టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయంపై భక్తులు, టీటీడీ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ నుంచి కొద్ది నెలల క్రితమే రూ.1,300 కోట్ల విలువైన డిపాజిట్లను ఉపసంహరించుకొని వాటిని ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి మరలించారు. యస్ బ్యాంక్‌లో ఖాతాదారులు రూ.50,000 మించి తీసుకోవడానికి వీలు లేదంటూ ఆర్బీఐ ఆంక్షలు విధించడం తెలిసిందే. గత ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన విషయం తెలియడంతో చైర్మన్ ఆ మొత్తాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులోకి తరలించారు. డిపాజిట్లు ఉపసంహరించుకోవద్దంటూ తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినా ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సీఎం ఆదేశాలతో యస్ బ్యాంకు నుంచి రూ.1,300 కోట్లు ఉపసంహరించుకున్నారు. చదవండి : విత్‌డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’! -
నగదు విత్‌డ్రా పై ఆర్బిఐ ఆంక్షలు
-
ఫిబ్రవరి చివరికి నగదు విత్‌డ్రా కష్టాలకు చెక్
పరిమితి ఎత్తివేయొచ్చని బ్యాంకర్ల అంచనా న్యూఢిల్లీ: బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా పరిమితిని ఫిబ్రవరి చివరికల్లా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తొలగించనున్నట్లు బ్యాంకర్లు వెల్లడించారు. నగదు విత్‌డ్రా పరిమితిని ఫిబ్రవరి చివరికి లేక మార్చి మొదటి అర్ధ భాగంలో పూర్తిగా తొలగించనున్నట్లు గురువారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తా మీడియాకు తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరికల్లా 78–88% కొత్త కరెన్సీ వ్యవస్థలోకి వచ్చేస్తుంది. మరో 2 నెలల్లో నగదు విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అయితే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాత్రం బ్యాంకింగ్ వ్యవస్థ నిర్ధేశిత సమయంలో సాధారణ పరిస్థితులకు రావడంపై స్థాయీ సంఘానికి స్పష్టంగా చెప్పలేదు. అయితే రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో రూ. 9.2 లక్షల కోట్లు లేక 60% కొత్త నోట్లను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఆర్బీఐ ఇటీవలే ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితిని రోజుకు రూ. 10,000 పెంచి, వారంలో పరిమితిని మాత్రం సేవింగ్స్ అకౌంట్లకు రూ. 24,000, కరెంట్ అకౌంట్లకు రూ. లక్ష కొనసాగించడం తెలిసిందే. ఆ కొత్త నోట్ల వివరాలు చెప్పలేం... పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8కి ముందే ముద్రించి సిద్ధంచేసిన కొత్త నోట్ల వివరాలు చెప్పడం కుదరదని ఆర్బీఐ స్పష్టంచేసింది. ముందే ఎన్ని కొత్త రూ.2,000, రూ.500 నోట్లు ముద్రించారని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు.. బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వివరణ ఇచ్చింది. -
నోట్ల రద్దు: ఖాతాదారులకు శుభవార్త!
-
ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: డిమానిటైజేషన్ తర్వాత నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు శుభవార్త. త్వరలోనే విత్ డ్రా పరిమితిని పెంచేందుకు కేంద్రం యోచిస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత విధించిన నగదు విత్ డ్రా పరిమితులను పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వారంలో క్యాష్ విత్ డ్రాలను సమీక్షించనున్న రిజర్వు బ్యాంకు ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పొదుపు ఖాతా పరిమితి దాదాపు రూ.30-35 వేలకు వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కరెంట్ ఖాతాలోని నగదు ఉపసంహరణను వారానికి రూ. 50 వేలనుంచి కూడా పెంచనున్నట్టు అంచనా. ఇప్పటివరకు పొదుపు ఖాతాల విత్ డ్రా పరిమితి రూ. 24 వేలు మాత్రమే. కాగా డిమానిజేషన్ నేపథ్యంలో నగదు కష్టాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం దశల వారీగా వివిధ వెసులు బాటులను కల్పిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ఏటీఎం ఉపసంహరణలను రోజుకు రూ.2500 నుంచి రూ.4,500 కు పెంచిన సంగతి తెలిసిందే. అయితే విత్ డ్రా లిమిట్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తారా లేదా అనేది ఇంకా అస్పష్టమే. -
జన్‌ధన్ విత్‌డ్రా పై ఆర్బీఐ మార్గదర్శకాలు
-
క్యాష్ కోసం వెళ్తే.. మా పని ఎవరు చేస్తారు?
గువాహతి: పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజల కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఉద్యోగం, వారు చేసే వ్యాపారాలు, ఇతర పనులు వదిలేసి మరీ బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలకు పరుగులు పెడుతున్నా నగదు చేతికి అందక కొన్ని సందర్భాలలో నిరాశ తప్పడం లేదు. చేతిలో డబ్బులు అందుబాటులో లేకపోతే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అసోం రైతులు చెబుతున్నారు. రబీ సీజన్లో పంట అవసరాలకు ఖర్చులకు, విత్తనాల కొనుగోలుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అపూర్వ అనే రైతు జాతీయ మీడియాకు తెలిపారు. సీజన్ సమయంలో డబ్బుల కోసం పొలాన్ని వదిలి వెళ్లడం రైతులకు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 'రోజుకు రెండు వేల రూపాయలు మాత్రమే ఏటీఎంలలో డ్రా చేసుకునే వీలు దొరుకుతోంది. కానీ తమ అవసరాలకు కనీసం 5వేల రూపాయలు చేతిలో ఉండాలి. సీజన్ ఇప్పటికే వచ్చేసింది. అయినా విత్తనాలు కొనేందుకు మా వద్ద డబ్బులు లేవు' ఏం చేయాలో అర్ధంకావడం లేదని సోనాపూర్ గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలం సాగు పనులను వదిలేసి బ్యాంకుల వద్దే సుదీర్ఘంగా ఉండాల్సి రావడం ఏమాత్రం శుభపరిణామం కాదని అపూర్వ అభిప్రాయపడ్డారు. తమ సమస్యలు అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అసోం రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.