Women Driving
-
Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది
భిన్న జీవనం జెలజ కుటుంబం ఇంట్లో కంటే రోడ్డు మీదే ఎక్కువగా ఉంటుంది. జెలజ ట్రక్ డ్రైవర్. భర్తకు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది. తొలత గృహిణిగా ఉన్న జెలజ మెల్లగా డ్రైవింగ్ నేర్చుకుంది. లోడు దించేందుకు కుటుంబంతో బయలుదేరి కొత్త ప్రాంతాల వీడియో చేస్తుంది. ఆమె కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ తోలింది. కూతురు తల్లితోపాటు డ్రైవింగ్ నేర్చుకుంది. ‘పుతట్టు ట్రావెల్ వ్లోగ్’ పేరుతో ఈ కుటుంబ యానం లక్షల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించింది. ఉదాహరణకు జెలజ జీవితం ఇలా ఉంటుంది. ఆమె కేరళలోని కొట్టాయం నుంచి ప్లైవుడ్ లోడ్ తీసుకుని పూణెలో డెలివరీ చేస్తుంది. కాని ఖాళీ ట్రక్కు వెనక్కు తెస్తే నష్టం. ‘ఉల్లిపాయల లోడు కశ్మీర్లో దింపుతారా’ అని పూణెలో అడుగుతారు. ‘దింపుతాను’ అని బయలుదేరుతుంది. కశ్మీర్ చేరుకుంటుంది. అక్కడ లోడ్ దొరకదు ఒక్కోసారి. ఢిల్లీ, హర్యాణ దాకా వచ్చే లోడ్ దొరుకుతుంది. ఏదో ఒక సరుకు కేరళకు దింపే బుకింగ్ వస్తుంది. ఆ లోడు తీసుకుని కేరళ చేరుకుంటుంది. ‘కేరళలో ప్రతి సంవత్సరం జారీ అవుతున్న డ్రైవింగ్ లైసెన్స్‌లలో 40 శాతం స్త్రీలవి. టూ వీలర్లు కార్లు సరే... బస్సులు కూడా కేరళలో నడుపుతున్నారు స్త్రీలు. కాని ట్రక్కు నడిపే స్త్రీలు చాలా అరుదు. అందుకే జెలజ ను చూసి అందరూ గౌరవిస్తారు’ అంటాడు రతీష్. అతడు జెలజ భర్త. ఆమె లాంగ్ డ్రైవ్‌కి బయలుదేరితే చాలాసార్లు తోడు ఉంటాడు. ఒక్కోసారి పెద్దకూతురు, భార్య డ్రైవ్ చేస్తుంటే వారికి తోడు వస్తాడు. అతను స్వయంగా డ్రైవరు. కాని తన కుటుంబ స్త్రీలు హైవేలను జయిస్తూ ఉంటే సంతోషపడతాడు. గృహిణి నుంచి డ్రైవర్‌గా రతీష్ 2003 వరకూ ఒక సాధారణ ట్రక్ డ్రైవర్. ఆ సంవత్సరం ఆరు లక్షలు లోన్ తీసుకుని ఒక భారత్ బెంజ్ ట్రక్ కొన్నాడు. కలిసొచ్చింది. తన సోదరుడితో కలిసి ఇప్పుడు 27 నేషనల్ పర్మిట్ ట్రక్కులతో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. తరచూ లాంగ్ డ్రైవ్‌కి వెళ్లే రతీష్ని జెలజ ‘నేనూ నీతో రానా కొత్తప్రాంతాలు చూడాలని ఉంది’ అనడిగింది. ‘రావచ్చు. కాని నువ్వు ట్రక్కు నడపడం నేర్చుకుంటే’ అన్నాడు రతీష్. అప్పటికి జెలజ కేవలం గృహిణి. టూ వీలర్ నడపడం కూడా రాదు. ఆమె మొదట టూ వీలర్.. ఆ తర్వాత కారు నడిపి ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. భర్తను తోడు తీసుకుని స్వయంగా ట్రక్ నడుపుతూ లోడ్ డెలివరీ చేయడం ్ప్రారంభించింది. వీడియోలు చేస్తూ ‘మాది ఉమ్మడి కుటుంబం. నా మరిది, తోటికోడలు, అత్తగారు.. అందరం కలిసి ఉంటాం. అందుకే నా ఇద్దరు పిల్లలను వదిలి ట్రక్ తీసుకుని బయలుదేరుతాను’ అంటుంది జెలజ. ఆమె పెద్ద కూతురు కూడా ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. లోడ్లు దింపే పనిలో భాగంగా పర్యటనలు కూడా ఈ కుటుంబం ట్రక్కు ద్వారా ముగిస్తారు. ‘మేఘాలయా, కోల్కటా, పోర్బందర్... ఇలా ఎన్నో కొత్తప్రాంతాలు చూశాను’ అంటుంది జెలజ.. ఎక్కడకు వెళ్లినా అక్కడి విశేషాలు వీడియోలు చేస్తూ అక్కడి సంస్కృతి, అలవాట్లు తెలియచేస్తూ ఉంటుంది. రోడ్డు పక్కన ట్రక్కు ఆపి వంట చేసుకుని తోటి డ్రైవర్లతో కలిసి తినడం ఆ వీడియోలు కనపడుతుంది. ఒకసారి అత్తగారిని తీసుకుని ఆమె ట్రక్కులోనే లాంగ్ జర్నీ చేసింది. కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ నడిపి వార్తల్లోకి ఎక్కింది జెలజ . ‘వాష్‌రూమ్‌లు ఒక్కటే ఇబ్బంది. పెట్రోల్ బంకుల్లో ఉన్నవాటిని ఉపయోగిస్తాను. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో పోలీసులు పీక్కు తింటారు మామూళ్ల కోసం. మిగిలిన రాష్ట్రాలు పర్లేదు. ఇక దొంగల భయం ఉంటుంది. కాని హైవేల మీద తిరగ్గా తిరగ్గా ఆ భయం పోయింది’ అంటుంది జెలజ. -
భార్య డ్రైవర్, భర్త కండక్టర్
-
International Womens Day: వాణిజ్య వాహనాల డ్రైవర్లుగా మహిళలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాహన తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ ఎంబ్రేస్ ఈక్విటీ పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు సమాన అవకాశాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అశోక్ లేలాండ్‌కు చెందిన ట్రైనింగ్ సెంటర్లో భారీ వాణిజ్య వాహనాలు, బస్‌లు నడపడంపై శిక్షణ పొందేందుకు 100 మంది మహిళలను న్యూఢిల్లీకి ఆహ్వానించింది. ‘వాస్తవానికి భారీ వాణిజ్య వాహనాల డ్రైవింగ్ అనేది పురుషుల బలమనే ప్రచారం ఉంది. ఎంబ్రేస్ ఈక్విటీ ద్వారా దీనిని ఛేదించాలనేది కంపెనీ ఆలోచన’ అని అశోక్ లేలాండ్ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం కోసం ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీనిలో భాగంగా 180 మంది మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ కల్పించింది. వీరిలో చాలా మంది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్లుగా నియామకం అందుకున్నారని అశోక్ లేలాండ్ వెల్లడించింది. -
బతుకు బండి: బామ్మ స్టీరింగ్... బంగారు డ్రైవింగ్
భర్త చనిపోయిన దుఃఖం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న రాధామణి, బతుకు మార్గంపై దృష్టి పెట్టింది. వ్యాపారం చేసిన అనుభవం లేదు. ఆర్థిక స్థోమత అంతకంటే లేదు. తనకు తెలిసిన ఏకైక విద్య డ్రైవింగ్. ముప్పై సంవత్సరాల వయసులో భర్త లలాన్ దగ్గర స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంది రాధామణి. మొదట్లో ఎంత భయమేసిందో! అయితే ఆ భయం కొన్ని రోజులే. ఆ తరువాత భయం స్థానంలో ఇష్టం ఏర్పడింది. స్కూటర్ డ్రైవింగ్‌ను పర్ఫెక్ట్గా నేర్చుకుంది. కేరళలోని తొప్పుంపేడి పట్టణానికి చెందిన రాధ స్కూటర్ డ్రైవింగ్ దగ్గర మాత్రమే ఆగిపోలేదు. కారు, బస్, లారీ, ట్రాక్టర్, ఆటో–రిక్షా, క్రెన్, రోడ్ రోలర్ అండ్ జేసిబి, కంటేనర్ ట్రక్...ఇలా 11 వాహనాలను నడపడంలో లైసెన్స్ తీసుకుంది. కేరళలో హెవీ వెహికిల్ లైసెన్స్ తీసుకున్న తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది రాధామణి. కొన్ని సంవత్సరాల క్రితం... తొప్పుంపేడి నుంచి చెర్తాలం వరకు రాధామణి బస్సు నడిపినప్పుడు, ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చి చూశారు. ‘నా దృష్టిలో ఒక కొత్త వాహనం నేర్చుకోవడం అంటే, కొత్త బడిలో చేరడం లాంటిది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. దీనికి ఏకైక కారణం డ్రైవింగ్ అని చెబుతుంటాను’ అంటుంది 71 సంవత్సరాల రాధామణి. ఆమెను అందరూ ‘మణియమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. తన పిల్లలతో కలిసి తొప్పుంపేడిలో మొదలు పెట్టిన డ్రైవింగ్ స్కూల్‌కు అనూహ్యమైన ఆదరణ ఏర్పడింది. కాలేజి స్టూడెంట్ రీతిక ఇలా అంటుంది... ‘గతంలో డ్రైవింగ్‌పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కాలేజీలో చేరిన తరువాత మాత్రం బండి నేర్చుకోవడం తప్పనిసరి అనిపించింది. వెంటనే మణియమ్మ డ్రైవింగ్ స్కూల్ గుర్తొచ్చి చేరిపోయాను. అమ్మాయిలు ఇక్కడ సేఫ్టీగా ఫీలవుతారు. మణియమ్మ దగ్గరికి వెళితే డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపించదు. బామ్మ దగ్గరకు వెళ్లినట్లు అనిపిస్తుంది. చాలా సరదాగా ఆమె డ్రైవింగ్ నేర్పిస్తుంది. ఇప్పుడు నేను టూవీలర్స్ మాత్రమే కాదు కారు కూడా నడుపుతున్నాను’ మణియమ్మ భర్త కోచిలో ‘ఏ టు జెడ్’ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపేవాడు. ఆయన చనిపోయిన తరువాత ఆ స్కూల్ మూతపడింది. అయితే ఇప్పుడు తొప్పుంపేడిలోని ‘డ్రైవింగ్ స్కూల్’లో అడుగడుగునా భర్తను చూసుకుంటుంది మణియమ్మ! -
కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి?
కారులో షికారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి! కొంతమందికైతే ఇది వ్యసనంలాగా మారుతుంటుంది. కారులో పయనం సుఖవంతమైనదే కాకుండా బైక్‌తో పోలిస్తే సురక్షితమైనది కూడా! అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు అతిగా కారులో తిరగడానికే అలవాటు పడితే క్రమంగా కొన్ని శారీరక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అతిగా కారు డ్రైవ్ చేసేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. వెన్నెముక చుట్టూ ఉండే కండరాలన్నీ బ్యాలెన్స్డ్గా ఉండడం, కండరాలకు ఎలాంటి నొప్పులు రాకుండా శరీరాన్ని తీరుగా ఉంచడమే గుడ్ పోశ్చర్. మన డైలీ లైఫ్‌లో ఎదురయ్యే శారీరక ఒత్తిడి కండరాలు, ఎముకలపై పడకుండా జాగ్రత్తపడడమన్నమాట! మనం సరైన భంగిమ లేదా పోశ్చర్ మెయిన్ టెయిన్ చేస్తున్నామో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు సమాంతరంగా నేలపై ఉన్నాయా? రెండు పిరుదులపై సమాన భారం పడుతోందా? వెన్నెముక నిటారుగా ఉందా? భుజాలను చెవులకు సమాంతరంగా రిలాక్స్‌గా ఉంచామా? నిలుచున్నప్పుడు మోకాలి జాయింట్లు లాక్ అవకుండా నిల్చుంటున్నామా? పడుకున్నప్పుడు శరీరం సమాంతరంగా ఉంటోందా? వంటివి చెక్ చేయడం ద్వారా పోశ్చర్ మెయిన్ టెయిన్ అవుతుందా, లేదా తెలిసిపోతుంది. సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయకపోతే, వెన్నుముక పెళుసుగా మారి, ఈజీగా దెబ్బతింటుంది. కండరాల నొప్పులు ఆరంభమై క్రమంగా పెరిగిపోతాయి. మెడ, భుజం, వెన్ను నొప్పులు పర్మినెంట్‌గా ఉండిపోతాయి. కీళ్ల కదలికలు దెబ్బతింటాయి. క్రమంగా ఈ మార్పులు జీర్ణవ్యవస్థను మందగింపజేస్తాయి. ఆపైన శ్వాస ఆడడం ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇబ్బందులన్నీ మరీ ముదిరిపోతే తీవ్ర వ్యాధుల పాలు కావాల్సిఉంటుంది. అందువల్ల కారు డ్రైవింగ్ చేసే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి... మీ కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లు పొడవుగా ఉన్నవారు సీట్‌ను మరీ ముందుకు ఉంచకుండా తగినంత దూరంలో ఫిక్స్ చేసుకోవాలి. అలాగే మీ ఎత్తుకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం. మీ సీట్‌ను నిటారుగా ఉండేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది. మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి. సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మీకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే కాదు... మరెన్నో విధాలుగా మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ఒకవేళ పోశ్చర్ బాగా దెబ్బతిన్నదనిపిస్తే డాక్టర్ సలహాతో కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్స్, తేలికపాటి పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు. బాడీ భంగిమను నిలబెట్టే ఉపకరణాలు(పోశ్చర్ బెల్ట్స్ లాంటివి) వాడవచ్చు. మరీ ఎక్కువగా ఇబ్బందులుంటే అలెగ్జాండర్ టెక్నిక్ టీచర్స్, ఫిజియోథెరపిస్ట్, ఖైరోప్రాక్టర్, ఓస్టియోపతీ ప్రాక్టీషనర్ సహాయం తీసుకోవాలి. అవసరమైతే వీరు సూచించే ఎలక్ట్రోథెరపీ, డ్రైనీడిలింగ్, మసాజింగ్, జాయిట్ మొబిలైజేషన్ లాంటి విధానాలు పాటించాలి. స్మార్ట్ పోశ్చర్, అప్రైట్ లాంటి మొబైల్ యాప్స్‌లో సరైన భంగిమల గురించి, గుడ్‌పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయడం గురించి వివరంగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కారులో షికారు హుషారునిస్తుంది. – డి. శాయి ప్రమోద్ -
సౌదీ మహిళల డ్రైవింగ్‌పై ముగిసిన నిషేధం
-
సౌదీ మహిళకు స్టీరింగ్
రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు ఆదివారం వాహనాలతో రోడ్లెక్కారు. కార్లతో రోడ్లపై సందడి చేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయని అప్పట్లో పేర్కొన్నారు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు. తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరినవారికి కొందరు మహిళలు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది మహిళలు తమ తొలి కారు డ్రైవింగ్ మధుర క్షణాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తాము కుటుంబ సభ్యులను కారులో కాఫీ షాప్‌కు, ఐస్‌క్రీమ్‌కు తీసుకెళ్తామని వెల్లడించారు. తండ్రి, సోదరులు, ప్రైవేటు పురుష డ్రైవర్ల అవసరం లేకుండా తొలిసారి కారును నడపడంపై మహిళా యాంకర్, రచయిత సమర్ అల్మోగ్రెన్ స్పందిస్తూ.. ‘నాకు పక్షి అంత స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. సౌదీ యువరాజు, కోటీశ్వరుడు అల్వలీద్ బిన్ తలాల్ ‘మహిళలకు ఇది గొప్ప విజయం. ఎట్టకేలకు మహిళలకు స్వేచ్ఛ లభించింది’ అని అన్నారు. తన కుమార్తె ఎస్యూవీ కారును డ్రైవింగ్ చేస్తుండగా, అదే కారులో ఆయన మనుమరాళ్లతో కలసి సంబరాలు చేసుకున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ విషయమై ఓ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ హలా మాట్లాడుతూ..‘డ్రైవింగ్ అనుమతి లేకపోవడంతో కంపెనీల్లో పనిచేసే మహిళలకు చాలా కష్టసాధ్యంగా ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు మహిళలందరూ స్వేచ్ఛగా వాహనాలు నడుపుకుంటూ విధులకు హాజరయ్యే వెసులుబాటు ఏర్పడింది. త్వరలోనే మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగనుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 12 ఏళ్లలో రూ.6.1 లక్షల కోట్లు మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడం ద్వారా సౌదీ అరేబియా ఆర్థికంగా పురోగమించనుందా? కొత్త ఉద్యోగాల సృష్టి జరగడంతో పాటు మహిళల జీవనప్రమాణాలు మెరుగు కానున్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. డ్రైవింగ్‌కు మహిళల్ని అనుమతించడంపై గల్ఫ్ టాలెంట్ అనే ఆన్లైన్ రిక్రూట్మెంట్ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ అనుమతి తర్వాత డ్రైవింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 82 శాతం మంది మహిళలు తెలిపారు. తాజా నిర్ణయంతో ఇన్నాళ్లు పురుషులు ఆధిపత్యం చెలాయిస్తున్న ఉన్నతస్థాయి ఉద్యోగాలకు తాము దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడిందని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. యువరాజు సల్మాన్ నిర్ణయంతో మరో 12 ఏళ్లలో సౌదీ ఆర్థిక వ్యవస్థకు రూ.6.1 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యం మహిళలకు సాధికారత కల్పించడంలో భాగంగా 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 22 నుంచి 30 శాతం మహిళలు ఉండాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం చేపట్టిన సంస్కరణలో భాగంగా తొలుత మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని తొలగించింది. దీనిద్వారా వాళ్లు మంచి ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతం పొందేందుకు వీలవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాజా నిర్ణయంతో మహిళలు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వెలుసుబాటు లభించింది. మహిళల డ్రైవింగ్‌పై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో మరింత మంది మహిళా ఉద్యోగుల్ని తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆకర్షణీయమైన వేతనాలకు అందుకోనున్నారు. కార్ల మార్కెట్ కూడా గణనీయంగా అభివృద్ధి చెందనుంది. 2020కి 30 లక్షల మహిళలు డ్రైవింగ్ చేస్తారని అంచనా. -
సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం
రియాద్ : సౌదీ అరేబియాలో మహిళలకు భారీ ఊరట లభించింది. ఇక నుంచి వారు కూడా డ్రైవింగ్ చేసేందుకు అనుమతి లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొద్దికొద్దిగా మార్పులను ఆహ్వానిస్తున్న సౌదీ తాజాగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బైక్‌ల నుంచి ట్రక్కుల వరకు మహిళలు డ్రైవింగ్ చేసేందుకు వీలుకల్పించాలని నిర్ణయించాం. ఇది జూన్ నుంచి అమలులోకి రానుంది' అని సౌదీ ప్రభుత్వం పేర్కొంది. గతంలోనే సౌదీ రాజు సల్మాన్ ఈ విషయం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఇక నుంచి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఎలాంటి భేదాలు లేకుండా బైక్‌లపై దూసుకెళ్లనున్నారు. కాగా, మహిళలకు ప్రత్యేక లైసెన్స్ ప్లేటులు ఉండవని, అయితే, వారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు, రోడ్డు ప్రమాదాలకు పాల్పడినా వారి కేసులు విచారించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలో ఒక్క సౌదీ అరేబియా మాత్రమే మహిళల డ్రైవింగ్‌పై ఇప్పటి వరకు నిషేధం కొనసాగించిన విషయం తెలిసిందే. -
సౌదీ అరేబియా నెవర్ బీ ద సేమ్ ఎగైన్
రియాద్(సౌదీ అరేబియా): అరబ్ దేశం సౌదీ అరేబియాలో మహిళలు వాహనాల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధం తొలగిపోయింది. ఈ మేరకు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్‌అజిజ్ అల్ సౌద్ చారిత్రక డిక్రీ వెలువరించారు. దీని ప్రకారం దేశ మహిళలు 2018 జూన్ నుంచి తమ వాహనాన్ని తామే డ్రైవ్ చేసుకునే వీలుంటుంది. ఈ నిర్ణయంపై సౌదీ అరేబియాతోపాటు ఇతర దేశాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు దేశంలో మగవాళ్లకు మాత్రమే అధికారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేసేవారు. మహిళలు డ్రైవ్ చేస్తే మాత్రం అరెస్టు చేసి, జరిమానా వసూలు చేసేవారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన మనల్ అల్ షరీఫ్ అనే మహిళ కూడా జరిమానా చెల్లించారు. అనంతరం ఆమె వుమెన్2డ్రైవ్ అనే పేరుతో ఆన్లైన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవ్ చేసే హక్కు కల్పించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి, పలువురు మద్దతు కూడగట్టారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఆమె ట్విటర్లో ‘సౌదీ అరేబియా నెవర్ బీ ద సేమ్ ఎగైన్’ అంటూ స్పందించారు. రియాద్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. మహిళల హక్కుల కోసం ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయంగా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రస్ తదితరులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను కాదని 2014లో తన వాహనం నడుపుకుంటూ వెళ్లిన లౌజయిన్ అల్ హత్లౌల్ 73 రోజుల జైలు శిక్ష అనుభవించారు. ఈమె కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా సౌదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఎన్నో ఏళ్లుగా సౌదీ మహిళలు కొనసాగిస్తున్న పోరాటానికి తగిన ఫలితం ఎట్టకేలకు లభించిందని ఆ సంస్థ అధికారి ఫిలిప్ లూథర్ తెలిపారు. అయితే, సౌదీ అరేబియాలోని సంప్రదాయ వాదులు మాత్రం రాజు తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు. షరియా చెప్పిన దాన్ని వక్రీకరించారని మండిపడ్డారు. ‘షరియా ప్రకారం మహిళలు డ్రైవ్ చేయటం నిషిద్ధం. అలాంటి విషయంలో ఇప్పుడు అకస్మాత్తుగా అనుమతి ఎలా లభిస్తుందని ఓ విమర్శకుడు ట్వీట్ చేశారు. -
మహిళల మెదడు 'పావుశాతమే'.. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వొద్దు!
రియాద్: పురుషులతో పోలిస్తే మహిళలకు 'పావుశాతం' మెదడు మాత్రమే ఉంటుందని, వాహనాలు నడిపేందుకు వారిని అనుమతించొద్దని సౌదీ అరేబియా మత పెద్ద ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ నిరాకరించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో సౌదీ ప్రభుత్వం సదరు మతపెద్దపై వేటు వేసింది. ప్రార్థనలకు నేతృత్వం వహించడం సహా ఇతర మతకార్యక్రమాలేవీ చేపట్టకుండా ఆయనపై సస్పెన్షన్ విధించింది. సాద్ హిజ్రీ అనే మతపెద్ద మాట్లాడుతూ.. పురుషులతో పోలిస్తే మహిళలకు 'సగం మెదడు' మాత్రమే ఉంటుందని, షాపింగ్ కు వెళ్లినప్పుడు అది పావుశాతానికి కుదించుకుపోతుందని, కాబట్టి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మతవాద దేశమైన సౌదీ అరేబియాలో మహిళలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. మహిళలు వాహనాలు నడుపడం ఇక్కడ అనుమతించరు. అయితే , మహిళ ఉద్యోగితను పెంచేందుకు ఇటీవల సౌదీలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.